
డాక్టర్‌కు మెసేజ్ చేసిన కోడలు
బనశంకరి(కర్ణాటక): అత్తను పై లోకానికి పంపడానికి రెండు మాత్రలు ఇవ్వాలని కోడలు ఓ డాక్టర్ వాట్సాప్‌కు మెసేజ్ చేసింది. కంగుతిన్న గురైన డాక్టర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. బెంగళూరు (Bengaluru)కు చెందిన డాక్టర్ సునీల్‌కుమార్‌కు ఇన్‌స్టాలో ఓ మహిళ పరిచయమైంది. ఈనెల 17వ తేదీ ఆ మహిళ డాక్టర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ (WhatsApp Message) పంపింది.
తన అత్త చాలా వేధింపులకు పాల్పడుతోందని.. ఆమెను చంపడానికి రెండు మాత్రలు ఇవ్వాలని, ఇలా మాత్రలు అడిగినందుకు తనను తిట్టవద్దని అందులో పేర్కొంది. దీంతో డాక్టర్ ఆమెను మందలించగా మెసేజ్ డిలిట్ చేసింది. అప్పటికే ఆ మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసుకున్న డాక్టర్.. సంజయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉద్యోగాల పేరుతో వంచన.. మాజీ పీడీఓ అరెస్ట్
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని విధానసౌధలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర మాజీ పీడీఓ యోగేంద్రను పోలీసులు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతోనే కాకుండా క్రిప్టో కరెన్సీ, టింబర్ బిజినెస్‌ల పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి దుబాయ్‌కి పరారయ్యాడు.
మంగళవారం దుబాయ్ నుంచి కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన యోగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై చెన్నమ్మనకెరె, యలహంక, వీవీ పురం, హిరియూరు, చిత్రదుర్గ తదితర పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment