మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జకాటెకాస్‌లోని హైవేపై ఒక బస్సు ప్రమాదానికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్నఈ బస్సు మక్కా వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. వెంటనే బస్సు, ట్రాక్టర్ రెండూ కాలువలో పడిపోయాయి.
జకాటెకాస్ గవర్నర్ డేవిడ్ మాన్రియల్ తొలుత ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారని తెలిపారు. అయితే రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం తరువాత ఒక ప్రకటనలో మృతుల సంఖ్యను సవరించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని స్పష్టం చేసింది.
స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రమాదం దరిమిలా కాలువలో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు యూఎస్-మెక్సికో సరిహద్దులోని చివావా రాష్ట్రంలోని క్యూడాడ్ జువార్జ్ అనే నగరానికి వెళుతోంది.
ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment