
పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్ర

క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్‌లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది

రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు

రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన : రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు

రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన : రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్












