ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్‌పూర్-అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ కూడలి సమీపంలో శనివారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బీహార్‌లోని సీతామర్హి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తున్నారు. కారు జౌన్‌పూర్ నుంచి కెరకట్ వైపు మలుపు తిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లోని సీతామర్హికి చెందిన గజధర్ శర్మ తన కుమారుడు చందన్‌శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. ఆయన కారు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు కుటుంబ సభ్యులు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్, సహాయకుడు ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ధ్వంసమైన కారు, లారీని క్రేన్, జేసీబీల సాయంతో పోలీసులు తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment