సాధారణంగా మనం ద్విచక్ర వాహనంపై ఇద్దరు లేదా ముగ్గురు రైడర్లను చూసి ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక బైక్‌పై ఐదుగురు కుర్రాళ్లు ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతుండగా వారిని ట్రాఫిక్ పోలీసులు గమనించి, వారికి భారీ మొత్తంలో చలానా జారీచేశారు.
ఈ ఉదంతం చిత్రకూట్ జిల్లాలోని ఖోహ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బైక్‌పై ఐదుగురు కూర్చొని గ్రామంలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఇంతలో వారికి ట్రాఫిక్ పోలీసులు తారసడ్డారు. చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్‌ఐ శైలేంద్రకుమార్ సింగ్ ఆ బైక్ నడిపే కుర్రాళ్లను అడ్డుకుని, వారికి రూ.17 వేలు చలానా జారీ చేయడంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఉదంతం గురించి చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్‌ఐ శైలేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ కార్వీ కొత్వాలి ప్రాంతంలోని ఖోహ్ గ్రామంలో ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించామన్నారు. తరువాత వారిని ఆపి, వారి పేరు, చిరునామా తెలుసుకున్నామని, డ్రైవింగ్ లైసెన్స్ ను తనిఖీ చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్న ఈ ఐదుగురు కుర్రాళ్లకు రూ.17 వేలు చలాన్ జారీ చేశామన్నారు. అలాగే ఆ వాహనాన్ని సీజ్ చేశమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment