భీమునిపాదం జలపాతంలో పర్యాటకుల సందడి | Bhemuni Padam Waterfall Is A Popular Tourist Attraction | Sakshi
Sakshi News home page

భీమునిపాదం జలపాతంలో పర్యాటకుల సందడి

Published Mon, Jul 16 2018 2:57 PM | Last Updated on Mon, Jul 16 2018 2:57 PM

Bhemuni Padam Waterfall Is A Popular Tourist Attraction - Sakshi

సీతానగరం శివారు భీమునిపాదం జలపాతంలో పర్యాటకుల సందడి  

గూడూరు(మహబూబాబాద్‌): మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని భీమునిపాదం జలపాతంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భీమునిపాదం జలపాతం జాలువారుతోంది.

వర్షాకాలం మొదలు వేసవికాలం చివరి వరకు సెలవు దినాల్లో జలపాతాన్ని వీక్షించడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. సరదాగా స్నానాలు చేస్తు, ప్రకృతి రమణీయతను చూసి కనువిందు పొందుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తిస్తామని పర్యాటక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు చెపుతూ వస్తున్నారు. జలపాతం వద్ద మౌళిక వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement