వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు | Mass enrollments in YSRCP: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

Published Wed, Apr 10 2024 4:41 AM | Last Updated on Wed, Apr 10 2024 4:41 AM

Mass enrollments in YSRCP: Andhra pradesh - Sakshi

పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీలో చేరిన బ్రహ్మయ్యపాకాలు గ్రామస్తులతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

 రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో మంగళవారం పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల, శనగపాడు, కొళ్లికూళ్ల గ్రామాలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. అదేవిధంగా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ వైఎస్సార్‌సీపీ మాజీ అధ్యక్షుడు ఆనంగి శ్రీనివారావు యాదవ్‌ ఇటీవల టీడీపీలో చేరారు. ఆయన తిరిగి ఉదయభాను సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.     – సాక్షి నెట్‌వర్క్‌

► విజయవాడ 11వ డివిజన్‌కు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 100మందికి పైగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 
► పల్నాడు జిల్లా వినుకొండలో కొప్పుకొండ గ్రామ పంచాయతీ బ్రహ్మయ్య పాకాలు గ్రామానికి చెందిన 50 కుటుంబాలవారు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.   

►  కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు వైఎస్సార్‌సీపీలో చేరారు. జనసేనకు చెందిన వీరందరికీ అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం నార్త్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో మెట్రేవు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు బర్రి రమేష్‌ తన అనుచరులు సుమారు 25 మందితో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 

► పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో అత్తిలికి చెందిన తూర్పు కాపు సంఘ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరినవారిలో తూర్పు కాపు సంఘ నాయకులు, అత్తిలి రెండో వార్డు మాజీ సభ్యుడు ముల్లు సత్యనారాయణ, కిలాడి అప్పన్న, రెడ్డి సత్యనారాయణ 
తదితరులు ఉన్నారు. 
► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్, మండలంలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  

► ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన 40 కుటుంబాలవారు టీడీపీ, జనసేన పారీ్టలను వీడి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement