
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ పైనుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సింహాద్రి అనే వ్యక్తిని పోలీసులు కాపాడారు. దీంతో అతడు క్షేమంగా బయటపడ్డాడు. అనంతరం సింహాద్రి మాట్లాడుతూ.. ఇంటి యజమాని వేధింపులు భరించలేక నదిలోకి దూకి చనిపోదామనుకున్నట్లు తెలిపాడు. అయితే నీళ్లలో కొట్టుకుపోతున్న సమయంలో తన కాళ్లకు ఇసుక దిబ్బలు తగిలాయని.. దాంతో దుర్గమ్మ బతకాలని చెప్పినట్టు భావించానని పేర్కొన్నాడు. అందుకే చేతులు పైకెత్తి అరిచానని.. ఈ క్రమంలో తన కేకలు విన్న పోలీసులు బోటులో వచ్చి రక్షించారని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment