ఏపీలో రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు | Andhra Pradesh Heavy Rains Alert July 17 Latest News | Sakshi
Sakshi News home page

ఏపీలో రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Jul 17 2024 7:20 PM | Updated on Jul 17 2024 8:16 PM

Andhra Pradesh Heavy Rains Alert July 17 Latest News

అమరావతి, సాక్షి: మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం, దీనికి అనుబంధంగా విస్తరించిన ఆవర్తనం రాష్ట్రం మీద ప్రభావం చూపించనుంది. ఈ ప్రభావంతో రెండ్రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

రేపు, ఎల్లుండి (జులై 18, 19వ తేదీల్లో) కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే.. మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారాయన.  రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

‘‘వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు  చెట్లు క్రింద ఉండరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సూచించారాయన. అలాగే.. 

అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 సంప్రదించాలని కోరారాయన. 

భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ 

భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలు
కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్లు

భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement