Chhattisgarh Girl Jumps Into Chitrakote Waterfall, Survived Miraculously - Sakshi
Sakshi News home page

వీడియో: తండ్రి తిట్టాడని 90 అడుగుల ఎత్తు నుంచి దూకింది.. అంతలోనే..

Published Thu, Jul 20 2023 9:12 AM | Last Updated on Thu, Jul 20 2023 9:32 AM

Chhattisgarh Girl Jumps Into Waterfall survived Miraculously - Sakshi

Waterfall Jump Video: చిన్న చిన్న కారణాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటి తరం. తాజాగా..  తండ్రి మందలించాడని ఓ యువతి అఘాయిత్యానికి పాల్పడబోయింది. ఏకంగా 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. కానీ, ఆశ్చర్యకరరీతిలో.. ఆ జలపాతమే ఆమెను రక్షించింది!.. 

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లా జగదల్పూర్‌ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్‌ చౌకీ వద్ద  మంగళవారం సాయంత్రం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. జలపాతం చివరి దాకా వెళ్లి.. నిల్చుంది. ఆ సమయంలో కొందరు ఆమెను గమనించి.. వద్దని వారించారు. కానీ, ఆమె వినకుండా దూకేసింది.  కానీ, అంత పై నుంచి పడ్డా కూడా అదృష్టం కొద్దీ ఆమెకు ఏం కాలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాళ్లపై పడకుండా.. నేరుగా నీళ్లలోకి వచ్చి చేరింది. ఆమె బతికే ఉందని గుర్తించిన స్థానికులు పడవల్లో వెళ్లి రక్షించి.. ఒడ్డుకు తెచ్చారు. 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెకు కౌన్సిలింగ్‌ ఇప్పించి పేరెంట్స్‌కు అప్పజెప్పారు. సెల్‌ఫోన్‌ అతిగా వాడుతున్నందుకు తండ్రి మందలించడంతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని తెలుస్తోంది. జలపాతం వద్ద కొందరు యువకులు తమ సెల్‌ఫోన్లలో ఆమె దూకేటప్పుడు దృశ్యాలను బంధించగా.. అవి వైరల్‌ అవుతున్నాయి.  

ఇంద్రావతి నదిపై  చిత్రాకోట్‌ జలపాతం ఉంది. దాదాపు 90 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దూకుతుంటుంది. ఈ వాటర్‌ఫాల్‌కు స్థానికంగా మినీ నయాగారా ఫాల్స్‌గా పేరుంది. వానాకాలంలో 300 మీటర్ల విస్తీర్ణంతో ప్రవహిస్తుంటుంది. అయితే చుట్టూ రక్షణా వలయంలాంటివి లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.   

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement