రోగులకు ఆపరేషన్ చేయడానికి మత్తుమందు ఇచ్చిన ఓ డాక్టర్.. తానే నిద్ర పోయారు! దాంతో ఆయనను వెంటనే సస్పెండ్ చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో జరిగింది. ఆ డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కౌల్ సింగ్ ఠాకూర్ అసెంబ్లీలో తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.
అదృష్టవశాత్తు ఆ మహిళలు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని, అంతా ఆరోగ్యకరంగానే ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నిర్వాకం చేసిన వైద్యుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, కొద్ది మోతాదులో అతడు మద్యం పుచ్చుకున్నట్లు తేలిందన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెప్పారు.
పేషెంటుకు మత్తిచ్చి.. నిద్రపోయిన డాక్టర్
Published Fri, Dec 12 2014 7:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement