
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : కాలేజీ చదువుతున్న సమయంలో క్లర్కుతో ఏర్పడ్డ ఎఫైర్ ఓ మహిళ చావుకు కారణమైంది. ఆమెను 21 ఏళ్లుగా వేధింపులకు గురి చేసిన సదరు క్లర్కు.. స్నేహితుల సహాయంతో దారణంగా హత్య చేసి, ఇంటిని ఆక్రమించుకున్నాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఓ మహిళకు కాలేజీ చదువుతున్న సమయంలో రమేష్ సింగ్ అనే క్లర్క్‌తో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు ఫొటోలు, వీడియోలు చిత్రీకరించాడు రమేష్. ఆ తర్వాత కాలేజీనుంచి బయటకొచ్చిన ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. రమేష్ ఆమెను వదల్లేదు.. బెదిరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆమె పెళ్లి చేసుకున్నా అతడి వేధింపులు ఆగలేదు. అతడు తమ సంబంధం విషయం ఆమె భర్తకు చెప్పటం విడాకులకు దారితీసింది. ( 3 పేర్లు,పది అరెస్టులు: ఓ లేడీ సింగర్ క్రైం కథ)
మహిళ తండ్రి చనిపోయిన తర్వాత రమేష్ తరుచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. అతడి ఇద్దరు స్నేహితులు చంద్ర శేఖర్, దిలీప్ కుమార్‌లను కూడా వెంట బెట్టుకెళ్లేవాడు. 2020 మార్చి 12న మహిళ తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని పాతి పెట్టేశారు. అనంతరం ఆమె బంగారు నగలను దోచుకుని, ఇంటిలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు. కూతురు కనిపించకపోవటంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆ ముగ్గురు తన కూతుర్ని హత్య చేశారని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేయటానికి రంగం సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment