వైఎస్ఆర్ సీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన టీడీపీ నేతలు తోక ముడిచారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అరాచకాలను వైఎస్‌ఆర్ సీపీ నేతలు విమర్శించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన సవాల్‌ను స్వీకరించిన వైఎస్ఆర్ సీపీ నేతలు సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో 3 గంటల పాటు ఎదురుచూసినప్పటికి అధికార పార్టీ నేతలు అడ్రస్ లేకుండా పోయారు.