సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ సీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన టీడీపీ నేతలు తోక ముడిచారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అరాచకాలను వైఎస్‌ఆర్ సీపీ నేతలు విమర్శించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన సవాల్‌ను స్వీకరించిన వైఎస్ఆర్ సీపీ నేతలు సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో 3 గంటల పాటు ఎదురుచూసినప్పటికి అధికార పార్టీ నేతలు అడ్రస్ లేకుండా పోయారు.
దీనిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అవినీతిని ఎప్పుడైనా, ఎక్కడైనా సాక్ష్యాధారలతో ఎండగడతామని చెప్పారు. టీడీపీ కార్యాలయమైనా, ప్రకాశం బ్యారేజ్ పైనా అయిన వస్తామని అందుకోసం ఏడాది పాటు సమయం ఇస్తున్నామని టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు.
‘చర్చించే దమ్ములేక టీడీపీ నేత వర్ల రామయ్య చర్చకు రాలేకపోయారు. మేము అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు టీడీపీ నేతలకు టైం ఇస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ అయినా సరే.. టీడీపీ కార్యాలయం అయినా చర్చకు మేం రెడీ. మరోసారి వైఎస్ జగన్‌ను విమర్శిస్తే ఊరుకోం.’ అని హెచ్చరించారు. కాగా అవినీతిపై చర్చించేందుకు సిద్ధమని వర్ల రామయ్య సవాల్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment