ఉత్తరప్రదేశ్‌లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం నాడు కాన్పూర్‌లో దేశంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాన్పూర్‌లో పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి 35.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 31 మంది మృతి చెందారు. సోమవారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాన్పూర్, బుందేల్‌ఖండ్‌లో ఎండ వేడిమి కారణంగా శనివారం 20 మంది మృతిచెందారు.
వీరిలో కాన్పూర్‌లో ఎనిమిది మంది, చిత్రకూట్‌లో ఆరుగురు, మహోబాలో ముగ్గురు, బందా, హమీర్‌పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదేవిధంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో ఎండ వేడిమికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వారణాసిలో ఏడుగురు, బల్లియాలో ముగ్గురు, మీర్జాపూర్‌లో ఇద్దరు, ఘాజీపూర్, సోన్‌భద్రలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
జోనల్ వాతావరణ కేంద్రం సీనియర్ వాతావరణ నిపుణులు అతుల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment