పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. పెళ్లిని ఎవరైనా జీవితంలో గుర్తిండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అతిథులందరి సమక్షంలో గ్రాండ్‌గా జరుపుకుంటారు. అయితే ఒక చోట మాత్రం కొందరు పెళ్లి ఊరేగింపులో హల్‌చల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. గాల్లోకి ఏకంగా లక్షలు వెదజల్లారు. ఈఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అఫ్జల్, అర్మాన్ వివాహాం జరిగిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. అంత సవ్యంగా సాగుతుండగా.. వరుడు, వధువు పక్కన ఉన్న బంధువులు ఒక్కసారికి గాలిలోకి డబ్బులు విసిరారు. చుట్టుపక్కలా ఉన్న ఇళ్లపై, జేసీబీలపై నిలబడి నోట్ల కట్టలను గాల్లోకి జల్లారు. రూ. 100, 200, 500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు.
దీంతో గాల్లో ఎగురుతున్న నోట్లను స్థానికులు పట్టుకునేందుకు ఎగబడ్డారు. గాలిలో దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు డబ్బును అవసరమైన వారికి పంచాలని సూచించారు., మరికొందరు ఆదాయపు పన్ను కార్యాలయానికి కాల్ చేసి దీనిపై ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment