కనువిందు చేస్తున్న జలపాతం సోయగాలు
పెరుగుతున్న పర్యాటకులు
పొచ్చర జలపాతం వద్ద వనదేవత విగ్రహం
పొచ్చర జలపాతాన్ని వీక్షిస్తున్న పర్యాటకులు
ఆదిలాబాద్: పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను కట్టిçపడేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం వద్ద పెద్ద బండరాళ్లపై పడుతున్న నీరు, వచ్చే నీటి తుంపరులు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.
ఆహ్లాద వాతావరణం..
పొచ్చర జలపాతం అందాలు, పచ్చని వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. జలపాతాన్ని చూడటంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వచ్చిన పర్యాటకులు íవీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పొచ్చెర జలపాతం మంచి పిక్నిక్ స్పాట్‌గా ఏర్పడింది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు విగ్రహాలతో ఫొటోలు తీసుకుంటున్నారు.
‘పొచ్చర’కు ఇలా చేరుకోవాలి..
బోథ్ మండలంలోని పొచ్చర జలపాతానికి నిర్మల్ నుండి వచ్చే వారు జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండల కేంద్రం మీదుగా రావాలి. నేరడిగొండ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు బోథ్ ఎక్స్ రోడ్డు ఉంటుంది. ఎడమ వైపు తిరిగి అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు పొచ్చర జలపాతానికి దారి వస్తుంది. కిలో మీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వారు 44వ జాతీయ రహహదారిపై ఆదిలాబాద్ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించి బోథ్ ఎక్స్ రోడ్డు కుడివైపు రావాలి. అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు.
సహజసిద్ధమైన అందాలు..
పొచ్చర వద్ద సహజ సిద్ధమైన అందాలు బాగున్నాయి. జలపాతం వద్ద బండరాళ్లపై నీరు జారిపడినప్పుడు వచ్చే శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి. పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కూర్చోవడానికి కుటీరాలు ఏర్పాటు చేశారు. కుటుంబంతో వచ్చి చూడాల్సిన ప్రాంతం ఇది. – గోపిడి రమేశ్‌రెడ్డి, జగిత్యాల
ఆహ్లాదకరంగా ఉంది..
నేను వరంగల్ నుంచి వచ్చా. జతపాతం అందాలు చాలా బాగున్నాయి. ఆహ్లదకరంగా ఉంది. వీకెండ్‌లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాంతం. ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మా కుటుంబంతో మళ్లీ వచ్చి చూస్తాం. – ప్రియాంక, వరంగల్
ఇవి చదవండి: మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు
Comments
Please login to add a commentAdd a comment