తణుకులో వైఎస్సార్‌సీపీలో చేరిన 27వ వార్డు మహిళలతో మంత్రి కారుమూరి
తణుకు అర్బన్/మొగల్తూరు/కైకలూరు/ భీమవరం/పెనుగొండ/పాలకొల్లు అర్బన్/పోలవరం రూరల్/బు చ్చిరెడ్డిపాళెం రూరల్: ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం తణుకు 27వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ మెర్ల అనంతలక్ష్మి పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులు మెర్ల వెంకట్రావు, మెర్ల రాంబాబు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. అదేవిధంగా టీడీపీకి చెందిన 80మంది కాపు నాయకులు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి కారుమూరి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు నమ్మి వాసు, మహిళా నాయకురాలు తిరునాల శకుంతల ఆధ్వర్యాన టీడీపీ నాయకులు వర్థినీడి సూర్యచంద్రరావు, ఉజ్జిన సిద్ధయ్య, వీర్ని సూర్యప్రకాశరావు, వారి కుటుంబ సభ్యులతోపాటు ఏరపాటి రమణమ్మ, పాలాటి లక్ష్మి తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారిని మంత్రి కారుమూరి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు.
► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవు ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు తిరుమాని ఏడుకొండలు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరాజు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహా్వనించారు.
► ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన
మండల గౌరవ అధ్యక్షుడు పోకల దేవేంద్ర గోపాలకృష్ణ, మండల కార్యదర్శి నాగదేశి గణేష్బాబు, నాయకులు నర్రా ప్రభు, కారుమంచి యుగంధర్, ముదినేపల్లి మండల టీడీపీ నాయకులు అల్లాడి సతీష్బాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కైకలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహా్వనించారు.
► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన సుమారు వంద మంది టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
► పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో ములపర్రు గ్రామానికి చెందిన కాపు సంఘ నాయకులు, మారెమ్మ గద్దెకు చెందిన శెట్టి బలిజ నాయకులు భారీగా వైఎస్సార్‌సీపీలో చేరారు.
► పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వాలమర్రులో సర్పంచ్ గంటా సత్యనారాయణ, ఉప సర్పంచ్ దాసరి రమేష్ నాయకత్వంలో దళిత యువకులు సరిపల్లి సుదీప్, సరెళ్ల నివాస్, సరిపల్లి రమేష్, దాయం ఏసురత్నం, సబ్బితి భరత్‌కుమార్, సరెళ్ల శివాజీతోపాటు 30కుటుంబాలవారు పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
► ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసం పంచాయతీ పరిధిలోని బంగారంపేటతోపాటు పోలవరానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు దత్తి దేవి, కొవి్వడి పోశయ్య, కోటాబత్తుల రాంబాబు తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పెనుబల్లి గ్రామ టీడీపీ ఉప సర్పంచ్ గుమ్మ భాస్కర్ తన అనుచరులు 200 మందితో, కోవూరు నగర పంచాయతీకి చెందిన గిలకా కల్యాణ్, కనపరెడ్డి వేణు తమ అనుచరులు 200 మందితో కలిసి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పంచేడు గ్రామానికి చెందిన గారితోటి విజయ్, బి.కామేశ్వరరావు కూడా ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment