pochera
-
Telangana: ప్రకృతి ఒడిలో 'పొచ్చెర' అందాలు..
ఆదిలాబాద్: పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను కట్టిçపడేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం వద్ద పెద్ద బండరాళ్లపై పడుతున్న నీరు, వచ్చే నీటి తుంపరులు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.ఆహ్లాద వాతావరణం..పొచ్చర జలపాతం అందాలు, పచ్చని వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. జలపాతాన్ని చూడటంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వచ్చిన పర్యాటకులు íవీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పొచ్చెర జలపాతం మంచి పిక్నిక్ స్పాట్‌గా ఏర్పడింది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు విగ్రహాలతో ఫొటోలు తీసుకుంటున్నారు.‘పొచ్చర’కు ఇలా చేరుకోవాలి..బోథ్ మండలంలోని పొచ్చర జలపాతానికి నిర్మల్ నుండి వచ్చే వారు జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండల కేంద్రం మీదుగా రావాలి. నేరడిగొండ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు బోథ్ ఎక్స్ రోడ్డు ఉంటుంది. ఎడమ వైపు తిరిగి అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు పొచ్చర జలపాతానికి దారి వస్తుంది. కిలో మీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వారు 44వ జాతీయ రహహదారిపై ఆదిలాబాద్ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించి బోథ్ ఎక్స్ రోడ్డు కుడివైపు రావాలి. అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు.సహజసిద్ధమైన అందాలు..పొచ్చర వద్ద సహజ సిద్ధమైన అందాలు బాగున్నాయి. జలపాతం వద్ద బండరాళ్లపై నీరు జారిపడినప్పుడు వచ్చే శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి. పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కూర్చోవడానికి కుటీరాలు ఏర్పాటు చేశారు. కుటుంబంతో వచ్చి చూడాల్సిన ప్రాంతం ఇది. – గోపిడి రమేశ్‌రెడ్డి, జగిత్యాలఆహ్లాదకరంగా ఉంది..నేను వరంగల్ నుంచి వచ్చా. జతపాతం అందాలు చాలా బాగున్నాయి. ఆహ్లదకరంగా ఉంది. వీకెండ్లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాంతం. ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మా కుటుంబంతో మళ్లీ వచ్చి చూస్తాం. – ప్రియాంక, వరంగల్ఇవి చదవండి: మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు -
TSRTC: సుందర జలపాతాలు చూసొద్దాం రండి..
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. జలపాతాల సందర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రతి శని, ఆదివారాల్లో బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈప్రత్యేక బస్సులు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 55, 56) నుంచి, ఉదయం 5.30 గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 20) నుంచి బయల్దేరుతాయి. పర్యటనలో భాగంగా పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, పోచేరా జలపాతం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని, అనంతరం నిర్మల్ బొమ్మలు, హస్తకళలను సందర్శిస్తారు. రాత్రి 10.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. (క్లిక్: ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు) ఈ పర్యటనలో కుంటాల వద్ద మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో చేగుంట వద్ద రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. పిల్లలకు రూ.599, పెద్దవాళ్లకు రూ.1099 చొప్పున చార్జి ఉంటుంది. పర్యటన టిక్కెట్ల బుకింగ్ కోసం ఫోన్ : 7382842582 నంబర్‌ను సంప్రదించవచ్చు. (క్లిక్: పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
అబ్బురపరిచే జలపాతాలు
సాక్షి,వీకెండ్: జలపాతాలు జలజల పారుతున్నాయి.. పచ్చని పరిసరాలు ఆనందం, ఆహ్లాదం పంచుతున్నాయి... మరెందుకాలస్యం పదండి జలపాత్రయం... – కోన సుధాకర్‌రెడ్డి జలపాతాలకు ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. మూడు ప్రముఖ జలపాతాలు కుంటాల, పొచ్చెర, కనకాయ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. అందుకే దీనికి జలపాత్రయం అనే పేరొచ్చింది. కుంటాల... తెలంగాణలోనే పెద్ద జలపాతం ఇది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ మండలంలో కడెం నదీపై ఉందీ. హైదరాబాద్ నుంచి 250 కి.మీ దూరం. సిటీ నుంచి నిర్మల్ (210 కి.మీ) వెళ్లి, అక్కడి నుంచి నేరేడిగొండ (30) వెళ్లాలి. నేరేడిగొండ నుంచి 10కి.మీ దూరంలో ఉందీ జలపాతం. సిటీ నుంచి నిర్మల్‌కు, అక్కడి నుంచి నేరేడిగొం డకు బస్ సౌకర్యం ఉంది. నేరేడిగొండ నుంచి ప్రైవేట్ వాహనాల్లో కుంటాల చేరుకోవచ్చు. పొచ్చెర... ఇక్కడ గోదావరి గలగలలు మీకు స్వాగతం పలుకుతాయి. చిన్న చిన్న జలపాతాలు జలజలపారుతూ మిమ్మల్ని మైమరిపిస్తాయి. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 47 కి.మీ దూరంలో ఉంది. నగరం నుంచి నిర్మల్‌కు 210 కి.మీ దూరం. బస్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పొచ్చెర జలపాతానికి వాహనాలు ఉంటాయి. కనకాయ్... కనకాయ్ జలపాతాన్ని ట్రెక్కింగ్ చేసేవారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇది సిటీ నుంచి 260 కి.మీ దూరంలో ఉంది. నిర్మల్ నుంచి 50 కి.మీ దూరంలో ఉంటుంది. నగరం నుంచి నిర్మల్‌కు బస్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వాహనాల్లో కనకాయ్ చేరుకోవచ్చు. టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో... తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) బృందాలుగా వెళ్లే వారి కోసం ప్రత్యేక వాహనాలు సమకూరుస్తోంది. వివరాలకు 040– 6674 6370,6674 5986, 98485 40371 నంబర్లలో సంప్రదించొచ్చు.