
ఈ మధ్యకాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరిని గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. అప్పటి వరకు బాగానే చలాకీగా ఉన్నవారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వారు అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు. సైలెంట్ హార్ట్ ఎటాక్‌లతో అక్కడికక్కడే అర్థాంతరంగా తనవు చాలిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జాన్‌పూర్‌లోని బెలాసిన్ గ్రామంలో సోమవారం రామ్‌లీలా నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ అనే కళాకారుడు శివుడి పాత్ర వేశారు. నాటకం మధ్యంలో పూజారి హరతి ఇస్తున్న సమయంలో శివుడి వేషధారణలో ఉన్న వ్యక్తి వేదికపైనే అమాంతం కుప్పుకూలిపోయాడు. గమనించిన పక్కనున్న వారు అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
చదవండి: మైనర్ల వివాహం వైరల్.. విస్తుపోయే విషయాలు
దీనికి సంబంధించిన వీడియోన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మరణించిన రామ్ ప్రసాద్ అలియాస్ చబ్బన్ పాండే ఆరేళ్లుగా ఈ శివుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇటీవల ప్రదర్శన ఇస్తూ హనుమంతుడు, రావణుడు పాత్రలు పోషిస్తున్న ఇద్దరు కళాకారులు మరణించిన విషయం తెలిసిందే.
आरती के दौरान अचानक मंच पर गिर पड़ा शख्स | Unseen India pic.twitter.com/M8wdUhu1NF
— UnSeen India (@USIndia_) October 11, 2022