ఫొటోలకు ఫోజులు... భయానక అనుభవం! | Terrifying Moment For Tourist Wave Sweeps Away Her | Sakshi
Sakshi News home page

ఫొటోలకు ఫోజులు... భయానక అనుభవం!

Published Wed, Mar 20 2019 2:50 PM | Last Updated on Wed, Mar 20 2019 4:50 PM

Terrifying Moment For Tourist Wave Sweeps Away Her - Sakshi

ఇండోనేషియాలోని నూసా లెంబోంగన్‌ ఐలాండ్‌కు వెళ్లిన ఓ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. సరదాగా గడుపుతూ.. సముద్రం అంచున నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చే సమయంలో ఒక్కసారిగా భారీ అలలు ఆమెను ముంచెత్తాయి. దీంతో అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో సముద్రంలోకి కాకుండా బయటికి కొట్టుకురావడంతో సదరు పర్యాటకురాలు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకుంది.

కాగా ఇండోనేషియాలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన డెవిల్స్‌ టియర్‌ స్పాట్‌లో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. ‘సముద్రం ఒడ్డున నిలుచుండటం వల్ల ఇలాంటి ప్రమాదాల బారిన పడాల్సి ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. 20 మీటర్ల దూరం నుంచి కూడా సముద్రం అందాలను వీక్షించవచ్చు’ అంటూ బాలీలైఫ్‌ అనే యూజర్‌ నేమ్‌తో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement