
రోడ్డు మీద ఓ సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ- లక్నో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం ఉదయం రెడ్ కలర్ సూట్‌కేసు ఉండటాన్ని ప్రయాణికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సూట్‌కేసును తెరిచి చూడగా అందులో ఓ మహిళ మృతదేహం కనుగొన్నారు. ఆమె శరీరమంతా గాయాల గుర్తులు ఉ‍్నట్లు గుర్తించారు.
మహిళ వయసు 25 నుంచి 30 ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పోలీసు బృందం విచారణ చేపట్టారు. సూట్‌కేస్ నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారులు సూట్‌కేస్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా అందులో కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. అయితే మహిళ ఒంటిపై ఉన్న గాయాలు గమనిస్తే ఆమె మరణించి ఒక రోజు అయి ఉండవచ్చని ఎస్సీపీ వినీత్ భట్నాగర్ తెలిపారు. మహిళ ఎవరు? ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment