డాక్టర్ నిర్వాకం.. ప్రాణసంకటం
మహరాజ్గంజ్: ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రభుత్వ వైద్యుడు 17 మంది మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. మత్తు మందు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయాడు. మహరాజ్గంజ్ బ్లాకులోని జాన్పూర్ లో చోటు ఈ ఉదంతంపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 17 మంది మహిళలకు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలకు మేరకు వైద్యసిబ్బంది మత్తు ఇచ్చారు. అయితే ఆపరేషన్ చేసేందుకు అవసరమైన సామాగ్రి లేదని ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపైనా డాక్టర్ రాకపోవడంతో మహిళల బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆశా వర్కర్లు డీఎం, జాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు ఫోన్ చేశారు. మహరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఏ కూడా అక్కడికి చేరుకున్నారు.
నాలుగు గంటలు గడిచిన తర్వాత తీరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ తిరిగొచ్చాడు. ఎనస్తీషియా తీసుకున్న 17 మంది మహిళలు అప్పటికే వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది మహిళలకు రాత్రి 11 గంటలకు వరకు ఆపరేషన్ చేశాడు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను డీఎం ఆదేశించారు.