Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి | 7 People Died in a Collision Detween a Double Decker bus and a Car | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Published Sun, Aug 4 2024 8:54 AM | Last Updated on Sun, Aug 4 2024 8:58 AM

7 People Died in a Collision Detween a Double Decker bus and a Car

ఉత్తరప్రదేశ్‌లో ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక డబుల్ డెక్కర్ బస్సు, కారు  ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో  ఏడుగురు మృతిచెందగా, 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావా పోలీసు అధికారి సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ శనివారం రాత్రి 12:30 ప్రాంతంలో రాయ్‌బరేలీ నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు కారును ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురు  అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే కారులో ఉన్న ముగ్గురు కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement