
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కొడంగల్( వికారాబాద్): కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన సోమవారం పట్టణంలోని బస్టాండు సమీపంలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బషీరాబాద్ మండలం ఎక్మైయి గ్రామానికి చెందిన వెంకటయ్యగౌడ్ తన భార్యాపిల్లలతో కలిసి కర్ణాటకలోని యానగుంది పుణ్యక్షేత్రానికి సోమవారం ఉదయం బయలుదేరారు. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య
ఈ క్రమంలో కొడంగల్ బస్టాండులో దిగి మూత్రం చేయడానికి బస్టాండ్ పక్కకు వెళ్లాడు. సమయం గడుస్తున్నా భర్త రాకపోవడంతో భార్య వెళ్లి చూసేసరికి వెంకటయ్యగౌడ్ కిందపడి ఉన్నాడు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటయ్యగౌడ్‌కు గతంలోనే హార్ట్ సర్జరీ జరిగినట్లు, లో బీపీ ఉన్నట్లు భార్య సుజాత తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ బాలకిషన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment