బ్యాంకుల్లో లోన్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకునే రుణాలపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా బిజినెజ్ లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కానీ బ్యాంకుల్లో రుణం అంత సులువుగా లభించదు. క్రెడిట్ స్కోర్, ఆదాయ మార్గం.. ఇలా చాలా అంశాలను బ్యాంకులు పరగణనలోకి తీసుకుని లోన్ మంజూరు చేస్తాయి.
టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ సర్వీసులు కూడా చాలా సులభతరం అయ్యాయి. బిల్లుల చెల్లింపు, పేమెంట్ చెల్లింపు, మనీ సెండ్, మనీ రిసీవ్ ఇలా చాలా పనులు ఇప్పుడు సెకన్లలోనే అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆన్‌లైన్ లోన్లు ఎక్కువయ్యాయి. కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమరపాటుగా ఉంటే అసలుకే ముప్పు రావొచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవాల్సి ఉంటుంది.
వాట్సాప్ గ్రూప్‌లో చేరితే చాలంటూ..
ఇటీవల కాలంలో వాట్సాప్ స్కామ్‌ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే చాలు క్షణాల్లో లోన్ పొందొచ్చు అంటూ జరుగుతున్న మోసం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కస్టమర్లను హెచ్చరిస్తోంది.
'మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంటే.. వెంటనే రూ.50 వేలు ఉచితంగా పొందొచ్చు. వరల్డ్ డిజిటల్ లోన్ కింద బ్యాంక్ రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఇంట్లో నుంచే మీరు ఈ లోన్ పొందొచ్చు. నిమిషాల్లో రుణం వస్తుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి లోన్ పొందొచ్చు' అంటూ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోందని బ్యాంక్ తెలిపింది.
ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాల బారిన పడవద్దని బ్యాంక్ కస్టమర్లను కోరుతోంది. ఇలాంటి మోసపూరిత వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావొద్దని సూచించింది. బ్యాంక్ ఎప్పుడూ కస్టమర్లను ఇలా వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వమని కోరదని, బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment