anaesthesia
-
ఆ ఘనత సాధించిన తొలి డాక్టర్‌గా అనస్తీషియాలజిస్ట్ వైభవరి నాయక్
బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అనస్తీషియాలజిస్ట్, ఇంటెన్సివ్ వైద్య నిపుణురాలు డాక్టర్ విభావరి నాయక్ ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనస్తీషియాకు గౌరవ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈనెల 16 నుంచి 18వరకు జరిగిన మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో ఆమెను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆమె ఈ పదవికి ప్రాతినిధ్యం వహిస్తారు. 2010 నుంచి బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఆమె పని చేస్తున్నారు. అంతకు ముందు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూరులోని నిమ్స్, హైదరాబాదులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. అంతే కాకుండా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఎంజిల్స్‌లో ప్రత్యేకమైన రీసెర్చి ఫెలోషిప్ చేశారు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో పలు సంస్థలతో కలసి పీడియాట్రిక్ అనస్థీషియాపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇండియన్ సొసైటీ అఫ్ అనస్థీషియాలజిస్టులు, ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ అనస్థీషియాలజీ, ఇండియన్ కాలేజీ ఆఫ్ అనస్థీషియాలజిస్టులు, సొసైటీ ఆఫ్ ఆంకో అనస్థీషియా, పెరీ ఆపరేటివ్ కేర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలయేటివ్ కేర్, ఇండియన్ సొసైటీ అఫ్ క్రిటికల్ మెడిసన్ లాంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలలో ఆమె సభ్యులుగా కొనసాగుతున్నారు. భారత దేశంతో పాటూ పలు దేశాలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా పలు ప్రఖ్యాత మెడికల్ జర్నల్స్ అయిన ఇండియన్ జర్నల్ ఆఫ్ అనస్థీషియా, జర్నల్ ఆఫ్ అనస్థీషియా ,క్లినికల్ ఫార్మకాలజీ, జర్నల్ ఆఫ్ సెల్యులర్ మరియు మాలిక్యులర్ అనస్థీషియా వంటి వాటికి రివ్యూయర్ గా కూడా పని చేస్తున్నారు. 50కి పైగా ఇండెక్సెడ్ ప్రచురణలు ,ఎనిమిది పుస్తకాలలో ప్రత్యేకమైన చాప్టర్లను డా. విభావరి నాయక్ రచించారు. ఇప్పుడు ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనస్తీషియా గౌరవ కార్యదర్శిగా ఎన్నికకావడం పట్ల డా.విభావరి నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. ఆసియా ఖండంలోని ప్రతి ఒక్కరితో పని చేసే గొప్ప అవకాశాన్ని తాను పొందానని, మూల ప్రాంతాలకు కూడా వైద్య నైపుణ్యాన్ని చేర్చడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. -
వ్యాక్సిన్లపై ఆ ప్రచారాలు, నిజమెంతంటే..
వ్యాక్సిన్లు తప్ప మరో సురక్షిత మార్గం ఇప్పుడు మన ముందు లేదని వైద్య నిపుణులు, సైంటిస్టులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోపక్క వ్యాక్సిన్లపై ఉత్త ప్రచారాలతో కొందరు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలు, కేంద్ర ఆరోగ్య శాఖ సౌజన్యంతో ఆ ఉత్త ప్రచారాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా.. వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వాళ్లు ఆపరేషన్లకు దూరంగా ఉండాలని, కోవాగ్జిన్‌లో ఆవు దూడ సీరం ఉంటుందనే ప్రచారాలతో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కరోనా వాక్సిన్లు తీసుకున్న వాళ్లు.. ఆపరేషన్లకు దూరంగా ఉండాలని, ఎందుకంటే ఆపరేషన్‌కి ముందు ఇచ్చే అనస్తీషియా డ్రగ్స్ వల్ల వ్యాక్సిన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అది ప్రాణాలకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు అనస్థీషియా ముప్పు ఎక్కువగా ఉందనేది ఆ వార్త ప్రధాన సారాంశం. అయితే ఈ ప్రచారానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు. సర్జరీల టైంలో స్పృహ కోల్పోవడానికి మాత్రమే జనరల్ అనెస్థెషీయా ఇస్తారు. అనస్థటిక్ డ్రగ్స్ వల్ల మత్తు, శరీరం.. ప్రత్యేకించి ఆపరేషన్ జరిపే భాగం మొద్దుబారిపోతుందే తప్ప శరీరానికి ఎలాంటి హాని చేయబోదని వెల్లడించారు. A post claiming that anaesthetics can be life-threatening for #COVID19 vaccinated people is doing the rounds on social media#PIBFactCheck: ▶️This claim is #FAKE ▶️There is NO scientific evidence till date to confirm the claim ▶️Don't fall for misinformation. GET vaccinated pic.twitter.com/y6SASyZPQl — PIB Fact Check (@PIBFactCheck) June 16, 2021 ‘‘వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో కొందరికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండొచ్చు. ఆ ప్రభావంతో వాళ్లు నీరసించిపోవచ్చు. అలాంటి పేషెంట్లకు రిస్క్ రేటు ఉంటుంది. కాబట్టే ఆ టైంలో ఆపరేషన్లకు వెళ్లొద్దని వద్దని సూచిస్తున్నాం. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైతే ఆపరేషన్లు తప్పవు. అలాగే అనస్తీషియా డ్రగ్స్‌తో వచ్చిన ముప్పేమి ఉండదు. ఇప్పటివరకు అలాంటి కేసులేవీ దృష్టికి రాలేదు, అసలు ఈ అంశంపై అధ్యయనాలు ఇంకా మొదలుకాలేద’ని అనస్థీషియా నిపుణులు స్పష్టం చేశారు. దూడ సీరం ఇక దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌పై వ్యతిరేక ప్రచారం రకరకాలుగా ఉంటోంది. టీకా తయారీలో అప్పుడే పుట్టిన లేగ దూడల సీరం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లలో అసలు విషయాల్ని కాకుండా.. తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అప్పుడే పుట్టిన దూడ సీరంను వేరో కణాల (vero cells) తయారీకి, వాటి పెరుగుదలకు మాత్రమే ఉపయోగిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ‘వివిధ రకాల బోవిన్ (ఆవు, గేదె), ఇతర జంతువుల సీరంను వేరో కణాల పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీకి ఇదొక ప్రామాణిక పదార్థం. టీకాల ఉత్పత్తిలో ఈ వేరో కణాల్ని ఉపయోగిస్తారు. Final vaccine product of #COVAXIN does NOT contain new born calf serum ! Claims suggesting otherwise are misrepresenting facts ! Animal serum has been used in vaccine manufacturing process for decades, but it is completely removed from the end product.https://t.co/NKlh5kow08 pic.twitter.com/L4CrEmZtT1 — Dr Harsh Vardhan (@drharshvardhan) June 16, 2021 కొత్తదేం కాదు అయితే వీరో కణాల్ని ప్రత్యేక పరిస్థితుల్లో శుద్ధి చేసిన తర్వాతే వ్యాక్సిన్ల తయారీకి ఉపయోగిస్తారు. అప్పుడు దూడ సీరం ఆనవాళ్లు పూర్తిగా తొలగిపోతాయి. అంటే అంతిమ దశలో అసలు సీరం ఆనవాళ్లు ఉండవన్నమాట. కొన్ని సంవత్సరాలుగా.. పోలియో, రేబిస్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ల తయారీలో.. ఇప్పుడు కరోనా వైరస్ తయారీలోనూ ఈ పద్ధతిని కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వార్తలను, వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా, అందరూ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. ఈ మేరకు సమాచార హక్కుచట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌కు.. క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. చదవండి: వ్యాక్సిన్లు బాబూ.. వ్యాక్సిన్లు -
వైద్యరంగంలో మత్తు మందు డాక్టర్ పాత్ర కీలకం
కర్నూలు(హాస్పిటల్): వైద్యరంగంలో మత్తు మందు వైద్యుడు పోషించే పాత్ర ఎంతో కీలకమని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ అన్నారు. ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అనెస్తీషియాజిస్ట్స్ అసోసియేషన్ కర్నూలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక సూరజ్గ్రాండ్లో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం డాక్టర్ రామప్రసాద్ మాట్లాడుతూ.. కర్నూలు మెడికల్ కాలేజిలో అనెస్తీషియా విభాగం సేవలు ఎనలేనవన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ శాంతిరాజు మాట్లాడుతూ.. మత్తుమందు ఆవిర్భావం నుంచి ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. కర్నూలు నగరం రాష్ట్రంలో మెడికల్ హబ్‌గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. సింహపురి మెడికల్ కాలేజి అనెస్తెటిస్ట్ డాక్టర్ రాజగోపాల్‌రెడ్డి ప్రసంగించారు. అంతకు ముందు ఉదయం కర్నూలు మెడికల్ కాలేజి నుంచి రాజవిహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో నగరంలోని మత్తు మందు డాక్టర్లు పాల్గొన్నారు. -
డాక్టర్ నిర్వాకం.. ప్రాణసంకటం
మహరాజ్‌గంజ్: ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రభుత్వ వైద్యుడు 17 మంది మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. మత్తు మందు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయాడు. మహరాజ్‌గంజ్ బ్లాకులోని జాన్పూర్ లో చోటు ఈ ఉదంతంపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 17 మంది మహిళలకు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలకు మేరకు వైద్యసిబ్బంది మత్తు ఇచ్చారు. అయితే ఆపరేషన్ చేసేందుకు అవసరమైన సామాగ్రి లేదని ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపైనా డాక్టర్ రాకపోవడంతో మహిళల బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆశా వర్కర్లు డీఎం, జాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు ఫోన్ చేశారు. మహరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఏ కూడా అక్కడికి చేరుకున్నారు. నాలుగు గంటలు గడిచిన తర్వాత తీరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ తిరిగొచ్చాడు. ఎనస్తీషియా తీసుకున్న 17 మంది మహిళలు అప్పటికే వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది మహిళలకు రాత్రి 11 గంటలకు వరకు ఆపరేషన్ చేశాడు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను డీఎం ఆదేశించారు. -
బాలుడి ప్రాణాలు తీసిన మత్తుమందు
గుర్గావ్: డాక్టర్ల నిర్లక్ష్యం బధిర బాలుడి ప్రాణాలు తీసింది. కొడుకు వైద్యం కోసం దేశంకాని దేశం వచ్చిన తండ్రికి వైద్యులు విషాదం మిగిల్చారు. మత్తుమందు(ఎనస్తీషియా) వికటించి ఇరాక్ కు చెందిన 12 ఏళ్ల బధిర బాలుడు మృతి చెందిన ఘటన హర్యానాలోని గుర్గావ్లో చోటుచేసుకుంది. పుట్టినప్పటి నుంచి మూగ, చెవిటితనంతో బాధ పడుతున్న అహ్మద్ ఇమాద్ ఫైసల్‌ను వైద్యం కోసం అతడి తండ్రి ఇమాద్ ఫైసల్... బాగ్దాద్ నుంచి గుర్గావ్ లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ఎమ్మారై పరీక్ష చేయించమన్నారు. ఆస్పత్రికి సమీపంలో ఉన్న మోడ్రన్ డయాగ్నోస్టిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో పరీక్ష చేయించేందుకు వెళ్లగా బాలుడికి మత్తుమందు ఇచ్చారు. అతడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన మళ్లీ ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. 20 నిమిషాల తర్వాత మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. అయితే ఎనస్తీషియా వల్లే బాలుడు మరణించాడా, మరేదైనా కారణముందా అనేది వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు తీసుకున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదని చెప్పారు. -
పేషెంటుకు మత్తిచ్చి.. నిద్రపోయిన డాక్టర్
రోగులకు ఆపరేషన్ చేయడానికి మత్తుమందు ఇచ్చిన ఓ డాక్టర్.. తానే నిద్ర పోయారు! దాంతో ఆయనను వెంటనే సస్పెండ్ చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో జరిగింది. ఆ డాక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కౌల్ సింగ్ ఠాకూర్ అసెంబ్లీలో తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. అదృష్టవశాత్తు ఆ మహిళలు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని, అంతా ఆరోగ్యకరంగానే ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నిర్వాకం చేసిన వైద్యుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, కొద్ది మోతాదులో అతడు మద్యం పుచ్చుకున్నట్లు తేలిందన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెప్పారు.