వైద్యరంగంలో మత్తు మందు డాక్టర్ పాత్ర కీలకం
వైద్యరంగంలో మత్తు మందు డాక్టర్ పాత్ర కీలకం
Published Mon, Oct 17 2016 12:16 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
కర్నూలు(హాస్పిటల్): వైద్యరంగంలో మత్తు మందు వైద్యుడు పోషించే పాత్ర ఎంతో కీలకమని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ అన్నారు. ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అనెస్తీషియాజిస్ట్స్ అసోసియేషన్ కర్నూలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక సూరజ్‌గ్రాండ్‌లో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం డాక్టర్ రామప్రసాద్ మాట్లాడుతూ.. కర్నూలు మెడికల్ కాలేజిలో అనెస్తీషియా విభాగం సేవలు ఎనలేనవన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ శాంతిరాజు మాట్లాడుతూ.. మత్తుమందు ఆవిర్భావం నుంచి ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. కర్నూలు నగరం రాష్ట్రంలో మెడికల్ హబ్‌గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. సింహపురి మెడికల్ కాలేజి అనెస్తెటిస్ట్ డాక్టర్ రాజగోపాల్‌రెడ్డి ప్రసంగించారు. అంతకు ముందు ఉదయం కర్నూలు మెడికల్ కాలేజి నుంచి రాజవిహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో నగరంలోని మత్తు మందు డాక్టర్లు పాల్గొన్నారు.
Advertisement