
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.
రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.
ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది