Waterfall Jumping
-
Telangana: ప్రకృతి ఒడిలో 'పొచ్చెర' అందాలు..
ఆదిలాబాద్: పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను కట్టిçపడేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం వద్ద పెద్ద బండరాళ్లపై పడుతున్న నీరు, వచ్చే నీటి తుంపరులు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.ఆహ్లాద వాతావరణం..పొచ్చర జలపాతం అందాలు, పచ్చని వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. జలపాతాన్ని చూడటంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వచ్చిన పర్యాటకులు íవీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పొచ్చెర జలపాతం మంచి పిక్నిక్ స్పాట్‌గా ఏర్పడింది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు విగ్రహాలతో ఫొటోలు తీసుకుంటున్నారు.‘పొచ్చర’కు ఇలా చేరుకోవాలి..బోథ్ మండలంలోని పొచ్చర జలపాతానికి నిర్మల్ నుండి వచ్చే వారు జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండల కేంద్రం మీదుగా రావాలి. నేరడిగొండ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు బోథ్ ఎక్స్ రోడ్డు ఉంటుంది. ఎడమ వైపు తిరిగి అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు పొచ్చర జలపాతానికి దారి వస్తుంది. కిలో మీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వారు 44వ జాతీయ రహహదారిపై ఆదిలాబాద్ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించి బోథ్ ఎక్స్ రోడ్డు కుడివైపు రావాలి. అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు.సహజసిద్ధమైన అందాలు..పొచ్చర వద్ద సహజ సిద్ధమైన అందాలు బాగున్నాయి. జలపాతం వద్ద బండరాళ్లపై నీరు జారిపడినప్పుడు వచ్చే శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి. పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కూర్చోవడానికి కుటీరాలు ఏర్పాటు చేశారు. కుటుంబంతో వచ్చి చూడాల్సిన ప్రాంతం ఇది. – గోపిడి రమేశ్‌రెడ్డి, జగిత్యాలఆహ్లాదకరంగా ఉంది..నేను వరంగల్ నుంచి వచ్చా. జతపాతం అందాలు చాలా బాగున్నాయి. ఆహ్లదకరంగా ఉంది. వీకెండ్లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాంతం. ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మా కుటుంబంతో మళ్లీ వచ్చి చూస్తాం. – ప్రియాంక, వరంగల్ఇవి చదవండి: మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు -
తండ్రి తిట్టాడని 90 అడుగుల ఎత్తు నుంచి..
Waterfall Jump Video: చిన్న చిన్న కారణాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటి తరం. తాజాగా.. తండ్రి మందలించాడని ఓ యువతి అఘాయిత్యానికి పాల్పడబోయింది. ఏకంగా 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. కానీ, ఆశ్చర్యకరరీతిలో.. ఆ జలపాతమే ఆమెను రక్షించింది!.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లా జగదల్పూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ చౌకీ వద్ద మంగళవారం సాయంత్రం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. జలపాతం చివరి దాకా వెళ్లి.. నిల్చుంది. ఆ సమయంలో కొందరు ఆమెను గమనించి.. వద్దని వారించారు. కానీ, ఆమె వినకుండా దూకేసింది. కానీ, అంత పై నుంచి పడ్డా కూడా అదృష్టం కొద్దీ ఆమెకు ఏం కాలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాళ్లపై పడకుండా.. నేరుగా నీళ్లలోకి వచ్చి చేరింది. ఆమె బతికే ఉందని గుర్తించిన స్థానికులు పడవల్లో వెళ్లి రక్షించి.. ఒడ్డుకు తెచ్చారు. Watch this Earlier in the day, a woman attempted to commit suicide by jumping into Chitrakoot waterfall of Bastar district, #Chhattisgarh. Fortunately, the woman managed to swim back to shore.#mentalhealth pic.twitter.com/qtBGMaFhnu — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 18, 2023 ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించి పేరెంట్స్‌కు అప్పజెప్పారు. సెల్‌ఫోన్ అతిగా వాడుతున్నందుకు తండ్రి మందలించడంతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని తెలుస్తోంది. జలపాతం వద్ద కొందరు యువకులు తమ సెల్ఫోన్లలో ఆమె దూకేటప్పుడు దృశ్యాలను బంధించగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఇంద్రావతి నదిపై చిత్రాకోట్ జలపాతం ఉంది. దాదాపు 90 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దూకుతుంటుంది. ఈ వాటర్ఫాల్కు స్థానికంగా మినీ నయాగారా ఫాల్స్‌గా పేరుంది. వానాకాలంలో 300 మీటర్ల విస్తీర్ణంతో ప్రవహిస్తుంటుంది. అయితే చుట్టూ రక్షణా వలయంలాంటివి లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అస్తమాను ఫోన్ తోనే.. తండ్రి తిట్టారని 90 అడుగుల ఎత్తు నుండి
రాంచీ: భారత నయాగరాగా పిలవబడే చిత్రకూట్ జలపాతంలోకి దూకి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు సమాయానికి స్పందించబట్టి ఆ యువతి 90 అడుగుల ఎత్తు నుండి దూకినా కాపాడగలిగారు. ఎటొచ్చి ఆమే ఎందుకు చనిపోవాలనుకుందో కారణం తెలిసిన తర్వాత ఎవ్వరికీ నోట మాట రాలేదు. తన కోపమే తనకి శత్రువు అంటారు. అలాంటి కోపమే ఓ యువతి ప్రాణాలను యమలోకం అంచు వరకు తీసుకెళ్ళింది. పిల్లలు తప్పు చేస్తే తల్లదండ్రులు మందలించడం సర్వసాధారణమే. పిల్లలు అందుకు బదులుగా కోపగించడం కూడా సహజమే. రెండు మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటుంది. తర్వాత అంతా మామూలే.. ఎక్కడో కొంతమంది మాత్రమే తల్లదండ్రులు తిట్టారని అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు. అచ్చంగా అలాంటి పిచ్చి పనే చేసింది చిత్రకూట్ కు చెందిన సరస్వతి మౌర్య(21). నిత్యం సెల్ ఫోన్లో ఎదో ఒకటి చూసుకుంటూ కాలక్షేపం చేస్తోందన్న కారణంతో ఆమె తండ్రి శాంటో మౌర్య ఆమెను పరుషమైన మాటాలతో దూషించారట. తప్పు చేస్తున్నానని గ్రహించకపోగా అంత మాత్రానికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు పోలీసులు. కోపంతో సరస్వతి చిత్రకూట్ జలపాతాల వద్దకు వెళ్లి చుట్టుపక్కల వారు వారిస్తున్నా వినకుండా 90 అడుగుల ఎత్తు నుండి అందులోకి దూకేసింది. క్షణాల్లో ఆమె నదీప్రవాహంలో కిందకు వెళ్ళిపోయింది. అక్కడి గ్రామస్థులు అప్రమత్తమై బోటు మీద వెళ్లి సరస్వతిని రక్షించారు. అక్కడున్న సందర్శకుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: కుటుంబాన్ని చంపి తగులబెట్టి.. మృతుల్లో ఆరు నెలల పసికందు.. -
తలకోన జలపాతం: విహారయాత్రలో విషాదం.. సుమన్ మృతి
సాక్షి, తిరుపతి: తలకోన జలపాతం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహారం కోసం వెళ్లిన యాత్ర.. విషాదకరంగా ముగిసింది. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయ చెన్నైకి చెందిన సుమన్(23) మృతిచెందాడు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమన్ మృత్యువాతపడ్డాడు. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సుమన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కాగా, చెన్నైలో ఎమ్మెస్సీ చదువుతోన్న సుమంత్ తిరుపతికి చెందిన సహ విద్యార్ధితో కలిసి తలకోనకు వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. జలపాతంపై నుంచి దూకుతూ వీడియో తీయమని స్నేహితుడిని కోరాడు. ఈ క్రమంలో పై నుంచి తలకిందులుగా నీళ్లలోకి దూకిన సుమంత్ కనిపించకపోకవడంతో స్నేహితుడు ఆందోళన చెందాడు. సుమంత్ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రవారిపాలెం పోలీసులు శుక్రవారం రాత్రి వరకు సుమంత్‌ను బయటికి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటిపడటంతో శనివారం ఉదయం వెలికితీస్తామన్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు సుమంత్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా తలకోనలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ప్లాట్‌ఫామ్‌పై పిచ్చి చేష్టలు.. లోకల్ ట్రైన్ ఢీకొనడంతో గాల్లోకి ఎగిరి.. -
బోస్నియాలో 'బాహుబలులు'