tourist place
-
పర్యాటక ప్రాంతాలుగా యుద్దభూములు
-
రాజమండ్రి : పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు)
-
శ్వేత మయూరం మన కశ్మీరం
పచ్చటి పర్వత శ్రేణులను ముద్దాడుతున్న మేఘమాలలు..దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు మరోవైపు ఆకుపచ్చని హరిత అందాలు.. అడవులపై పరిచినట్టుగా పవళించే మేఘాలు.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లంబసింగిని సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తేవావ్ అనాల్సిందే. చింతపల్లి: మండలంలోని లంబసింగికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇదే కావడం అందుకు కారణం. చలికాలం బాగా ఉధృతంగా ఉండే తరుణంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు మించదు. అత్యల్ప ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌గా ఇక్కడ వివిధ సందర్భాల్లో నమోదైంది. 3,600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న లంబసింగి ఒకప్పుడు ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న గిరిజన పల్లె. అటవీశాఖ చెక్‌పోస్టు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆశ్రమ గురుకుల పాఠశాల మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు నుంచి బస్సులు మాత్రం ఈ ప్రాంతం మీదుగా తరచూ తిరిగేవి. ⇒ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెక్‌పోస్టు సెంటర్లో చాలాకాలం క్రితం ఓ చెట్టుకింద ఒక వ్యక్తి చలికి కొయ్యబారి చనిపోయాడని చెబుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని కూడా పిలిచేవారు. ⇒ మైదాన ప్రాంతంలో సాధారణంగా ఏడాదికి నాలుగు నెలలు మాత్రం చలి ఉంటుంది. కానీ లంబసింగి ప్రాంతంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుంది. సెపె్టంబర్ మొదటి వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. డిసెంబర్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చింతపల్లిలో ఉష్ణోగ్రత ఇక్కడకన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. నిత్యం భోగి మంటలే.. ప్రతీ ఇంట్లో అందరికీ పెద్ద రగ్గులు ఉంటాయి. స్వెటర్లు, కంబళ్లు తప్పనిసరి. మంట కోసం కట్టెలు సిద్ధంగా ఉంచుకుంటారు. సాయంత్రమయ్యేసరికి ప్రతి ఇంట్లో అన్నం వండుకోవడానికన్నా ముందు కుంపట్లు సిద్ధం చేసుకుంటారు.తాజంగిలో బోటు షికార్, జిప్‌లైన్ తాజంగి జలాశయంలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన బోట్ షికార్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకులందరూ 20 నిమిషాలు బోటులో షికారు చేసి ఎంతో సంతోషం పొందుతుంటారు. జలాశయం మీదుగా ఏర్పాటుచేసిన జిప్వే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిప్ లైన్ ద్వారా కొండపై నుంచి చెరువు వరకు జారుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. మరో వ్యూపాయింట్ నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే మార్గంలో బోడకొండమ్మ ఆలయం వద్ద మరో వ్యూపాయింట్ అందుబాటులోకి వచ్చింది. గత అరకు ఎంపీ మాధవి నిధులు వెచ్చించి దీనిని నిర్మించారు. ⇒ నర్సీపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో కాఫీ, మిరియం తోటలు ఆకట్టుకుంటాయి. ⇒ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. దీనిని బట్టి ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం, నర్సీపట్నం నుంచి ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.పర్యాటక సీజన్లో కళకళ పర్యాటక సీజన్ వచ్చిందంటే చాలు లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో వసతులు లేనందున సమీప నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున ఇక్కడి పర్యాటకులు వచ్చేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కాటేజీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.కొండల్లో ‘పాల సముద్రం’ చెరువులవేనం కొండల్లో ప్రకృతి అందాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. ఈ ప్రాంతం లంబసింగికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మి ఉంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పాడేరు ఐటీడీఏ వ్యూపాయింట్‌ను నిర్మించింది. ⇒ శీతల వాతావరణం ప్రారంభమైన నాటి నుంచి వచ్చే పర్యాటకులతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లంబసింగి సెంటర్ జాతరను తలపిస్తుంది. వీకెండ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. శని, ఆదివారాల్లో అయితే చెరువులవేనం జనసంద్రంగా మారుతుంది. కొంతమంది శనివారం రాత్రి లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడుపుతారు. వేకువజామున చెరువులవేనం వెళ్లి ప్రకృతి అందాలను తిలకిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. చెరువులవేనం, బోడకొండ గుడి వద్ద వ్యూపాయింట్లు నిర్మించింది.కృష్ణాపురం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేసింది. తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసింది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యేకనీస వసతులు అవసరం పర్యాటక ప్రాంతంగా పాచు ర్యం పొందడంతో ఈ ప్రాంత అందాలను చూడడానికి ఎంతోమంది కుటుంబాలతో వ స్తున్నారు.ఈ ప్రాంతంలో కనీస వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు అ««ధికారులు చర్యలు చేపట్టాలి.వాహనాల నిలుపుదలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. – ప్రశాంత్, పర్యాటకుడు విజయనగరం -
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్ -
మంచు కురిసే వేళలో మనాలి విహారం
మనాలి, కులులోయ... ఈ రెండు పర్యాటక ప్రదేశాలను విడిగా చెప్పుకోవడం మనకు అలవాటు లేదు. కులూమనాలిగా కలిపేస్తాం. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకే ట్రిప్‌ల కవర్ చేయవచ్చు. మనాలి పక్కనే ఉన్న లోయ ప్రాంతం కులు. ఈ శీతల ప్రదేశాల పర్యటనకు వేసవి ఒక ఆప్షన్. స్నో ఫాల్‌ని కళ్లారా చూడాలంటే నవంబర్ రెండవ వారం నుంచి టూర్ ప్లాన్ చేసుకోవాలి. నవంబర్ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. డిసెంబర్లో పతాకస్థాయికి చేరుతుంది. చెట్ల ఆకులు మంచుతో బరువుగా వంగిపోతాయి. నేల కనిపించనంత దట్టంగా ఉంటుంది. మనాలి నుంచి కేబుల్‌కార్‌లో విహరిస్తూ కులు లోయను చూడవచ్చు. తెల్లటి హిమాలయాలను ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం. ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ ద గాడ్స్ అంటారు. ఇక్కడ మనువు గుడి ఉంది. మనువు ఆలయం అనే పేరు మీదనే దీనికి మనాలి అనే పేరు వచ్చింది. ఇదీ చదవండి: చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే! -
సంస్కర్త స్మారకం: అక్షర్ధామ్
అక్షర్ధామ్.... ఆధ్యాత్మికతకు అర్థం చెప్పిన స్వామి నారాయణుడి ఆలయం. సమాజాన్ని ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, తాత్వికత వైపు నడిపించిన సంఘసంస్కర్త స్మారక మందిరమే అక్షర్ధామ్. స్వామి నారాయణుడు 18–19 శతాబ్దాల్లో సమాజంలో కరడుగట్టి ఉన్న సామాజిక దురాచారాలను పరిహరించడం కోసం పని చేశాడు. మనదేశం అప్పుడు స్థానికంగా హిందూ, ముస్లిం పాలకుల పాలనలో ఉంది. ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలన కింద మనుగడ సాగించాయి. ఈ సమ్మేళన సంస్కృతి ప్రభావం సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అనేక మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో మహిళలు ఆంక్షల వలయంలో చిక్కుకుపోయారు. భద్రత, మత విశ్వాసాల నిబంధనల కింద పేదవాళ్లు మహిళలు మగ్గిపోతున్న సమయంలో సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నతుడు స్వామి నారాయణుడు. ఆడపిల్లలను పురిట్లోనే ప్రాణాలు తీస్తున్న రోజుల్లో స్వామి నారాయణుడు సతి దురాచారాన్ని నియంత్రించడంతో΄ాటు మహిళలకు చదువు అవసరాన్ని చెప్పాడు. వివక్ష రహిత, హింస రహిత సమాజాన్ని స్థాపించడం కోసం సమాజాన్ని సన్మార్గంలో నడిపించాడు. ఒక సంఘ సంస్కర్త గౌరవార్థం నిర్మించిన క్షేత్రం కావడంతో ఇక్కడ వైదిక క్రతువులు ఉండవు. ఏకకాలంలో ఈ ఆవరణంలో వేలాదిమంది ఉన్నప్పటికీ రణగొణధ్వనులుండవు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అక్షర్‌థామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఆర్ట్, సైన్స్, కల్చర్, స్పిరిచువాలిటీల సమ్మేళనం. ఇది ఎక్కడుంది! గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉంది అక్షర్ధామ్. అహ్మదాబాద్ నుంచి 40 కి.మీ.లు ఉంటుంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఈ పింక్ సాండ్స్టోన్ నిర్మాణం... అందమైన శిల్పసౌందర్యానికి నిలయం. చక్కటి గార్డెన్లు, స్వామి నారాయణ్ జీవిత చరిత్ర, ఆయన తీసుకువచ్చిన సంస్కరణల ఇతివృత్తంలో సాగే చిత్ర ప్రదర్శన, పెయింటింగ్స్, శిల్పాలను చూసి తీరాల్సిందే. ఈ ఆలయంలో ప్రతి అంగుళం అత్యాధునికమైన సాంకేతికతను, ఆధ్యాత్మిక భావనను, క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. అక్షర్‌ధామ్‌ను ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయాణ సమయం కాకుండా కనీసం మూడు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి. అక్షర్ధామ్కి ఎంట్రీ ఫీజ్ లేదు కానీ ఎగ్జిబిషన్లు, వాటర్ షోలకు టికెట్ ఉంటుంది. వాటర్ షో ‘సత్ చిత్ ఆనంద్’ కథనం కఠోపనిషత్తు ఆధారంగా హిందీలో సాగుతుంది నెరేషన్. నచికేతుడికి యముడు వరాలివ్వడం వంటి ఉపనిషత్ సారాంశాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ మల్టీ కలర్ లేజర్స్, ఫైర్‌బాల్స్, అండర్ వాటర్ ఫ్లేమ్స్‌లో టెక్నాలజీని ఎంజాయ్ చేయవచ్చు. ఫొటో పాయింట్ అక్షర్ధామ్ లోపలికి మన కెమెరాలను అనుమతించరు, కానీ ఈ ఆవరణలో ఫొటో పాయింట్ దగ్గర కెమెరాతో ఒక ఫొటోగ్రాఫర్ ఉంటాడు. పర్యటనకు గుర్తుగా అక్షర్ధామ్ గోపురం కనిపించేటట్లు ఫొటో తీయించుకోవచ్చు. సావనీర్ షాప్‌లో పుస్తకాలు, ఫొటోలు, వీడియో సీడీలతోపాటు అక్షర్ధామ్ టీ షర్టులుంటాయి. ఫొటోలతో ఇంటిని నింపడం కంటే టీ షర్టు కొనుక్కోవడం మంచి ఆప్షన్. అక్షర్ధామ్ ఆవరణ మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆశ్యర్యంగా అనిపించేదేమిటంటే... స్వామి నారాయణుడి జీవనశైలి అత్యంత నిరాడంబరంగా సాగింది. ఆయన స్మారక మందిరం మాత్రం సంపన్నతకు ప్రతిరూపంగా ఉంది. అభిషేకం చేయవచ్చు! అక్షర్‌ధామ్‌లో పర్యాటకులు అందరూ స్వామి నారాయణ్‌కి అభిషేకం చేయవచ్చు. అభిషేక మండపంలో పూలు, ఆకులతో నీటి చెంబులను వరుసగా పేర్చి ఉంటారు. టికెట్ తీసుకుని మౌనంగా క్యూలో వెళ్లి అభిషేకం చేయాలి. ఇక్కడ నియమాలు చాలా కచ్చితంగా ఉంటాయి. కానీ హ్యూమన్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. డ్రెస్ కోడ్ విషయంలో ఇండియన్, వెస్ట్రన్ అనే నియమాలేవీ ఉండవు. కానీ భుజాలు, ఛాతీ, నాభి, భుజాల నుంచి మోచేతుల వరకు, మోకాళ్ల కింది వరకు కవర్ అయ్యే డ్రెస్‌లను మాత్రమే అనుమతిస్తారు. మనం ధరించిన డ్రస్ వాళ్ల నియమాలకు లోబడి లేకపోతే మూడు వందల రూపాయలు డిపాజిట్ చేయించుకుని సరోంగ్ అనే డ్రస్‌ను ఇస్తారు. మన దుస్తుల మీద దానిని ధరించాలి. డ్రస్ వెనక్కి ఇచ్చినప్పుడు మన డబ్బు ఇచ్చేస్తారు. ఫోన్లు, కెమెరాలు, పెన్‌డ్రైవ్‌లు, మ్యూజిక్ డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, ఆయుధాలు, ఆటబొమ్మలు, లగేజ్, పెట్లు, ఆహార పానీయాలు, పొగాకు ఆల్కహాల్ ఇతర నిషేధిత డ్రగ్స్‌కు అనుమతి ఉండదు. చంటి పిల్లలతో వెళ్లే వాళ్లకు పాలు, ఆహారం, నీళ్ల సీసాలను అనుమతిస్తారు. వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ ఫ్రీగా ఇస్తారు. -
Telangana: ప్రకృతి ఒడిలో 'పొచ్చెర' అందాలు..
ఆదిలాబాద్: పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను కట్టిçపడేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం వద్ద పెద్ద బండరాళ్లపై పడుతున్న నీరు, వచ్చే నీటి తుంపరులు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.ఆహ్లాద వాతావరణం..పొచ్చర జలపాతం అందాలు, పచ్చని వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. జలపాతాన్ని చూడటంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వచ్చిన పర్యాటకులు íవీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పొచ్చెర జలపాతం మంచి పిక్నిక్ స్పాట్‌గా ఏర్పడింది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు విగ్రహాలతో ఫొటోలు తీసుకుంటున్నారు.‘పొచ్చర’కు ఇలా చేరుకోవాలి..బోథ్ మండలంలోని పొచ్చర జలపాతానికి నిర్మల్ నుండి వచ్చే వారు జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండల కేంద్రం మీదుగా రావాలి. నేరడిగొండ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు బోథ్ ఎక్స్ రోడ్డు ఉంటుంది. ఎడమ వైపు తిరిగి అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు పొచ్చర జలపాతానికి దారి వస్తుంది. కిలో మీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వారు 44వ జాతీయ రహహదారిపై ఆదిలాబాద్ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించి బోథ్ ఎక్స్ రోడ్డు కుడివైపు రావాలి. అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు.సహజసిద్ధమైన అందాలు..పొచ్చర వద్ద సహజ సిద్ధమైన అందాలు బాగున్నాయి. జలపాతం వద్ద బండరాళ్లపై నీరు జారిపడినప్పుడు వచ్చే శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి. పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కూర్చోవడానికి కుటీరాలు ఏర్పాటు చేశారు. కుటుంబంతో వచ్చి చూడాల్సిన ప్రాంతం ఇది. – గోపిడి రమేశ్‌రెడ్డి, జగిత్యాలఆహ్లాదకరంగా ఉంది..నేను వరంగల్ నుంచి వచ్చా. జతపాతం అందాలు చాలా బాగున్నాయి. ఆహ్లదకరంగా ఉంది. వీకెండ్లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాంతం. ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మా కుటుంబంతో మళ్లీ వచ్చి చూస్తాం. – ప్రియాంక, వరంగల్ఇవి చదవండి: మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు -
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
Jefferies report: ఆర్థిక వ్యవస్థకు శ్రీరామజయం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా శోభిల్లనుంది. దేశంలోని ఇతర ప్రముఖ ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలను దాటి పర్యాటకుల సందర్శన పరంగా అయోధ్య మొదటి స్థానానికి చేరుకోనుంది. బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ వేసిన అంచనా ప్రకారం ఏటా సుమారు 5 కోట్ల మంది సందర్శకులు అయోధ్యకు రానున్నారు. నూతన విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, టౌన్షిప్, రహదారుల అనుసంధానం కోసం చేసిన 10 బిలియన్ డాలర్ల వ్యయానికి తోడు కొత్త హోటళ్ల రాక ఇవన్నీ అయోధ్యలో ఆర్థిక కార్యకలాపాల విస్తృతిని పెంచుతాయని జెఫరీస్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య విలసిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఎంతో విశిష్టత కలిగిన తిరుమల ఆలయాన్ని ఏటా 3 కోట్ల మంది వరకు భక్తులు సందర్శిస్తున్నారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు సైతం ఇదే స్థాయిలో సందర్శకులు వస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే వాటికన్ సిటీని ఏటా 90 లక్షల మంది, సౌదీ అరేబియాలోని మక్కాను 2 కోట్ల మంది సందర్శిస్తున్నారు. ఊపందుకోనున్న టూరిజం ‘‘ఆధ్యాత్మిక పర్యాటకం అనేది భారత పర్యాటక రంగంలో అతిపెద్ద విభాగంగా ఉంది. మౌలిక వసతుల సమస్యలు ఉన్నప్పటికీ పలు ప్రముఖ ఆధాతి్మక కేంద్రాలకు ఏటా 1–3 కోట్ల మధ్య పర్యాటకులు విచ్చేస్తున్నారు. మరింత మెరుగైన వసతులు, అనుసంధానంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రం (అయోధ్య) చెప్పుకోతగ్గ స్థాయిలో ఆర్థిక ప్రభావం చూపించనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. కరోనాకు ముందు 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీలో పర్యాటక రంగం 194 బిలియన్ డాలర్ల వాటా కలిగి ఉంటే, అది ఏటా 8 శాతం కాంపౌండెడ్ వృద్ధితో 2022–23 నాటికి 443 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. దేశ జీడీపీలో పర్యాటక రంగం వాటా 6.8 శాతంగా ఉందని, అభివృద్ధి చెందిన, ప్రముఖ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు వివరించింది. ‘‘పర్యాటకం అయోధ్యకు ఆర్థికపరమైన, మతపరమైన వలసలను పెంచుతుంది. దీంతో హోటళ్లు, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, ఎఫ్ఎంసీజీ, పర్యాటక అనుబంధ రంగాలు, సిమెంట్ రంగాలు లాభపడనున్నాయి’’అని జెఫరీస్ పేర్కొంది. అయోధ్యలో వసతులు అయోధ్య ఎయిర్పోర్ట్ మొదటి దశ అందుబాటులోకి రాగా, ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యానికి సేవలు అందించే అదనపు దేశీయ, అంతర్జాతీయ టెరి్మనల్ 2025 నాటికి రానుంది. రోజువారీ 60 వేల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. 1,200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్షిప్ నిర్మాణాన్ని తలపెట్టారు. రోడ్ల కనెక్టివిటీని పెంచారు. ప్రస్తుతం 17 హోటళ్లు 590 రూమ్‌లను కలిగి ఉన్నాయి. కొత్తగా 73 హోటళ్లకు ప్రణాళికలు ఉన్నాయి. ఇందులో 40 హోటళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఇండియన్ హోటల్స్, మారియట్, విందమ్ ఇప్పటికే హోటళ్ల కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీసీ సైతం హోటల్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ఓయో సైతం 1,000 హోటల్ రూమ్‌లను తన ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలని భావిస్తోంది. -
అక్కడ అన్నీ ఉన్నాయ్.. అధికారుల నిర్లక్ష్యంతో సహా!
రామగుండం: సహజ వనరులకు కొదవ లేదు.. శ్రామిక శక్తికి ఏలోటూ లేదు.. స్థలం కొరత అంతకన్నా లేదు.. నిధుల విడుదలలో ఏమాత్రం జాప్యం కావడంలేదు.. ఉన్నదంతా నిలువెల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే.. అందుకే రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తొలి థర్మల్ విద్యుత్ రామగుండంలోనే.. ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం రామగుండంలోనే నిర్మించారు.అంటే రామగుండం పారిశ్రామి ప్రాంతం ప్రాధాన్యత ఎంతఉందో అర్థం చేసుకోవచ్చు. ►ఎన్టీపీసీ, బీ–థర్మల్, రైల్వేస్టేషన్, సింగరేణి బొగ్గు గనులు, ఎరువుల తయారీ కంపెనీ, సిమెంట్ కంపెనీ తదితర పరిశ్రమలు రామగుండం పేరిట స్థాపించారు. ► రాముడు సీతను నడియాడిన నేల కూడా ఇక్కడే ఉంది. ► రాముడు–సీతాదేవి సంచరించిన ఆనవాళ్లు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయని చర్రికారులు చెబుతున్నారు. ►ఇందుకు నిదర్శనంగా భక్తులు ఆయా ప్రాంతాలను దర్శించుకొని పునీతులవుతున్నారు. పర్యాటకంపై దృష్టి సారిస్తే.. పట్టణ సమీపంలోని రామునిగుండాల ఆధ్మాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రామలక్ష్మణుడు, సీతాదేవి ఇక్కడ సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండపై 108 గుండాలు ఉండగా ఇందులో ఒకగుండం 200 అడుగుల లోతు, 50 అడుగుల వెడల్పుతో ఓలోయ ఉంది. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. 108 గుండాల్లో అన్నికాలాల్లోనూ నీరు సమృద్ధిగా లభిస్తూ ఉండడం ఇక్కడి విశేషం. ఇందులో ప్రధానమైనవి పాలగుండం, నేతిగుండం, జీడిగుండం, పసుపుగుండం, తొక్కుడుగుండం, యమగుండం, ధర్మగుండం, మోక్షగుండం ఉన్నాయి. కొండపై లోయ.. సొరంగం.. ►రామునిగుండాల కొండపై లోయ మధ్యలో సొరంగ మార్గం ఉంది. దీనిని యమకోణమని పేర్కొంటారు. ►ఈ సొరంగం గుండా నిత్యం నీరు పారుతూ ఉంటుంది. ► ప్రతీ శ్రావణ, కార్తీకమాసంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీసీతారామ లక్ష్మణులను దర్శించుకుంటారు. ►ఇంతటి ప్రాధాన్యం కలిగిన రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ► కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా రామగుండం ప్రాధాన్యం గుర్తించి దీని పేరిటనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తారని భావించినా జాబితాలో ఆ పేరు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. మూలనపడ్డ ప్రణాళిక.. రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో 2007లో అప్పటి మున్సిపల్ చైర్మన్ రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇస్కాన్ సంస్థను సంప్రదించారు. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌లోని బిర్లా మందిర్ తరహాలో దేవాలయం, కొండకింద నుంచి పైకి రోప్‌వే నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇస్కాన్ ప్రతినిధులు కూడా క్షేత్రసందర్శనకు రాగా అటవీశాఖ అధికారుల అభ్యంతరంతో అభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యాయి. భూ వివాదాస్పద అంశాలతో ఇస్కాన్ సంస్థ ముందుకు రాలేదు. అభివృద్ధికి ఆమడదూరం రామునిగుండాలను అభివృద్ధి చేసేందుకు అటవీ భూముల సాకుతో అభివృద్ధికి నోచుకోకపోవడం లేదు. ఆధ్యాత్మిక చరిత్ర క లిగిన ప్రాంతాలను వివక్ష లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అర్హత ఉన్నా పాలకుల ఆధిపత్య ధోరణితో అభివృద్ధికి దూరంగా ఉంది. – భట్టు ప్రసాద్, పట్టణవాసి అవకాశం ఉన్నా.. రామగుండం పేరిట ఉన్న ప్రతీ పరిశ్రమకు సామాజిక బాధ్యత పథకం (సీఎస్ఆర్)కింద నిధులు విడుదల చేసి అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. కానీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను పాలకులు వేరే ప్రాంతాలకు తరలించుకెళ్లారు. ఏ ప్రాంతమైనా ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అన్ని రంగాలు ప్రగతి సాధిస్తాయి. – ముస్త్యాల శంకర్లింగం, పట్టణవాసి -
బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ పొందాలనుకుంటున్నారా..? చలో పోచారం..
ఎటుచూసినా భవనాలు... రోడ్లు.. వాహనాల రణగొణ ధ్వనులు.. ఉక్కిరిబిక్కిరి చేసే వాయుకాలుష్యం... ఉరుకుల పరుగుల జీవనం.. ఇదీ నేటి కాంక్రీట్ జంగిల్లా మారిన పట్టణ, నగరవాసుల దయనీయ పరిస్థితి. దీన్నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నారా? ఎటుచూసినా పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు... అక్కడక్కడా కనిపిస్తూ కనువిందు చేసే వన్యప్రాణులు, స్వచ్ఛమైన పిల్లగాలులు, ప్రకృతి సోయగాల నడుమ సూర్యోదయ, అస్తమయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. చలో నర్సాపూర్, పోచారం. సాక్షి, హైదరాబాద్: ప్రకృతి ఒడిలో నగరవాసులు కాసేపు సేదతీరేందుకు వీలుగా మెదక్ అటవీ శాఖ, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) సంయుక్తంగా ‘కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం’నేచర్ క్యాంప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. నర్సాపూర్ అటవీ ప్రాంతం, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, జీప్ సఫారీ, ట్రెక్కింగ్ తదితరాలతో రెండు పగళ్లు, ఒక రాత్రి కలిపి మొత్తం 36 గంటలపాటు అడవిలో గడుపుతూ మధుర అనుభూతులను సొంతం చేసుకొనేలా ప్యాకేజీని సిద్ధం చేశాయి. పర్యాటకులు అడవుల్లోని చెట్లు, జంతువుల రకాలు, పర్యావరణ వ్యవస్థలు, స్థానిక ఆహారపు అలవాట్లు, గిరిజనుల సాంస్కృతిక జీవనం, వ్యవసాయ పద్ధతుల వంటి వాటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడాన్ని ఇందులో అంతర్భాగం చేశాయి. స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గిరాకీ కలి్పంచడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించనున్నాయి. నేచర్ క్యాంప్ టూర్ ఇలా.. ♦ ఉదయం 6 గంటలకు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు నుంచి ప్రారంభం ♦ ఈ పార్కులో ట్రెక్కింగ్, బర్డింగ్, బట్టర్ఫ్లై వాక్, వెట్‌ల్యాండ్ విజిట్ ♦ వాచ్‌టవర్ వద్ద అల్పాహారం. అక్కడే ఈ టూర్‌కు సంబంధించిన ఇంటరాక్షన్ ♦ నర్సాపూర్ పార్క్‌కు ఎదురుగానున్న అటవీప్రాంతం సందర్శన, అక్కడ నుంచి నర్సాపూర్ పట్టణానికి పయనం. ♦ మెదక్ పట్టణానికి ప్రయాణ మార్గమధ్యంలో ఫారెస్ట్, ప్రైవేట్ నర్సరీల విజిట్. మెదక్ చర్చి సందర్శన, ఆ తర్వాత సమీపంలోనే లంచ్ ♦ అక్కడి నుంచి పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి.. ♦ స్థానిక పర్యావరణ వ్యవస్థలపై అవగాహన పెంచుకునేందుకు సిద్ధం చేసిన ఎని్వరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఈఈసీ) విజిట్ ♦ వైల్డ్‌లైఫ్ సఫారీ, పోచారం డ్యామ్, నిజాం హెరిటేజ్ బిల్డింగ్స్ సందర్శన, సూర్యాస్తమయ వీక్షణ. ♦ ఈఈసీ సెంటర్ వద్ద సమావేశం. అక్కడే స్థానిక వంటకాలు, రుచులతో బార్బిక్యూ డిన్నర్, హోమ్‌స్టే లేదా టెంట్లలో రాత్రి నిద్ర. ♦ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పోచారం లేక్ వద్ద సూర్యోదయ వీక్షణ ♦ అల్పాహారం తర్వాత పోచారం వైల్డ్‌లైఫ్ ♦ శాంక్చురీలో బర్డ్ వాచింగ్, బట్టర్ఫ్లై వాక్ ♦ ఉదయం 11 గంటలకు దంతేపల్లి లేదా మరోచోట గిరిజన గ్రామ సందర్శన ♦ మధ్యాహ్నం దంతేపల్లిలో ‘ఫామ్ లంచ్’ ♦ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ ప్రత్యేకతలివే... హైదరాబాద్‌కు 115 కి.మీ. దూరంలోని పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ 130 చ.కి.మీ. విస్తీర్ణంలో మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించింది. ఇది పోచారం లేక్ వెంట విస్తరించి ఉండటం విశేషం. ఇక్కడ వివిధ రకాల జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా కనిపిస్తుంటాయి. పలు రకాల అరుదైన పక్షులకు సైతం ఇది కేంద్రంగా ఉంది. ఫారెస్ట్ ప్లస్ 2.0 అంటే... కేంద్ర అటవీ, పర్యావరణశాఖల సహకారంతో యూఎస్ఏఐడీ సంస్థ ప్రకృతిసిద్ధ పరిష్కారాల అభివృద్ధి ద్వారా అడవులపై ఆధారపడిన స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు కమ్యూనిటీల పరంగా బలోపేతం కావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి ఫారెస్ట్ ప్లస్ 2.0గా నామకరణం చేసింది. ఇందులో భాగంగా తిరువనంతపురం (కేరళ), గయ (బిహార్), మెదక్ (తెలంగాణ)లో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం నేచర్ క్యాంపులకు శ్రీకారం చుట్టింది. కనీసం 20 మంది.. సొంత వాహనాల్లో వస్తేనే.. పర్యాటకులకు ప్రత్యక్షంగా ప్రకృతిని, వైల్డ్ లైఫ్‌ను అనుభవంలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాం. ప్రజలకు అడవులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ క్యాంప్‌లకు ప్రాధాన్యతనిచ్చాం. నేచర్ క్యాంప్‌ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. కనీసం 20 మందితో కూడిన పర్యాటక బృందం ఈ క్యాంప్‌కు రావాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లోనే వారు మొత్తం టూర్లో పాల్గొనాల్సి ఉంటుంది. పిల్లలకు (పదేళ్లు పైబడిన వారే) రూ. 1,500, పెద్దలకు రూ. 2 వేలు చొప్పున చార్జీగా ఖరారు చేశాం. ఆహారం, ఎంట్రీ ఫీజు, సఫారీ తదితరాలన్నీ ఈ ప్యాకేజీలో ఉంటాయి. – జి. సాయిలు, రీజినల్ డైరెక్టర్, ఫారెస్ట్–ప్లస్ 2.0 చదవండి: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట -
Hyderabad: సమ్మోహన తీరం.. సరికొత్తగా హుస్సేన్ సాగర్
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరం సమ్మోహన రాగం ఆలపించనుంది. సరికొత్త అందాలను సంతరించుకోనుంది. ఒకవైపు అలలపై వెల్లువెత్తే సంగీత ఝరి.. మహోన్నతమైన హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ వైభవాన్ని ప్రదర్శించే లేజర్ షో.. నగరవాసులను, సందర్శకులను, పర్యాటకులను సమ్మోనంగా ఆకట్టుకోనుంది. మరోవైపు అమరుల త్యాగాలను సమున్నతంగా ఆవిష్కరించేలా ఎంతో అద్భుతంగా రూపొందించిన అమరుల స్మారక చిహ్నం కూడా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అలనాటి వైభవాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేవిధంగా ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు సైతం అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు హుస్సేన్ సాగర్ జలాలపై నడిచిన అనుభూతిని కలిగించే వేలాడే వంతెన సైతం ప్రారంభానికి సిద్ధమవుతోంది. మొత్తంగా నెక్లెస్‌రోడ్డులో ఫిబ్రవరి మొదటి వారం నుంచి సందడి నెలకోనుంది. ఫార్ములా– ఈ పనులు శరవేగం.. ► ఫార్ములా– ఈ అంతర్జాతీయ పోటీలకు నెక్లెస్‌రోడ్డు సన్నద్ధమవుతోంది. స్వల్ప మార్పులు, చేర్పులతో 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను పునరుద్ధరించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీల్లో 11 ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు పాల్గొననున్న సంగతి తెలిసిందే. 22 మంది రేజర్లు ఈ పోటీల్లో తమ సత్తా చాటనున్నారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనాలు పరుగులు తీయనున్నాయి. ► సందర్శకులకు ఇదో సరికొత్త అనుభూతి కానుంది. మరోవైపు ఈ అంతర్జాతీయ పోటీల నాటికే నెక్లెస్‌రోడ్డు పరిసరాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు దూసుకెళ్లే ట్రాక్‌ను నీలిరంగు డివైడర్లతో ఆకర్షణీయంగా రూపొందించారు. ప్రదర్శనను తిలకించేందుకు వచ్చే మోటార్‌స్పోర్ట్స్ ప్రియులకు ఫార్ములా–ఈ పోటీలకు చక్కటి అనుభూతినిచ్చేవిధంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 25 వేల మందికి పైగా వీక్షించేందుకు అనుగుణంగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. అలలపై సంగీత సవ్వడులు.. హుస్సేన్‌సాగర్‌లో సుమారు రూ.18 కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టిన మ్యూజికల్ ఫౌంటెన్ కూడా ఫార్ములా– ఈ పోటీల నాటికి ప్రారంభం కానుంది. మిరుమిట్లుగొలిపే రంగు రంగుల వెలుగు జిలుగుల నడుమ ఉవ్వెత్తున ఎగిసిపడే జలాలు.. నేపథ్యంగా వినిపించే ఆహ్లాదభరితమైన సంగీతం సందర్శకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. దీంతో పాటు లేజర్ షోను కూడా ప్రదర్శించనున్నారు. నాలుగువందల ఏళ్ల హైదరాబాద్ చరిత్ర, సాంస్కృతిక విశేషాలు, వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను ఈ ప్రదర్శన ద్వారా ఆవిష్కరిస్తారు. పర్యాటకులు, సందర్శకులే కాకుండా నెక్లెస్‌రోడ్డు మీదుగా రాక పోకలు సాగించే వారు కూడా ఈ ప్రదర్శనను వీక్షించవచ్చు.మరోవైపు సంజీవయ్య పార్కుకు సమీపంలో చేపట్టిన వేలాడే వంతెన నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది. దీనిపై నడుస్తున్నప్పుడు నీటిపైనే నడుస్తున్న భావన కలుగుతుంది. పారిస్‌లోని ఓ నదిపై ఏర్పాటు చేసిన వంతెనకు నమూనాగా హెచ్ఎండీఏ ప్రాజెక్టును చేపట్టింది. త్యాగాలను ఎత్తిపట్టేలా... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతోమంది అసువులు బాశారు. ప్రాణాలను బలిదానం చేశారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకొనేవిధంగా లుంబిని పార్కు వద్ద సుమారు రూ.60 కోట్లతో చేపట్టిన అమరుల స్మృతి చిహ్నం ప్రపంచంలోనే ఒక అరుదైన చారిత్రక కట్టడంగా ఆవిష్కృతం కానుంది. స్టీల్‌తో నిర్మించిన ఈ స్మారక చిహ్నం అమరులకు నివాళులరి్పస్తూ జ్యోతిని వెలిగించినట్లుగా రూపొందించారు. అద్దంలా మెరిసే ఈ అపురూపమైన కట్టడం కూడా ఫార్ములా–ఈ పోటీల నాటికి ప్రారంభం కానుంది. త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు... ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సులను తలపించేలా హెచ్ఎండీఏ విద్యుత్ ఆధారిత డబుల్ డెక్కర్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టనుంది. ఈ బస్సులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పర్యాటక,చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు అనుగుణంగా వీటిని నడుపనున్నారు. చదవండి: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ -
ద్రౌపది దాహం తీర్చుకున్న కొలను.. ఎక్కడో తెలుసా?
శ్రీశైలం(నంద్యాల జిల్లా): దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ప్రాంతమే భీముని కొలను. సెలయేర్ల సవ్వడులతో, పక్షుల కిలకిలరావాలతో రెండు కొండలు చీలినట్లు ఉండి ఆ మధ్యలో గంభీరంగా రాతిపొరల నడుమ భీమునికొలను కనువిందు చేస్తోంది. ఎంతో ఆహ్లాదకరంగా సాగే భీమునికొలను సందర్శనం మంచి అనుభూతిని ఇస్తుంది. చదవండి: ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ? స్థల పురాణం ఇదీ.. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట. ఆ పరిసరాలు చూసివచ్చిన భీముడు .. ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. దాంతో లోమశ మహర్షి ఒక శిలను చూపించి దానిని పగులగొట్టమని చెప్పాడు. తన గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగానే నీటి ధారలు కిందికి దూకాయని, ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుందని, భీముడి కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి ’భీముని కొలను’ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆహ్లాదకర ప్రదేశం పూర్వపు రోజుల్లో కాలినడకన వచ్చే భక్తులు ఈ భీమునికొలను మీదుగానే శ్రీశైలాన్ని చేరేవారు. శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో ఈ భీమునికొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. భీముని కొలను లోయప్రాంతం ప్రకృతి అందాలతో అలరారుతూ చూపరుల మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటుంది. కైలాసద్వారం నుంచి దాదాపు 2వేల అడుగుల లోతులో ఉండే ఈ భీమునికొలను లోయ చుట్టూ సుమారు 650 అడుగుల పైగా ఎత్తులో దట్టమైన కొండలు వ్యాపించి ఉన్నాయి. లోయకు ఇరువైపులా రంపంతో కోసినట్లుగా ఏర్పడి నునుపైన శిలలు ముచ్చటగా ఉంటాయి. లోయ పైతట్టు ప్రాంతంలోని కొండ ల్లోంచి ఉబికి వచ్చే సహజ జలధారలు లోయలో బండరాళ్లపై ప్రవహిస్తూ, పెద్దకోనేరులాగా కని్పంచే భీమునికొలను చేరి పొంగిపొర్లుతుంటాయి. ఈ నీరు మండు వేసవిలో కూడా నిరంతరం ప్రవహిస్తుండడం విశేషం. ఇలా చేరుకోవచ్చు..: భీముని కొలను వెళ్లేందుకు శ్రీశైలం నుంచి సుమారు 4 కి.మీ దూరంలో ఉన్న హఠకేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపున అడవి దారిలో 2 కి.మీ. ప్రయాణించి కైలాసద్వారం వెళ్లాలి. హఠకేశ్వరం నుంచి కైలాస ద్వారం వరకు మట్టిరోడ్డు ఉంది. కారు, జీపు, చిన్న వాహనాల్లో ఇక్కడికి సులభంగా వెళ్లవచ్చు. కైలాసద్వారం నుంచి సుమారు 850 మెట్లు దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీమునికొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. -
1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు..
World's largest cemetery where more than 5 million dead people are buried: ఈ సృష్టిలో నా అంతటి వాడులేడని విర్రవీగే మనిషి.. కట్టుబట్టలతో మాత్రమే తన చివరి మజిలీని చేరుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే.! ఐనా ఎత్తుకు పైఎత్తులు వేసి మరొకరిని చిత్తుచేయాలనే కుబుద్ధి ఎన్ని జన్మలెత్తినా మారదు. అంత పోరాటం చేసి చివరికి చేరేది అంతశయ్యకే..! జీవన్మరణాలు ఎంత విచిత్రమైనవో స్మశానాన్ని చూస్తే అర్ధమవుతుంది. తారతమ్య భేదాలు లేకుండా ఒకే చోట ఖననం అవుతారు. ప్రేతభూమి మహత్యమదే!! ఎంతటివారినైనా కాదనకుండా తనలో ఇముడ్చుకుంటుంది. ఐతే ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక తప్పక ఉంటుంది. సాధారణంగా రెండు మూడు ఎకరాల్లో శ్మశానవాటికలు ఉంటాయి. ఆ దేశంలో వేల ఎకరాల్లో ఒక శ్మాశానవాటిక ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటికది.. ఎక్కడుందో తెలుసా! వారికి చాలా ప్రత్యేక స్థలమిది! ఇరాక్ దాదాపు 1485 ఎకరాల్లో ఉంటుందీ శ్మశానం. ఇప్పటివరకూ 50 లక్షల మృతదేహాలను ఖననం చేసిన ఈ శ్మశాన వాటిక చూపరులకు ఓ మహానగరాన్ని తలపించేలా ఉంటుంది. ‘వాడీ ఉస్ సలామ్’ అని ఈ శ్మశానాన్ని పిలుస్తారు. దీనికి ‘వ్యాలీ ఆఫ్ పీస్’ అనే మరోపేరు కూడా ఉంది. రోజుకు కనీసం రెండు వందలకుపైగా మృతదేహాలను ఖననం చేస్తారిక్కడ. షియా ముస్లీంలకు ఈ శ్మశానం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలో షియాలు ఎక్కడున్నా మరణించిన తర్వాత వారిని, వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే ఖననం చేయాలని కోరుకుంటారట. ఆ యుద్ధకాలంలో అధిక సంఖ్యలో.. ఇది చాలా పురాతనమైన శ్మశానవాటిక. గత 1400 యేళ్ల నుంచి ఈ శ్మశానంలో ఖననాలు జరుగుతున్నాయి. 18వ శతాబ్ధంలో ఇరాన్ - ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన వారిని ఇక్కడ ఖననం చేయడంలో ఒక్కసారిగా సమాధుల సంఖ్య పెరిగింది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో రోజుకు 250 మృతాదేహాలను ఖననం చేసేవారట. 19వ శాతాబ్ధంలో జరిగిన గల్ఫ్ యుద్ధ సమయంలో ఈ శ్మశానవాటికలో ఉగ్రవాదులు దాగడం మూలంగా అనేక సమాధులను ఇరాక్ సైన్యం పడగొట్టారు. వందల వేల మృతదేహాలను ఈ యుద్ధ కాలంలో ఖననం చేశారిక్కడ. శ్మశానికి కూడా కథలుంటాయని, వాటికీ చరిత్ర ఉంటుందనడానికి వాడీ ఉస్ సలామ్ ఓ ఉదాహరణ. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
చిన్నయ్య గుట్ట: ఎంత గట్టిగా చప్పట్లు కొడితే.. అంత నీరు
లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలంలోని హన్మంతుపల్లి గ్రామ పంచాయతి పరిదిలోగల చల్లంపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా సుమారు 150 సంవత్సరాల క్రితం నుండి కొలువు పొందుతున్న గిరిజనుల ఆరాధ్య దేవుడు చిన్నయ్య దేవుడు. ఈ ప్రాంతంలో చిన్నయ్య దేవుడు ఎంతో ప్రసిద్ధి గాంచాడు. చారిత్రాత్మకంగా వెలిసిన చిన్నయ్య దేవుడు గిరిజనుల ఆరాధ్య దైవంగా ఇప్పటికి సేవలందుకుంటూనే ఉన్నాడు. ప్రాచీన కాలంలో పాండవులు ఇక్కడ వ్యవసాయం చేసేవార..ని ద్రౌపది స్నానం చేయడానికి కొల్లుగుంటలు, పరుపుబండపైన వ్యవసాయం చేసినట్లు నాగళి సాళ్ళు, గుడి లోపల దొనలో పట్టె మంచం దేవుని విగ్రహాలు ఉన్నట్లు ఇప్పటికి పూర్వీకులు చెబుతుంటారు. వర్షాకాలం ప్రారంభం సమయంలో సుదూర ప్రాంతాల నుంచి దర్శనానికి వస్తుంటారు. రైతులు వరదపాశం బోనాలు వండి దేవునికి తీర్ధ ప్రసాదాలు వడ్డిస్తారు. పంట పొలాలకు వ్యాధులు సంభవిస్తే ఇక్కడి తీర్ధపు నీరు పంటపొలాలపై చల్లితే రోగాలు పోతాయనే నానుడి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వెల్లడానికి దారి.... పట్టణంనుండి చందారం గ్రామం మీదుగ 10 కిలోమీటర్లు వాహనాలపై చల్లంపేట వరకు చేరుకుని అక్కడి నుండి అటవీ ప్రాంతం గుండా సుమారు 3 కిలో మీటర్లు కాలినడకన నడిచి వెల్తే చిన్నయ్య గుట్ట దేవుడి గుడిని చేరుకోవచ్చు. సమీప ప్రాంతంలో నీళ్ళ సదుపాయం చిన్నపాటి బుగ్గ వాగు లాంటిది ఉంటుంది అందులోని నీటిని త్రాగడానికి వాడుతారు. ఇప్పటికి అక్కడ గిరిజనులే పూజారులుగా కొనసాగుతుంటారు. ప్రతి ఆదివారం, గురువారం ఇక్కడ పూజలు పెద్ద మొత్తంగా నిర్వహిస్తారు. వివిద గ్రామాలనుండి మేకలు, కొళ్ళు లాంటివి తెచ్చుకుని దేవుడికి బోనం వండి మొక్కలు చెల్లించి కొంచెం దూరంగా వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. చిన్నయ్య దేవుడి ప్రత్యేకత... చిన్నయ్య దేవుడి ప్రత్యేకత ముఖ్యంగా పంట పొలాలు దుక్కి దున్నేముందు దేవుడి దర్శనం చేసుకుని బండారు(పసుపు) తెచ్చుకుని ధాన్యం వేసేటప్పుడు అందులో కలిపి వ్యవసాయం సాగు చేస్తారు. మరల పంట చేతికి వచ్చిన తర్వాత దినుసును దేవుడికి అప్పజెప్పి మొక్కిన మొక్కును చెల్లించుకుంటారు. వేసవి కాలం ముగుస్తుందనే సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది చిన్నయ్య గుడి. అల్లుబండ.... గుడిలో అల్లుబండ ప్రత్యేక స్థానాన్ని కల్గిఉంది. అక్కడికి వచ్చిన భక్తులు మనసులో కొరికను కోరుకుని అల్లుబండ లేపితే సులభంగా లేచినట్లైతే కోరిక నెరవేరుతుందని అల్లుబండ బరువుగా ఉంటే కోరిక నేరవేరదనేది నమ్మకం. అల్లుబండ ప్రదేశం వద్ద భక్తులు వారి కొర్కెలను కోరుకుంటారు. చిన్నయ్య దేవుని గుడి వద్ద నుండి సుమారు మూడు కిలీమీటర్లు అటవీ ప్రాంతంలో నుండి నడుచుకుంటు వెల్లితే మంచు కొండలు దర్శనమిస్తాయి. అక్కడికి వెల్లిన భక్తులు ఎంత గట్టిగ చప్పట్లు, కేకలు, ఈళలు వేస్తే అంత నీరు కిందకు వస్తుంది. అక్కడి నీటిని భక్తులు తెచ్చుకుని పంటపొలాల్లో జల్లుకుంటే పంట దిగుబడి అధికంగా వస్తు చీడ, పీడలు రావని రైతుల నమ్మకం. పర్యాటక కేంద్రంగా తీర్చాలి.... పచ్చని అటవీ ప్రాంతం పక్షుల కిలకిల రావాలు, అడవి జంతువుల శబ్దాలు చూడడానికి వేసవి విడిదిగా అనిపించే చిన్నయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని పలువురు కోరుతున్నారు. రహదారి మధ్యలో మత్తడి నీటిని నిల్వచేసి వాటికి అనుకూలంగా రహదారిని ఏర్పాటు చేస్తే పుణ్యక్షేత్రంగాను పర్యాటక కేంద్రంగాను ఏర్పడుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
దక్షిణ కాశీగా పేరు.. కన్నడిగులతో కిక్కిరిస్తున్న కోవెల.. ఎక్కడంటే?
వైఎస్ఆర్ జిల్లా(సంబేపల్లె): దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ వీరభద్రస్వామి రాచవీడు రేడుగా విరాజిల్లుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి పట్టణ నడిబొడ్డున 11వ శతాబ్దంలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రాలయం నెలకొని దినదినాభివృద్ధి చెందుతోంది. 8వ శతాబ్దపు రాజరాజచోళుడు, 11వ శతాబ్దపు కాకతీయ గణపతిదేవుడు, శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్ర అభివృద్ధికి బాటలు వేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. వీరభద్రస్వామి వీరశైవులకు ఇలవేల్పుగా వెలుగొందుతున్నారు. ఈ ఆలయంలో ప్రతి యేటా మాఘమాస బహుళ ఏకాదశి నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి స్థానిక భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన అగ్నిగుండప్రవేశం, మహానైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు కీలకం. అంతేకాకుండా ప్రతి అమావాస్య నాడు కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటుంటారు. 1980లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో కొన్ని అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీరభద్రాలయానికి పశ్చిమాన రాజగోపురం నిర్మాణంతో పాటు సాలహారం నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.58 కోట్లను మంజూరు చేయించగా మరో రూ.38 లక్షలతో విమాన గోపురం, గర్భాలయ అభివృద్ధి పనులను చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకున్న వీరభద్రాలయ అధికారులు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేసి బస సౌకర్యాలను కల్పిస్తున్నారు. చదవండి: శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం -
కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి.. అంతలో
సాక్షి, కొడంగల్( వికారాబాద్): కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన సోమవారం పట్టణంలోని బస్టాండు సమీపంలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బషీరాబాద్ మండలం ఎక్మైయి గ్రామానికి చెందిన వెంకటయ్యగౌడ్ తన భార్యాపిల్లలతో కలిసి కర్ణాటకలోని యానగుంది పుణ్యక్షేత్రానికి సోమవారం ఉదయం బయలుదేరారు. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య ఈ క్రమంలో కొడంగల్ బస్టాండులో దిగి మూత్రం చేయడానికి బస్టాండ్ పక్కకు వెళ్లాడు. సమయం గడుస్తున్నా భర్త రాకపోవడంతో భార్య వెళ్లి చూసేసరికి వెంకటయ్యగౌడ్ కిందపడి ఉన్నాడు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటయ్యగౌడ్‌కు గతంలోనే హార్ట్ సర్జరీ జరిగినట్లు, లో బీపీ ఉన్నట్లు భార్య సుజాత తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాలకిషన్ తెలిపారు. -
‘అంతా మోసం’.. చైనా పరువుపాయే!
‘గ్జియాపు కౌంటీ.. ఫూజియన్ ప్రావిన్స్‌లోనే సుందరమైన ప్రదేశం. చిన్న ఊరే అయినప్పటికీ ఆహ్లాదానికి కలిగించే అందాలు ఆ ఊరి సొంతమ’ని చాటింపు వేయించుకుంది చైనా ప్రభుత్వం. ఆ ఫొటోలు చూసి అక్కడికి వెళ్తున్న టూరిస్టులకు.. తీరా అలాంటి అందాలేవీ తారసపడకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే అక్కడి యవ్వారమంతా ఉత్తదేనని ఆధారాలతో సహా బయటపెట్టారు కొందరు నెటిజన్స్. అదీ చైనావాళ్లే కావడం విశేషం. బీజింగ్: ఒడ్డు నుంచి చూస్తే సుందరంగా కనిపించే దృశ్యాల నడుమ చేపలు పట్టే జాలర్లు, పచ్చదనం మధ్య పశువుల మందలు, పొగమంచులో పక్షుల సందడి, అమాయకపు రైతులు.. వెరసి చైనాలోని రూరల్ టౌన్ గ్జియాపు కౌంటీని సుందర ప్రాంతంగా ప్రకటించుకుంది చైనా టూరిజం శాఖ. అంతేకాదు ఫారిన్ టూరిస్టులకు స్పెషల్ ప్యాకేజీలతో రాయితీలు కూడా ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు వెబో(చైనా వెర్షన్ ట్విటర్) యాప్‌లలో కూడా ఆ ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఆ యవ్వారం పైన పటారం.. లోన లొటారం అని తేలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఫేక్ ఫొటో షూట్‌తో తీసిన ఆ ఫొటోల గుట్టును అక్కడి యువతే సోషల్ మీడియాలో లీక్ చేసింది. అంతేకాదు అందులో ఉంది నిజం రైతులు, కూలీలు కాదని, వాళ్లు మోడల్స్ అని, ఒక్కొక్కరికి 30 డాలర్ల చొప్పున చెల్లించారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం కూడా ప్రచురించింది. కరోనాతో ఆర్థికంగా దిగజారిని ఆ ఊరిని.. టూరిస్ట్ ఆదాయం ద్వారా తిరిగి నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలా ప్రమోట్ చేసుకుందని ఆ కథనం వెల్లడించింది. అయినప్పటికీ మోసంతో ఆదాయం రాబట్టడం.. దేశం పరువు తీసే అంశమని అక్కడి యువత భావించింది. అందుకే ఆ షూట్ ఫొటోల్ని బయటపెట్టింది. -
20 ఏళ్ల తర్వాత సందర్శించా: అనిల్ కపూర్
ముంబై: బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఎప్పుడు హుషారుగా తన అభిరుచులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తనకిష్టమైన అలీబాగ్ ప్రదేశాన్ని 20ఏళ్ల తర్వాత సందర్శించినట్లు తెలిపారు. అనిల్ కపూర్ తెల్లషర్ట్ నీలి రంగు పాయింట్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్న దృష్యాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మీకు 63సంవత్సరాలంటే నమ్మలేమని చాలా యంగ్ కనిపిస్తున్నారని అనిల్ కపూర్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా అనిల్ కపూర్ సందర్శించిన బీచ్ చెట్లు, నీటితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మహారాష్ట్ర ప్రదేశంలొ ఉన్న అలీబాగ్ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫిజికల్ ఫిట్ నెస్ వ్యాయామం చెస్తున్న దృష్యాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనిల్ కపూర్ తన ఫిట్ నెస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి "ముఖం కంటే కండరాలు బాగా కనిపించినప్పుడు" అనే క్యాప్షన్ అనిల్ కపూర్ జోడించిన సంగతి తెలిసిందే. (చదవండి: అనిల్ కపూర్ "కిల్లర్ కాంబో'' వైరల్) -
పర్యాటకులు పన్ను చెల్లించక్కర్లేదు
గోవా: షారుఖ్ ఖాన్ నటించిన డియర్ జిందగీ సినిమాలో ఓ అందమైన ప్రదేశం అందరినీ కట్టిపడేసింది. ఆ ఒక్క సినిమాలోనే కాదు, పలు సినిమాలు కూడా ఆ లొకేషన్లో చిత్రీకరించబడ్డాయి. ఇంతకీ ఆ ప్రదేశం.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పూర్వీకుల గ్రామమైన పారా గ్రామం. చూపు తిప్పుకోలేని అందాలు సొంతం చేసుకున్న ఆ పర్యాటక గ్రామం పర్యాటకులు తీసుకునే ఫొటోలపై పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి గ్రామప్రజలు తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి విధానాలు అమలు చేస్తే పర్యాటకుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరించారు. పర్యాటకశాఖ సహా పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గిన పారా గ్రామపంచాయితీ ప్రస్తుతానికి ఫొటోగ్రఫీ పన్నును నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దారిపొడవునా స్వాగతం పలికే కొబ్బరి చెట్లు, ప్రకృతి అందాలతో విరసిల్లే ఆ ప్రాంతంలో ఫొటోలు తీసుకోవాలన్నా, వీడియోలు చిత్రీకరించాలన్నా స్వచ్ఛ పన్ను కింద రూ.100 నుంచి రూ.500 చెల్లించాల్సి వచ్చేది. గ్రామపంచాయితీ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమై ఫొటోగ్రఫీ పన్నును నిషేధించటంతో పర్యాటకులకు ఊరట లభించింది. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ డెలిలా లోబో మాట్లాడుతూ.. ఆదాయం కోసం పన్ను విధించట్లేదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌ను తగ్గించడానికి, పర్యాటకులు రోడ్లపై చెత్త పడేయకుండా నివారించడానికి స్వచ్ఛ పన్ను ఆలోచన చేశామన్నారు. అయితే దీన్ని ఇప్పుడు అమలు చేయమని వెల్లడించారు. -
కార్తీకం వచ్చిందమ్మా.. కోనసీమ చూసొద్దామా!
సాక్షి, ముమ్మిడివరం: కోనసీమలో కార్తీక మాసం సందడి నెలకొంది. అటు భక్తిభావంతో, ఇటు వినోద, విహారయాత్రలతో కోనసీమ కళకళలాడుతోంది. తన సహజ సిద్ధమైన అందాలతో సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. పచ్చని తీవాచీ పరిచినట్టుగా ఉండే పంటపొలాలు, అడుగడుగునా దర్శనమిచ్చే దేవాలయాలు, గోదావరి పాయల గలగలలు, ఇసుక తిన్నెలతో కూడిన సముద్రపు సోయగాలు చారిత్రక ప్రదేశాలతో కోనసీమలో ప్రకృతి రమణీయత ఉట్టి పడుతోంది. కార్తికమాసం వచ్చిదంటే కోనసీమ వాసుల ఆనందానికి అవధులుండవు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా వనభోజనాల్లో పాల్గొంటారు. మరికొందరైతే ఉపవాస దీక్షలతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. సముద్రం వెంబడి సరుగుడు తోటలు, రిసార్టులు, లైట్ హౌస్‌లు, తీరప్రాంతాలు, కోరంగి అభయారణ్యం, కందికుప్ప లైట్‌హౌస్, అన్నంపల్లి అక్విడెక్టు, పీడబ్యూడీ బంగ్లాలు, ముఖ్యమైన పిక్నిక్ స్పాట్లుగా గుర్తింపు పొందాయి. వీటితో పాటు ఆదుర్రు బౌద్ధ స్తూపం, దిండి బోటు హౌస్, రిసార్టులు, పర్యాటక కేంద్రాలుగా అందరినీ అలరిస్తున్నాయి. అలాగే అయినవిల్లి శ్రీసిద్ధి వినాయక స్వామి, ముక్తేశ్వరంలోని క్షణముక్తేశ్వరస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి, అమలాపురం వేంకటేశ్వరస్వామి, కుండలేశ్వరం కుండలేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. విహారం కాకూడదు.. విషాదం పిక్నిక్‌లంటే తమను తాము మరిచిపోయేంత సంతోషంగా గడుపుతారు.అయితే ఈ విహారం ఒక్కొక్కసారి విషాదంగా మారుతోంది. ముఖ్యంగా సముద్రం స్నానాలకు వెళ్లే పర్యాటకులు మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా అంతర్వేది, ఓడలరేవు, కొమరిగిరిపట్నం, కాట్రేనికోన సముద్ర తీరాల వద్ద ఏటా ఏదొక దుర్ఘటన జరుగుతూనే ఉంది. ఏదొక ప్రమాదం జరిగే వరకు పోలీసులు సైతం స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్ర తీరంలో గస్తీ ఏర్పాటు చేస్తున్నా అనుకున్నంత ప్రయోజనం చేకూరడం లేదని పర్యాటకులు వాపోతున్నారు. -
ఫొటోలకు ఫోజులు... భయానక అనుభవం!
ఇండోనేషియాలోని నూసా లెంబోంగన్ ఐలాండ్‌కు వెళ్లిన ఓ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. సరదాగా గడుపుతూ.. సముద్రం అంచున నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చే సమయంలో ఒక్కసారిగా భారీ అలలు ఆమెను ముంచెత్తాయి. దీంతో అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో సముద్రంలోకి కాకుండా బయటికి కొట్టుకురావడంతో సదరు పర్యాటకురాలు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకుంది. కాగా ఇండోనేషియాలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన డెవిల్స్ టియర్ స్పాట్లో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. ‘సముద్రం ఒడ్డున నిలుచుండటం వల్ల ఇలాంటి ప్రమాదాల బారిన పడాల్సి ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. 20 మీటర్ల దూరం నుంచి కూడా సముద్రం అందాలను వీక్షించవచ్చు’ అంటూ బాలీలైఫ్ అనే యూజర్ నేమ్‌తో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram WARNING WARNING! Please like and share this video so more people understand how dangerous it is to stand this close! Please stop and be careful! You still have an amazing view 20m from the edge. @balilife Going to Bali? Join us on FB, A community where you can get answers to all your questions and share your Bali experiences, Link in bio ❤ ⠀ ⠀⠀ #Balilife #bali #Бали #bali2018 #wanderlusting #couplegoals #travelbug #couplesgoals #travelinspo #vacaymode #relationshipgoals #indonesia #femmetravel #passionpassport #sheisnotlost #infinitypool #mood #reisen #lifegoals #destinations #beautifuldestinations #bestvacations #buongiorno A post shared by Bali, Indonesia 🌴 (@balilife) on Mar 17, 2019 at 3:22am PDT -
భీమునిపాదం జలపాతంలో పర్యాటకుల సందడి
గూడూరు(మహబూబాబాద్): మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని భీమునిపాదం జలపాతంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భీమునిపాదం జలపాతం జాలువారుతోంది. వర్షాకాలం మొదలు వేసవికాలం చివరి వరకు సెలవు దినాల్లో జలపాతాన్ని వీక్షించడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. సరదాగా స్నానాలు చేస్తు, ప్రకృతి రమణీయతను చూసి కనువిందు పొందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తిస్తామని పర్యాటక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు చెపుతూ వస్తున్నారు. జలపాతం వద్ద మౌళిక వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. -
గండిపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
-
‘కూర్గ్’ సొగసు చూడతరమా!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలోని ‘కూర్గ్’ పేరు వినగానే ఎవరికైనా ఒళ్లు పులకరిస్తుంది. పలు రకాల పూల సమ్మిళిత సువాసనలు. రకరకాల కాఫీ గింజల గుబాళింపులు ముక్కు పుటాలను అదరగొడతాయి. ఊపిరితిత్తులకు కొత్త ఊపిరినిస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయి. అందమైన పచ్చిక బయళ్లు, గుబురైన చెట్ల సముదాయంతో బారులు తీరిన పర్వత శ్రేణులు, వాటి మధ్యనుంచి జాలువారే జలపాతాలు, కొమ్మ కొమ్మకు పలకరించే పక్షుల కిలకిలారావాలు. వన్య ప్రాణుల అలజడి మదిలో మెదులుతాయి. ఇదంతా వినడం వల్లనే, చదవడం వల్లనే మనలో కలిగే అనుభూతి. ఇక ప్రత్యక్షంగా వీక్షిస్తేనా....? ఆ అనుభూతిని ఎవరైనా మాటల్లో చెప్పడం కష్టం. ఎవరికి వారు ఆ అనుభూతిని అనుభవించి పరవశించాల్సిందే. అందుకే కూర్గ్‌ను ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణించారేమో! పర్యాటకులు కూడా పలు రకాలుగా ఉంటారు వయసురీత్యా, అభిరుచుల రీత్యా. కొందరికి చెట్టూ పుట్టలు పట్టుకొని ట్రెక్కింగ్ చేయడం, సుడులు తిరిగే సన్నటి నదీ పాయలో రాఫ్టింగ్ చేయడం, పారా గ్లైడింగ్ చేయడం, పారా జంపింగ్ చేయడం, బోటింగ్ చేయడం, రోప్‌వేలో ప్రయాణించడం ఇష్టం. లగ్జరీ రిసార్టుల్లో ఇవి అందుబాటులో ఉన్నా అంత డబ్బు వెచ్చించని వారికి అందుబాటులో ఉండవు. మరికొందరికి ప్రశాంత వాతావరణం ఇష్టం. కంటి ముందు కనిపించే కొండ కోనల్ల నుంచి వచ్చే చల్లటి, స్వచ్ఛమైన గాలులను ఆస్వాదించడం, దట్టమైన చెట్ల మధ్య నుంచి కాలిబాటన కాస్త దూరం ప్రయాణించడం, జలపాతాలను ఆస్వాదించడం, పక్షలు, వన్య సంరక్షణ ప్రాంతాలను సందర్శించడం వారికీ హాబీ. డబ్బును దండిగా ఖర్చు పెట్టే వారి కోసం కూర్గ్ రాజధాని మడికరి ప్రాంతంలో పలు లగ్జరీ రిసార్టులుండగా, రెండో కేటగిరీ వాళ్ల కోసం కూర్గ్‌లోని కుట్టా ప్రాంతంలో సరైన కాటేజీలు ఉన్నాయి. మడికేరి ఏడు కిలోమీటర్ల దూరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ‘అబే’ జలపాతం ఉండగా, కుట్టాకు సమీపంలో రెండవ అతిపెద్ద జలపాతం ‘ఇరుప్పు’ ఉంది. అబే జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుండగా, ఇరుప్పు ప్రశాంతంగా ఉంటుంది. దీని పక్కనే పక్షుల సంరక్షణ కేంద్రం ఉండగా, ట్రెక్కింగ్ చేసే కుర్రకారు కోసం నిటారైన కొండ ఉండనే ఉంది. ఇరుప్పు జలపాతం సమీపంలో పర్యాటకులు ఉండేందుకు పలు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కొండ దిగువ ప్రాంతంలో ఉండగా, పూర్తిగా కొండ ఎగువున ‘ట్రాపికల్ బూమ్స్’ అనే కాటేజీ కొత్తగా వెల్సింది ఆకర్షణీయంగానే కాకుండా, అందుబాటు ధరల్లో ఉంది (ఆసక్తిగల వారు మరిన్ని వివరాలకు 9449118698 మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చు). ఎక్కడికి వెళ్లనవసరం లేకుండానే ఈ క్యాటీజీ వసారాలో కూర్చొని ఆవలి కొండలను, కొండలను కౌగలించుకునే మబ్బులను, ఎప్పుడూ కురిసే మంచు ముత్యాలను చూడవచ్చు. ఈ కాటేజీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ‘ఇరుప్పు’ వాటర్ ఫాల్స్ ఉండగా, పది కిలోమీటర్ల దూరంలో నాగర్హోల్ నేషనల్ పార్క్, అంతే దూరంలో తోల్పట్టి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది. కాఫీ గింజల సువాసనలు, పూల గుబాళింపులు ఎల్లప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. రుతువులతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కూర్గ్‌ను సందర్శించవచ్చు. ఒక్కో రుతువులో ఒక్కో రకమైన అనుభూతిని పొందవచ్చు. నిండైన వాగులు, వంకలతోపాటు పచ్చదనం ఎక్కువగా ఉండే ‘సెప్టెంబర్ నుంచి మార్చి’ మధ్యలో సందర్శించడం మరీ బాగుంటుంది.