ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,అనంతపురం సప్తగిరి సర్కిల్: ‘‘ఏం ఈ రోజు డ్యూటీకి రాలేదే.. నిన్ను చూడాలని ఉంది. నీతో మాట్లాడాలని ఉంది’’... ‘‘మీ ఆయన విజయవాడలో విధులు నిర్వహిస్తుంటాడంట కదా. మరి రోజూ నీకు ఎలా? ఏంటి మరీ సంగతి...’’ నగర శివారు సూపర్‌స్పెషాలిటీలో కీచకుడి అవతారమెత్తిన ఓ వైద్యుడు కిందిస్థాయి మహిళా సిబ్బందితో మాట్లాడిన మాటలివీ. అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న ఆయన విధులకు హాజరయ్యే ఉద్యోగినులను నిత్యం వేధిస్తున్నట్లు తెలిసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడి చేష్టలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించే వారంతా ఔట్ సోర్సింగ్, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, వివాహితలు కావడంతో ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోననే దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిత్యం 10 నుంచి 15 మందిని కీచక వైద్యుడు వేధిస్తున్నట్లు సమాచారం.
ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్!
కీచక అధికారి వేధింపుల పర్వంపై ఉద్యోగినులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు 10 రోజుల క్రితమే స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోవడంతో కొంతమంది ఉద్యోగినులు మౌఖికంగా కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగినులు ఎవరికిచెప్పుకోలేక తెలియక సతమతమవుతున్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో ఉన్న ఉన్నతాధికారి అండదండలతోనే కీచకుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళా సిబ్బంది కోరుతున్నారు.
చదవండి: ‘నా భూమిని కాజేసేందుకు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారు’
Comments
Please login to add a commentAdd a comment