Jaunpur
-
యూపీలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్పూర్-అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ కూడలి సమీపంలో శనివారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బీహార్‌లోని సీతామర్హి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తున్నారు. కారు జౌన్పూర్ నుంచి కెరకట్ వైపు మలుపు తిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లోని సీతామర్హికి చెందిన గజధర్ శర్మ తన కుమారుడు చందన్‌శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. ఆయన కారు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు కుటుంబ సభ్యులు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్, సహాయకుడు ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ధ్వంసమైన కారు, లారీని క్రేన్, జేసీబీల సాయంతో పోలీసులు తొలగించారు. -
విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి..
ఈ మధ్యకాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరిని గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. అప్పటి వరకు బాగానే చలాకీగా ఉన్నవారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వారు అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు. సైలెంట్ హార్ట్ ఎటాక్‌లతో అక్కడికక్కడే అర్థాంతరంగా తనవు చాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జాన్‌పూర్‌లోని బెలాసిన్ గ్రామంలో సోమవారం రామ్‌లీలా నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ అనే కళాకారుడు శివుడి పాత్ర వేశారు. నాటకం మధ్యంలో పూజారి హరతి ఇస్తున్న సమయంలో శివుడి వేషధారణలో ఉన్న వ్యక్తి వేదికపైనే అమాంతం కుప్పుకూలిపోయాడు. గమనించిన పక్కనున్న వారు అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చదవండి: మైనర్ల వివాహం వైరల్.. విస్తుపోయే విషయాలు దీనికి సంబంధించిన వీడియోన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మరణించిన రామ్ ప్రసాద్ అలియాస్ చబ్బన్ పాండే ఆరేళ్లుగా ఈ శివుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇటీవల ప్రదర్శన ఇస్తూ హనుమంతుడు, రావణుడు పాత్రలు పోషిస్తున్న ఇద్దరు కళాకారులు మరణించిన విషయం తెలిసిందే. आरती के दौरान अचानक मंच पर गिर पड़ा शख्स | Unseen India pic.twitter.com/M8wdUhu1NF — UnSeen India (@USIndia_) October 11, 2022 -
అమానవీయం: సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు
లక్నో: కరోనా విజృంభణ వేళ దేశంలో అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి. కరోనాకు భయపడి ప్రజలు అందరినీ అనుమానిస్తున్నారు. కరోనా భయంతో చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన తన భార్యను సైకిల్‌పై శ్మశానానికి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి అతడిని రాకుండా నిలువరించారు. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా అంబర్‌పూర్‌కు చెందిన తిలక్ధారి సింగ్ భార్య రాజ్‌కుమారి (50) అనారోగ్యంతో ఉమానాథ్ జిల్లా ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందింది. గ్రామం వరకు అంబులెన్స్‌లో మృతదేహం చేరింది. అయితే అక్కడి నుంచి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు. నా అనేవారు లేకపోవడంతో అతడు తన భార్యను అంత్యక్రియల కోసం శ్మశానానికి సైకిల్‌పై తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు. ఆమె కరోనాతో మృతి చెందిందనే భయాందోళనతో గ్రామస్తులు ముందుకు కదలనీవలేదు. చివరకు పోలీసుల సహాయంతో అతడు తన భార్య అంత్యక్రియలు నిర్వహించాడు. చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ जौनपुर अस्पताल में पत्नी की मौत के बाद एम्बुलेस शव अम्बरपुर गांव तक छोड़ गई लेकिन गाव वालों ने अंतिम संस्कार नही करने दिया तो बुजुर्ग साइकिल पर शव रखकर नदी किनारे अंतिम संस्कार के लिए चल पड़े हालांकि बाद में @jaunpurpolice की मदद से गांव में ही अंतिम संस्कार हुआ ।@AjayPandeyTV9 pic.twitter.com/Fza3G0Q03M — Manish kumar (@manishtv9) April 28, 2021 -
ఓట్ ఫర్ మిస్ ఇండియా
మిస్ ఇండియా–2015 లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’ టైటిల్ విజేత దీక్ష యూపీ పంచాయితీ ఎన్నికల్లో జాన్పుర్ లోని బక్షా‘గ్రామ ప్రధాన్’గా పోటీ చేస్తున్నారు. నాలుగు విడతల ఆ ఎన్నికల్లో మొదటి విడతలోనే జాన్పుర్ జిల్లా ఉంది. పోలింగ్ ఏప్రిల్ 15 న. మే 2న ఫలితాల వెల్లడి. ‘‘నా చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఈ రోజుకీ అలానే ఉంది. ఆ పరిస్థితిని మార్చేందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను’’ అని దీక్ష (24) అంటున్నారు. వాస్తవానికి దీక్ష ఇప్పటికే తన కెరీర్‌ని నిర్మించుకునే క్రమంలో వయసుకు మించిన గుర్తింపే తెచ్చుకున్నారు. ప్రధానంగా ఆమె మోడల్. పెద్ద పెద్ద కంపెనీలకు మోడలింగ్ ఇచ్చారు. త్వరలోనే వెబ్ సీరీస్‌లో కనిపించబోతున్నారు. ‘ఇష్క్ తేరా’ అనే ఒక సినిమా కథను రాసి, సినిమాగా తెరకు ఎక్కించేందుకు దర్శక నిర్మాతల కోసం చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ‘రబ్బా మెహర్ కరే’కు నెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ చేస్తున్న దీక్ష ఇప్పుడిక పంచాయితీ ఎన్నికల్లో గ్రామ ప్రధాన్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్నది 26 వ నెంబరు వార్డు అభ్యర్థిగా. ఆ వార్డు పేరు బక్షా. దీక్ష పుట్టింది అక్కడే.. బక్షా ప్రాంతంలోని చిత్తోరి గ్రామంలో. ఆ గ్రామం జాన్పుర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. బక్షా గ్రామ ప్రధాన్‌గా గెలిచి, క్రమంగా జాన్పుర్ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి జరపాలని దీక్ష ఆశిస్తున్నారు. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఇప్పటికీ ఏ అభివృద్ధీ జరగకుండా అలాగే ఉండటం! మిస్ ఇండియా 2015లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’గా టైటిల్ గెలుచుకున్నప్పుడు దీ„ý వయసు 18. అప్పుడు ఆమె ముంబైలో బి.ఎ.సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడే ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆమె తండ్రి జితేంద్ర సింగ్ బిజినెస్‌మేన్. ముంబై, గోవా, రాజస్థాన్‌లలో వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అలా వాళ్ల కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని జాన్పుర్ నుంచి ముంబైకి మారింది. దీక్ష ఇష్టాలు, ఆసక్తులు కూడా మారి మోడలింగ్ రంగంలోకి వెళ్లిపోయారు. ముంబైలో ఉంటున్న దీక్ష తరచు జాన్పుర్ వస్తుంటారు. ఈసారి అలా వచ్చినప్పుడే పంచాయితీ ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. ‘‘చదువుకున్న అమ్మాయి కదా. నువ్వు గ్రామ ప్రధాన్ అయితే గ్రామం బాగుపడుతుంది. అంతే కాదు.. రాజకీయాల్లో నువ్వు పైపైకి ఎదిగిన కొద్దీ ఊరు, జిల్లా, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతాయి’’ అని ఊళ్లోని పెద్దలు మద్దతు ఇచ్చారు. తల్లి, తండ్రి కూడా సరేనన్నారు. అంతే.. ఏప్రిల్ 3 న నామినేషన్ వేశారు దీక్ష. ఆమె ఆ ఊళ్లో మూడో తరగతి వరకు చదివారు. గ్రామ ప్రధాన్‌గా ఎన్నికైతే కనుక అదే ఊరి చేత అభివృద్ధి అక్షరాలను దిద్దించబోతారు దీక్ష. -
వారి రాకతో పెరిగిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారాత్ ఆయీ హై, వ్యవస్థా కర్నీ హోగీ ( పెళ్లి బృందం వచ్చింది. ఏర్పాట్లు చేయాల్సిందే)’ జాన్పూర్ జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ రామాజీ పాండే వ్యాఖ్యానించారు. ‘తక్షణమే పది పడకలు వేయండీ, రాత్రికల్లా వంద పడకలు సిద్ధం చేయాలి’ అని ఆయన తన సిబ్బందికి హుటాహిటిన ఆదేశాలు జారీ చేశారు. ‘ 25 భోజనాలు తగ్గితే ఎలా? అసలు నీవు రోజుకు ఎన్ని భోజనాలు సరఫరా చేయగలవు?’ అంటూ ఆయన ఓ వంట వాడిని ఉద్దేశించి ప్రశ్నించారు. (చదవండి : పది కోట్ల మందికి కరోనా ముప్పు!) ఆయన చేస్తున్న హడావిడి అంత పెళ్లివారి కోసం కాదని, ముంబై, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చిన వలస కార్మికులకు జరపుతున్న వైద్య పరీక్షల్లో తేలుతున్న కరోనా కేసుల గురించి. గత ఆదివారం నాటికి ఈ మూడు ప్రాంతాల నుంచి దాదాపు రెండున్నర లక్షల మంది కార్మికులు యూపీకి తిరిగొచ్చారు. వారి రాకతో జాన్‌పూర్‌లో కూడా కరోనా కేసులు హఠాత్తుగా పెరిగాయి. మే 15వ తేదీ నాటికి ఆ జిల్లాలో కేవలం 18 కేసులే ఉండగా, జూన్ ఏడవ తేదీ నాటికి కరోనా కేసులు 284కు చేరుకున్నాయి. వాటిలో 249 కేసులు వలస కార్మికులవే. జూన్ 9వ తేదీ నాటికి ఆ కేసుల సంఖ్య 301 చేరుకున్నాయి. (చదవండి : ఇకపై కరోనా లక్షణాల్లో ఇవి కూడా..) దాంతో జాన్పూర్ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు కలిగిన జిల్లాగా మారిపోయింది. కరోనా పరీక్షలకు జాన్పూర్ ఆస్పత్రిలో ఒకే ఒక ఆస్పత్రి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుకు దాదాపు రెండు వేల మంది అనుమానితుల నుంచి శాంపిల్స్‌ను తీసుకుంటున్నప్పటికీ 25 శాంపిల్స్ మాత్రమే ల్యాబ్ సిబ్బంది పరీక్షించ గలుగుతున్నారు. దాంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న కరోనా అనుమానితులకు ‘కల్ హాజావో, నయీ పర్సుం ఆజావో’ అంటూ ల్యాబ్ సిబ్బంది నుంచి సమాధానాలు వస్తున్నాయి. -
ఊరు కాదు.. ఐఏఎస్‌ల కార్ఖానా
ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల గ్రామం మేథోపట్టి. కేవలం 75 ఇళ్లు ఉండే ఈ ఊరు విద్యుత్, రోడ్లు వంటి సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉంది. అనారోగ్యంపాలైతే గ్రామస్తులు చికిత్స కోసం 10 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రికి పరుగుతీయాల్సిందే. అదంతా నాణేనికి ఓవైపు. మరోవైపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ పరీక్షలో ఈ గ్రామస్తులు ర్యాంకులు కొల్లగొడుతున్నారు. ఈ ఊరు నుంచి ఇప్పటిదాకా ఏకంగా 47 మంది ఐఏఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. ఒకే ఇంటి నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులవ్వడం విశేషం. బ్రిటిష్ ఇండియాలో 1914లో ఖాన్ బహద్దూర్ సయ్యద్ మొహమ్మద్ ముస్తఫా ఖాన్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఊరు నుంచి ఐఏఎస్ అయ్యారు. 1952లో ఇందు ప్రకాశ్ అనే వ్యక్తి ఈ ఊరి నుంచి రెండో ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి ఈ గ్రామ యువకుల జైత్రయాత్ర కొనసాగుతోంది. 1955లో మేథోపట్టి నుంచి వినయ్ కుమార్ ఐఏఎస్‌గా ఎంపికై బిహార్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు. ఆయన తర్వాత ముగ్గురు తమ్ముళ్లు ఛత్రపతిపాల్, అజయ్, శశికాంత్‌లు ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యారు. ఈ విషయమై స్థానికంగా టీచర్‌గా పనిచేస్తున్న కార్తికేయ సింగ్ మాట్లాడుతూ..‘జోన్‌పూర్‌లోని డిగ్రీ కళాశాలే వీరిలో పోటీతత్వాన్ని నింపింది. ఇక్కడ సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నవారు చాలా అరుదు. సివిల్స్ అనగానే ఇప్పుడంతా ఇంగ్లిష్ మీడియంవైపు పరుగులు పెడుతున్నారు. కానీ ఊరిలో సివిల్స్‌కు ఎంపికైన వారంతా హిందీ మీడియంలో చదువుకున్నవారే’ అని వెల్లడించారు. -
కాలువలో పడిన బస్సు: 8మంది మృతి
-
కాలువలో పడిన బస్సు: 8మంది మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో 8మంది మృతిచెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జౌన్పూర్ జిల్లాలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ సర్వగ్యరామ్ ఘటనా స్థలికి వెళ్లారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మోదీ వృద్ధుడయ్యారు..
► యూపీలో యువ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ► ఎన్నికల ప్రచారంలో రాహుల్ జౌన్ పూర్: ప్రధాని నరేంద్ర మోదీకి వయసు మీదపడిందని, అలసిపోయారంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్రా్తలు సంధించారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కూటమి యువ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. సోమవారం జౌన్ పూర్లో ఆయన మాట్లాడుతూ... తమ నేతృత్వంలోని యువ ప్రభుత్వం యూపీని ప్రపంచానికి కర్మాగారం మారుస్తుందని చెప్పారు. అమెరికా మాజీ ప్రధమ మహిళ మిషెల్ ఒబామా కూడా తన వంట గదిలో ‘మేడిన్ జౌన్ పూర్’ పాత్రల్ని కలిగి ఉండే రోజు వస్తుందన్నారు. ‘మేడిన్ ఉత్తరప్రదేశ్’ ఉత్పత్తులు ప్రపంచమంతా లభ్యమవుతాయని పేర్కొన్నారు. ‘మోదీకి తప్పనిసరిగా సాయం చేయాలని నేను అఖిలేశ్‌కి చెప్పాను. ఆయనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని కోరా. అఖిలేశ్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మోదీ విశ్రాంతి పొందుతారు’ అని రాహుల్ చెప్పారు. వారణాసిలో ప్రధాని మోదీ వరుస రోడ్‌షోలపై స్పందిస్తూ... మోదీ సినిమాలో పదే పదే రీటేక్‌లు తీసుకుంటున్నారని చమత్కరించారు. నాలుగు రోజుల్లో నాలుగు రీటేక్‌లు తీసుకున్నారని, అయితే ఆశించిన ఫలితం దక్కలేదని ఎద్దేవా చేశారు. వారణాసి ఫలితంపై మోదీ భయపడుతున్నారని, అందుకే గత మూడు రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ ఆరోపించారు. గంగా మాత పుత్రుడిగా మోదీ అభివర్ణించుకోవడాన్ని తప్పుపడుతూ... భారత్‌లో గంగా నదికి ఒక్కరే కొడుకు ఉన్నారా? అన్న ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. -
డాక్టర్ నిర్వాకం.. ప్రాణసంకటం
మహరాజ్‌గంజ్: ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రభుత్వ వైద్యుడు 17 మంది మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. మత్తు మందు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయాడు. మహరాజ్‌గంజ్ బ్లాకులోని జాన్పూర్ లో చోటు ఈ ఉదంతంపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 17 మంది మహిళలకు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలకు మేరకు వైద్యసిబ్బంది మత్తు ఇచ్చారు. అయితే ఆపరేషన్ చేసేందుకు అవసరమైన సామాగ్రి లేదని ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపైనా డాక్టర్ రాకపోవడంతో మహిళల బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆశా వర్కర్లు డీఎం, జాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు ఫోన్ చేశారు. మహరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఏ కూడా అక్కడికి చేరుకున్నారు. నాలుగు గంటలు గడిచిన తర్వాత తీరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ తిరిగొచ్చాడు. ఎనస్తీషియా తీసుకున్న 17 మంది మహిళలు అప్పటికే వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది మహిళలకు రాత్రి 11 గంటలకు వరకు ఆపరేషన్ చేశాడు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను డీఎం ఆదేశించారు.