
Singer Urvashi Radadiya Showered With Bucketful Of Cash During Performance: కొంత మంది అభిమానులు వారు చేసే పనులు చూస్తే "అభిమానుల అభిమానానికి అంతే ఉండదేమో" అన్నట్లుగా ఉంటుంది. పైగా వాళ్లు అభిమానంతో చేసే కొన్ని పనులు చూస్తే మనకు నోటి నుంచి మాటలు కూడా రావు. అచ్చం అలానే గుజరాత్‌లో ఒక గాయనికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!)
అసలు విషయంలోకెళ్లితే....తులసీ అనే ఆమె వివాహంలో గాయని ఊర్వశి రదాడియా అక్కడ ఉన్న కార్పెట్‌పై కూర్చొని ప్రదర్శన ఇస్తుండగా ఒక వ్యక్తి బకెట్ నిండా డబ్బులు తీసుకొచ్చి.. ఆమె నెత్తిమీద నుంచి గుమ్మరిస్తాడు. పైగా తన సంగీతం పట్ల వారి చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం అంటూ రదాడియా ఆనందం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఆమె ఈ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు "మీ అమూల్యమైన ప్రేమకు ధన్యవాదాలు" అనే క్యాప్షన్‌ని జోడించి ఇన్‌స్టాగామ్‌లో పోస్ట్ చేశారు. పైగా ఆమె ఇన్‌స్టాగామ్ తనకు తానే క్వీన్ ఆఫ్‌ది గుజరాతీ ఫోక్‌గా అభివర్ణించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా దీనికి లక్షల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓలుక్ వేయండి.
(చదవండి: వ్యవసాయ చట్టాల రద్దుపై యూఎస్ కాంగ్రెస్ స్పందన)
Comments
Please login to add a commentAdd a comment