
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ రెండు వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ రాంగ్ రూట్‌లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేలోని బమన్సుత గ్రామ సమీపంలోని రోడ్డుపై గ్యాస్ ట్యాంకర్ రాంగ్ రూట్(Wrong route) నుండి వస్తూ, ఎదురుగా వస్తున్న ఒక కారు, జీపును బలంగా ఢీకొంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని ధార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతిచెందారు.
ప్రమాదం గురించి సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్రేన్ సహాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారిని రత్లం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా?
Comments
Please login to add a commentAdd a comment