
ఉత్తరప్రదేశ్: ఒక కీచక డాక్టర్ దారుణమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో చోటు చేసుకుంది. ఒక డాక్టర్ తాను ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ సదర్ కోత్వాల్ ప్రాంతంలో ఆస్పత్రి పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడు. దీన్ని చూసి ఒక మహిళ స్పందించి అతనితో సోషల్ మాధ్యమంలో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇద్దరు స్నేహితులుగా మారారు.
ఐతే ఒకరోజు సదరు డాక్టర్ ఆ మహిళను కలవాలంటూ తన ఆస్పత్రికి ఆహ్వానించాడు. దీంతో ఆమె అతని ఆస్పత్రికి వెళ్లింది. అంతే సదరు డాక్టర్ ఆమెను అక్కడ నుంచి తన హాస్టల్ రూమ్‌కి తీసుకెళ్లి తన సహచర డాక్టర్లతో కలిసి అఘాయిత్యానికి తెగబడ్డాడు. దీంతో బాధితురాలు ఉత్తరప్రదేశ్ బస్తీ నుంచి లక్నోకి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సదరు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ బస్తీ పోలీసులు కేసు నమోదు చేసి సదరు వైద్యుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు బాధితురాలు ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...)
Comments
Please login to add a commentAdd a comment