WhatsApp Message
-
అత్తను పైకి పంపాలి... మాత్రలు ఇవ్వండి
బనశంకరి(కర్ణాటక): అత్తను పై లోకానికి పంపడానికి రెండు మాత్రలు ఇవ్వాలని కోడలు ఓ డాక్టర్ వాట్సాప్‌కు మెసేజ్ చేసింది. కంగుతిన్న గురైన డాక్టర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. బెంగళూరు (Bengaluru)కు చెందిన డాక్టర్ సునీల్‌కుమార్‌కు ఇన్‌స్టాలో ఓ మహిళ పరిచయమైంది. ఈనెల 17వ తేదీ ఆ మహిళ డాక్టర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ (WhatsApp Message) పంపింది.తన అత్త చాలా వేధింపులకు పాల్పడుతోందని.. ఆమెను చంపడానికి రెండు మాత్రలు ఇవ్వాలని, ఇలా మాత్రలు అడిగినందుకు తనను తిట్టవద్దని అందులో పేర్కొంది. దీంతో డాక్టర్ ఆమెను మందలించగా మెసేజ్ డిలిట్ చేసింది. అప్పటికే ఆ మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసుకున్న డాక్టర్.. సంజయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరుతో వంచన.. మాజీ పీడీఓ అరెస్ట్దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని విధానసౌధలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర మాజీ పీడీఓ యోగేంద్రను పోలీసులు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతోనే కాకుండా క్రిప్టో కరెన్సీ, టింబర్ బిజినెస్‌ల పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి దుబాయ్‌కి పరారయ్యాడు. మంగళవారం దుబాయ్ నుంచి కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన యోగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై చెన్నమ్మనకెరె, యలహంక, వీవీ పురం, హిరియూరు, చిత్రదుర్గ తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చదవండి: ఇల్లరికం అల్లుడితో కలిసి మామను హత్య చేసిన అత్త -
ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు!
తిరుపతికి చెందిన శ్రీనివాస్ కుమారుడు యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన కొడుకు వివాహానికి ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల్లోని బంధుమిత్రులకు ఆహా్వనం పంపేందుకు సన్నాహాలు చేపట్టారు. సమయం కేవలం 12 రోజుల మాత్రమే ఉండడంతో అందరికీ పత్రికలు పంచేందుకు వీలుకాని పరిస్థితి. కుమారుడి సలహా మేరకు బెంగళూరుకు వెళ్లి క్యూర్ స్కానర్‌తో వీడియో వెడ్డింగ్ కార్డులు, ఏటీఎం తరహాలో డిజిటల్ కార్డులు డిజైన్ చేయించారు. కేవలం 10 నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా బంధుమిత్రులకు ఆహ్వానం పలికేశారు. సరికొత్త ట్రెండ్‌తో అందించిన పెళ్లిపిలుపుపై ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.తిరుపతి సిటీ : మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వివాహ, శుభకార్యాలకు ఆహ్వానించే విధానం వినూత్నంగా మారింది. గతంలో వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రులకు పిలవాలంటే కనీసం నెలరోజుల ముందుగా వెడ్డింగ్ కార్డులు ముద్రించి వ్యయ ప్రయాసలకోర్చి గడపగడపకు వెళ్లి పంచాల్సి వచ్చేది. మారుతున్న కాలంతో పాటు అది కాస్తా ఫోన్ కాల్స్, మెసేజ్‌ల రూపంలోకి వచ్చేసింది. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆధునిక యుగంలో ఆహా్వన పత్రికలు వీడియో వెడ్డింగ్ కార్డుల రూపంలో హల్చల్ చేస్తున్నాయి. మరింత ముందుకు వెళ్లిన అడ్వాన్డ్స్ టెక్నాలజీతో ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ వెడ్డింగ్ కార్డులు వచ్చేశాయి. ఏటీఎం తరహాలో కార్డులు పెళ్లికి బంధుమిత్రులను పిలించేందుకు క్యూఆర్ కోడ్‌తో ప్రింట్ చేసిన ఏటీఎం తరహా కార్డులు ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. వీడియో వెడ్డింగ్ ఇని్వటేషన్స్తో పాటు ఉన్నతస్థాయి బంధుమిత్రుల కోసం విజిటింగ్ కార్డ్స్ రూపంలో ఉండే డిజిటల్ వెడ్డింగ్ కార్డులు పంపుతున్నారు. ఏపీలో తొలిసారి పశి్చమగోదావరి జిల్లాలో ఓ కాంట్రాక్టర్ తన కుమారుడి వివాహం కోసం ఈ తరహా కార్డులను తయారు చేయించారు. ఇందులో కార్డుపై భాగంలో వధూవరుల ఫొటో, పేర్లు, ఆహా్వనించు తల్లిదండ్రుల పేర్లు మాత్రమే ఉంటాయి. వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వివాహనికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. పెళ్లిమండపం అడ్రస్, లొకేషన్ మ్యాప్, పెళ్లి పత్రిక, విందు టైమింగ్స్, ముహూర్త సమయంతో పాటు సంప్రదించాల్సిన వధువు, వరుడి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు పొందుపరిచి ఉంటాయి.ఇప్పుడు ఇదే ట్రెండ్ డిజిటల్ యుగంలో యువత బర్త్ డే, ఎంగేజ్మెంట్, గ్రాడ్యుయేషన్, బేబీ షవర్, ఆఫ్ శారీ ఫంక్షన్స్, గృహప్రవేశాలు వంటి అన్ని శుభకార్యాలకు వీడియో కార్డుల ద్వారా ఆహా్వనాలను వాట్సాప్‌లో పంపుతున్నారు. ఇంటర్నెట్, కంప్యూటర్‌పై అవగాహన ఉన్న ప్రతి వ్యక్తీ ఉచిత టెంప్లెట్స్ను డౌన్లోడ్ చేసుకుని తమకు నచ్చిన డిజైన్లలో ఆహ్వాన పత్రికలను తయారు చేసేస్తున్నారు. కరోనా తర్వాత ఆహా్వనాలను డిజిటల్ పద్ధతిలో పంపేందుకే ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రింటింగ్ కార్డులపై తగ్గిన మోజు వివాహ మహోత్సవంలో ప్రధాన భూమిక పోషించే వెడ్డింగ్ కార్డులు కాలానుగుణంగా రూపు మార్చుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కార్డులతో మొదలైన పెళ్లి పత్రికలు తర్వాత కలర్, యూవీ, లేజర్, ఫొటో ప్రింట్, సౌండ్ సిస్టమ్ కార్డులుగా మారాయి. ఈ ట్రెండ్ కొంతకాలం కొనసాగింది. రూ.2 నుంచి సుమారు రూ.20 వరకు ఒక్కోకార్డు «ప్రింటింగ్ ధర ఉండేది. ప్రస్తుతం నయా ట్రెండ్ మొదలైంది. డిజిటల్ యుగంలో వీడియో వెడ్డింగ్ కార్డులు మార్కెట్‌ను శాసించాయి. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కానర్‌తో రూపొందించిన డిజిటల్ కార్డుల వైపు యువత మొగ్గు చూపుతోంది. దీంతో ప్రింటింగ్ ప్రెస్ దుకాణాలు వెలవెలబోతున్నాయి.విశేషంగా స్పందన మా కాబోయే అల్లుడు లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. మాది కొత్త బంధుత్వం. ఆగస్టు 14న బెంగళూరులోని కల్యాణ మండపంలో సెపె్టంబర్ 2న వివాహం జరిపేందుకు పండితులు ముహూర్తం పెట్టారు. వధువరూలు ఆగస్టు 20న ఇండియాకు వచ్చారు. పదిరోజులు మాత్రమే సమయం ఉంది. బంధుమిత్రులకు ఎలా ఆహా్వనం పంపాలనే ఆలోచనలో పడ్డాం. మా అల్లుడి సలహాతో ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ కార్డులను తయారు చేసి అందరికీ వాట్సాప్ ద్వారా పంపించాం. బంధుమిత్రులు ఇబ్బంది లేకుండా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని కల్యాణ మండపానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. చాలా సంతోషంగా అనిపించింది. – కోటేశ్వరరావు, తిరుపతిప్రింటింగ్ కార్డులు తగ్గాయి గతంలో ప్రతి ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో సుమూహూర్తాలు ఉన్నందున పెళ్లికార్డుల ప్రింటింగ్‌కు ప్రజలు ఎగబడేవారు. బిజినెస్ అంతా ఆ మూడు మాసాల్లోనే జరిగేది. నగరంలోని ప్రతి ప్రింటింగ్ ప్రెస్ నిర్విరామంగా పనిచేసేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం అడపాదడపా తక్కువ క్వాంటిటీతో పెళ్లి పత్రికల కోసం వస్తున్నారు. సుమారు 50 శాతానికి పైగా బిజినెస్ తగ్గింది. కంప్యూటర్ కాలం, డిజిటల్ ఫోన్లు రాకతో పత్రికలకు డిమాండ్ భారీగా పడిపోయింది. – వెంకటేశ్వర్లు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని, తిరుపతి -
వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
వాట్సప్ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాట్సప్ ఓపెన్ చేయగానే వాట్సప్ నిండా ఇబ్బడి ముబ్బడిగా ఉన్న మెసేజ్‌లు కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంటాయి.ఈ సమస్యను అదిగమించేందుకు వాట్సప్ యాజమాన్యం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనున్నట్లు వీబీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన బీటా వెర్షన్ యూజర్ల వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.ఇక ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే.. లేటెస్ట్గా వాట్సప్‌కు వచ్చే మెసేజ్‌లకు నోటిఫికేషన్ వస్తుంది. చదవని వాట్సప్ మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అవ్వనున్నాయి. -
వాట్సాప్‌లో తన బాధనంతా చెప్పుకుని.. యువకుడు తీవ్ర నిర్ణయం!
మహబూబ్‌నగర్: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఉంటున్న సతీష్ (24) శనివారం సాయంత్రం కాలనీసమీపంలోని రైల్వేట్రాక్‌పై రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ, జూదానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు స్నేహితుడు గణేష్‌కు మెసేజ్ పెట్టాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా.. తూర్పు గోదావరి జిల్లా చిన్నవంగలపాడు చెందిన సతీష్ పోలేపల్లి ఫార్మా సెజ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తూ పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీలో మరో ముగ్గురితో కలసి అద్దెకు నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 6గంటలు దాటాక తోటి స్నేహితుడికి వాట్సాప్ మెసేజ్పెట్టాడు. ‘తన మృతదేహం రైలుపట్టాలపై ఉంటుందని, తీసుకుని ఎలాగైనా ఇంటికి చేర్చాలని, డబ్బులు లేకుంటే ఏమి చేయలేమని, తనకు బ్యాంకులో కొంత అప్పు ఉందని, అదికాకుండా బయట రూ.40వేల అప్పు ఉందని మెసేజ్‌లో పొందుపర్చాడు. తాను జూదానికి బానిసైనట్లుగా అందులోనుంచి బయటకు రాలేకపోతున్నానని, అప్పులు తీర్చేమార్గం లేకుండా పోయిందని తెలిపాడు. తాను ఏమి చేయలేనని, తల్లిదండ్రులకు అండగా ఉండి సోదరి పెళ్లి చేయాలనుకున్నా చేయలేదని, తనవల్ల ఎవరికీ లాభం లేదని, అమ్మానాన్నలతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నానని, మన్నించమని వేడుకున్నాడు. సోదరి ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులిచ్చేదని, అయినా పెళ్లి చేసి అండగా ఉండాల్సిన వాడిని ఏం చేయలేకపోతున్నానని, తనకు మనోధైర్యం ఇచ్చేవారు లేరని తెలిపాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొన్నాడు. మెసేజ్ చూసిన గణేష్‌తోపాటు ఇంటి యజమాని ప్రకాష్ మరికొందరు కలిసి రైలుపట్టాలపై వెతకగా మృతదేహం లభించింది. దీంతో విషయాన్ని అతడి బావ ప్రసాద్‌కు తెలియజేశారు. జడ్చర్లలోనే నివాసం ఉంటున్న అతడు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక రైల్వే స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించారు. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించి రాత్రి మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆస్ట్రేలియా వెళ్తున్నా.. నా కోసం వెతకొద్దు
హైదరాబాద్: ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు.. తన కోసం ఎవరూ వెతకవద్దంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి వైద్యురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న మహియా తరన్నం (24) ఈ నెల 3న ఎప్పటిలాగే ఉదయం సబ్జా కాలనీలోని తన నివాసం నుంచి విధులకు వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి మహ్మద్ గఫార్‌కు వాట్సాప్ కాల్ చేసి తాను ఆస్ట్రేలియా వెళ్తున్నానని తన కోసం వెతకవద్దంటూ చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. గత 8 నెలలుగా ఆమెతో పాటు వైద్యుడిగా పని చేస్తున్న నదీమ్‌తో.. పరిచయం ఏర్పడిందని.. బిహార్‌కు చెందిన అతను మాయమాటలు చెప్పి మహియా తరన్నంను తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: చిటికెలో రూ.50వేల లోన్! నమ్మారో..
బ్యాంకుల్లో లోన్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకునే రుణాలపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా బిజినెజ్ లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కానీ బ్యాంకుల్లో రుణం అంత సులువుగా లభించదు. క్రెడిట్ స్కోర్, ఆదాయ మార్గం.. ఇలా చాలా అంశాలను బ్యాంకులు పరగణనలోకి తీసుకుని లోన్ మంజూరు చేస్తాయి. టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ సర్వీసులు కూడా చాలా సులభతరం అయ్యాయి. బిల్లుల చెల్లింపు, పేమెంట్ చెల్లింపు, మనీ సెండ్, మనీ రిసీవ్ ఇలా చాలా పనులు ఇప్పుడు సెకన్లలోనే అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆన్లైన్ లోన్లు ఎక్కువయ్యాయి. కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమరపాటుగా ఉంటే అసలుకే ముప్పు రావొచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో చేరితే చాలంటూ.. ఇటీవల కాలంలో వాట్సాప్ స్కామ్‌ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే చాలు క్షణాల్లో లోన్ పొందొచ్చు అంటూ జరుగుతున్న మోసం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కస్టమర్లను హెచ్చరిస్తోంది. 'మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంటే.. వెంటనే రూ.50 వేలు ఉచితంగా పొందొచ్చు. వరల్డ్ డిజిటల్ లోన్ కింద బ్యాంక్ రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఇంట్లో నుంచే మీరు ఈ లోన్ పొందొచ్చు. నిమిషాల్లో రుణం వస్తుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి లోన్ పొందొచ్చు' అంటూ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోందని బ్యాంక్ తెలిపింది. ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాల బారిన పడవద్దని బ్యాంక్ కస్టమర్లను కోరుతోంది. ఇలాంటి మోసపూరిత వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావొద్దని సూచించింది. బ్యాంక్ ఎప్పుడూ కస్టమర్లను ఇలా వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వమని కోరదని, బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించింది. -
పాకిస్థాన్ నుంచి కాల్స్.. వాట్సాప్ యూజర్లకు ఇండియన్ ఆర్మీ హెచ్చరిక!
భారతదేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌తో సహా చాలా మంది విద్యార్థులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. కొన్ని నంబర్ల నుంచి విద్యార్థులకు వస్తున్న కాల్స్, మెసేజ్‌లలో వారిని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌నకు చెందిన గ్యాడ్జెట్స్ నౌ కథనం పేర్కొంది. ఇలా కాల్స్ చేస్తున్నవారు తమను పాఠశాల ఉపాధ్యాయులుగా చెప్పుకొంటూ కొత్త క్లాస్ గ్రూప్‌లలో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. ఈ నెపంలో వారికి ఓటీపీలను పంపుతున్నారు. తాము ఉపాధ్యాయులేనని నమ్మించేందుకు విద్యార్థులకు తెలిసిన వారి పేర్లు చెబుతున్నారు. ఈ అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వాట్సాప్ ద్వారానే వస్తున్నాయి. ఇలాంటి రెండు అనుమానాస్పద నంబర్లను అధికారులు గుర్తించారు. అవి 8617321715, 9622262167. ఈ కాల్స్ గురించి విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు హెచ్చరించారు. ఇదీ చదవండి ➤ వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా విద్యార్థులు గ్రూపుల్లో చేరిన తర్వాత వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తండ్రి ఉద్యోగం, ఉపాధ్యాయుల పేర్లు, వారికి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు దీని గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను చైతన్యపరచాలని ఆర్మీ స్కూళ్ల అధికారులు కోరుతున్నారు. ఆ రెండు నంబర్ల నుంచే కాకుండా ఇతర నంబర్ల నుంచి కూడా కాల్స్, మెసేజ్‌లు రావచ్చని, అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
వాట్సాప్ స్టేటస్తోనూ సమాచార వ్యాప్తి
ముంబై: వాట్సాప్ యాప్ ద్వారా ఇతరులకు సమాచారం అందించాలనుకునే వారు బాధ్యతాయుత వైఖరి కలిగి ఉండాలని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం పేర్కొంది. వాట్సాప్ ద్వారా మతాల మధ్య విద్వేషాలను పెంచుతున్నారంటూ ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. వాట్సాప్ స్టేటస్‌తో యూజర్లు తమ ఉద్దేశాలను ఇతరులకు తెలియజేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ ఈ నెల 12న ఇచి్చన ˘ ఉత్తర్వుల్లో తెలిపింది. -
డేంజర్:వాట్సాప్‌లో పొరపాటున కూడా ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దు
వాట్సప్‌లో ఓ కొత్త మోసం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వాట్సాప్ పింక్ స్కామ్ ఇప్పటికే చాలా మంది వ్యక్తులను మోసగించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, సైబర్ నిపుణులు ఈ మోసాలకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరించారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ‘పింక్ రెడ్ అలర్ట్’తో హెచ్చరించింది. ఇంతకీ వాట్సాప్ పింక్ అంటే ఏంటి? ఈ స్కామ్ ఎలా వ్యాపిస్తోంది. మీరు బాధితులైతే ఏం చేయాలి?! తప్పనిసరిగా తెలుసుకోవాలి. పింక్ వాట్సాప్ అంటే..? స్కామర్లు ‘అదనపు ఫీచర్లతో ఉన్న పింక్ వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతారు.’ ఈ యాప్ నిజానికి ప్రమాదకరమైన మాల్వేర్. వాట్సాప్ పింక్‌ని డౌన్లోడ్ చేయడంతో స్కామర్లు ఫోన్ డేటాకు యాక్సెస్ పొందుతారు. దీంతో ఈ యాప్ మన ఫోన్ డేటాను పూర్తిగా దొంగిలించడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్ వివరాలు, కాంటాక్ట్ నంబర్లు, ఫొటోగ్రాఫ్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని స్కామర్లు దొంగిలించి ఉండవచ్చు. అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్త తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. ప్రత్యేకించి అవి కొత్త ఫీచర్లు లేదా హానికరమైన లింక్‌లపై క్లిక్ చేసేలా ఆకట్టుకునే మెసేజ్‌లు ఉంటే అనుమానించాలి. వాట్సాప్ లేదా ఏదైనా ఇతర అధికారిక సంస్థ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే మెసేజ్‌ను యాక్సెస్ చేస్తే ముందు దాని ప్రామాణికతను ధ్రువీకరించాలి. సమాచారం చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ వెబ్సైట్, సోషల్‌మీడియా అకౌంట్స్, విశ్వసనీయ వార్తా సమాచారాల నుంచి చెక్ చేయాలి. పేరొందిన యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ మొబైల్ పరికరాన్ని సురక్షితంగా ఉంచచ్చు. ఇవి హానికరమైన యాప్‌లు లేదా లింక్‌లను గుర్తించి అడ్డుకోవడంలో సహాయపడతాయి. వాట్సాప్, ఇతర యాప్‌లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలి. సేఫ్టీ అప్డేట్ వల్ల బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ మీ బ్యాంకింగ్ వివరాల వంటి సెన్సిటివ్ సమాచారాన్ని మెసేజ్‌ల ద్వారా ఎప్పటికీ అడగదు. తెలియని లేదా నమ్మదగని అకౌంట్స్‌తో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. వాట్సాప్ కూడా రెండు దశల ప్రామాణికతతో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడానికి పిన్ నంబర్ ఉంటుంది. కొత్త ఫోన్లో మీ ఫోన్ నంబర్ యాక్సెస్ అవ్వాలంటే ఈ పిన్ నెంబర్ అవసరం అవుతుంది. మీ అకౌంట్ సేఫ్టీని మెరుగుపరచడానికి వాట్సాప్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ని ఇప్పుడే ప్రారంభించవచ్చు. వినియోగదారులకు వచ్చే మెసేజ్‌లు ఇలా ఉంటాయి.. ‘న్యూ పింక్’ వాట్సాప్ కొత్త ఫీచర్లతో అధికారికంగా ప్రారంభించారు. న్యూ పింక్ లుక్ కొత్త ఫీచర్లతో మీ వాట్సాప్‌ను ఇప్పుడే అప్డేట్ చేయండి. ఈ కొత్త వాట్సాప్‌ని ఇప్పుడే ప్రయత్నించండి అనే మెసేజ్‌లు వస్తుంటాయి. ఫోన్ హైజాక్ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్ నుండి వచ్చే మెసేజ్‌లను కూడా డౌన్లోడ్ చేయవచ్చు. యాప్ నకిలీ వెర్షన్ వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేయడమే కాదు, ఇది యాప్‌ను డౌన్లోడ్ చేయమని మీ పూర్తి కాంటాక్ట్‌లోని జాబితాకు మెసేజ్‌లు కూడా పంపుతుంది. వాట్సాప్ పింక్ అనేది హానికరమైన మాల్వేర్. మొబైల్ ఫోన్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఓ నకిలీ సాఫ్ట్వేర్. ఓటీపీలు, కాంటాక్ట్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక విషయాలతో సహా వినియోగదారుల పరికరాల నుండి పూర్తి సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని ఉపయోగిస్తారు. వ్యక్తులు లింక్‌లు ఓపెన్ చేసినప్పుడు వారి డిజిటల్ పరికరాలలో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. థర్డ్–పార్టీ యాప్ స్టోర్లు లేదా APK ఫైల్స్ నుండి ప్రోగ్రామ్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆపిల్ ఫోన్లో అయితే యాక్సెస్ ఉండదు. వాట్సాప్ పింక్ స్కామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌పార్టీ యాప్ స్టోర్లు, ఏపీకే ఫైల్స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తమ అక్రమ కార్యకలాపాలకోసం హ్యాకర్లు ఫోన్ గ్యాలరీలో వ్యక్తిగత ఫొటోలను తీసి, బ్లాక్ మెయిలింగ్‌కు ఉపయోగించుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్లో వాట్సాప్ పింక్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే ఇప్పుడే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత, మీ ఫోన్‌ని బ్యాకప్ చేసి ఫార్మాట్ లేదా రీసెట్ చేయండి. మీరు ఈ వాట్సాప్ పింక్ గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. తాజా స్కామ్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్నేహితుల, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోండి. అవగాహన పెంపొందించడం ద్వారా ఇతరుల స్కామ్‌ల బారిన పడకుండా మీరు సహాయం చేయవచ్చు. మోసానికి గురైతే బాధితులు జ్టి్ట https://www. cybercrime.gov.in/ పోర్టల్‌లో రిపోర్ట్ చేయవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వివేకా రెండో భార్య వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. లైవ్‌లో చదివి వినిపించిన యాంకర్
-
కవితతో సుఖేష్ వాట్సాప్ చాట్.. ‘ఆ రేంజ్ రోవర్ కారు ఎవరిది?’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎమ్మెల్సీ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేష్ చంద్ర లిక్కర్ స్కాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కవితతో తాను చేసిన వాట్సాప్ చాటింగ్‌ను బయటపెట్టాడు. ఈ సందర్బంగా లిక్కర్ వ్యాపారంలో వచ్చిన డబ్బును హైదరాబాద్ నుంచి ఆసియా దేశాలకు హవాలా మార్గాల ద్వారా మళ్లించినట్లు సుఖేష్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు రంగంలోకి దిగారు. దీంతో, రఘనందన్ రావు తాజాగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుఖేష్ చంద్ర లేఖపై ఈడీకి ఫిర్యాదు చేశారు రఘనందన్. ఈ సందర్భంగా రఘనందన్ మాట్లాడుతూ.. కవిత, సుఖేష్ చంద్ర వాట్సాప్ చాటింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. సుఖేష్ వాట్సాప్ చాట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కారులో రూ.15 కోట్లు ఇచ్చినట్టు సంభాషణ ఉంది. నగదు ఉంచిన 6060 నెంబర్ రేంజ్ రోవర్ కారు ఎవరిది? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ పోలీసులు మౌనం వీడాలి. తెలంగాణ భవన్లో మనీలాండరింగ్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. -
వాట్సాప్ స్పామ్ కాల్స్‌తో చిర్రెత్తిపోయారా?
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌లో వచ్చే స్పామ్ మెసేజెస్, అనుమానాస్పద కాల్స్ విసిగిస్తుంటాయి. అయితే అలాంటి వాట్సాప్ ఫోన్ కాల్స్ నుంచి యూజర్లకు ఉపశమనం కలిగించేందుకు వాట్సాప్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను మ్యూట్ చేసేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్ల సమాచారం. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం..వాట్సాప్ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే వాట్సాప్‌కు వచ్చే అనుమానాస్పద కాల్స్‌ను సైలెంట్లో పెట్టుకునే సౌలభ్యం కలిగించనుంది. అప్పటి వరకు ఆ కాల్స్ లిస్ట్ నోటిఫికేషన్ సెంటర్ (ఫోన్ డిస్ప్లే మీద కనిపించడం) లో ఫోన్ నెంబర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తే ఇటీవల కాలంలో యూజర్లను అసహనానికి గురి చేస్తున్న స్పామ్ కాల్స్ నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌కు వచ్చే స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ వాటిని సైలెంట్‌గా పెట్టుకునే సౌకర్యం లేదు. ఇప్పుడు ఆ ఫీచర్‌పైనే వర్క్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. చదవండి👉 నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు -
Apsrtc: ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రచారం ఫేక్
సాక్షి, కృష్ణా: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది ఏపీఎస్ఆర్టీసీ. తాము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీఎస్సార్టీసీలో డ్రైవర్ , కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కొందరు. పైగా వాట్సాప్‌లో Apsrtc వెబ్ సైట్ డొమైన్ ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు ఆ అగంతకులు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ. అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి రిలీజ్ చేస్తామని స్పస్టం చేసింది. -
పెళ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్.. కార్డులిచ్చే రోజులు పోయాయి..
సాక్షి వరంగల్: మా ఇంట్లో పెళ్లికి రండి.. అంటూ ఆప్యాయమైన పెళ్లి పత్రిక పలకరింపు మారింది. ఒకప్పుడు మేళతాళాలతో బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. బొట్టు పెట్టి మరీ పత్రిక చేతికిచ్చి ఆహ్వానించేవారు. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టు పెట్టి.. పెళ్లి కార్డు తలుపునకు పెట్టేవారు. దూరంగా ఉన్న ఊళ్లకు ప్రింట్ చేయించిన కార్డులను ఇంటి.. నాయీబ్రాహ్మణుడు లేదా రజకులకు ఇచ్చి పంపిణీ చేయించేవారు. ఈ ఆనవాయితీ కొన్ని పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా.. మారుతున్న కాలం.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నామమాత్రంగా 200 కార్డులు.. అంతకన్నా కొంచెం ఎక్కువ.. తక్కువగా ప్రింట్ చేయించడం.. సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల గ్రూపు తయారు చేసి అందులో కార్డు పెట్టి పిలిచే విధానానికొచ్చింది. వాట్సాప్‌లో కార్డు పెడుతున్నారు. కొందరికి ఫోన్ చేసి పెళ్లికి రండి అని సెలవిస్తున్నారు. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్. మన పెళ్లి పిలుపులు ప్రస్తుతం ఎలా మారాయో చూద్దాం.. పెళ్లికార్డు.. పిలుపు ఇలా.. నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై ఓరచూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. పెళ్లి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కాకుండా.. ఫొటోసూ్టడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. తాజాగా ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్లో పెళ్లి పత్రికను(పెళ్లి ఫైల్ అనాలి మరి..) ఓపెన్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక వివరాలతో చివరగా ‘డేట్ సేవ్ చేసుకోండి’ అని వీడియో ప్లే అవుతోంది. వాట్సాప్ గ్రూప్ కాల్ చేసి.. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నాం.. అంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది. వాట్సాప్ గ్రూపులో పెళ్లి సందడి.. బ్రాహ్మణుడు లగ్న పత్రిక రాసింది మొదలు.. పెళ్లి సందడి షురువైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెళ్లి తేదీ, సమయం, వేదిక మొదలు అన్నింటినీ తెలిపే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్.. పెళ్లి జరుగుతున్న వారి ఇంటి పేరుతో క్రియేట్ చేస్తారు. అందులో దగ్గరి, దూరపు బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లన్నీ చేర్చి.. వేడుకలు షురువైనప్పటి నుంచి ఆ ఫొటోలను అందులో అప్లోడ్ చేయడం.. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లయింది. ఆ ఫొటోలు చూసిన గ్రూపులోని వారు సైతం మరీ గుర్తు చేసుకుని తాము కూడా పెళ్లికి వెళ్లాలనే ఆతృత వారిలో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 200 కార్డులే.. కరోనా ముందు వరకు ఓ ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు వెయ్యి కార్డుల వరకు ఆహ్వాన పత్రికలు ఆర్డర్ ఇచ్చేవారు. ఇప్పుడు 200 వరకు ప్రింట్ చేయించుకుంటున్నారు. అవి కూడా లేటెస్ట్ డిజైన్లు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే.. డిజైన్ చేసిన పెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు ప్రోమో వీడియోలను వాట్సాప్ ద్వారానే పంపిస్తున్నారు. దీంతో కార్డుల ప్రింటింగ్ తగ్గించారు. – బోడకుంట్ల సంపత్, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, వరంగల్ సైకిల్‌పై వెళ్లి ఇచ్చాం.. మా నాన్న వాళ్లు సైకిళ్లపై.. దూరమైతే బస్సుల్లో వెళ్లి పెళ్లి కార్డులు ఇచ్చి వచ్చేవాళ్లు. ఎడ్ల బండిపై కూడా వెళ్లి పంచేవాళ్లు. కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చిన సందర్భాలున్నాయి. అదే ఇప్పుడైతే గ్రామం వరకే పరిమితమైంది. కొందరికి పెళ్లి కార్డులు లేదంటే ఇంటింటికి వెళ్లి చెప్పి వస్తున్నాం. పెళ్లింటి వారే వాట్సాప్‌లలో కార్డులు పంపుతున్నారు. – పంతంగి రజనీకాంత్, రజక కులపెద్ద, ధర్మారావుపేట ఒత్తిడిలో మరిచినా.. క్షణాల్లో చేరవేత.. పెళ్లి పనులన్నీ ఒక ఎత్తయితే.. కార్డుల పంపిణీ అనేది కత్తిమీద సాముతో కూడుకున్న పని. అయినా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి పెళ్లి పత్రికలు ఇవ్వడం.. పెళ్లి పనుల ఒత్తిడిలో పడి కొందరికి కార్డులు ఇవ్వడం కూడా మరిచిపోతుంటాం. అందుకే.. వాట్సాప్ ద్వారానే ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డులు పంపించాం. వీడియో ప్రోమోలు కూడా సెండ్ చేశాం. సెకన్ల వ్యవధిలోనే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించగలిగాం. గతంలో పెళ్లి కార్డుల పంపిణీకి నెలరోజుల ముందు నుంచే బాగా కసరత్తు చేసేవాళ్లం. ఇప్పుడు కాస్త సులువైంది. – గంగధార మురళి, తండ్రి నెలరోజుల ముందు నుంచే.. గతంలో నెల రోజుల ముందే పెళ్లి కార్డులు మాకు ఇచ్చేవారు.. రజక, నాయీబ్రాహ్మణుల సహాయంతో తమ బంధువులు ఉండే ఊర్లకు పంపించి పెళ్లి కార్డులు ఇచ్చేలా చూశాం. వారికి తలా కొన్ని కార్డులు ఇచ్చి ఏ ఊరికి పోవాలో చెప్పేవాళ్లం. కొన్ని సందర్భాల్లో కార్డు తీసుకునేవారు ఇంటి వద్ద లేకపోతే పక్క ఇంటివారికి ఇచ్చి మళ్లీ వచ్చాక ఇవ్వమని చెప్పిన సందర్భాలున్నాయి. సొంత ఊరిలో కుల బంధువుల ఇంటికి వెళ్లి వారి దర్వాజకు బొట్టు పెట్టి, ఆ ఇంట్లో వారికి కూడా బొట్టు పెట్టి పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించాం. ఇప్పటికీ ఊళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ నోటిమాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. ఏదో వాట్సాప్ అంట.. అందులో కార్డులు పంపిస్తుండ్రు. – కె.లచ్చమ్మ, బంధనంపల్లి, రాయపర్తి మండలం -
రిస్టోర్ అయిన వాట్సాప్ సేవలు
-
వాట్సాప్ సేవలు పునరుద్ధరణ
భారత్‌తో పాటు పలు దేశాల్లో నిలిచిపోయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుమారు 95 నిమిషాల తర్వాత సేవలను పునరుద్ధరించించి మాతృ సంస్థ మెటా. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల యూజర్లు మెసేజ్‌లు పంపేందుకు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత.. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించకపోవటం, డబుల్ టిక్, బ్లూటిక్ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో పడ్డారు యూజర్లు. సమస్య తలెత్తిన తర్వాత వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఫిర్యాదులు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు! -
Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు!
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాట్సాప్‌ను ప్రజలు వినియోగిస్తున్నారు. అన్ని దేశాల్లో కలిపి దాదాపు 244 కోట్లు మంది ఇప్పటివరకు వాట్సాప్ సేవలను వాడుతున్నారు. నవంబర్ 2009లో ప్రాథమికంగా వాట్సాప్‌ను యాపిల్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. 2010లో అండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ దశ తిరిగింది. కేవలం నాలుగేళ్లలోనూ 200 మిలియన్ యూజర్ల మార్కును చేరుకుంది. వాట్సాప్ పెరుగుతున్న తీరును చూసిన ఫేస్ బుక్.. వెంటనే బేరం పెట్టింది. ఏకంగా 19 బిలియన్ డాలర్లను వెచ్చించి 2014లో సొంతం చేసుకుంది. ఈ మొత్తం వాట్సాప్ విలువ కంటే 12 రెట్లు ఎక్కువ. భారత్ వ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల యూజర్లు ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ మెసెజ్‌లు పంపుకోవచ్చు. ప్రతీ రోజు దాదాపు పది వేల కోట్ల మెసెజ్‌లను వాట్సాప్ చేరవేస్తుంది. (చదవండి: దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం.. అయోమయంలో యూజర్లు!) వాట్సాప్ వచ్చిన తర్వాత దెబ్బ పడిన మొదటి సర్వీస్ SMS. అప్పటి వరకు ఒక్కో SMSకు కొంత మొత్తాన్ని చార్జ్ చేసిన మొబైల్ నెట్‌వర్క్‌లు వాట్సాప్ దెబ్బకు భారీగా నష్టపోయాయి. ఇక భారతీయులయితే వాట్సాప్‌ను ఎంతగా అభిమానించారంటే.. ఏం చేసినా వాట్సాప్‌లో పంచుకున్నారు. మెసెజ్ షేరింగ్, ఫోటో షేరింగ్, స్టేటస్.. ఇలా ప్రతీ అంశానికి వాట్సాప్‌పై ఆధారపడతారు.కొన్నాళ్లుగా కాలింగ్‌కు కూడా వాట్సాప్ ప్రత్యామ్నాయంగా మారింది. నేరుగా కాల్ చేస్తే రికార్డు అవుతుందనో.. లేక సౌకర్యంగా ఉంటుందనో వాట్సాప్ కాలింగ్‌నే నమ్ముకున్నారు చాలా మంది. ఇక విదేశాల్లో, లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారికి వాట్సాప్ కాలింగ్ ఎంతో సులభం. దీని వల్ల భారత్ లాంటి దేశాల్లో ISD ఇంటర్నేషనల్ కాలింగ్‌కు ఎంతో దెబ్బ పడింది. మొబైల్ నెట్‌వర్క్‌లు కన్నుమూసి తెరిచేలోపు వాట్సాప్ ఇంటర్నేషనల్ కాల్ ఎంతో ముందుకు వెళ్లింది. ఒకప్పుడు STD, ISD చేయాలంటే బూత్‌లకు వెళ్లేవాళ్లు. అపాయింట్మెంట్లు తీసుకునేవాళ్లు. వీటన్నింటికి వాట్సాప్ బెస్ట్సొల్యూషన్గా మారింది. ఇక వాట్సాప్ గ్రూపుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ప్రతీ వాట్సాప్ యూజర్ కనీసం 10 గ్రూపుల్లో చేరడం, తమకు నచ్చిన అంశాలను బేస్ చేసుకుని గ్రూప్‌లు క్రియేట్ చేయడం వీపరీతంగా పెరిగింది. దీనికి తోడు మీడియాకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారింది. ప్రతీ వార్తను వాట్సాప్‌లో షేర్ చేసుకోవడం అనవాయితీగా మారింది. ఏకంగా వాట్సాప్ బేస్డ్గా మీడియా అంటే వార్తా ఛానళ్లు, పబ్లికేషన్లు నడుస్తుండడం ఆశ్చర్యం. గతంలో గోడ పత్రికలన్నీ ఇప్పుడు వాట్సాప్ పత్రికలుగా మారిపోయాయి. (చదవండి: WhatsApp Down కలకలం: స్పందించిన మెటా) -
Whatsapp: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. అయోమయంలో యూజర్లు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో మంగళవారం అంతరాయం ఏర్పడింది. కొన్ని సాంకేతిక సమస్యలతో వాట్సాప్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం ప్రకారం.. అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించడం లేదు. వాట్సాప్‌లో డబుల్ టిక్ , బ్లూటిక్ మార్కులు చూపించడం లేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో ఉన్నారు యూజర్లు. ఇప్పటికే వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్లో వాట్సాప్ యూజర్లు.. ‘వాట్సాప్ డౌన్’ (#Whatsapp Down) అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. దీనిపై ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. People coming to twitter after #whatsappdown 😭😂 pic.twitter.com/kt1tZRDMbQ — Aritra ❤️ (@Aritra05073362) October 25, 2022 When WhatsApp is Down.#whatsappdown pic.twitter.com/xHgsHd9h8v — ɅMɅN DUВΞY (@imAmanDubey) October 25, 2022 When your WhatsApp is playing up but you come to Twitter and see that everyone else is having the same problem #WhatsAppDown pic.twitter.com/pMcJm0Zn56 — Jamie (@GingerPower_) October 25, 2022 People Coming to Twitter to see if WhatsApp is down#WhatsappDown pic.twitter.com/eGi25KiQhU — Bella Ciao (Chai) (@punjabiii_munda) October 25, 2022 చదవండి: షాపింగ్ బంద్, అల్లాడిన యూపీఐ లావాదేవీలు.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
అన్నతో కాళ్లు మొక్కించారని కోపం.. ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్
సాక్షి, జనగామ: రెండేళ్ల క్రితం పంపిన ఓ మెసేజ్.. యువకుడి హత్యకు దారి తీసింది. అన్నతో కాళ్లు మొక్కించారని కోపం పెంచుకున్న తమ్ముడు.. చివరకు కత్తిగాట్లకు బలయ్యాడు. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పక్కాప్లాన్‌తో మద్యం తాగేందుకు రప్పించి.. అదును చూసి కీచైన్ కత్తితో దారుణంగా చంపేశారు. ఈనెల 16న అర్ధరాత్రి జరిగిన ఈఘటన ‘ఇండస్ట్రియల్ ఏరియాలో హత్య’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈహత్యకు సంబంధించి సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ మూలబావికి చెందిన పకీరు రమేశ్ ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ వివాహిత ఫోన్‌కు రెండేళ్ల క్రితం అసభ్యకర మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె భర్త ఇండస్ట్రియల్ ఏరియాలోని దీప్తి ఇంజనీరింగ్ వర్క్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న పగడాల సందీప్ రమేశ్‌ను మందలించాడు. కాళ్లు మొక్కి తప్పు ఒప్పుకోవడంతో గొడవ అక్కడితో సద్దుమణిగింది. తన అన్నతో కాళ్లు మొక్కించారనే కోపంతో రమేశ్ తమ్ముడు పకీరు సురేశ్ సందీప్‌కు ఫోన్‌కు చేసి నిలదీశాడు. దీంతో పాటు మెసేజ్ గురించి తెలిసిన వారందరికీ చెప్పాడు. అనంతరం రమేశ్ తన తమ్ముడు సురేశ్, సందీప్ ఇద్దరినీ పిలిచి కాంప్రమైజ్ చేశాడు. అక్కడితో గొడవ ముగియగా.. మూడ్రోజుల క్రితం సురేశ్ మరోసారి సందీప్‌కు ఫోన్ చేసి అదే విషయం గురించి మాట్లాడాడు. తన అన్నతో కాళ్లు మొక్కించుకుంటారా అని పగ పెంచుకున్నాడు. ఈనెల 16న రాత్రి సందీప్, సురేశ్, మరో స్నేహితుడు విజయ్ ముగ్గురు కలిసి మద్యం తాగారు. ఇక్కడే ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. తాగిన మైకంలో సందీప్ తన వద్ద ఉన్న కీచైన్ కత్తితో సురేశ్‌ను ఇష్టం వచ్చినట్లుగా పొడిచి, మెడకోసి చంపేశాడు. ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసుకుని విచారణ సాగించారు. సందీప్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అదే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సురేశ్ తండ్రి పకీరు చంద్రయ్యను విట్నెస్గా చూపించి, సందీప్‌ను రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు. చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం -
కలెక్టర్ టీనా దాబికే షాకిచ్చాడు.. మాములు ఐడియా కాదుగా..
Tina Dabi.. అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి అందరికీ సుపరిచితురాలే. ఇటీవలే ఆమె రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండేను వివాహం చేసుకున్నారు. కాగా, మరోసారి టీనా దాబి వార్తల్లో నిలిచారు. అయితే, కలెక్టర్ టీనా దాడి ఫొటోనే వాట్సాప్‌లో వాడుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో, విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు.. ఓ మొబైల్ నెంబర్‌తో వాట్సాప్ ఓపెన్ చేసి, దాంట్లో ఐఏఎస్ టీనా దాబి ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. అనంతం వాట్సాప్‌లో ఆ నెంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు చేశాడు. అమెజాన్ గిఫ్ట్ కార్డులు పంపాలంటూ చాలా మందికి మెసేజ్‌లు పెట్టాడు. దీంతో, కలెక్టర్ టీనా దాబీనే గిఫ్ట్ కార్డులు అడిగిందే ఏమో అని వారు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు సెక్రటరీ సునితా చౌదరీకి కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డు పంపాలంటూ అతడి వాట్సాప్ నుంచి మెసేజ్ వెళ్లింది. దీంతో, ఎందుకైనా మంచిదని ఆమె.. టీనా దాబికి ఫోన చేసి అసలు విషయం అడిగింది. గిఫ్ట్ కార్డు గురించి చెప్పడంతో షాకైన కలెక్టర్ టీనా దాబి.. ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీకి తెలియజేసింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. యువకుడిని అరెస్ట్ చేశారు. CM अशोक गहलोत के बाद अब IAS टीना डाबी के नाम पर ठगी, अफसर से ही मांग लिया गिफ्ट#IAS #Tinadabi https://t.co/zTbOOBvIMM — Zee Salaam (@zeesalaamtweet) August 9, 2022 ఇక.. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. కాగా, రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగితోనే పరాచకాలా.. తేడా వస్తే ఇలాగే ఉంటంది.. -
వాట్సాప్ డిస్ప్లే పిక్చర్లుగా అధికారుల ఫోటోలు...అమెజాన్ గిఫ్ట్ కూపన్ల పేరుతో వల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫొటోలను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్లుగా (డీపీ) పెట్టి, అనేక మందికి సందేశాలు పంపిస్తూ, అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కోరి టోకరా వేస్తున్న, వేయడానికి ప్రయత్నిస్తున్న కేటుగాళ్లు నైజీరియాలో ఉన్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సహా ముగ్గురు ఉన్నతాధికారుల ఫొటోల దుర్వినియోగంపై నమోదైన కేసుల దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ఆయా వాట్సాప్‌ల ఐపీ అడ్రస్‌లు తని ఖీ చేయగా అవన్నీ నైజీరియాలోనే ఉన్నట్లు తేలింది. ఇక్కడి నంబర్ అక్కడ వాట్సాప్.. దేశంలోనే ఉంటూ నేరాలు చేసే నైజీరియన్లు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని వాడుతుంటారు. వీళ్లు బాధితులను బుట్టలో వేసుకోవడానికి అవసరమైన ఫోన్లు చేయడానికి బోగస్ వివరాలతో సిమ్‌కార్డులు తీసుకుంటారు. వీటిని వీళ్లు కేవలం బేసిక్ ఫోన్లలో వేసి వాడేలా సూత్రధారులైన నైజీరియన్లు జాగ్రత్తపడతారు. ఈ నంబర్లకు సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం నైజీరియాలోని తమ అనుచరులతో యాక్టివేట్ చేయిస్తారు. అక్కడి వాళ్లు వైఫై ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటారు. అందుకు అవసరమైన కోడ్ మాత్రం ఇక్కడి వ్యక్తి దగ్గర ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. దీన్ని వీళ్లు నైజీరియాలోని వారికి చెప్పడంతో వాళ్లు ఎంటర్ చేసుకుని వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. చిక్కకుండా గిఫ్ట్ కూపన్లు.. గతంలో సైబర్ నేరగాళ్లు తమ సందేశాలు అందుకున్న వారి నుంచి డబ్బు అడిగి ఆన్లైన్ ద్వారా లేదా వివిధ వ్యాలెట్స్‌కు పంపాలని కోరేవారు. విషయం పోలీసుల వరకు వెళ్లి దర్యాప్తు చేపడితే నగదు చేరిన నంబర్ ఆధారంగా వీరి వివరాలు బయటపడేవి. ఇటీవల కాలంలో ఎక్కువగా అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపాలని కోరుతున్నారు. నిర్ణీత మొత్తానికి వీటికి ఖరీదు చేస్తున్న బాధితులు దానికి సంబంధించిన లింకులను షేర్ చేస్తున్నారు. వీటిని ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా రీడీమ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఫలానా దేశంలో కూపన్ రీడీమ్ అయిందని గుర్తించినా చర్యలు సాధ్యంకాదు. అధికారిక వెబ్సైట్లే ఆధారం.. వాట్సాప్ సిద్ధం చేసుకుంటున్న నైజీరియన్లు అధికారిక వెబ్సైట్ల ద్వారానే ప్రముఖ సంస్థల, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల వివరాలు, ఫొటోలు సంగ్రహిస్తున్నారు. ప్రొఫైల్ నేమ్, అబౌట్ తదితరాలను డీపీగా ఎంచుకున్న ఫొటోకు తగ్గట్టే సిద్ధం చేసుకుంటారు. ఈ నంబర్ నుంచి సదరు అధికారి కింద పని చేసే వారికి సందేశాలు పంపుతారు. ఇవీ నేరగాళ్ల చేతికి ఆయా వెబ్సైట్ల ద్వారానే తెలుస్తున్నాయి. కేవలం డీపీలు మాత్రమే చూస్తూ ఆ సందేశం తమ అధికారి నుంచే వచ్చినట్లు భావించి స్పందిస్తున్నారు. ఈ తరహా స్కామ్స్ దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సంప్రదించి సరిచూసుకోవాలి డీపీ ఫ్రాడ్స్‌ల్లో ఉన్నతాధికారులు, సెలబ్రెటీల ఫొటోలు వినియోగిస్తారు. ఎవరికైనా తమ పై అధికారులు, పరిచయస్తుల నుంచి డబ్బు, గిఫ్ట్ కూపన్లు పంపాలంటూ సందేశాలు వస్తే గుడ్డిగా నమ్మొద్దు. కేవలం డీపీలు చూసి ఆ సందేశం ఫలానా వారే పంపారని భావించద్దు. ఆ వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్ నంబర్‌ను పరిశీలించాలి. అది వాళ్లు నిత్యం వినియోగించేది కాకపోతే వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం) -
పాతాళగంగలో దూకి మరణిస్తా.. భర్తకు వాట్సప్ మెసేజ్
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలోని పాతాళగంగలో దూకి మరణిస్తానని నంద్యాలకు చెందిన కృష్ణకుమారి తన భర్తకు వాట్సాప్ ద్వారా శనివారం సందేశం పంపించింది. అనంతరం ఆమె అదృశ్యమైంది. దీంతో మత్స్యకారుల సహకారంతో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వన్‌టౌన్ ఎస్ఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయా ల్సిందిగా కోరారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ మెసేజ్ పంపినట్లు తెలుస్తుంది. చదవండి: (అయ్యా నా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే ఆస్పత్రికి కోటంరెడ్డి) -
వాట్సాప్‌లో అదిరే ఫీచర్..సెండ్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాట్సాప్ రాకతో సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడం, స్వీకరించడం సులువైంది. అయితే పంపిన సందేశంలో అక్షర దోషాలు, వాక్య నిర్మాణంలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం లేదు. దాన్ని తొలగించడమో లేదా కాపీ చేసుకుని సరిచేసి మరోసారి పంపాల్సిందే. అయితే పంపిన సందేశాన్ని సరిదిద్దుకునే ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తోంది. దీని వల్ల సమయమూ ఆదా అవుతుంది. ఆన్‌డ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్‌టాప్ వాట్సాప్ బీటా వెర్షన్ భవిష్యత్ అప్డేట్ కోసం ఈ ఎడిటింగ్ ఫీచర్‌పై కంపెనీ నిమగ్నమైంది. ఇది వస్తే ఎడిటింగ్ ఫీచర్ కలిగిన తొలి మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ నిలుస్తుంది. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ ఇంకా స్పష్టత లేదు. గ్రూప్స్ నుంచి నిష్క్రమించినా అడ్మిన్‌కు తప్ప ఇతర సభ్యులకు తెలియకుండా ఓ ఫీచర్‌నూ వాట్సాప్ రూపొందిస్తున్నట్టు సమాచారం. -
తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?
Matrimonial sites are platforms designed to match: ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తమ పిల్లలకు తగిన సంబంధాలను వెతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో అలా ఒకటైన జంటలు కోకొల్లలు. అదేవిధంగా మ్యాటిమోని సైట్ల ద్వారా మోసపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఏంటి ఇదంతా అనుకోకండి ఇక్కడొక తండ్రి ఎంతో ఆశతో తన కూతురుకి సరిపోయే వరుడి వివరాలు పంపిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? వివరాల్లోకెళ్తే....ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన మంచి సంబంధాలను వెతికి తీసుకువ్చి మరీ పెళ్లిళ్లు చేస్తుంటారు. తమ పిల్లలు మంచి వ్యక్తులను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇది సర్వసాధారణం. పాపం బెంగుళూరులోని ఓ తండ్రి అలానే భావిస్తాడు. ఈ మేరకు అతను తన కూతురుకి తగిన వరుడుని మాట్రిమోనియల్ సైట్లలో వెతికి మరీ అతని వివరాలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఐతే ఆమె తన తండ్రికి ఊహించని షాక్ ఇచ్చింది. మాట్రిమోనియల్ సైట్లలో ప్రోఫెల్లో సదరు వ్యక్తుల పూర్తి సమాచారం ఉండటం సహజం. ఆమె అతని ప్రోఫెల్ చూసి ముచ్చటపడి ఉద్యోగం ఇచ్చింది. ఇంతకీ ఆమె బెంగళూరులోని స్టార్ట్ అప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ఉదితా పాల్. అంతేకాకుండా తన తండ్రికి ఆ వ్యక్తికి లావదేవీలను సులభతరం చేసే ఫిన్టెక్లో ఏడేళ్ల అనుభవం ఉండటం వల్ల తన స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చానని అందువల్ల తనను క్షమించమని తండ్రికి సందేశం పంపింది. వాస్తవానికి చూసిన ప్రతీ సంబంధం కుదరకపోవచ్చు గానీ ఇలా ఆమె ఆ వ్యక్తికి ఉద్యోగం ఆఫర్ ఇచ్చిన తీరు ఆమెకు తన కెరీయర్ పట్ల ఉన్న నిబద్ధత తెలియజేస్తోంది. ఈ మేరకు ఉదితా పాల్ తనకు తన తండ్రికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వాట్సాప్ సంభాషణ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq — Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022 (చదవండి: పెళ్లి తంతులో దంపతులు రచ్చ... షాక్‌లో బంధువులు) -
Whatsapp: మీ వాట్సాప్ బ్యాన్ అయ్యిందా?
Whatsapp Banned? Find Reasons, How to Recover Whatsapp Blocked Number: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ను మన దేశంలో కోట్ల మంది వాడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మెటా కంపెనీ పరిధిలో పని చేస్తున్న వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్ ఆధారిత మెసేజ్‌ల దగ్గరి నుంచి వీడియో కాల్స్ దాకా, వ్యక్తిగత అవసరాల నుంచి ఆఫీసుల పనుల దాకా.. అన్నీ నడిచిపోతున్నాయి. అయితే ఐటీ రూల్స్ 2021 అమలులోకి వచ్చాక.. వాట్సాప్ భారత్‌లో తన యూజర్లపై ఎక్కువ అజమాయిషీ చెలాయిస్తోంది. ఈ తరుణంలో వాట్సాప్ అకౌంట్లను క్రమం తప్పకుండా భారత్‌లో అకౌంట్లను బ్యాన్ చేస్తూ వస్తోంది. పైగా Intermediary Guidelines and Digital Media Ethics Code ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన అకౌంట్లనే బ్యాన్ చేస్తున్నట్లు మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టుల్లో చెబుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు రెండు కోట్ల వాట్సాప్ అకౌంట్లను నిషేధిత జాబితాలోకి చేర్చిందని తెలుస్తోంది. ఇంతకీ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్ చేస్తుందో కారణాలు తెలుసా? ►ఫేక్ అకౌంట్లు వేరే వ్యక్తి పేరు మీద, నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఇలాంటి వ్యవహారాలు దృష్టికి వస్తే వాట్సాప్ వాటిని బ్యాన్ చేస్తుంది. ►కాంటాక్ట్ లిస్ట్‌లో లేనోళ్లకు.. కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నెంబర్లకు ఎక్కువ మెసేజ్‌లు పంపడాన్ని.. అనుమతులు లేని సంభాషణలుగా గుర్తిస్తుంది వాట్సాప్. అందుకే బ్యాన్ విధిస్తుంది. ఒకవేళ తెలిసిన వ్యక్తి అయినా సరే, నోటికి నెంబర్ గుర్తున్నా సరే.. కచ్చితంగా కాంటాక్ట్‌లో సేవ్ చేసుకున్నాకే ఛాటింగ్ చేయండి. ►థర్డ్ పార్టీ యాప్‌లతో.. వాట్సాప్ మెసేంజర్ కాకుండా థర్డ్ పార్టీలు యాప్‌లు ఉపయోగించినా ఈ సమస్య ఎదురవుతుంది. ఉదాహరణకు.. వాట్సాప్ డెల్టా, జీబీ వాట్సాప్, వాట్సాప్ ఫ్లస్.. ఇలాంటివన్నమాట. వీటిని వాట్సాప్ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు. ప్రైవసీ కోణంలో ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. కాబట్టి, వాటిని డిలీట్ చేయండి. అఫీయల్ యాప్‌కు మొమరీ స్పేస్ ఎక్కువైనా వాడేయండి. ►ఎక్కువమంది బ్లాక్ చేసినా.. ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎక్కువ మంది యూజర్లు బ్లాక్ చేసినా సరే.. ఆ అకౌంట్‌ను వాట్సాప్ నిషేధిస్తుందని తెలుసా?. కాబట్టి, అడ్డగోలు కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవడం, అవసరం లేకున్నా వాళ్లకు మెసేజ్‌లు పంపడం, ఫార్వార్డ్ మెసేజ్‌లు పంపడం చేయడం తగ్గిస్తే మంచిది. ►ఫిర్యాదుల ఫలితం కూడా.. ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎక్కువ మంది రిపోర్ట్ చేసినా, ఎక్కువ మంది ఫిర్యాదులు చేసినా.. ఆ అకౌంట్‌ను వాట్సాప్ బ్యాన్ చేసేస్తుంది. ►మాల్వేర్ లింక్స్ మాల్వేర్(వైరస్)తో కూడిన లింక్స్, స్మార్ట్ఫోన్లకు ప్రమాదం కలిగించే లింక్స్‌గానీ, ఏపీకే ఫైల్స్ రూపంలో ఉండే ఫైల్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపినా వాట్సాప్ ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. ►అసభ్య సందేశాలు.. పోర్న్ సంబంధిత కంటెంట్, అసభ్య సందేశాలు, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే సందేశాలు, బెదిరింపులు, వేధింపులు, విద్వేషపూరిత సందేశాలు.. ఇతరులకు పంపినా సరే బ్యాన్ తప్పదు!. ►హింసను ప్రేరేపించినా.. ఈరోజుల్లో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే ఫేక్ కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అందుకే హింసను ప్రేరేపించేవిగా ఉండే కంటెంట్‌ను ఫార్వార్డ్ చేసినా బ్యాన్ వేస్తుంది వాట్సాప్. వీటితో పాటు ఘర్షణలకు ప్రేరేపించే పోస్టులు, పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించిన కంటెంట్ ప్రమోట్ చేసినా వాట్సాప్ బ్యాన్ తప్పదు. కాబట్టి, బ్యాన్ పరిధిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడడండి. అలాగే వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయడం అనేది రిపోర్ట్ లేదా అవతలి వాళ్ల ఫిర్యాదుల ఆధారంగా జరుగుతుంటుంది. పర్సనల్ అకౌంట్లతో పాటు గ్రూపులు ఇందుకు అతీతం కాదు. గ్రీవియెన్స్ చానెల్‌తో పాటు రకరకాల టూల్స్ ఇబ్బందికారక అకౌంట్ల(ఫిర్యాదుల ఆధారంగా)ను నిశీతంగా పరిశీలించాకే.. వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. ఈ బ్యాన్ టెంపరరీగా లేదంటే శాశ్వతంగా ఉండొచ్చు. తాత్కాలిక నిషేధం ఎత్తివేతకు వాట్సాప్ సపోర్ట్ టీంకి మెయిల్ పెడితే సరిపోతుంది. ఏం చేయాలంటే.. వాట్సాప్ బ్యాన్ అని కనిపించే స్క్రీన్ షాట్‌ను.. అన్‌బ్యాన్(బ్యాన్ ఎత్తేయమంటూ) రిక్వెస్ట్ చేస్తూ support@whatsapp.com కు మెయిల్ పెట్టాలి. అప్పుడు ఎందుకు బ్యాన్ చేసిందో వివరణ ఇస్తూనే.. వీలైతే అన్‌బ్యాన్ చేయడానికి వాట్సాప్ ప్రయత్నిస్తుంది. ఒకవేళ అన్‌బ్యాన్ కన్ఫర్మ్ మెసేజ్ గనుక వస్తే.. యాప్‌ను అన్-ఇన్స్టాల్ చేసి, తిరిగి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే ప్లేస్టోర్‌లో అప్డేట్ కొట్టినా సరిపోతుంది. ఒకవేళ మళ్లీ మళ్లీ బ్యాన్ మెసేజ్ వస్తుంటే.. ఈసారి support@whatsapp.com కు మరోసారి రిక్వెస్ట్ మెయిల్ (ఇంతకు ముందు.. ఇప్పటివి స్క్రీన్ షాట్స్‌తో) పెట్టొచ్చు. అప్పుడు సరైన వివరణ దక్కుతుంది. ఒకవేళ పర్మినెంట్ బ్యాన్ సంకేతాలు గనుక అందితే మాత్రం.. నెంబర్ మార్చేడయం తప్ప మరో మార్గం ఉండదని వాట్సాప్ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొని ఉంది. మీ తరపున గనుక ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు లేకుంటే.. grievance_officer_wa@support.whatsapp.comకు మెయిల్ చేయడం ద్వారా సమస్యకు ఓ పరిష్కారం పొందవచ్చు. చదవండి: ఇంట్లో కరెంట్ బిల్లును ఆదా చేసే సింపుల్ టిప్స్.. పాటించండి -
ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం
సాక్షి, పెనుమూరు(చిత్తూరు): ‘గత్యంతరం లేక ఐపీ పెట్టాం. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నా.. నా పరిస్థితి అర్థం చేసుకోండి. కోర్టులో నడుస్తున్న భూమి కేసు పరిష్కారం అయితే కానీ మా కష్టాలు తీరవు’ ఇది వ్యాపారి కోడూరు రంగయ్య శెట్టి మనువడు ప్రవీణ్‌కుమార్ ఐపీ బాధితులకు పెట్టిన వాట్సప్ మెసేజ్. పెనుమూరులో 60 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేసిన రంగయ్య శెట్టి గత వారం దాదాపు 997 మందికి రూ.87.40 కోట్లు ఐపీ పెట్టి అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీనిపై రుణదాతలు పెనుమూరులో ఈ నెల 6న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డీఎస్పీ సుధాకరరెడ్డి, పాకాల సీఐ ఆశీర్వాదం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. చదవండి: (‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’) ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10 గంటలకు రంగయ్యశెట్టి మనుమడు ప్రవీణ్ రుణదాతలకు వాట్సప్ మెసేజ్ పెట్టారు. అందులో తన తండ్రి చేపట్టిన ట్రావెల్స్, వడ్డీ, గ్రానైట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నష్టపోయినట్లు చెప్పారు. అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల క్రితం వరకూ నెలకు రూ. కోటి వడ్డీ కడుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్లాట్లు, 70 ఎకరాల భూమి అమ్ముకున్నట్లు మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఇక గత్యంతరం లేక ఐపీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నానని, తన పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం తిరుపతిలోని భూమిపై కోర్టులో కేసు నడుస్తోందని, ఆ కేసు పరిష్కారం అయితే తమ కష్టాలు తీరుతాయన్నారు. ప్రస్తుతం తన సమస్యలు తీరేందుకు రెండు మార్గాలు మిగిలాయని, ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, రెండు తాను బతికినంత కాలం అప్పు తీర్చేందుకు శ్రమిస్తానంటూ మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్ వాట్సాప్ చేసిన ఫోన్ స్విచాఫ్ వచ్చింది. పోలీసులు ఆ మెసేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. -
మీ మొబైల్లో సేవ్‌కాని నంబర్లకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇలా...!
Send Message To Unsaved Number In Whatsapp: వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు. స్మార్ట్ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్ మనందరి నిత్యజీవితాల్లో ఒక భాగమైంది. పొద్దునే లేచి డేటా ఆన్ చేసి వాట్సాప్‌లో ఏమైనా మెసేజ్స్ వచ్చాయో లేదో చూస్తాం. చదవండి: WhatsApp: మీ ఫొటోలు సరికొత్త రూపంలో..! వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్ చేయాలంటే కచ్చితంగా ఫలనా వ్యక్తి నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. సేవ్ చేస్తేనే వాట్సాప్ యాప్‌లో ఆయా వ్యక్తి నంబరు కన్పిస్తోంది. థర్డ్‌పార్టీ యాప్స్ ఉపయోగించి ఫలానా వ్యక్తి నంబర్‌ను సేవ్ చేసుకోకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయవచ్చు. థర్డ్‌పార్టీ యాప్స్‌నుపయోగించి మెసేజ్ చేయడం మన భద్రతకే భంగం వాటిల్లుతుంది. అంతేకాకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మంది ఎదుర్కొన్న వాళ్లమే. కొన్ని సార్లు మనకు చికాకు కూడా తెప్పిస్తోంది. వాట్సాప్‌లో నంబర్ లేకుండా మెసేజ్ ఎలా పంపాలి లేదా కాంటాక్ట్ యాడ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో ఇక్కడ తెలుసుకుందాం. వాట్సాప్‌లో సేవ్‌లేని నంబర్లకు మెసేజ్ ఇలా చేయండి... మీ ఫోన్లోని బ్రౌజర్‌ని(క్రోమ్ లేదా ఫైర్ఫాక్స్) ఒపెన్ చేయండి. ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్ఎల్ అడ్రస్ బార్‌లోపేస్ట్ చేయాలి. ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశ కంట్రీ కోడ్ 91తో పాటు మీరు మెసేజ్ పంపాలనుకున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ: మీ వాట్సాప్‌లో సేవ్ కాని ఫలానా నంబర్‌కు ‘http://wa.me/919911111111’ ఎంటర్ చేయాలి. ఇక్కడ తొలి రెండు అంకెలు మన దేశ కోడ్. తరువాత మెసేజ్ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్ మీరు లింక్‌ను టైప్ చేసిన తర్వాత, లింక్‌ని తెరవడానికి ఎంటర్ నొక్కండి . తరువాత మీరు రెసిపెంట్(గ్రహీత) ఫోన్ నంబర్‌తో గ్రీన్ కలర్‌తో మెసేజ్ బటన్‌తో ఒక వాట్సాప్ పేజీని చూస్తారు. గ్రీన్ కలర్ మెసేజ్‌బటన్‌పై క్లిక్ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్లించబడతారు. అంతే మీరు ఫలానా నంబర్‌ను సేవ్ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్ చేయవచ్చును. చదవండి: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..! యూజర్లకు కాస్త ఊరట..! -
వాట్సాప్‌లో మరో ఫీచర్, ఇకపై ఐపాడ్లో కూడా
ఐపాడ్ యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న వాట్సాప్ మల్టీ డివైజ్ ఆప్షన్‌ను ఐపాడ్ యూజర్లు వినియోగించేలా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2019 నుంచి మల్టీ డివైజ్ 2.0 పేరుతో మల్టీ డివైజ్ ఆప్షన్‌పై వర్క్ చేస్తున్న వాట్సాప్..ఈ ఏడాదిలో ఊహించని విధంగా ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందించింది. అయితే తాజాగా ఈ మల్టీ డివైజ్ ఆప్షన్‌ను ఐపాడ్లలో కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా' వివరాల ఆధారంగా.. యూజర్లు వాట్సాప్‌ను ఫోన్‌తో పాటు వాట్సాప్ వెబ్, పోర్టల్, డెస్క్ ట్యాప్, ఫోన్ లో వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఐపాడ్ లో కూడా అందుబాటులోకి రానుంది. Very excited to be launching a beta of our new multi-device capability for @WhatsApp. Now you can use our desktop or web experiences even when your phone isn't active and connected to the internet. All secured with end-to-end encryption. Learn more: https://t.co/AnFu4Qh6Hd — Will Cathcart (@wcathcart) July 14, 2021 అంతేకాదు వాట్సాప్ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ దిగిపోయి డెడ్ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. కాగా భవిష్యత్‌లో ఐపాడ్ కాకుండా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో మల్టీ డివైజ్ ఆప్షన్ ను అందించనుంది. -
సెల్ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతున్నారు.. కారణం ఏంటంటే..
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ భౌతిక శాస్త్రం క్వశ్చన్ పేపర్ కొందరు విద్యార్థుల సెల్‌ఫోన్‌కు రావడంతో బుక్‌లో అందులోని సమాధానాలు వెతుక్కుంటూ పరీక్షా కేంద్రం బాధ్యులకు పట్టుబడ్డారు. కళాశాల కేంద్రం వారు శాతవాహనకు సమాచారం అందించగా 9 మంది సెల్ఫోన్లు సీజ్ చేసి విచారణకు ఆదేశించారు. ప్రశ్నాపత్రం లీక్ చేసింది ఎవరనే విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎస్‌యూ పరీక్షల విభాగం తెలిపింది. ఇలా జరిగింది...? డిగ్రీ 6,4వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 12 నుండి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 6వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఎస్సారార్ కళాశాల కేంద్రం వద్ద ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రం బయటే ఉండడాన్ని పరిశీలించిన ఎస్సారార్ అధ్యాపకులు వారి వద్దకు వెళ్లి చూడగా సెల్ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతుండడం కనిపించింది. వెంటనే సెల్ఫోన్లు తీసుకొని చూడగా ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కయిన ఎస్సారార్ అధ్యాపకులు శాతవాహన యూనివర్సిటీకి సమాచారమందించారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం నుండి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని 9 సెల్ఫోన్లు సీజ్ చేసి యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షల విభాగం అధికారులకు అప్పగించారు. ప్రశ్నాపత్రం లీక్‌పై విచారణ కమిటీ.. ఈ విషయాన్ని ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగప్రసాద్ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ దృష్టికి తీసుకెళ్లగా నలుగురితో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కమిటీ త్వరలోనే నిజానిజాలు తేల్చి సంఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. లీక్ చేసిందెవరు...? ప్రశ్నాపత్రం లీక్ చేసింది ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వ, కళాశాల, ప్రయివేట్ కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపాల్/బాధ్యులకు ఆన్లైన్లో ఏ రోజుకారోజు పరీక్షా సమయానికి అరగంట ముందు మాత్రమే యూనివర్సిటీ నుండి వస్తుంది. దానిని ప్రింట్ తీసి కేంద్రంలో ఉన్న విద్యార్థులకు అందిస్తారు. అరగంట ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఎలా విద్యార్థుల సెల్ఫోన్లకు వెళ్లిందనే విషయాలు తెలియకుండా ఉన్నాయి. దీని వెనక యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారా.. లేదా కళాశాలల వారు ఉన్నారా అనే విషయాలు విచారణ చేపడుతున్నారు. ప్రత్యేక కమిటీ వేశాం.. విద్యార్థుల సెల్‌ఫోన్‌కు ప్రశ్నాపత్రం వచ్చిన విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లాం. ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరుగుతుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బా«ధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ శ్రీరంగప్రసాద్, ఎస్‌యూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
వాట్సాప్ ! ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ లో ఎక్కువగా వినియోగించే యాప్. ఈ యాప్ తో స్నేహితులతో ముచ్చట్లు, కుటుంబ సభ్యులతో సంభాషణలు, నచ్చిన వారితో గిల్లిగజ్జాలు. ఇలా ఒకటేమిటి.‘వాట్సాప్’ గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత హిస్టరీయే ఉంది. అయితే ఇన్ని రోజులు వాట్సాప్ లో చాటింగ్ చేసిన మనం ఇకపై ఆర్ధిక లావాదేవీలను జరుపుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. చదవండి: సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామయ్యంలో వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను మంగళవారం ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.గూగుల్ పే తరహాలో మనీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వాట్సాప్ పేమెంట్ డైరక్టర్ మనేష్ మహాత్మే మాట్లాడుతూ.. వాట్సాప్ నుంచి 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.వాట్సాప్ ద్వారా మనీ సెండ్ చేయడం.. అదే వాట్సాప్ నుంచి మనీ తీసుకోవడం అనేది ట్రాన్సాక్షన్ మాత్రమే. కానీ యూజర్లు వారి భావాల్ని ఒకరికొకరు పంచుకోవడం వెలకట్టలేనిది. అందుకే భవిష్యత్‌లో వాట్సాప్‌కు మరిన్ని ఫీచర్లను అప్డేట్ చేయనున్నట్లు తెలిపారు. వాట్సాప్ నుంచి డబ్బులు పంపడం ఎలా? ♦ ముందుగా వాట్సాప్ డ్యాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి ♦ రైట్ సైడ్ టాప్ లో ఉన్న మూడు డాట్స్ పై ట్యాప్ చేయాలి ♦ ట్యాప్ చేస్తే మీకు న్యూ గ్రూప్, న్యూ బ్రాడ్ కాస్ట్, లింక్డ్ డివైజెస్, స్టార్డ్ మెసేజెస్ తో పాటు చివరిగా పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ♦ ఆ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ♦ అలా పేమెంట్ మెథడ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పేమెంట్స్ ఆప్షన్ తో డ్యాష్ బోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో కంటిన్యూ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ♦ కంటిన్యూ ఆప్షన్ తరువాత మీకు నచ్చిన బ్యాంక్ ను సెలక్ట్ చేసుకోవాలి. ♦ అనంతరం మీ కాంటాక్ట్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలి ♦ వెరిఫై తరువాత.. న్యూ పేమెంట్ ఆప్షన్ లో మీరు ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ నెంబర్ మీద క్లిక్ చేసి..డబ్బులు పంపించుకోవచ్చు. -
మీకు ఈ మెసేజ్ వస్తుందా! మరేం పర్లేదు
వాట్సాప్ యూజర్ల ఆందోళనపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఇటీవల వాట్సాప్ వినియోగదారులకు వింత సమస్య ఎదురైంది. ఆన్‌లో ఉన్న వాట్సాప్ ఒక్కసారిగా లాగ్ అవుట్ అవుతుంది. వెంటనే మీరు ఉపయోగిస్తున్న ఫోన్లో ఈ నెంబర్ వాట్సాప్ లేదు. బహుశా వేరే ఫోన్లో ఈ నెంబర్ వాట్సాప్ ఉంటుందేమో.. ఒక్కసారి చెక్ చేయండి లేదంటే మీ ఫోన్ నెంబర్ ను వెరిఫై చేసుకోండంటూ ఓ మెసేజ్ వచ్చింది. If you have been recently logged out from WhatsApp, on WhatsApp for Android, don't worry: it's a bug. You can log into WhatsApp again. pic.twitter.com/SnhFzUd5jP — WABetaInfo (@WABetaInfo) August 8, 2021 దీంతో ఆ మెసేజ్‌పై వాట్సాప్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.వాట్సాప్ హ్యాక్ అయ్యిందేమో? ఎవరన్నాహ్యాక్ చేశారేమో చెక్ చేయండి అంటూ వాట్సాప్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. దీంతో యూజర్ల రిక్వెస్ట్ వాట్సాప్ రియాక్ట్ అయ్యింది. మీ ఫోన్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు. బ్యాక్ ఎండ్ కోడ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్య గురించి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరిగి వాట్సాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చని డబ్ల్యూఏబీటా ఇన్ఫో ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో యూజర్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. -
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
గుండెబరువు దించుకోవాలి.. పలకరిద్దాం పదండి
కోవిడ్ తుఫాను కొద్దిగా తెరిపి ఇస్తోంది.. అది కురిపించిన శోకవృష్టి అంతా ఇంతా కాదు. ఎవరికీ ఎవరితో మాట్లాడ బుద్ధి కాలేదు.. ఎవరికీ ఎవరూ సాయం చేయ వీలు కూడా లేదు. ప్రతి ఇల్లు తన సొంత బాధల్లో మునిగిపోయింది. భయంతో బెదిరిపోయింది. వాట్సప్ పలకరింపులు తప్ప ఫోన్లు కూడా చేయని నిరాసక్తత ఏర్పడింది.. ఇది కొనసాగకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడదీసుకోవాలి.. ఒకరిని ఒకరు పలకరించుకోవాలి. నేరుగా కాకపోయినా సరే మనసారా మాట్లాడుకుని గుండెబరువు దించుకోవాలి. ‘ఒకరికి ఒకరం ఉన్నాం’ అని ఓదార్చుకోవాలి. పలకరిద్దాం పదండి. సందర్భం–1: రామలక్ష్మి కాలేజీ లెక్చరర్. భర్త బ్యాంక్ ఎంప్లాయీ. ఇద్దరు పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు. కోవిడ్ మహమ్మారి చెలరేగిన ఏప్రిల్–మే నెలల్లో ఆమె కుటుంబంలో ఎవరికీ కోవిడ్ రాలేదు. కాని ఆమె పెదనాన్న కొడుక్కి కోవిడ్ వచ్చింది. 50 ఏళ్లు. చాలా ఖర్చు పెట్టినా మరణించాడు. ‘అక్కా అక్కా’ అని నోరారా పిలిచేవాడు. ఆమె అతన్ని చివరి చూపులు చూడలేకపోయింది. అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడి పిల్లల భవిష్యత్తు తలచుకుంటే ఆమెకు విషాదమే విషాదం. స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఆమే ఆమె కుటుంబం బాగుంది కదా అనుకోవచ్చు. కాని ఇది కుటుంబానికి మాత్రమే సంబంధించిన వేదన కాదు. ఇలా అటాచ్మెంట్ ఉన్నవారు దూరమైనా వేదన ఉంటుంది. అయినా సమస్య ఏమిటంటే ఇది ఎవరి తో చెప్పుకుంటాం అందరూ ఇలాగే ఉన్నప్పుడు అని ఆమె అనుకోవడం. కాని ఆమె మాట్లాడాలి. ఆమెతో మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవాళ్ల మనసు లోపల ఏముందో తెలుసుకోవాలి. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఆమె వంటి ఎందరికో పలకరింపు అవసరం ఉంది. సందర్భం›– 2: మురళీకృష్ణకి 70 ఏళ్లు. భార్య మరణించింది. కుమారుడు, కోడలు విదేశాలలో స్థిరపడ్డారు. తండ్రి ని తన దగ్గరకు రమ్మంటే ఇండియా వదిలి ఏం వస్తానని వెళ్లలేదు. దాంతో కొడుకే అక్కడి నుంచి ఇండియాకు రెండేళ్ల క్రితం షిఫ్ట్ అయ్యి తండ్రితోనే ఉంటున్నాడు. మొన్న మే మొదటివారం ఆ కొడుక్కి కరోనా వచ్చింది. ఎంత డబ్బు ఖర్చు చేసినా బతకలేదు. మరణించాడు. ఆ తండ్రికి అదెంత పెద్ద దెబ్బ. ఎంత భారం. ఎందరో బంధువులు. అయితే ఒక్కరూ వచ్చి ఆయనను గట్టిగా హత్తుకొని మనసారా ఏడ్వలేని స్థితి. ఆయన కూడా ఎవరితోనూ మాట్లాడలేకపోయారు. ఆయన కోలుకోవాలి. కోడలికి స్థయిర్యం ఇవ్వాలి. పిల్లలు ధైర్యం తెచ్చుకోవాలి. ఎంతోమంది కలిసి ఎన్నోసార్లు పలకరిస్తూ, మాట్లాడుతూ, కలుస్తూ గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఈ పని జరగదు. కోవిడ్ చాలా నిర్లిప్తతను ఇస్తోంది. కాని నిర్లిప్తత వల్ల చనిపోయినవారు తిరిగి రారు. బతికి ఉన్నవారు నష్టపోతారు. ఒక్క పలకరింపు దీనికి సరైన వేక్సిన్. సందర్భం – 3: శ్రీలత ఐటి ఎంప్లాయి. భర్త కూడా అదే రంగం. కోవిడ్ వచ్చినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇరువురికీ రాలేదు. కాని రోజూ పేపర్లో వార్తలు శ్రీలత మీద చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన పసిపిల్లలను చూస్తే ఆమె కళ్లు ధారాపాతంగా కారేవి. ఏమిటి ఈ జీవితం అని ఆమెకు అనిపించేది. ఇంతటి విషాదం ఆ పిల్లలకు దేవుడు ఎందుకిచ్చినట్టు అని విరక్తి అనిపించేది. ఆమె చాలా డిప్రెస్ అయిపోయింది. చుట్టూ ఉన్న సమాజం ఇంత కష్టాల్లో ఉంటే నిస్సహాయంగా చూడాల్సి వస్తోందని చాలా ముభావం అయిపోయింది. పైకి ఆమె ఉద్యోగం చేసుకుంటోంది.. కుటుంబం బాగుంది అనుకోవచ్చు. మానసికంగా ఇలా తీవ్రమైన వేదన అనుభవించేవారు ఉంటారు. వారిని కూడా సరిగ్గా పలకరించడం, భవిష్యత్తు మీద ఆశ కల్పించడం అవసరం. ‘ఎలా ఉన్నావు?’ అని అడిగితే ‘బానే ఉన్నాను’ అని చెప్పాక ఫోన్ పెట్టేయడం పలకరింత కాదు. లోలోపలి గడ్డకట్టిన నెగెటివ్ భావనలను బద్దలు కొట్టగలగాలి. ఇందుకు సమయం పెట్టాలి. కన్సర్న్ చూపించాలి. లేకుంటే ఆ నిర్లిప్తత బావి లోపలికి లాగుతూనే ఉంటుంది. ఫోన్లు కలిసి మాట్లాడుకునే సందర్భాలను ఎలా అయితే తగ్గించాయో వాట్సప్ వచ్చి ఫోన్ మాట్లాడుకునే సందర్భాలను తగ్గించాయి. కోవిడ్ సమయంలో సమాజంలో అత్యంతగా మాటల ముభావం నడిచిందని చెప్పాలి. ఏదైనా పలకరింతకు వాట్సప్‌ను ఎక్కువగా ఉపయోగించారు. కోవిడ్ బారిన పడిన వారు ఓపిక లేక ఫోన్లు ఎత్తలేదు. ఆ పేషెంట్స్‌ను అటెండ్ చేస్తున్నవాళ్లు ఆందోళన వల్ల బిజీ వల్ల ఫోన్లు ఎత్తలేదు. మాటకు మాట వినిపిస్తే వచ్చే ధైర్యం వేరు. కోవిడ్ ఉధృతి ఉన్న రోజుల్లో కనీసం ఈ మాట్లాడుకునే ఉత్సాహం కూడా పరస్పరం కరువైందన్నది వాస్తవం. ఎలాగూ కోవిడ్ వల్ల ఒకరి ఇంటికి మరొకరు రావడం లేదు. ఒకరి స్పర్శ మరొకరికి అంటడం లేదు. మనిషి కనిపించినా ముఖం కనిపించక ‘మాస్క్’ అడ్డం కావడం వల్ల ఆ ఆత్మీయత తాలుకు గాఢత సగం తగ్గిపోతోంది. దానికి తోడు ‘మాట’ కూడా తగ్గిపోతే అందరం ప్రమాదంలో పడతాం. బాధ్యతే బంధం కోవిడ్ అనంతరం మనం ఎవరినైనా పలకరిస్తున్నాం అంటే వారి బాధ్యత మనం తీసుకుంటున్నట్టు. లేదా మన బాధ్యత వారికి అప్పజెప్తున్నట్టు. ఆ స్థాయి స్నేహితులుగా, బంధువులుగా, ఆత్మీయులుగా మనం మారకపోతే సమాజం పూర్తిగా కోలుకోవడం కష్టం. పైపై పెదాల మాటలు ఇప్పుడు వృధా. ప్రతి ఒక్కరికి లోతైన కష్టం ఉంది. మానసిక, భౌతిక, ఆరోగ్యపరమైన నష్టాలు ప్రతి కుటుంబం చవిచూసింది. దానికి ఏ విధంగా చేయూతనివ్వొచ్చో పరస్పరం తప్పనిసరిగా ఆలోచించాలి. మనం డబ్బు సహాయం చేయలేకపోతే మాట సహాయం తప్పనిసరిగా చేయగలగాలి. ఇంట్లోకి వెళ్లలేకపోతే గడప దాకా వెళ్లి డజను అరటిపండ్లు ఇవ్వగలగడం కూడా సంజీవిని కంటే తక్కువ కాదు. మనిషికి మనవాళ్లు ఉన్నారు మన కోసం నిలబడతారు అనే భావనే సగం బలం. చాలామందిమి అలా నిలబడలేకపోవచ్చు... కాని అలా నిలబడతామన్న భరోసా అన్నా ఇవ్వాలి. ముఖ్యంగా కరోనా బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన వారిని కచ్చితంగా గమనించుకోవాలి. వారికి అప్పు ఇచ్చినవారు ఎవరు, వారు రేపెప్పుడైనా వొత్తిడి పెడతారా, వీరు దానిని తీర్చడం గురించి ఏం మార్గాలు ఉన్నాయి... చర్చించి వీలైన సలహా సహకారం అందించగలిగే స్థాయిలో మన వారితో మన అనుబంధం ఉండాలి. థర్డ్ వేవ్ రాకూడదనే ఆశిద్దాం. ఇప్పుడు ఒక నెల రెండు నెలల విరామం దొరికేలా ఉంది. కనుక కోవిడ్ తుఫాను తాకిడికి చెల్లాచెదురైన స్నేహితులు, ఆత్మీయులు, బంధువులలో మనకు విలువైనవారిని, మనం విలువైనవారుగా భావించేవారిని ‘పూర్తిగా పలకరించే’ బాధ్యతను మనం తీసుకోవాలి.లేకుంటే కోవిడ్ చేసిన నష్టం కంటే కోవిడ్ అనంతర పరిస్థితులు చేసే నష్టం ఎక్కువగా ఉంటుంది. అది మంచిది కాదు. – సాక్షి ఫ్యామిలీ -
వాట్సాప్ మెసేజ్: సిటీలో హెల్మెట్ అవసరం లేదా?
"నగరవాసులకు శుభవార్త.. నగరపరిధిలో ప్రయాణించే వాహనదారులు ఇక మీదట బైకులపై హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈమేరకు దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీలను కోర్టు వ్యతిరేకించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరేమీ కాదని తేల్చి చెప్పింది." "కనీస రక్షణ అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర, జిల్లాల హైవేలపై మాత్రం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని తీర్పునిచ్చింది. నగర పరిధుల్లో మాత్రం హెల్మెట్ ధరించాలా? వద్దా? అన్నది కేవలం పౌరుల వ్యక్తిగత ఇష్టమని వెల్లడించింది. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీ బండి ఆపి మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని అడిగితే నేను పలానా మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని వారికి చెప్పొచ్చు. దీంతో వారు మీపై ఎలాంటి జరిమానా వేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి" అంటూ ఓ మెసేజ్ వాట్సాప్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇకపై హెల్మెట్ లేకున్నా నో ఫైన్ అంటూ జనాలు దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారు. అయితే మీరు మాత్రం దీన్ని నమ్మి హెల్మెట్ లేకుండా వెళ్లారంటే చలానా బారిన పడటం ఖాయం. ఎందుకంటే ఇది పూర్తిగా ఓ ఫేక్ న్యూస్. ఈ అసత్య ప్రచారానికి తోడు దాని కింద ఫోన్ నెంబర్లు జోడించారు. అందులో ఒక నంబర్ కలవగా అది న్యాయవాది దేవేంద్ర ప్రతాప్ సింగ్‌దే కావడం గమనార్హం. అయితే అతడు దీనిపై స్పందిస్తూ ఈ మెసేజ్‌కు, తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పాడు. ఎవరో కావాలనే తన పేరు మీద ఈ వదంతులు సృష్టించారని, దీన్ని ఎవరూ నమ్మొద్దని సూచించాడు. కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వవని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఫేక్ న్యూస్‌ను ఎవరూ నమ్మవద్దని, దీన్ని అస్సలు ఫార్వర్డ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: వైరల్: ఎప్పుడైనా ఎగిరే వడాపావ్ తిన్నారా?! పోలీస్ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు -
ఈ అమెజాన్ లింకుతో జర జాగ్రత్త!
వాట్సాప్ యూజర్లు జర జాగ్రత్త! అమెజాన్ 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమెజాన్ ఉచితంగా బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఒక నకిలీ వాట్సాప్ సందేశం తెగ వైరల్ అవుతుంది. ఇలాంటివి రాగానే అందులో నిజమెంతో తెలుసుకోకుండా కొందరు ఇతరులకు పంపించేస్తుంటారు. బహుమతి సంగతి ఏమో కానీ అలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల బారిన పడడం మాత్రం ఖాయం. తాజాగా అమెజాన్ పేరిట కూడా ఇలాంటి లింక్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. అందుకని జర జాగ్రత్తగా ఉండండి. అమెజాన్ లోగోతోనే ఈ లింకుతో వస్తుండడం వల్ల ఎక్కువ మంది సులభంగా నమ్మడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ, నిశితంగా పరిశీలిస్తే యూఆర్ఎల్ HTTPతో ప్రారంభమవుతోంది. ఎప్పుడైనా ‘S’ లేదంటే అది సెక్యూర్ కాదని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లింకులు హెచ్‌టీటీపీతోనే ప్రారంభమవుతాయని గమనించాలి. అలాగే యూఆర్ఎల్ xyz అనే దానితో ముగుస్తుంది. ఎక్కువ శాతం వ్యాపార సంస్థలు .comతో ముగుస్తాయని గుర్తుంచుకోవాలి. అసలు అమెజాన్ స్థాపించి 30 ఏళ్లు పూర్తీ కాలేదు. ఇక లింక్ క్లిక్ చేస్తే ఫలానా ఫోన్ గెలుచుకోవాలంటే ఈ సందేశాన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ, వ్యక్తులకు పంపించాలని వస్తుంది. వాస్తవానికి అమెజాన్ ఎలాంటి ఆఫరూ ప్రకటించలేదు. అంతపెద్ద కంపెనీ ఇలాంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు తన వెబ్సైట్లో పొందుపరచకుండా ఉంటుందా? కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజులు నమ్మొద్దు. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు! -
జూన్‌లో నూతన అధ్యక్షుడు
సాక్షి,న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడు నెలల్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేప«థ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికను జూన్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకు మేలో అ«ధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు వాయిదా వేశారు. శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రసంగంతో ప్రారంభమైంది. రైతు ఆందోళ నలపై కేంద్రం అత్యంత దారుణంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. రైతు ప్రతినిధులతో చర్చల్లో ప్రభుత్వ అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెం ట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియా దిశానిర్దేశం చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలబ డాలని, దేశవ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అంతేగాక కోవిడ్–19 విషయంలో టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను అభినందించడంతో పాటు, పంపిణీ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రజలు వాక్సినేషన్‌కు ముందుకు రావాలని తీర్మానం చేసింది. అలాగే, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా పంపిణీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను బహిర్గత పరచాలని కోరింది. దేశ రక్షణకు సంబం ధించిన వ్యాఖ్యలతో బహిర్గతమైన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి వాట్సాప్ చాట్ వ్యవహారంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేసింది. గహ్లోత్ సీరియస్ సీడబ్ల్యూసీ సమావేశంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలపై రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని సమాచారం. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదా అని గహ్లోత్ ప్రశ్నించారు. గతేడాది ఆగస్టు 24న జరిగిన సమావేశంలోనూ ఆజాద్, శర్మ తదితర నాయకులు పార్టీ అధినేత్రిని ఉద్దేశించి రాసిన ఒక లేఖలో లేవనెత్తిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ లేఖ బహిర్గతం అయినప్పటినుంచి పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొనసాగుతున్న విష యం తెలిసిందే.ఆ లేఖపై సంతకం చేసిన నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని గత సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఆజాద్, కపిల్ సిబల్ అభ్యంత రం వ్యక్తం చేసిన తరువాత, కాంగ్రెస్ అధిష్టా నం డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోకి వెళ్లింది. -
టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్ చాట్
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు బయటకు లీకయ్యాయి. దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి తిరుగులేని ఆధారాలు అంటూ పలువురు స్పందిస్తున్నారు. అయితే కొన్ని చాట్లలో టీఆర్పీకి సంబంధించి అవసరమైతే పార్థోదాస్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానంటూ అర్నబ్ గోస్వామి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో చాట్‌లో మంత్రులంతా మనతోనే ఉన్నారు.. అని చెబుతున్నట్లు ఉంది. కండీవలి పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైనట్లు కనిపిస్తున్న ఈపీడీఎఫ్ పేజీల్లో ప్రతి పేజీకి పలువురి సంతకాలు ఉండటం గమనార్హం. (టీఆర్పీ కేసు: అర్నబ్ గోస్వామికి ఊరట) Mumbai Police releases 500 pages WhatsApp chat between Arnab Goswami and Partho Das Gupta ( Ex CEO of BARC) pic.twitter.com/C3wnxjRi0N — Abhijeet Dipke (@abhijeet_dipke) January 15, 2021 -
వాట్సాప్ నోటిఫికేషన్ ట్రిక్స్
వాట్సాప్ తన వినియోగదారుల సంఖ్యను కాలక్రమేణా భారీగా పెంచుకుంది. ఉచితంగా లభించడంతో పాటు సులభంగా వాడుకునే విదంగా ఉండటమే ఈ యాప్ చాలా ప్రజాదరణ పొందటానికి కారణం. గోప్యతా విషయంలో కూడా ఇతర యాప్ ల కంటే ఎక్కువ భద్రతా ఇందులో లభిస్తుంది. ప్రారంభంలో వాట్సాప్ వ్యక్తిగత కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడిన, నేడు ప్రొఫెషనల్ చాట్లు కూడా ఈ యాప్ ద్వారా పంపించ బడుతున్నాయి. ఇలా రోజు వృత్తిపరమైన, వ్యక్తిగత మెసేజ్ లతో మీ ఫోన్ లో ముఖ్యమైన చాట్ల విషయంలో కొంచెం ఇబ్బందికి గురి అవుతున్నాం. కొన్ని సార్లు మనం అవసరమైన వాటి కంటే అనవసరమైన మెసేజ్ వాటితో పదేపదే చూడటం వల్ల ఇబ్బందికి పడాల్సి వస్తుంది. ఇలా కాకుండా సాధారణ, ముఖ్యమైన మెసేజ్ లను వేరు చేయగలిగితే ఎలా ఉంటుంది. మేము చెప్పే ఈ చిన్న ట్రిక్స్ ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్‌ను మిస్ కాకూండా ఉంటారు.(చదవండి: వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఇవే!) మీరు తక్కువ ప్రాముఖ్యత గల చాట్ల నోటిఫికేషన్లను మ్యూట్ చేయడం ద్వారా మీరు ఈ అనవసరమైన మెసేజ్ లతో రోజంతా బాధపడరు. మీరు ఒక వ్యక్తి లేదా గ్రూప్ చాట్ కోసం నోటిఫికేషన్ ట్యూన్ లేదా రింగ్‌టోన్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా సెట్ చేస్తే మీకు ఆ వ్యక్తి లేదా గ్రూప్ నుండి మెసేజ్ వచ్చినప్పుడు ఈ రింగ్‌టోన్ ద్వారా మీరు సులభంగా గుర్తించవచ్చు. దీని కోసం కస్టమ్ నోటిఫికేషన్ సెట్టింగ్ క్రింద ఉన్న ఆప్షన్ ద్వారా టోన్ ని సెట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ సమయం చాట్ నోటిఫికేషన్లను సైలెంట్ మోడ్‌లో ఉంచాలనుకుంటే వైబ్రేషన్ కాలాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు గ్రూప్/పర్సనల్ కాంటాక్ట్ పేరుపై క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ కస్టమ్ నోటోఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. కస్టమ్ నోటోఫికేషన్ లో వైబ్రేషన్ మోడ్ ని ఎంచుకోవచ్చు. మీరు ఎవరి నుండి ఏదైనా సందేశాన్ని కోల్పోకూడదనుకుంటే చాట్ కోసం నోటిఫికేషన్ ప్రత్యేకంగా లైట్ ఆప్షన్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు కస్టమ్ సెట్టింగ్‌లకు వెళ్లి “లైట్” ఆప్షన్ కింద ఉన్న ఎంపికలను ఎంచుకోవచ్చు. మీకు అవసరం లేని చాట్ యొక్క నోటిఫికేషన్లు కనిపించకూడదు అంటే మీకు నోటిఫికేషన్ అవసరం లేని చాట్ ని ఎంచుకొని నోటిఫికేషన్ సెట్టింగ్ బటన్ అఫ్ చేస్తే సరిపోతుంది. -
2019లోనే సుశాంత్ సోదరికి తెలుసా?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తి.. అతడికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చేదని.. డబ్బు తీసుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక సుశాంత్ మెంటల్ హెల్త్ కండిషన్ గురించి రియా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నటుడి కుటుంబ సభ్యులు గతంలో ఆరోపించారు. మీడియాలో కూడా రియాకు సంబంధించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో నటి స్వర భాస్కర్ రియాకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం.. మీడియా, రియాను కసబ్ కన్నా దారుణంగా వేధిస్తుందని విమర్శించారు స్వర. తాజాగా రియాను ఈ కేసులో కావాలనే ఇరికించారంటున్నారు స్వర. అంతేకాక సుశాంత్ మానసిక అనారోగ్యం గురించి అతడి మాజీ మేనేజర్ శ్రుతి మోదీకి, అతడికి సోదరికి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్‌ని ట్వీట్ చేశారు స్వర. (చదవండి: రియాకు న్యాయం జరగాలి: మంచు లక్ష్మి) 2019, నవంబర్ 26న జరిగిన ఈ వాట్సాప్ చాట్‌లో శ్రుతి.. సుశాంత్ సోదరి నీతుకి ఓ ప్రిస్కిప్షన్‌ని మెసేజ్ చేసింది. దాంతో పాటు సుశాంత్‌కు వైద్యం చేస్తోన్న సైక్రియాట్రిస్ట్ సుసాన్ వాకర్ ఫోన్ నంబర్ని కూడా సెండ్ చేసింది. దీనికి బదులుగా నీతు.. ఆ వైద్యుడిని కలవాలని ఉందంటూ రిప్లై కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ చాట్ కాస్త సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి అజయ్ కుమార్ అనే జర్నలిస్ట్ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన స్వర.. ‘హేయ్ మనస్సాక్షి లేని యాంకర్స్.. రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ మానసిక అనారోగ్యం గురించి అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసిందని ఈ వాట్సాప్ చాట్ నిరూపిస్తోంది. గట్టిగా అరుస్తూ.. డిబెట్లు నిర్వహించే యాంకర్లు దీన్ని విస్మరించారు ఎందుకు. చూడబోతే రియాను కావాలనే ఈ కేసులో ఫ్రేమ్ చేసినట్లు అనిపిస్తోంది’ అంటూ స్వర ట్వీట్ చేశారు. సుశాంత్ మానసిక అనారోగ్యం గురించి రియా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ హీరో కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని ఈ చాట్‌తో స్పష్టమవుతోంది. ఇక సుశాంత్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ప్రిస్క్రిప్షన్‌లో ఉంది. Hey Voyeurs & shameless conscience-less anchors! Chat Proves #RheaChakraborty had informed the family about the mental health of SSR way back in 2019. Why did all the high decibel, screaming shouting anchors conveniently ignore this story? Does it seem like Rhea is being framed? https://t.co/qFWDuEw6B2 — Swara Bhasker (@ReallySwara) August 30, 2020 -
రియా, మహేష్ భట్ల వాట్సాప్ చాట్ వైరల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ప్రతి రోజు ఏదో ఒక మలుపు చోటు చేసుకుంటుంది. తాజాగా సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తి, నిర్మాత మహేష్ భట్ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ తెర మీదకు వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న అధికారులు దీనిని మీడియాకు అందించారు. ఈ సంభాషణ జూన్ 8 తర్వాత అంటే రియా, సుశాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయిన తర్వాత జరగడం గమనార్హం. ఈ మెసెజ్‌లలో రియా ‘అయేషా మూవ్స్ ఆన్ సర్.. ఇప్పుడు చాలా ఉపశమనంగా’ ఉంది అంటూ మహేష్ భట్‌కు మెసేజ్ చేసింది. అయేషా అనేది ‘జలేబి’ చిత్రంలో రియా చక్రవర్తి పోషించిన పాత్ర పేరు. దీనికి మహేష్ భట్ నిర్మాత. ఆ తర్వాత ‘మీరు నాకు చేసిన చివరి కాల్ వేక్ అప్ కాల్ లాంటిది. మీరు నా ఏంజెల్.. ఇప్పుడు ఎప్పుడు’ అని రియా మెసేజ్ చేస్తే.. అందుకు మహేష్ భట్.. ‘ఇక వెనక్కి తిరిగి చూడకు.. అనివార్యమైన దాన్ని సాధ్యం చేయండి. మీ తండ్రికి నీ ప్రేమ.. అతను సంతోషంగా ఉంటాడు’ అని రిప్లై ఇచ్చాడు. అందుకు రియా ‘ఆ రోజు మీరు మా నాన్న గురించి ఫోన్లో చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నేను బలంగా ఉండటానికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చాయి’ అంటూ వారి సంభాషణ కొనసాగింది. ఈ సందేశాలు పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు రియా చెప్పిన విషయాల ప్రామాణికత గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పూర్తి సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. (రియా కాల్ రికార్డు: మహేష్ భట్‌కు 16 కాల్స్) రియా మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నలు ఇక విచారణలో రియా పోలీసులకు సుశాంత్‌తో బంధం తన తండ్రికి ఇష్టం లేదని... మహేష్ భట్ కూడా తమ రిలేషన్ గురించి హెచ్చరించారని తెలిపింది. అంతేకాక రియా తన సన్నిహితులకు సుశాంత్ వ్యాధి గురించి చెప్పడమే కాక.. దాని వల్ల తాను ఎంతో ఇబ్బందిపడుతున్నట్లు వారి దగ్గర వాపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ అధికారులు జూన్ 8న రియా చక్రవర్తి, సుశాంత్‌ల మధ్య ఏం జరిగిందనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుశాంత్ ఇంటి నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దాని గురించి ఆమె మాత్రమే సరిగ్గా చెప్పగలదని సీబీఐ భావిస్తోంది. (అలా బయటకు కనిపిస్తారా?) జూన్ 8న ఏం జరిగింది అంటే.. రియా తరఫు న్యాయవాది సతీష్ మనేషిందే విడుదల చేసిన ఓ ప్రకటనలో ‘సుశాంత్ ముంబై నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో తన కుటుంబ సభ్యులను తన దగ్గరకు రావాల్సిందిగా ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. అతడి సోదరి శ్వేత జూన్ 8న సుశాంత్‌ని కలవడానికి అంగీకరించింది. అందువల్ల సుశాంత్ రియాను ఆమె అమ్మనాన్నల దగ్గరకు వెళ్లమని కోరాడు. కానీ సుశాంత్‌తో కలిసి ఉన్నప్పటి నుంచి రియా కుటుంబం ఆమెతో సరిగా మాట్లాడటం లేదు. దాంతో వారి వద్దకు వెళ్లడానికి రియా ఇబ్బంది పడింది. జూన్ 8న రియా సుశాంత్ కోసం సుసాన్ వాకర్‌తో థెరపి సేషన్ని ఏర్పాటు చేసింది. అది పూర్తయ్యాక వెళ్తానని కోరింది. కానీ సుశాంత్ వెంటనే ఆమెని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని అభ్యర్థించాడు. దాంతో రియా అఇష్టంగానే అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఏదైనా అవసరం ఉంటే తనకు లేదా తన సోదరుడికి కాల్ చేయమని సుశాంత్‌కు చెప్పి రియా అతడి ఇంటి నుంచి వెళ్లి పోయింది’ అని ఈ ప్రకటనలో తెలిపారు. -
వాట్సప్ మెసేజ్ కలకలం..ఎస్ఐ క్షేమం
సాక్షి, కర్నూలు : వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టి ఓ ఎస్ఐ కనిపించకుండా పోవటం కలకలం రేపింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా రుద్రారంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. కర్నూలు జిల్లాకు చెందిన విష్ణునారాయణ రుద్రవరం పీఎస్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించాడనే కారణంతో అధికారులు ఆయన్ని హెడ్ క్వార్టర్స్‌కు పిలిపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విష్ణు నారాయణ శనివారం అర్థరాత్రి వాట్సాప్ గ్రూపులో ‘‘ ఈ మెసేజ్ చదివే సమయానికి నేను బతకొచ్చు లేదా చనిపోవచ్చు. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు’’ అని మెసేజ్ పెట్టాడు. అయితే ఈ మెసేజ్ చదివిన డీఎస్పీ.. విష్ణునారాయణ ఇంటికి చేరుకుని నచ్చజెప్పారు. అయినప్పటికి ఎస్ఐ ఈ తెల్లవారుజామున కారులో ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపటఆరు. కాగా ఎస్ఐ విష్ణునారాయణ ఆదివారం మధ్యాహ్నం ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజుకు ఫోన్ చేసి, తాను మైదుకూరు మండలం బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్లు సమాచారం అందించాడు. దీంతో అధికారులతో పాటు కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్ పెట్టి..
పంజగుట్ట: వివాహేతర సంబంధంపై భార్య నిలదీసినందుకు ఓ వ్యక్తి ‘తాను ఆత్మహత్య చేసుకుంటానని’ భార్యకు మెసేజ్ పంపి అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి, వినోద్కాంబ్లి దంపతులు గత కొంత కాలం క్రితం నగరానికి వలస వచ్చి చింతల్‌బస్తీ, వీర్‌నగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వినోద్‌కాంబ్లీ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆదిలక్ష్మి అతడిని మందలించింది. దీంతో ఈ నెల 22న డ్యూటీకి వెళ్లిన వినోద్ ‘తాను చనిపోతానని’ ఆదిలక్ష్మికి మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె అతడి కోసం ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో గురువారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముందే చెప్పాం.. పట్టించుకోలేదు
న్యూఢిల్లీ: యూనివర్సిటీలో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మూక గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయినా వారు చర్యలు తీసుకోలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించింది. ఈ నెల 5న మధ్యాహ్నం 3:00 గంటలకు వాట్సాప్‌లో పోలీసులకు మెసేజ్ పెట్టామని, ఆ మెసేజ్‌ను పోలీసులు 3:07 గంటలకు చూసి కూడా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం తెలిపింది. ఈ దాడికి పాల్పడింది ఆరెస్సెస్‌కు చెందిన ఏబీవీపీ వర్గం వారేనని ఆరోపించింది. గత వారంలోకూడా తమ సంఘానికి చెందిన నాయకుల మీద వారు దాడిచేసినట్లు తెలిపింది. దాడికి ముందురోజు సాయంత్రం కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్‌పై దాడిచేశారని చెప్పింది. -
ఐయామ్ వెరీ సారీ!.. నేను చనిపోతున్నా
సాక్షి, విజయవాడ : నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఇన్నర్ రోడ్డు... ఖాళీ స్థలాల్లో సగం కాలిన వ్యక్తి మృతదేహం.... ఎవరైనా హత్య చేసి శవాన్ని మాయం చేసేందుకు కాల్చేందుకు ప్రయత్నించారా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే అనుమానాలు.. మృతదేహం చుట్టూ జనం గుమిగూడి... సదరు వ్యక్తిని గుర్తు పట్టేందుకు ప్రయత్నించారు.. మృతదేహానికి దూరంగా రోడ్డుపై ఉన్న బైక్‌లో సెల్‌ఫోన్.. ఇంతలో మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం విద్యాధరపురం వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతానికి చెందిన కూరాకుల రమేష్ (40) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. రమేష్‌కు ఇంకా వివాహం కాకపోవడంతో తల్లి అప్పలనర్సమ్మతో కలిసి ఉంటున్నాడు. తల్లితో పాటు అన్నయ్య లీలాప్రసాద్ తరచూ తమ్ముడిని పెళ్లి చేసుకోవాలని అడుగుతూ ఉండేవారు. అయినా సరే పెళ్లికి అంగీకరించేవాడు కాదు. ఈ క్రమంలో గత 12వ తేదీ రమేష్ తన అన్నకి ఫోన్ చేసి తల్లిని నీ దగ్గర పెట్టుకోవాలని అడిగాడు. ఎందుకని ప్రశ్నించగా నేను ఎవరికి భారం కాకూడదని సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో రమేష్ ఫోన్ నుంచి అన్నయ్య ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తన బైక్‌ను ఇన్నర్ రోడ్డులో రైట్ సైడ్ ఉంచానని, వచ్చి తీసుకువెళ్లాలని.... ఐయామ్ వెరీ సారీ... అమ్మ.. విజయ అక్క జాగ్రత్త.. అని ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో అనుమానం వచ్చి ఇన్నర్ రోడ్డులోకి వచ్చి చూసేసరికి రోడ్డుపై బైక్ ఉంది. బైక్ కవర్లో ఫోన్ కూడా కనిపించింది. కొద్ది దూరం వెళ్లి చూడగా ఖాళీ స్థలంలో సగం కాలిపోయిన మృతదేహం కనిపించింది. పక్కనే చెప్పులు, పెట్రోల్ తెచ్చుకున్న బాటిల్, అగ్గిపెట్టె కనిపించాయి. అయితే, మానసిక పరిస్థితి సరిగా లేక రమేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తెల్లవారుజాము నుంచి జన సంచారంతో ఉండే ఇన్నర్ రోడ్డులో ఓ వ్యక్తి వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడితే అటుగా వెళ్లే వారు గుర్తించలేకపోయారా.. అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ ఘటన వెనుక ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా... లేక ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధం ఉందా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
ఎక్కువ ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్ చెప్పేస్తుంది!
వాట్సప్‌లో ఒక మెసేజ్ ఎక్కువసార్లు ఫార్వార్డ్ చేయబడితే అది యూజర్‌కు తెలిసే విధంగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘ఫ్రీక్వెట్లీ ఫార్వాడెడ్’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్‌తో చాలాసార్లు ఫార్వాడ్ చేసిన మెసేజ్‌ను సులభంగా గుర్తించొచ్చు. ఎక్కువసార్లు ఫార్వాడ్ చేయబడిన మెసెజ్‌లు ‘రెండు బాణాలతో కూడిన ప్రత్యేక చిహ్నం’తో కనిపిస్తాయి. తమ మెసేజ్‌ను ఇతరులకు తరచుగా ఫార్వాడ్ చేస్తే యూజర్‌కు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఐదు కంటే ఎక్కువసార్లు ఫార్వాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ లేబుల్ కనబడుతుంది. వాట్సాప్ ‘ఫార్వార్డ్’ లేబుల్‌కు అదనంగా 'ట్యాప్'ను అందుబాటులోకి తెచ్చింది. మెసేజ్‌లు సుదీర్ఘంగా ఉంటే యూజర్ దానిని చదివేందుకు వీలుగా 'ట్యాప్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో యూజర్ అనుభూతిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్టు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లతో నకిలీ వార్తలను గుర్తించడం, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయకుండా ఆపడం తేలిక అవుతుంది. వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి తన చెల్లింపు సేవ అయిన ‘వాట్సాప్ పే’ను భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కాగా, వాట్సాప్ భారతదేశంలో 400 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. -
అమ్మా, నాన్నా.. అక్కడకొచ్చి నా శవం తీసుకెళ్లండి..!!
న్యూఢిల్లీ : స్నేహితులతో కలిసి బర్త్‌డే పార్టీకి వెళ్లిన కొడుకు అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. మరికాపట్లో ఇళ్లు చేరుతానని చెప్పిన తమ కుమారుడు హర్ష్ కందేల్వాల్ (26) నుంచి ఊహించని మెసేజ్ రావడంతో ఆ తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి. నా స్కూటర్, మనీ పర్స్, ఇతర వస్తువులు ఐటీవో బ్రిడ్జి దగ్గర ఉంటాయి తీసుకోండి. నా శవం బ్రిడ్జి కింద ఉంటుంది స్వాధీనం చేసుకోండి’అని వాట్సాప్‌లో సందేశమిచ్చాడు. ఊహించని షాక్‌తో తల్లిదండ్రులు హుటాహుటిన ఐటీవో బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. అతను చెప్పినట్టే అక్కడ స్కూటర్, పర్స్ ఉన్నాయి. కానీ, హర్ష్ కనబడలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు పెట్టారు. వాట్సాప్ మెసేజ్ గురించి తెలుసుకున్న పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. వట్టి బెదిరింపులే కావచ్చునని అనుకున్నారు. అయితే, జూన్ 30న నుంచి కనిపించకుండా పోయిన హర్ష్ యమునా నది తీరంలో జూలై 3న శవమై తేలాడు. ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించేవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ శవం నాలుగు రోజుల క్రితం కనిపించకుండాపోయన హర్ష్దే అని గుర్తించారు. నలుగురు స్నేహితులతో కలిసి ఫ్రెండ్ భార్య పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన తమ కొడుకు హత్యకు గురయ్యాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి చాందినీచౌక్‌లో నివాసముండే హర్ష్ ఓ ఆన్లైన్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. హత్యేకేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. -
ఆ ఫొటోలను యువతి భర్తకు వాట్సాప్‌లో..
తిరువణ్ణామలై: ప్రేమించిన సమయంలో తీసుకున్న అసభ్య ఫొటోలను యువతి భర్తకు సెల్ఫోన్లో పంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాతూర్ గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువతి అదే గ్రామంలో పాత్రలు విక్రయించే దుకాణానికి పనికి వెళ్లింది. ఆ సమయంలో దుకాణం యజమాని కుమారుడు వీరమణికి యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరమణి ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ సమయంలో యువతికి తెలియకుండా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను చూపించి యువతిని బెదిరించి పలు మార్లు లైంగికవాంచ తీర్చుకున్నాడు. ఆనంతరం ఆ యువతిని వివాహం చేసుకునేందుకు వీరమణి నిరాకరించాడు. సెల్ఫోన్లో ఉన్న అసభ్య ఫొటోలు పూర్తిగా తొలగిస్తానని చెప్పాడు. ఈ విషయం తెలియని యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మరో యువకుడితో ఈనెల 6వ తేదీన వివాహం జరిపించారు. వివాహం అనంతరం యువతి తనను దూరం పెట్టడంతో జీర్ణించుకోలేని వీరమణి ఆమె భర్త సెల్‌ఫోన్ నెంబరును తెలుసుకొని ఆమె అసభ్య ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపాడు. దీన్ని ఆమె భర్త ఇంట్లోని కుటుంబ సభ్యులకు చూపించి ఇకపై ఆ యువతితో కాపురం చేయలేనని పుట్టింటిలో వదిలిపెట్టాడు. దీనిపై బాధిత యువతి తల్లిదండ్రులు తిరువణ్ణామలై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
చనిపోతున్నానని వాట్సాప్ మెసేజ్.. అదృశ్యం
గోల్కొండ: చనిపోతున్నానని వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి ఓ యువతి అదృశ్యమైన సంఘటన శుక్రవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఘాన్సీబజార్‌కు చెందిన అమీనా సుల్తానా ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన కుమార్తె అలినా హమీద్(19)కు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తోంది. ఈ విషయం కుమార్తెకు చెప్పడంతో తాను నవాజ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతనిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. దీంతో అమీనా సుల్తానా నవాజ్‌కు ఫోన్ చేసి పెళ్లి విషయం ప్రస్తావించగా అలినాను పెళ్లి చేసుకునేందుకు అతను నిరాకరించాడు. కొన్ని రోజుల క్రితం అలినా రిసాలాబజార్‌లో ఉంటున్న పిన్ని ఇంటికి వెళ్లింది. గురువారం సాయంత్రం తాను చనిపోతున్నట్లు తల్లిదండ్రులకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి బయటికి వెళ్లింది. అలినా ఆచూకి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె తల్లి అమినా సుల్తానా శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కలకలం రేపుతున్న సీఐ వాట్సాప్ మెసేజ్
సాక్షి, నిజామాబాద్ : ఉన్నతాధికారుల టార్చర్ తట్టుకోలేని విధంగా ఉందని, తన సమస్యకు ఆత్మహత్యే మార్గమని నిజామాబాద్ జిల్లా రూద్రుర్ సీఐ దామోదర్ రెడ్డి పెట్టిన వాట్సాప్ మెసేజ్ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారుల టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని దామోదర్ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 30 ఏళ్లుగా పనిచేసినా బలిదానం తప్పదేమోనని బలహీన క్షణాలు భయం కలిగిస్తున్నాయంటూ మెసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలిసింగ్ అని చెప్పినా పోలీసు ఉన్నతాధికారులు వ్యవస్థలోని లోపాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి పెట్టిన మెజేస్‌తో జిల్లా పోలీస్ వర్గాల్లో కలవరం మొదలైంది. అతన్ని అంతగా ఇబ్బందికి గురి చేసిన అధికారులు ఎవరై ఉంటారని చర్చించుకుంటున్నారు. అయితే, దామోదర్‌రెడ్డికి ఐసీ ఆఫీస్ నుంచి ఛార్జ్‌మెమో జారీ కావడమే ఈ మెసేజ్‌కు కారణమని పోలీసులు వర్గాలు అంటున్నాయి. -
‘పచ్చ’ నేత అండతో మహిళలతో అసభ్యకర చాటింగులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓ మహిళపై విశ్రాంత ఉద్యోగి వేధింపులకు పాల్పడుతుండగా ... ఈయనకు ‘పచ్చ’ రాజకీయం అండదండలిస్తోంది. అధికారులను ఆటబొమ్మలుగా మార్చేసి అంతా తానై చక్రం తిప్పుతున్న ఆయన మహిళలను మానసిక వ్యథకు గురిచేసే వ్యక్తిని వెనుకేసుకురావడాన్ని నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈ షాడో నేతకు ఒక సలహాదారుడిగా ఈ రిటైర్డ్ అధికారి వ్యవహరిస్తుంటాడు. అవినీతి ఎలా చేయాలన్న దర్గరనుంచి ఎక్కడ భూములు కబ్జాలు చేయాలో గుర్తించి మరీ చెబుతాడు. నియోజకవర్గ కీలక నేత తన కనుసన్నల్లో ఉన్నాడనో...ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో తెలియదు గానీ ఆడపిల్లలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. ఆ మహిళల ప్రమేయం లేకుండా వారి నెంబర్ల వాట్సాప్‌ల ద్వారా అసభ్యకరంగా చాటింగ్ చేస్తున్నాడు. ఆ మధ్య ఒక యానిమేటర్‌తో చేసిన చాటింగ్ వ్యవహారం బయటపడి రచ్చరచ్చ అవుతోంది. ఆయనొక రిటైర్డ్ అధికారి. రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో పనిచేశాడు. ఉద్యోగంలో ఉండగానే నియోజకవర్గ షాడో నేతకు అండగా నిలిచాడు. షాడో నేత ఏది చెబితే అదే చేసేవాడు. ఇద్దరూ కలిపి పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఆ నేతకొక కార్యకర్తలా పనిచేశాడు. ఎవరికే పథకం ఇవ్వాలి? ఎవరికి ఏ లబ్ధి చేకూర్చాలనే సలహాల నుంచి ఎక్కడేవిధంగా దోపిడీ చేయాలో కూడా సదరు నేతకు ఈ అధికారి సూచించేవాడు. ఆ విధంగా కార్యాచరణ అమలు చేసేవారు. ఇక, రిటైరయ్యాక ముసుగు తొలగించి ఏకంగా ఆ షాడో నేతకు సలహాదారునిగా, సన్నిహితుడిగా ఉండిపోయాడు. ఇదంతా నాణెంకు ఒకవైపు అన్నట్టుగా ఈయనకు మరో కోణం కూడా ఉంది. ఆయన వయస్సుకు, చేష్టలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నాడు. అవసరాల నిమిత్తం వచ్చే మహిళలను ట్రాప్ చేసే దుర్బుద్ధి ఉండడంతో వారి వద్దనుంచి ఫోన్ నెంబర్లు తీసుకుని సాయంత్రమయ్యాక చాటింగులు చేయడం ప్రారంభించాడు. అసభ్యకర సందేశాలతో...వీడియోలు, ఫొటోలతో ఓ యానిమేటర్ వాట్సాప్‌కు పంపించి నరకం చూపించాడు. ఎవరికి చెప్పుకోలేక...అలా అని మౌనం దాల్చలేక మానసిక వేదనకు ఆమె గురయ్యింది. ఎవరికైనా చెబుతామంటే పరువు పోతుందని... దానికితోడు నియోజకవర్గంలో కీలక నేతకు సన్నిహితుడిగా ఉండటంతో ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని తనలోనే కుమిలిపోయిందామె. ఈ చాటింగ్ క్లిప్పింగులు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈయనతోపాటు ఈయన్ని సమర్ధించే ఆ షాడో నేతను నియోజకవర్గ ప్రజలు ఈసడించుకుంటున్నారు. -
‘ఫ్రెండ్స్ ఐయామ్ లివింగ్ మై లైఫ్’
చాంద్రాయణగుట్ట: ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శివతేజ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఇంద్రానగర్‌కు చెందిన శివరాజ్ కుమారుడు వంశీ (18) బ్యాండ్ కార్మికుడిగా పని చేసేవాడు. బుధవారం ఉదయం తన తల్లిని బైక్‌పై తీసుకెళ్లి ఫలక్‌నుమా వట్టెపల్లిలో వదిలేసిన వంశీ 11.30 గంటలకు తిరిగి వస్తానని చెప్పాడు. మధ్యాహ్నం అతను రాకపోవడంతో ఆమె ఫోన్ చేయగా స్పందించలేదు. దీనికితోడు తన వాట్సాప్ స్టేటస్‌లో ‘ఫ్రెండ్స్ ఐయామ్ లివింగ్ మై లైఫ్’ అంటూ మెసేజ్ పెట్టడాన్ని గుర్తించిన అతని స్నేహితులు హుటాహుటిని ఇంటికి వచ్చారు. అప్పుడే అతని తల్లి అక్కడికి రావడంతో అందరూ తలుపులు బద్దలుకొట్టి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని కనిపించాడు. అతడిని కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రేమ విఫలమైనందునే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
వైఎస్ఆర్ జిల్లా , రైల్వేకోడూరు రూరల్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణతో వారి భవిషత్‌కు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి సభ్యసమాజం, ఉపాధ్యాయులును తలదించుకునేలా చేసిన సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీపీఆర్ కండ్రికలో చోటు చేసుకుంది. తన కూతురు కంటే తక్కువ వయస్సు కలిగిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హీనంగా ప్రవర్తించడంతో మంగళవారం దేహశుద్ధి చేశారు. వివరాలిలా.. మండలంలోని వీపీఆర్ కండ్రిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై కన్ను పడింది. ఆధార్‌కార్డుతో పాటు ఇచ్చిన ఫోన్ నెంబరును తీసుకుని మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టారు. అశ్లీల వీడియోలు పెట్టే స్థాయికి చేరుకోవడంతో చేసేదేమీ లేక ఆ విద్యార్థిని తోటి విద్యార్థులకు ఆ మెసేజ్‌లను చూపింది. దీంతో సమాచారం బయటికి వ్యాపించి విద్యార్థిని బంధువులకు చేరింది. దీంతో బాధిత విద్యార్థిని బంధువులు మంగళవారం హైస్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయుడిని విచారించగా తాను ఏ తప్పు చేయలేదని వాగ్వాదం చేయడంతో చితకబాదారు. ఈ విషయమై హెచ్ఎం మార్కెండేయ నాయుడును వారు ప్రశ్నించగా జరిగిందేదో జరిగింది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, పాఠశాలకు చెడ్డ పేరు వస్తుందన్నారు. దీంతో వారు సూరపురాజుపల్లె గ్రామ సభలో ఎంఈఓ రామయ్య ఉన్నట్లు తెలుసుకుని ఆయనకు సెల్ఫోన్లో పంపిన మెసేజ్‌లను చూపారు. దీనిపై స్పందించిన ఆయన ఆ ఉపాధ్యాయుడుపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులపై ఆ విధంగా ప్రవర్తించిన ఆయనపై నిర్భయ కేసు నమోదు చేసి, విధుల నుంచి శాశ్వితంగా తొలగించాలని డిమాండ్ చేశారు. -
వాట్సాప్‌లో తలాక్..అమెరికాకు పరార్
యశవంతపుర (బెంగళూరు): విభేదాలు పరిష్కరించుకుందామంటూ అమెరికా నుంచి భార్యను తీసుకువ్చన ఓ భర్త.. ఆమెకు తెలియకుండా తిరిగి అమెరికా చెక్కేశాడు. ఆ తర్వాత వాట్సాప్‌లో ఆమెకు తలాక్ చెప్పాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ జావేద్ ఖాన్, రేష్మా అజీజ్‌లకు 2003లో పెళ్లయింది. అమెరికాలోని ఇల్లినాయిస్లోఉంటున్న వీరికి 13 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు. కాగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని నవంబర్ 30వ తేదీన వారు బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇప్పుడే వస్తానంటూ చెప్పి భార్యను ఇంటికి పంపించి వేశాడు. తాను మాత్రం విమానంలో మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. తర్వాత తలాక్ అంటూ మూడుసార్లు వాట్సాప్‌లో పోస్టులు, వాయిస్ మెసేజ్‌లు పంపించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
వాట్సాప్ ఫొటోలతో నిలిచిన పెళ్లి !
సాక్షి బెంగళూరు: ఒక వాట్సాప్ మెసేజ్, అందులో పంపిన ఫొటోలు ఒక పెళ్లినే నిలిపేశాయి. ప్రియుడు, ప్రియురాలిని కలిపి దాంపత్య జీవితానికి బాటలు వేశాయి. ఈ ఘటన హాసన్ జిల్లా సకలేశపుర పట్టణంలో జరిగింది. సకలేశపురకు చెందిన శృతి, తారేశ్‌లకు ఇరు కుటంబాల పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. బుధవారం సాయంత్రం సంప్రదాయం ప్రకారం చేయాల్సిన పెళ్లి తంతు, ముందస్తు ఏర్పాట్లు అన్ని చేశారు. గురువారం ఉదయం పెళ్లి ముహూర్తం ఉందనగా తెల్లవారుజామున తారేశ్ మొబైల్‌కు మూడు ఫోటోలు వాట్సాప్ ద్వారా వచ్చాయి. ఆ ఫోటోల్లో శ్రుతి వేరే వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో వరుడి కుటుంబం పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పెళ్లి మండపంలో గందరగోళం నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట నడిచింది. ఇదే సమయంలో ఫొటోలు పంపించిన, ఆ ఫొటోల్లోని వ్యక్తి అభిలాష్ పెళ్లి మంటపానికి వచ్చాడు. తాను, శ్రుతి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నామని, పెళ్లి ఎలా ఆపాలో తెలియక ఫొటోలు పంపించానని చెప్పుకొచ్చాడు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న సకలేశపురా పోలీసులు మంటపానికి వచ్చి యువతి శ్రుతిని పిలిచి వివరాలు అడగగా తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. దీంతో ఆమె అంగీకారం మేరకు అభిలాష్‌తో పెళ్లి చేశారు. -
భార్య అశ్లీల ఫొటోలు వాట్సాప్‌లో..
సాక్షి, సిటీబ్యూరో: భార్యను అప్రతిష్టపాలు చేయడంతో పాటు ఆమె నుంచి విడాకులు తీసుకోవాలన్న ఆలోచనతో ఆశ్లీల చిత్రాలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడంతో పాటు అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన ప్రియుడు, ప్రియురాలిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం...ఆస్ట్రేలియాలో బీబీఏ చదివిన వనస్థలిపురానికి చెందిన ఆలపాటి తులసీదాస్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన మోనిక హైటెక్ సిటీలో మేనేజర్‌గా పనిచేస్తోంది. మనస్పర్థల వల్ల భర్త ఈశ్వర్‌కు దూరంగా ఉంటున్న ఆమెకు ఈ ఏడాదిలో మేలో విడాకులు మంజూరయ్యాయి. అయితే 2017లో బంజారాహిల్స్‌లో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్ మీటింగ్‌లో మోనికకు తులసీదాస్‌తో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్తా ప్రేమ వరకు వెళ్లి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన తులసీదాస్ భార్య వనస్థలిపురం పోలీసు స్టేషన్లో మేలో ఫిర్యాదు చేసింది. దీంతో తులసీదాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతె తులసీదాస్, మోనిక ఆమెపై కక్ష పెంచుకున్నారు. ఆమె ప్రతిష్టను దిగజార్చి, తొందరాగా విడాకులు ఇచ్చేలా ప్రణాళిక రచించి గతంలో భార్యతో తులసీదాస్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి మోనికాకు పంపాడు. మోనికి ఆ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో ‘డబ్బు కోసం ఏమైనా చేస్తుంది...భర్తను జైలుకు కూడా పంపించింద’ంటూ పెట్టింది. అంతటితో ఆగకుండా అభ్యంతరక వ్యాఖ్యలను మెసేజ్ చేశారు. ఈ విషయమై బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో మాదాపూర్‌లో నిందితులను అరెస్టు చశారు. -
వాట్సాప్‌లో కామెంట్లు.. అంతలోనే..
ఔరంగాబాద్ : ఓవైపు వాట్సాప్‌లో నకిలీ వార్తలతో అమాయకులపై దాడులు జరుగుతోంటే.. మరోవైపు నువ్వెంత అంటే నువ్వెంత అని కయ్యానికి కాలు దువ్విన ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసే మోయిన్ మెహమూద్ పఠాన్ (35)పై దాదాపు 20 మంది వ్యక్తులు కత్తులు, తల్వార్లతో మూక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హర్సూల్ ప్రాంతంలోని ఫాతిమానగర్‌లో జరిగింది. తీవ్ర గాయాలపాలైన పఠాన్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్టు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం సాంయత్రం వాట్సాప్‌లో పఠాన్ చేసిన కామెంట్లు ప్రత్యర్థి వర్గాన్ని ఈ దాడికి ఉసిగొల్పాయని అంటున్నారు. దమ్ముంటే తనతో తేల్చుకోవాలని పఠాన్ చాలెంజ్ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే.. వాట్సాప్‌లో రెచ్చగొట్టే కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 20 మంది సమూహం పఠాన్‌పై దాడి చేసిందని ఆయన మేనల్లుడు ఇర్ఫాన్ షైక్ తెలిపాడు. తన మామపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయినందుకు ఇర్ఫాన్‌ను కూడా తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఇర్ఫాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనతో ప్రమేయమున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేశామని వెల్లడించారు. -
బ్యాంకు మెసేజ్‌లు ఇక వాట్సాప్‌లో..
న్యూఢిల్లీ : వాట్సాప్‌లో బ్యాంకు మెసేజ్‌లు రావడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! కానీ ఇక నుంచి చూడబోతారు. భారత్‌లో టాప్ బ్యాంకులన్నీ ఇక నుంచి వాట్సాప్ ద్వారానే తన కస్టమర్లతో సంభాషించాలని చూస్తున్నాయి. అలర్ట్‌లను, ఏదైనా బ్యాంకు సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపాలని యోచిస్తున్నాయని తెలిసింది. ఇప్పటికే ఐదు టాప్ బ్యాంకులు దీనిపై టెస్టింగ్ ప్రారంభించాయని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. టెస్టింగ్ ప్రారంభించిన బ్యాంకుల్లో కొటక్ మహింద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు ఉన్నట్టు తెలిసింది. తొలుత వాట్సాప్ ఆధారిత కమ్యూనికేషన్ కలిగి ఉన్న కస్టమర్లకు ఈ సేవలను లాంచ్ చేయనున్నట్టు రిపోర్టులు తెలిపాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తప్పనిసరి చేసిన పాయింట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం విత్‌డ్రా అలర్ట్‌లను పంపడానికి బ్యాంకులు ఇక నుంచి వాట్సాప్‌ను వాడనున్నాయి. దీని కోసం కస్టమర్లు తమ వాట్సాప్ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌ను అందించాల్సి ఉంటుంది. ఆ అనంతరం ప్లాట్‌ఫామ్‌పై బిజినెస్, రిసీవ్ కమ్యూనికేషన్‌తో అకౌంట్లను లింక్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం బ్యాంకులు తమ అలర్ట్‌లను ఎస్ఎంఎస్ల ద్వారా అందిస్తున్నాయి. ఎస్ఎంఎస్తో పాటు అదనంగా వాట్సాప్ మెసేజ్‌లను బ్యాంకులు పంపించాలనుకుంటున్నాయి. కేవలం అలర్ట్‌లకే కాకుండా.. బ్యాంకులతో కమ్యూనికేషన్ కోసం కూడా వాట్సాప్‌ను వాడుకోవచ్చు. కస్టమర్ సర్వీసు విషయాలకు, క్వరీస్ నిర్వహించడానికి బ్యాంకులు దీన్ని ఉపయోగించనున్నాయి. -
నేను చచ్చిపోతున్నా...
సారంగాపూర్(జగిత్యాల): ‘అమ్మ కు డబ్బులు పంపలేకపోతున్నాను. మా అమ్మను, నాన్నను, తమ్ముణ్ణి బాగా చూసుకోండ్రి’ అం టూ మిత్రులకు వాట్సాప్ మేసేజ్ పంపి గల్ఫ్‌లోని దోహా ఖతార్‌లో జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సారంగాపూర్ మం డలం పెంబట్లకు చెందిన తోట నాగరాజు (24) స్వగ్రామం మంచిర్యాల జిల్లా బాదంపల్లి. నాగరాజు దోహ ఖతార్‌కు ఐదేళ్లుగా వెళ్లి వస్తున్నాడు. నాగరాజుకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు శంకర్, కళావతి సంబంధం కూడా చూసి పెట్టారు. అక్కడ వాహనాల క్లీనిం గ్ పనులు చేసే నాగరాజుకు కం పెనీ నెలకు 500 దిర్హమ్స్ (రూ.8779) చెల్లించాలి. కానీ, మిషన్లు చెడిపోయాయంటూ నెల కు 100 దిర్హమ్స్(రూ.1756) ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం రాత్రి తాను పనిచేసే చోటే ఉరేసుకొని ఆత్మ హత్య చేసు కున్నాడు. అంతకు ముందు మిత్రులకు వాట్సాప్ వాయిస్ ద్వారా తన ఆత్మహత్యకు గల కారణాలను పంపాడు. -
మరో మాల్వేర్ : వాట్సాప్ మెసేజ్‌లను దొంగిలిస్తోంది
సెక్యురిటీ రీసెర్చర్లు మరో మాల్వేర్ భూతాన్ని కనుగొన్నారు. ఈ మాల్వేర్ యూజర్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై పూర్తి ఆధిపత్యం సంపాదించి, సమాచారాన్ని దొంగలిస్తుందని రష్యాకు చెందిన కాస్పెర్‌స్కై ల్యాబ్ రీసెర్చర్లు వెల్లడించారు. దీంతో ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ మెసేజ్‌లు కూడా ఈ మాల్వేర్ చోరి చేస్తుందని కాస్పెర్‌స్కై ల్యాబ్ హెచ్చరించింది. ఈ మాల్వేర్ను స్కైగోఫ్రీగా రీసెర్చర్లు పేర్కొన్నారు. 2014లో తొలుత దీన్ని రూపొందించారని, అప్పటి నుంచి ఇది అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిసింది. అంతకముందు ఎన్నడూ మనం చూడని విధంగా ఓ ప్రత్యేక ప్రాంతంలోకి టార్గెట్ ఫోన్ ప్రవేశించగానే, వ్యక్తుల సంభాషణను, చుట్టుపక్కల ఆడియోలను ఆటోమేటిక్ రికార్డు చేస్తుందని రీసెర్చర్లు తెలిపారు. పిక్చర్లను, వీడియోలను తీసే సామర్థ్యాన్ని కూడా ఈ స్కైగోఫ్రీ కలిగి ఉందని, డివైజ్ మెమరీలో స్టోర్ అయి ఉన్న కాల్ రికార్డులను సీజ్ చేయడం, ఎస్ఎంఎస్లు, జియోలొకేషన్, కాలెండర్ ఈవెంట్లు, బిజినెస్‌లకు సంబంధించిన సమాచారం తన ఆధీనంలోకి తీసుకెళ్లడం వంటి చేస్తుందని పేర్కొన్నారు. ఈ మాల్వేర్ బారిన పడిన బాధితులు ఎక్కువగా ఇటలీలో ఉన్నారు. అదేవిధంగా ఈ మాల్వేర్ టూల్‌ను సృష్టించిన వారు కూడా ఇటాలియన్లే అని తెలిసింది. అటాకర్ల ఆధీనంలో ఉన్న వై-ఫై నెట్‌వర్క్‌లకు కూడా ఈ ప్రభావిత డివైజ్‌లు కనెక్ట్ అవుతుంటాయని రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడైంది. -
మమత హత్యకు సహకరిస్తే ..
సాక్షి,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని హత్య చేస్తే రూ 65 లక్షలిస్తామని ముర్షిదాబాద్ జిల్లా బెహ్రంపోర్లో 19 ఏళ్ల విద్యార్థికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న పాలిటెక్నిక్ విద్యార్థితో సంభాషించేందుకు ఉపయోగించే ఈ నెంబర్‌కు మెసేజ్ వచ్చింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి తనకు లాటిన్ అనే వ్యక్తి నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని ఈ మెసేజ్‌లతో షాక్‌కు గురైన విద్యార్థి చెప్పారు. మెసేజ్‌లు పంపిన వ్యక్తి తనకు తాను ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడినని, భారత్‌లో భాగస్వామి కోసం చూస్తున్నామని చెప్పినట్టు విద్యార్థి తెలిపారు. వాట్సాప్ మెసేజ్లిలా... తాము చెప్పినట్టు చేస్తే లక్ష డాలర్లు ( రూ 65 లక్షలు) ఇస్తామని, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదని గుర్తుతెలియని వ్యక్తి సదరు విద్యార్థికి పంపిన మెసేజ్‌ల్లో సంభాషించాడు.అయితే తనకు కొంత సమయం కావాలని విద్యార్థి కోరడంతో తొందరగా తమతో చేతులు కలపాలని, లేకుంటే వేరొకరిని ఎంపిక చేసుకుంటామని దుండగుడు తొందరపెట్టాడు. రూ 65 లక్షలను పోగొట్టుకోవద్దని ఒత్తిడి పెంచినట్టు సంభాషణల సారాంశంలో వెల్లడైంది. బాధిత విద్యార్థి నో థ్యాంక్స్ అని రిప్లై ఇవ్వగా మరికొద్ది సేపటికే మళ్లీ ఆన్‌లైన్‌లోకి వచ్చిన వ్యక్తి విద్యార్థిని లాసర్గా పేర్కొన్నాడు. రాత్రి 3.30 గంటలకు మళ్లీ లైన్లోకి వచ్చిన వ్యక్తి తాను త్వరలో భారత్ రానున్నట్టు చెప్పగా, తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడం తనకు ఇష్టం లేదని విద్యార్థి తేల్చిచెప్పారు. అయితే తాము భారత్‌ను నాశనం చేయబోమని, కేవలం ఒకరిని చంపాలని మాత్రమే అనుకుంటున్నామని ఆ వ్యక్తి సంభాషించాడు. ఈ ఉదంతంపై పశ్చిమ బెంగాల్ సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. -
యువతిపై అత్యాచారం.. కాబోయే భర్తకు ఫొటోలు!
టీనగర్: యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో చెన్నైకి చెందిన క్రీడాకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ట్రిప్లికేన్కు చెందిన ఓ యువతి(22) కీల్పాక్కంలోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి హర్డిల్స్ క్రీడా కేంద్రం నిర్వహిస్తున్నారు. అక్కడ టీపీ సత్రం జ్యోతియమ్మాల్ నగర్‌కు చెందిన దీపక్ అలియాస్ డేనియల్(22) శిక్షణ పొందుతున్నాడు. తండ్రి నిర్వహిస్తున్న హర్డిల్స్ కేంద్రానికి ఆ యువతి తరచుగా వస్తుండడంతో దీపక్ ఆమెతో స్నేహంగా మెలిగాడు. అనంతరం డేనియల్, యువతి ప్రేమించుకున్నారు. ఇటీవల కొన్ని విషయాల్లో వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. నెలరోజులుగా ఆ యువతి దీపక్‌తో మాట్లాడలేదు. అనేకసార్లు సెల్ఫోన్లో ప్రయత్నించినా ఆమె సమాధానం చెప్పలేదు. ఇలా ఉండగా ఆ యువతి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమెకు వివాహం చేసేందుకు వరుడి కోసం అన్వేషించారు. ఈ విషయం తెలియగానే దీపక్ ఆ యువతిని ప్రశ్నించాడు. అందుకామె తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఆగ్రహించిన దీపక్ ఆమెతో తాను తీసుకున్న ఫొటోను ఇంటర్నెట్లో విడుదల చేస్తానని బెదిరించాడు. ఆమెకు కాబోయే భర్తకు వాట్సప్ ద్వారా ఫోటో పంపాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువతి ఆ విషయం తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు దీపక్‌పై కీల్పాక్కం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వాంగ్మూలం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తమ అభిప్రాయభేదాలకు మునుపు ఒకరోజు ఆమెను స్నేహితుల గదికి తీసుకువెళ్లి, శీతలపానీయంలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపానని దీపక్ వాగ్మూలం ఇచ్చాడు. తనపై జరిగిన దారుణాన్ని ఆమె తన తల్లిదండ్రులకు బెబుతానని తనను బెదిరించిందన్నాడు. దీంతో ఆమె అసభ్య చిత్రాలను చూపగా కోపంగా వెళ్లిపోయి తల్లిదండ్రులకు చెప్పినట్టు వివరించాడు. ఈ నేపథ్యంలో దీపక్‌కు అనేకమంది యువతులతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
వాట్సప్ సాక్ష్యం.. రేపిస్టులకు 20 ఏళ్ల జైలు!
ముగ్గురు న్యాయ విద్యార్థులు కలిసి తమ యూనివర్సిటీలో కొత్తగా చేరిన ఒక అమ్మాయిపై రెండేళ్ల పాటు అత్యాచారం చేశారు. బాధితురాలికి, నిందితులకు మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్నే సాక్ష్యంగా పరిగణించిన కోర్టు.. ఆ ముగ్గురిలో ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. మూడో విద్యార్థికి ఏడేళ్ల జైలుశిక్ష వేసింది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ చాటింగ్‌ను సాక్ష్యంగా ఉపయోగించుకున్న ఈ ఘటన హరియాణాలోని సోనేపట్‌లో గల ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. మేనేజ్మెంట్ విద్యార్థినిపై రెండేళ్ల పాటు అత్యాచారం చేయడం, ఆమెను బ్లాక్మెయిల్ చేయడం లాంటి నేరాలకు గాను ప్రధాన నిందితుడు హార్దిక్ సిక్రీ, అతడి స్నేహితుడు కరణ్ ఛాబ్రాలకు 20 ఏళ్లు, మూడో వ్యక్తి వికాస్ గార్గ్‌కు ఏడు సంవత్సరాలు జైలుశిక్ష పడింది. వాట్సప్ చాటింగ్‌లో వాళ్లు ఉపయోగించిన పదాలు దారుణాతి దారుణంగా, అత్యంత అసభ్యంగా ఉన్నాయని.. అందువల్ల వాటిని తీర్పులో కూడా ప్రస్తావించలేకపోతున్నానని అదనపు సెషన్స్ జడ్జి సునీతా గ్రోవర్ తెలిపారు. బాధితురాలు 2013 ఆగస్టు నెలలో యూనివర్సిటీలో చేరింది. అప్పటి నుంచి అదే యూనివర్సిటీలో చదువుతున్న న్యాయవిద్యార్థులు తనపై అత్యాచారాలు చేస్తూనే ఉన్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో 2015 ఏప్రిల్ నుంచి నిందితులు జైల్లో ఉన్నారు. ప్రధాన నిందితుడైన హార్దిక్ ఆమె నగ్న చిత్రాలను వాట్సప్‌లో స్నేహితులందరికీ పంపాడు. అంతేకాదు, యాపిల్ ఐక్లౌడ్‌లో కూడా వాటిని భద్రపరిచాడు. విషయం ఎవరికైనా చెబితే యూనివర్సిటీ వెబ్సైట్లో వాటిని పెడతానని ఆమెను బెదిరించాడు. అంతేకాదు, ఒక సెక్స్ టాయ్ కొని, దాన్ని వాడుతూ తనకు స్కైప్‌లో చూపించాలని ఆమెను బెదిరించాడు. తరచు చండీగఢ్ తీసుకెళ్లి తనను అనుభవించేవాడని ఆమె తెలిపింది. ఆ విషయం కూడా వాట్సప్ చాటింగ్‌లో ఉండటంతో దాన్ని కోర్టు సాక్ష్యంగా అంగీకరించింది. ఆ అమ్మాయి వాళ్లతో లైంగిక సంబంధాలకు అంగీకరించే వచ్చిందని, తనంతట తానే చండీగఢ్ పర్యటనలో బీర్ కొని, డ్రగ్స్ తీసుకోడానికి కూడా ఒప్పుకొందని డిఫెన్స్ న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు. నిందితులు సీనియర్లు కావడంతో వాళ్లు ఆమెను డామినేట్ చేసేవారని, బాధితురాలు వాళ్ల మాట కాదనలేకపోయిందని వాట్సప్ చాటింగ్‌ను బట్టి తెలుస్తోందని జడ్జి అన్నారు. -
చిచ్చురేపిన వాట్సప్ మెసేజ్.. ఊరంతా ఉద్రిక్తం
- ఇరువర్గాల ఘర్షణ.. ఉట్నూరులో రణరంగం - పోలీసులపైకి రాళ్లు రువ్విన అల్లరిమూక.. టియర్ గ్యాస్ ప్రయోగం - ఎస్సీ, ఏఎస్పీ, డీఎస్పీలకు గాయాలు.. 144 సెక్షన్ విధింపు ఉట్నూరు (ఆదిలాబాద్ జిల్లా): ఉట్నూరు మండల కేంద్రంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ యువకుడు వాట్సప్‌లో ఓ వర్గాన్ని కించపరుస్తూ 8 నిమిషాల నిడివి గల వాయిస్ మెసేజ్ పోస్టు చేశాడు. అతడు పెట్టిన పోస్టింగ్ పెద్ద గొడవకు తెరలేపింది. తమ వర్గాన్ని కించపరిచిన యువకుడిని అరెస్టు చేయాలని ఆ వర్గం వారు రోడ్లపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో అవతలి వర్గం వారు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగం.. రాళ్ల వర్షం.. పోలీసులు నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో అల్లరిమూకలను తరిమి కొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన రెండువర్గాలూ రాళ్లు విసురుకోవడంతో కొంతమంది పోలీసులతో పాటు మరికొంత మంది ప్రజలకు గాయాలయ్యాయి. ఉన్నట్టుండి చెలిరేగిన ఈ హింసతో ఉట్నూరు మండల కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉట్నూరులో 144 సెక్షన్ అమలులో ఉంది. పోలీసు ఉన్నతాధికారులకూ గాయాలు.. అల్లరి మూకలు జరిపిన దాడిలో జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు కూడా గాయాలయ్యాయి. కలెక్టర్ బుద్ధ ప్రసాద్ ఆదేశాల మేరకు డీఐజీ రవి వర్మ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్లురువ్వడానికి గర్హించిన ఆయన.. తప్పు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. -
చిన్న సందేశం.. పెద్ద సాయం
⇒ ఆపదలో ఉన్న చిన్నారి ⇒ వైద్యానికి యువత చేయూత నెహ్రూనగర్(గుంటూరు): ఓ చిన్న వాట్సప్ సందేశం ఒక మంచిపనికి మార్గం చూపింది. ఆపదలో ఉన్న ఓ చిన్నారిని ఆదుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన మనోహర్, లావణ్య ఒకటిన్నర ఏళ్ల కుమార్తె జెస్విత ఇటీవల ప్రమాదవశాత్తు మరుగుతున్న నూనెలో పడి తీవ్ర గాయాలపాలయ్యింది. వెంటనే తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యులు చిన్నారి కోలుకోవడానికి రూ.6 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఉండగా సమీప బంధువు ఒకరు చిన్నారికి వచ్చిన ఆపదను వాట్సాప్‌లో తెలిసిన మిత్రులందరికీ పంపించాడు. అలా సామాజిక మాధ్యమంలో సమాచారం అందుకున్న నగరంలోని క్రీస్టియన్పేట, పాతగుంటూరుకు చెందిన యువతీ యువకులు ఈస్ట్, వెస్ట్ ప్యారిస్, చర్చిలో విరాళాలు సేకరించి శనివారం రూ.60 వేలు సేకరించారు. నగదును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. దాతలెవరైనా వైద్యానికి సాయం చేయాలనుకుంటే 91779 86812, 97007 78345లో సంప్రదించాలని కోరారు. -
వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు..
-
వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు..
• ఒకే రోజు 1400 కోట్ల మెసేజ్‌లు • భారత్‌లో ఇదే ఆల్‌టైం గరిష్టం న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలు వాట్స్‌యాప్‌ను విపరీతంగా వాడేస్తున్నారు. మరీ ఎంతలా అంటే డిసెంబర్ 31న 1400 కోట్ల వాట్స్‌యాప్ మెసేజ్‌లను పంపుకున్నారు. భారత్ నుంచి ఇదే ఆల్‌టైం గరిష్టం. యూజర్లు మునుపెన్నడూ కూడా ఇంత ఎక్కువగా వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుకోలేదు. ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడం కోసం వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ వాట్స్యాప్కు భారత్ అతిపెద్ద మార్కెట్. సంస్థకు భారత్‌లో 16 కోట్ల మంది యూజర్లున్నారు. ఇక వీరి సంఖ్య అంతర్జాతీయంగా వంద కోట్లకుపైగానే ఉంది. టెలికం కంపెనీలు న్యూ ఇయర్, దీపావళి వంటి రోజుల్లో ఎస్ఎంఎస్లకు మామూలు చార్జీలను వసూలు చేస్తుంటాయి. కానీ ఇక్కడ వాట్స్‌యాప్‌లో ఉచితంగా (డేటా చార్జీలు మినహా) ఎన్ని మెసేజ్‌లనైనా పంపుకోవచ్చు. అందుకే వాట్స్యాప్కు ఆదరణ బాగా పెరిగిపోతోంది. కాగా గతేడాది దీపావళి రోజు వాట్స్‌యాప్ యూజర్లు 800 కోట్ల మెసేజ్‌లను పంపుకున్నారు. మీడియా ఫైల్స్‌దే పైచెయ్యి.. డిసెంబర్ 31న పంపుకున్న వాట్స్‌యాప్ మెసేజ్‌లలో మీడియా ఫైల్స్ సింహభాగం ఆక్రమించాయి. ఫొటోలు, జీఐఎఫ్‌లు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు సంయుక్తంగా 32 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఫొటో మెసేజ్‌లు 310 కోట్లుగా, జీఐఎఫ్ మెసేజ్‌లు 70 కోట్లుగా, వీడియో మెసేజ్‌లు 61 కోట్లుగా ఉన్నాయి. -
వాట్సాప్‌లో వచ్చే ఆ మెసేజ్‌తో జాగ్రత్త!
ఈ లింకు క్లిక్ చేస్తే మీ మొబైల్‌కు ఉచితంగా రూ.500 రీఛార్జ్ అయిపోతుంది. వెంటనే రీఛార్జ్ చేసుకుని, మరో 15 మంది ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడంటూ ప్రధాని నరేంద్రమోదీ పేరుమీదనే ఓ లింకు వైరల్ అవుతున్న విషయం విదితమే. ప్రధాని ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం ఈ లింకు ఎక్కువగా సర్క్యూలేట్ అవుతోంది. నగదు కొరతతో నిజంగానే మోదీ మనకు ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నాడమోనని భావించి, చాలామంది ఆ లింకును ఓపెన్ చేస్తున్నారు. దానిలో ఎంతమందికి రూ.500 రీఛార్జ్గా వస్తుందో తెలియదు కాని, మన వ్యక్తిగత సమాచారమైతే లీకైపోయి, హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందట. ఈ లింకు ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా ప్రజలకు హానికరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని పేరు మీద సర్క్యూలేట్ అయ్యే http://balance.modi-gov.in/ లింకు ఫేకని వెల్లడైంది. ఆ లింకును క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్, ఆపరేటర్, రాష్ట్రం వంటి వివరాలు అందించాలి. అన్ని వివరాలు నింపిన తర్వాత రీఛార్జ్ బటన్ నొక్కగానే, మరో కొత్త పేజీ ఓపెన్ అవుతోంది. ఈ పేజీలో లింకును మరో 15 మంది స్నేహితులకు షేర్ చేయాలని అడుగుతోంది. అయితే ఈ వెబ్సైట్లో నింపే సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్తుందని, యూజర్ల సమాచారాన్ని వారు తప్పుడు కార్యకలాపాలకు వాడుతున్నారని వెల్లడైంది. అదేవిధంగా ఈ హోమ్ పేజీలోనే తాము ఏ టెలికాం కంపెనీకి చెందిన వాళ్లం కాదని నిబంధనలు, షరతుల్లోనే ఉంటుంది. మొదటిసారి వాట్సాప్ వీడియో కాలింగ్‌ను యూజర్లకు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే మాదిరి ఓ ఫేక్ మెసేజ్ విపరీతంగా సర్క్యూలేట్ అయింది. ఈ లింకులు చాలా ప్రమాదకరమని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయొద్దని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని పన్నగం పెట్టి ఉచిత రీఛార్జ్‌ల కోసం పాకులాడవద్దని హెచ్చరిస్తున్నారు. -
లాకర్లలో బంగారంపై.. అదంతా తప్పుడు ప్రచారమే!
''పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇక బ్యాంకులో లాకర్లను టార్గెట్ చేయబోతున్నారు.. తహసీల్దార్ సమక్షంలో లాకర్లు తెరుస్తారు. ఒక మహిళకు 600 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉన్నా, లెక్కలు చూపించని బంగారం ఉన్నా దాన్ని స్వాధీనం చేసుకుంటారు'' అని ఈమధ్య వాట్సప్‌లో ఒక సందేశం తెగ సర్క్యులేట్ అయ్యింది. కానీ.. అసలు అలాంటిదేమీ లేదని, బ్యాంకు లాకర్లను తెరవాలని గానీ, బంగారాన్ని స్వాధీనం చేసుకోవాలని గానీ నిర్ణయం కాదు కదా అసలు చర్చ కూడా ఏమీ లేదని తేలిపోయింది. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ట్వీట్లో స్పష్టీకరణ ఇచ్చింది. దాంతో ఇప్పటివరకు వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో దానిపై జరిగినదంతా ఉత్తుత్తి ప్రచారమేనన్న విషయం తేలిపోయింది. దొంగల పనేనా? నిజానికి లాకర్లలో పెట్టిన బంగారం గురించి ఇలాంటి వదంతులు వ్యాపింపజేస్తే, అప్పుడు లాకర్లలో ఉన్న బంగారాన్ని ఇళ్లకు తీసుకొచ్చేస్తారని, దాంతో తమ పని సులభం అవుతుందని భావించిన కొందరు దొంగలే ఇలాంటి ప్రచారం మొదలుపెట్టి ఉంటారన్న అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. పాతనోట్లు చెల్లకపోవడం, కొత్త నోట్లు ఇంకా పెద్ద మొత్తంలో బయటకు రాకపోవడంతో కొన్నాళ్లుగా దొంగలకు చేతిలో పనిలేకుండా పోతోంది. అందుకే బంగారం అయితే సులభంగా తీసుకెళ్లొచ్చన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. विमुद्रीकरण पर भ्रम टूटा pic.twitter.com/cEgRBI30pt — Ministry of Finance (@FinMinIndia) 18 November 2016 -
స్మార్ట్ 'గాడ్'జట్స్
స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సప్ మెసేజ్‌లు... శాటిలైట్ టీవీలోని లైవ్ టెలిక్యాస్ట్లు... ఫోన్లోనే స్తోత్రాల క్లిప్‌లు... అన్నీ ఈ న్యూ ఏజ్‌లో భక్తిపర్వానికి ప్రతీకలే. ఈ దసరా వేళ... సమయానికీ, సందర్భానికీ తగ్గట్లు వాట్సప్‌లో అమ్మ వారి అలంకారం ఫోటో సహా తిథి వార నక్షత్ర వివరాలతో మెసేజ్‌లు ‘గాడ్’ మార్నింగ్ చెబుతున్నాయి. చకచకా ఫ్రెండ్స్‌కీ, రకరకాల గ్రూపులకీ ఫార్వర్డ్ అవుతూ, ఇతోధికంగా భక్తి భావాన్ని నలుగురికీ పంచుతున్నాయి. ఆడియో క్యాసెట్ తరం పోయి, స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌లో ఆడియో క్లిప్ వినే తరం వచ్చినవేళ... భక్తి ఇప్పుడు కొత్త ట్రెండ్స్‌తో జనంలో దూసుకుపోతోంది. కవల పిల్లలైన ఇంద్రాణి, శర్వాణి... ఇద్దరూ నాలుగో తరగతే. ఇద్దరూ గడచిన ఆరేడు రోజులుగా ఎప్పటి కన్నా తొందరగా నిద్ర లేస్తున్నారు. స్కూళ్ళకు దసరా సెలవులు... బడి లేదు... ట్యూషన్లూ లేవు... ఇంట్లో ప్రత్యేకంగా వేరే పనీ లేదు. కానీ, ఈ చిన్న పిల్లలు తొందరగా ఎందుకు నిద్ర లేస్తున్నట్లు? గబగబా స్నానం చేసి, తయారై ఎక్కడికి వెళుతున్నట్లు? ‘మరే... మరే... ఈ పండగ టైమ్‌లో... తొమ్మిది రోజులూ... గుడికి వెళ్ళి, అమ్మ వారికి దణ్ణం పెట్టుకుంటే... చదువు బాగా వస్తుందట! మా డాడీ కూడా చిన్నప్పుడు ఇలాగే చేశాట్ట! మా మమ్మీ, తాతయ్య చెప్పారు’ అంటూ ముద్దుగా చెప్పారా పిల్లలు. ఆ ఇద్దరినీ హైదరాబాద్‌లోని తమ కాలనీలోనే... దగ్గరలో ఉన్న అమ్మ వారి గుడికి తీసుకువెళ్ళడం, ఏ రోజుకు ఆ రోజు అమ్మ వారికి వేసే ప్రత్యేక అలంకారాలు చూపించడం, వాటి గురించి చెప్పడం తల్లి రేఖకు వారం రోజులుగా నిత్యకృత్యం. ‘‘పిల్లలకు ఇప్పటి నుంచే మన పండుగలు, సంస్కృతి, దేవుడి మీద భక్తి, తప్పు చేయకూడదనే భయం అలవాటు చేయాలని మా ఇంట్లో అనుకుంటాం. చిన్నప్పుడు మనం తెలుసుకున్నవి, అలవాటు చేసుకున్నవి పిల్లలకు చెప్పి, అలవాటు చేస్తేనే కదా... వాళ్ళకూ అన్నీ తెలిసేది, మంచివాళ్ళుగా తయారయ్యేది’’ అని రేఖ అన్నారు. ఇవాళ మన సంస్కృతీ సంప్రదాయాల గురించి పిల్లలకు ఎలా నేర్పాలా అని తపిస్తున్న కొత్త జనరేషన్ తల్లితండ్రులకూ, ఆ అలవాటులో దైవభక్తి పెరుగుతున్న పిల్లలకూ రేఖ కుటుంబం, ఆ కవల పిల్లలు ఒక చిన్న ఉదాహరణ. స్మార్ట్‌ఫోన్‌లో... స్తోత్రాలు నలభై అయిదేళ్ళ భవాని చిన్నప్పటి నుంచి భక్తి, పూజ, పురస్కారం ఇంట్లో అమ్మానాన్న చేసిన మంచి అలవాటు. ఆమె చేతికి ఈ మధ్యే ఒక కొత్త పరికరం వచ్చి చేరింది. ప్రేమగా భర్త ఆన్లైన్లో కొని ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆమె రోజువారీ అలవాటుకు కొత్త రంగులు అద్దింది. తెలతెలవారుతుండగానే లేచి, వంటింట్లో పని చేసుకుంటూ భక్తి గీతాలు వినడం భవానికి అలవాటు. అందుకోసం కొన్నేళ్ళ క్రితం దాకా పాత క్యాసెట్ రికార్డర్ మీద ఆధారపడేది. క్యాసెట్ల నుంచి సీడీలకు మారినా, సీడీ ప్లేయర్ హాలులో ఉండడంతో, నిద్ర లేని మిగతావాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇబ్బంది పడేది. కానీ, ఇటీవల భర్త కొనిచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్‌తో అమ్మవారి గీతాల ఆడియో క్లిప్‌లను ఇంటి పని చేసుకుంటూనే, ఫోన్లోనే పైకి వినిపించేలా స్పీకర్ మోడ్‌లో పెట్టి వింటోంది. ‘‘పండుగ రోజుల్లో పొద్దున్నే ఇంట్లో భక్తి వాతావరణానికి ఇది నాకో కొత్త ఫ్రెండ్. ఎవరినీ డిస్ట్రబ్ చేయకుండానే, నా భక్తి భావాన్ని తగ్గించుకోకుండానే పని చేసుకుంటున్నా’’ అని భవాని నవ్వుతూ చెప్పారు. ఇంట్లోనే పురాణ ప్రవచనం కాశీనాథుని జయలక్ష్మి గారికి టీవీ మంచి కాలక్షేపం. ఎనిమిది పదులు మీద పడిన ఆ పెద్ద ముత్తయిదువ నిన్న మొన్నటి వరకు మంచి సంగీత, భక్తి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తప్పకుండా హాజరయ్యేవారు. ప్రసిద్ధ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్, ఆమె కలసి ఆదిదంపతుల్లా ముందు వరుసలో కూర్చొని, కార్యక్రమం ఆసాంతం ఆస్వాదించి, ఆశీర్వదిస్తుంటే - కార్యక్రమ నిర్వాహకుల్లో కొత్త ఉత్సాహం. అయితే, మీద పడుతున్న వయసుతో ఇప్పుడు బయటకు రావడం తగ్గించుకున్న జయలక్ష్మికి టీవీలో అంతకు మించిన సత్కాలక్షేపం దొరికింది. వివిధ టీవీ ఛానళ్ళలో వచ్చే భక్తి ప్రవచనాలు ఆమెకిప్పుడు పెద్ద రిలీఫ్. ‘‘ఒకప్పుడు గుడికి వెళ్ళి, హరికథలూ, పురాణాలూ వినేవాళ్ళం. వయసు వల్ల అక్కడి దాకా వెళ్ళే ఓపిక లేని మా లాంటి పెద్ద వాళ్ళకు ఇప్పుడు ఇంట్లోనే నాలుగు మంచి మాటలు వినే వీలు చిక్కింది’’ అని కె. విశ్వనాథ్ అన్నారు. ఇవాళ కె. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకే కాదు... అలాంటి కొన్ని లక్షల మందికి ఇలా ఇల్లే దేవాలయంగా, టీవీలో ప్రవచనమే సత్కాలక్షేపంగా మారింది. ఇది ‘గాడ్’ మార్నింగ్! ప్రతి రోజూ తన స్కూలు, కాలేజ్ ఫ్రెండ్స్‌కు నాలుగు మంచి మాటలతో ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్ పెట్టే అలవాటున్న విజయవాడ సత్యనారాయణపురం వాసి శంకరనారాయణకు ఈ పండుగ కొత్తగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లోని సోషల్ నెట్వర్క్ యాప్ ‘వాట్సప్’ పుణ్యమా అని ఇప్పుడు అతను ఏ రోజుకు ఆ రోజు దేశం నలుమూలల ఉన్న తన విజయవాడ ఫ్రెండ్స్‌కు వాట్సప్‌లో గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు పంపుతున్నాడు. పైగా... అదీ బెజవాడ కనకదుర్గమ్మ వారి ప్రత్యేక అలంకారాల ఫోటోలతో! అమెరికాలో ఉన్న సురేఖకీ, ఆస్ట్రేలియాలో ఉన్న విజయమాధవికీ ఇప్పుడు విజయవాడనూ, కనకదుర్గమ్మనూ మిస్ అవుతున్నామన్న బెంగ కొంత తీరింది. తెలుగు గడ్డకు దూరంగా విదేశాల్లో తమ దగ్గరే పెరుగుతున్న తమ పిల్లలకు ఆ ఫోటోలు చూపిస్తూ, తమ చిన్నప్పటి సంగతులు చెప్పడం మంచి నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తోంది. వాట్సప్ దైవదర్శనం ఓ ప్రముఖ పబ్లికేషన్ సంస్థలో చాలా ఉన్నతస్థాయి ఉద్యోగి ఎం. కృష్ణకిరణ్. చెన్నైలో పనిచేస్తుండగా, రోజూ దగ్గరలోని రాయపేట ‘గౌడీయ మఠం’ ఆలయానికి వెళ్ళేవారు. శ్రీకృష్ణ సందర్శనం చేసుకొనేవారు. అలా అక్కడి స్వామీజీలతో పరిచయం, దైవ సాన్నిధ్యంలో ప్రశాంతత అలవాటైపోయాయి. అలా కొన్నేళ్ళు సాగింది. ఉద్యోగరీత్యా అనుకోకుండా ముంబయ్‌కి షిఫ్ట్ అయ్యారు. చాలా కాలం తులసిమాలతో దీక్షలో ఉన్న ఆయనకు కృష్ణ దర్శనం దూరమవడం తెలియని వెలితిగా అనిపించసాగింది. ఆ మాటే మిత్రులతో పంచుకున్నారు. అంతే! గౌడీయ మఠం దగ్గరలో ఉండే ఆయన మిత్రులు కొందరు పరిష్కారం చూపించారు. రోజూ తాము గుడికి వెళ్ళి, గుడిలో దేవుడి అలంకారం ఫోటో తీసి, వాట్సప్‌లో పెడుతున్నారు. కాలు కదపకుండానే... ప్రత్యక్ష వీక్షణం ఒకప్పుడు స్కూల్లో టీచర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న అనంతపురం వాసి లక్ష్మికి భక్తి ఎక్కువే. పుణ్యక్షేత్రాలు చూడాలనీ, ఉత్సవాలు ప్రత్యక్షంగా దర్శించాలనీ ఈ గృహిణికి మహా కోరిక. భర్తకీ చాలా భక్తి. కాకపోతే, ఇంటి పరిస్థితులు, భర్త ఉద్యోగ పరిస్థితులు అనుకున్న ప్రతిసారీ అందుకు అనుమతించవు. రోజూ మూడు వేళలా ఇంట్లో పూజ, హారతి జరిపే ఈ దంపతుల అలవాటు. ప్రతి గురువారం ఇంట్లోనే సాయిబాబా పూజ, సత్సంగం సరేసరి! కానీ, షిర్డీకి వెళ్ళడమంటేనే కుదరడం లేదు. ఈ విజయదశమికి కూడా అదే పరిస్థితి. కానీ, ఇప్పుడు లక్ష్మి లాంటి వారికి పెద్ద రిలీఫ్ - శాటిలైట్ భక్తి టీవీల ప్రత్యక్ష ప్రసారాలు. షిర్డీలోని సాయిబాబా నిత్య హారతుల దగ్గర నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మథురలో కృష్ణాష్టమి వేడుకల దాకా ఏదైనా సరే ఇంట్లోనే కూర్చొని చూసే వెసులుబాటు వచ్చేసింది. వెరసి... ఇవాళ కనిపిస్తున్న భక్తి ధోరణుల్లో ఇలాంటివి అనేకం! జనరేషన్లు మారినా... అమ్మ ప్రేమ మారలేదు. అమ్మ వారి మీద భక్తీ మారలేదు. కాకపోతే, కాలానికి తగ్గట్లు కొత్త రూపం, రంగు, రుచి, వాసన మాత్రం సంతరించుకుంటున్నాయి. అంతే! హ్యాపీ దసరా! - రెంటాల జయదేవ -
వాట్సాప్ ఆపింది పెళ్లిని..
పెళ్లికూతురికి అంతకు ముందే వివాహం వాట్సాప్ ద్వారా పెళ్లికుమారుడికి తెలిసిన నిజం కేకే.నగర్(చెన్నై): పెళ్లికూతురికి అంతకుముందే వివాహమైనట్లు వాట్సాప్ ద్వారా తెలియడంతో పెళ్లికుమారుడు వివాహాన్ని రద్దు చేశాడు. అనంతరం తనను మోసం చేశారని ఆరోపిస్తూ అతను పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు..ఆరణి సమీపంలోని సేవూర్ గ్రామానికి చెందిన మణి కుమారుడు మహేష్ (31). ఇతనికి ఆరణి ఎస్వీనగర్‌కు చెందిన యువతితో సోమవారం రాత్రి సేవూర్‌లోని కల్యాణ మండపంలో రిసెప్షన్ జరిగింది. ఆ సమయంలో ఆరణి దసరాపేటకు చెందిన వినాయకం నుంచి మహేష్ సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌లో ఓ మెసేజ్ అందింది. అందులో పెళ్లికూతురు, వినాయకం కలిసి దిగిన ఫొటోలతో పాటు తనకు, యువతికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపాడు. మహేష్ ఈ విషయాన్ని వెంటనే తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులను అడగ్గా వారు మౌనం వహించడంతో ఆగ్రహిం చిన పెళ్లికుమారుడు మహేష్ తనను మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో గతంలో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి మోసం చేశారని. వివాహ ఏర్పాట్లకు తనకు రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని దాన్ని తిరిగి యువతి కుటుంబ సభ్యులు చెల్లించాలని కోరారు. పోలీసులు వాట్సాప్‌లో మెసేజ్ పంపిన వినాయకం కోసం గాలిస్తున్నారు. -
వాట్సప్ మెసేజీలను మావాళ్లు చదవలేకపోతున్నారు
న్యూఢిల్లీ : వాట్సాప్ లాంటి కమ్యూనికేషన్ యాప్ ల మేసెజ్ లను డీక్రిప్ట్ (వ్యక్తీకరించడానికి) చేయడానికి భారత సెక్యురిటీ ఏజెన్సీలకు సాధ్యపడదని కేంద్ర సమాచార, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో తెలిపారు. న్యాయపరంగా, టెక్నికల్ గా, రెగ్యులేటరీ పాలసీ వంటి కారణాలతో ఈ వాట్సాప్ మెసేజ్ లను చదివగలిగే ఆకృతులోకి మార్చడం కుదరదని పేర్కొన్నారు. వివిధ అప్లికేషన్ సర్వీస్ ప్రొవేడర్లు కల్పిస్తున్న ఎన్ర్కిప్టెడ్ కమ్యూనిషన్ తో వ్యవహరించేటప్పుడు సెక్యురిటీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఆ అప్లికేషన్లు ఎన్కిప్షన్ టెక్నాలజీని, యాజమాన్య ధృవీకరణ ప్రొటోకాల్స్ ను వాడుతూ మెసేజ్ లను భద్రంగా ఉంచుతున్నాయని పేర్కొన్నారు. మొబైల్ అప్లికేషన్లలో వాట్సాప్ అనేది సమాచారం మార్పిడికి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, ఇంటర్ నెట్ సేవలు కల్గి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉందని చెప్పారు. సెక్యురిటీ ఏజెన్సీలు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించి, వాటిని డీక్రిప్ట్ చేయడం సాధ్యపడదని, ఒకవేళ డీక్రిప్ట్ చేయాలనుకున్నా టెక్నికల్ గా, న్యాయపరంగా, రెగ్యులేటరీ పాలసీ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. టెలికాం సర్వీసు ప్రొవేడర్లతో పాటు సోషల్ మీడియా ప్రొవైడర్లతో రెగ్యులేటరీ ఎప్పడికప్పుడూ సమావేశమై దేశ భద్రత, అభివృద్ధి అంశాలు, సేవల విషయంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాల అమలు చేస్తుంటాయని చెప్పారు. ఇటీవలే వాట్సాప్ ద్వారా అందించే అన్ని సేవలకు ఎండ్ టూ ఎండ్ ఎన్ర్కిప్షన్ ను ఫేస్ బుక్ తీసుకొచ్చింది. ఉద్దేశించిన గ్రహీతలు మాత్రమే ఈ మెసేజ్ లు చదువుకోగలిగే రీతిలో దీన్ని రూపొందించారు. ఎన్ర్కిప్షన్ అనేది అత్యంత ప్రాముఖ్యం కల్గిన సాధనమని, ఈ కొత్త డిజిటల్ యుగంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వినియోగదారులు భద్రతను, సెక్యురిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్ర్కిప్టెడ్ సర్వీసులకు, లా ఎన్ ఫోర్స్ మెంట్ లకు సంబంధించి చాలా చర్చలు జరిగాయని, అయితే ప్రజల సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్, హ్యాంకర్ల దగ్గర్నుంచి భద్రతగా ఉంచడమే లా ఎన్ ఫోర్స్ మెంట్ విధిగా గుర్తించామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. -
వాట్సాప్ లో మెసేజ్, జర్నలిస్ట్ అరెస్ట్
దంతెవాడ: బస్తర్ ప్రాంతాన్ని పోలీస్ రాష్ట్రంగా మారుస్తున్నారని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దంతెవాడకు చెందిన జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. సీనియర్ పోలీసు అధికారి గురించి వాట్సాప్ లో అభ్యంతకర మెసేజ్ పోస్టుచేశారనే ఆరోపణలతో జర్నలిస్ట్ ప్రభాత్ సింగ్ ను జగదల్ పూర్ లో సోమవారం అరెస్ట్ చేశారు. మంగళవారం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో పోలీసులు తనను కొట్టారని కోర్టుకు అతడు తెలిపాడు. అతడికి కోర్టు మార్చి 31 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రభాత్ సింగ్ పై పోలీసులు గతేడాది నుంచి మూడు కేసులు నమోదు చేశారు. దంతెవాడలో ఆధార్ సెంటర్ నడుపుతున్న అతడు పలువురిని మోసం చేసినట్టు ఆరోపించారు. తాజా కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని సింగ్ తరపు లాయర్ తెలిపారు. సింగ్ అరెస్ట్ ను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బాగ్ హెల్ మంగళవారం అసెంబ్లీలో లేవనెత్తారు. బస్తర్ ప్రాంతంలో జర్నలిస్టులపై పోలీసు కేసులు పెరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు కలిసివున్నారనే ఆరోపణలతో ఇంతకుముందు ఇద్దరు స్థానిక జర్నలిస్టులు సంతోష్ యాదవ్, సమరు నాగ్ లను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. స్ర్కాల్ డాన్ నిన్ వెబ్ సైట్ లో పనిచేసే ఓ కంట్రిబ్యూటర్ ను బస్తర్ ప్రాంతం వదిలి పెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. -
వాళ్లను చంపడం జాతి ధర్మం
జేఎన్‌యూ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. అక్కడి విద్యార్థి సంఘ నేతలు కన్హయ్యకుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను చంపేస్తామంటూ ఎప్పటికప్పుడు కొత్గా పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇంతకుముందు కన్హయ్యను చంపితే 11 లక్షలు ఇస్తానని ప్రకటించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే జైల్లో పెట్టారు. ఈ లోపు వాట్సప్, ఇతర సోషల్ మీడియాలో మరో పోస్టర్ ప్రచారంలోకి వచ్చింది. ''జేఎన్‌యూ ద్రోహులను కాల్చి చంపడం జాతిధర్మం. నేను ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్యలను కాల్చేస్తా'' అని ఈ పోస్టర్లో ఉంది. తన పేరు బల్బీర్ సింగ్ భారతీయ అని, తాను సమాజ సేవకుడినని, అన్నా హజారే నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని అందులో పేర్కొన్నాడు. పోస్టర్లో తన ఫోన్ నంబర్, పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా పెట్టాడు. జేఎన్‌యూ విద్యార్థులకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆ పోస్టర్లో ఖండించారు. ''అఫ్జల్‌గురు ఉరితీత దినం రోజున పండగ చేసుకున్నవారిని నేను కాల్చేస్తా.. ఉగ్రవాదుల కంటే వెన్నుపోటుదారుల వల్లే దేశానికి ఎక్కువ ముప్పు ఉంది. ఇలాంటి వాళ్లకు జీవితఖైదు విధించాలి'' అని కూడా పోస్టర్లో రాశారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణ ప్రారంభిచినట్లు డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. పోస్టర్లో ఉన్న నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తే, తనకు యమునా బజార్లో ఓ దుకాణం ఉందని అవతలి వ్యక్తి చెప్పాడు. అయితే పోస్టర్లు వేసిన విషయం గురించి మాత్రం అతడు పెద్దగా స్పందించలేదు. అతడిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. -
వాట్సాప్ సేవలు బంద్!
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ, నోకియా ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే మొబైల్ హ్యాండ్సెట్లలో వాట్సాప్ మెసెంజర్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా), నోకియా ఎస్40, నోకియా సింబియాన్ ఎస్60, ఆండ్రాయిడ్ 2.1, 2.2, విండోస్ ఫోన్ 7.1 ఓఎస్‌లపై నడిచే ఫోన్లలో వాట్సాప్ మెసెంజర్ సేవలను ఈ ఏడాది చివరి నాటికి నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో దాదాపు 99.5 శాతం వరకు ఫోన్లు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీల ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)పై పనిచేస్తున్నాయని తెలిపింది. అత్యధిక ప్రజలు ఉపయోగిస్తున్న ఓఎస్‌పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొంది. ఫేస్బుక్ 2014 ఫిబ్రవరిలో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఆ వాట్సప్ మెసేజి తప్పు.. నమ్మొద్దు
ఇటీవలే భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారిన చెన్నై నగరంలో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు వస్తాయంటూ నాసా హెచ్చరించిందని వాట్సప్‌లో ఇటీవల ఓ సందేశం విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. హరికేన్ కారణంగా అత్యంత భారీ వర్షపాతం తప్పదని, అది కూడా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఎక్కువగా.. ఏకంగా 250 సెంటీమీటర్ల వర్షం పడుతుందని ఆ మెసేజిలో ఉంది. కానీ.. అదంతా తప్పు. దాన్ని ఎవరూ నమ్మొద్దన్నది తాజా కబురు. వాట్సప్‌లో ఎవరో ఒకరు మొదలుపెట్టిన ఈ మెసేజ్ దావానలంలా వ్యాపించి, చాలా గ్రూపులలో షేర్ అయ్యింది. దాంతో గత ఆదివారం వరకు సెలవులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మళ్లీ సోమ, మంగళవారాల్లో కూడా సెలవులు పెట్టి ఆఫీసులకు వెళ్లకుండా ఊరుకున్నారు. చెన్నైలో ఉన్న తమ మిత్రులను పరిస్థితి ఎలా ఉంది, రావచ్చా అంటూ అడగడం కూడా కనిపిస్తోంది. తీరాచూస్తే ఇప్పుడు చెన్నై నగరంలో అసలు వర్షం అన్నదే పడటం లేదు. -
వాట్సాప్‌లో స్టార్ మెసేజీలు
ఈరోజు వాట్సప్ వాడారా? ఏదైనా తేడాగా అనిపించిందా? ఒకే సస్పెన్స్ ఎందుకుగానీ విషయం ఇదీ... వాట్సప్‌లో కొన్ని కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టారు. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది స్టార్ మెసేజ్‌ల గురించి. ఇటీవలే విడుదలైన వాట్సప్ 2.12.367 వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ వచ్చి చేరింది. వాట్సప్ సందేశాల్లో మనకు కావాల్సిన వాటిని వెంటనే చూసుకునేందుకు వీలుగా దానిపై స్టార్ గుర్తు పెట్టుకునే అవకాశం కల్పించారు. వాట్సప్‌లోని ఆప్షన్స్ సెక్షన్లో ఉంటుంది ఈ ఫీచర్. ఏ సందేశాన్నైనా కొద్దిసేపు నొక్కి పట్టుకుంటే స్క్రీన్ పై భాగంలో స్టార్ గుర్తు కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే ఆ సందేశం ప్రత్యేకమైందిగా సేవ్ అవుతుంది. ఒకే సందేశాన్ని పలుమార్లు పంపేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక రెండో కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ డెరైక్ట్ షేర్‌తో పనిచేయగలగడం. ఇది మార్ష్‌మెల్లో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఏవైనా లింక్‌లను వాట్సప్ ద్వారా షేర్ చేసుకోవడం దీని ద్వారా సులువు అవుతుంది. దీంతోపాటు మనం షేర్ చేసుకునే లింక్‌ల రిచ్ ప్రీవ్యూను కూడా ఒక ఫీచర్‌గా పరిచయం చేశారు. -
కండలవీరుణ్ణి కలవరపెట్టిన మెసేజ్..!
సినీ అభిమానానికి కులం, ప్రాంతం, మతం లాంటి భేదాలుండవు. కానీ, కొందరు అత్యుత్సాహంతో తమ హీరోలకు ఆ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. తాజాగా కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఓ అనుహ్య పరిస్థితి ఎదురైంది. అనుకోకుండా ఓ వాట్సాప్ మెసేజ్ సల్మాన్‌ను కంగారు పడేలా చేసింది. ఎక్కణ్ణించి వచ్చిందో తెలీదు. కానీ, ఆ మెసేజ్ ఇప్పుడీ చుల్బుల్ పాండేను పోలీస్ శాఖను ఆశ్రయించేలా చేసింది. ‘‘హనుమాన్ భక్తుడిగా నేను నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్ర విజయానికి ముస్లిమ్‌ల మద్దతు అవసరం లేదు’’అని సాక్షాత్తూ సల్మాన్ ఖాన్ అన్నారని ఆ వాట్సాప్ మెసేజ్ సారాంశం. ఓ హిందీ చానల్లో ఆయన ఆ మాటలు వ్యాఖ్యానించినట్లు ప్రచారమైంది. కానీ, తానలాంటి వ్యాఖ్యలు చేయలేదని సల్మాన్ స్పష్టం చేశారు. కొందరు చేస్తున్న ఈ దుష్ర్పచారం వల్ల తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని సల్మాన్ పోలీసులకు ఉత్తరం రాశారు. -
వాట్సాప్‌లో చాట్ చేస్తోందని.. చంపేశాడు!
భార్య తరచు వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడుతోందని.. వాట్సప్‌లో కూడా చాట్ చేస్తోందని అనుమానం పెంచుకున్న ఓ భర్త.. కట్టుకున్న భార్యను తలపై ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సీతారాంపేట్ ప్రాంతంలో నివసించే రాజేశ్‌శర్మ చార్మినార్ పటేల్ మార్కెట్లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి 14 ఏళ్ల క్రితం సరిత(34)తో పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా సరిత తరచూ ఫోన్లో ఇతరులతో మాట్లాడుతూ ఉండడం, వాట్సప్‌లో చాటింగ్ చేయడం గమనించిన రాజేశ్‌శర్మ పలు మార్లు భార్యను హెచ్చరించాడు. అయినా, ఆమె తన తీరు మార్చుకోలేదు. బుధవారం నాడు పనికి వెళ్లకుండా ఇంటివద్దనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో సరిత ఎవరితోతో ఫోన్లో మాట్లాడడం గమనించిన రాజేశ్‌శర్మ ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. బాగా కోపం వచ్చిన రాజేశ్‌శర్మ పక్కనే ఉన్న ఇనుపరాడుతో సరిత తలపై బాదాడు. దీంతో సరిత రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అతడు మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు'
అలీగఢ్: మదరసాలపై ఓ ప్రొఫెసర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మదరసాల గురించి మాట్లాడుతూ 'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం విద్యార్థులు బాగుపడాలంటే మదరసాలపై నిషేధం విధించాలని సూచించారు. యూనివర్సిటీలోని హిస్టరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వసీం రాజా తన వాట్సాప్ ద్వారా ఓ టీవీ ఛానల్‌కు ఈ సందేశాన్ని పంపించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులలో స్వలింగ సంపర్కులు ఉన్నారని, ఇతర మదరసాలలో కూడా ఇటువంటి వ్యవహారం నడుస్తోందంటూ ఆ ప్రొఫెసర్ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. . తాను సార్క్ దేశాల సదస్సులలో పాల్గొన్నానని, ఎప్పుడూ వర్గాలు, మతాల పునరుద్ధరణ అంశాలపై మాట్లాడుతుంటానని చెప్పారు. మదరసా అనేది మతానికి సంబంధించినది కాదని తన అభిప్రాయం అన్నారు. ఇక వాట్సాప్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా... ఆ సందేశాలు తాను పంపలేదని, తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ప్రొఫెసర్ వసీం తెలిపారు. కాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఆ వీడియోపై విద్యార్థులు మండిపడుతున్నారు. వసీం రాజా వ్యాఖ్యలను యూనివర్సిటీ డైరెక్టర్ రషీద్ షాజ్ ఖండించారు. మదరసా విద్యార్థులు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంటారని అన్నారు.