తల లేకుండా మహిళ మృతదేహాం.. యూపీలో కలకలం | Mystery Woman Headless, Naked Body Found In UP Kanpur | Sakshi
Sakshi News home page

తల లేకుండా మహిళ మృతదేహాం.. యూపీలో కలకలం

Published Thu, Sep 12 2024 2:41 PM | Last Updated on Thu, Sep 12 2024 2:57 PM

Mystery Woman Headless, Naked Body Found In UP Kanpur

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తలలేకుండా.. నగ్నంగా గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. కాన్పూర్ సమీపంలోని గుజైనా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం మహిళ నగ్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలిపై అత్యాచారం చేసి, హత్యచేసి రహదారిపై పడేసే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు. అయితే ఆమె ఎవరు? అనేది ఇంకా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

బుధవారం ఉదయం 5 గంటలకు తలలేని మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహాం పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలం దగ్గర ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు కానీ.. హైవేకి అవతలి వైపున ఉన్న ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కొన్ని గంటల ముందు అలాగే ఉన్న ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యిందని పోలీసులు తెలిపారు. 

ఫుటేజీలో మహిళ బూడిద రంగు ప్యాంటు ధరించి కనిపించగా.. మృతదేహానికి సమీపంలోనూ బూడిద రంగు దుస్తులముక్కలు కనిపించాయని పేర్కొన్నారు. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జిల్లాలో మహిళ మిస్సింగ్‌పై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 
చదవండి:    శ్రుతి జీవితంలో మరో పెను విషాదం

మరోవైపు ఘటనా స్థలిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి, ఆమె దంతాలు, ఎముకల నుంచి నమూనాలను సేకరించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా నేరమా? బాధితురాలు స్థానిక మహిళేనా? వేరే ప్రాంతానికి చెందింది అనేది నిర్దారించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరిగిన మరో షాకింగ్ ఘటన ఇది.. తల లేకుండా.. నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని కాన్పూర్ జాతీయ రహదారిపై గుర్తించారు.. ఈ అంశంపై నిప్పక్షపాతంగా విచారణ జరిపించి.. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా నిందితులకు కఠిన శిక్ష విధించాలి’ అని డిమాండ్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement