Bank customers
-
Bank holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! నవంబర్‌లో సెలవులు ఇవే..
Bank holidays in November 2023: అక్టోబర్ నెల ముగుస్తోంది. నవంబర్‌లోకి అడుగు పెట్టబోతున్నాం. పండుగ సీజన్ కావడంతో నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కస్టమర్లు తమ ఆర్థిక కార్యకలాపాలను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేసింది. నవంబర్‌లో దీపావళి, గోవర్ధన్ పూజ, ఛత్ పూజ, సాధారణ వారాంతాలతో సహా దేశంలోని పలు రాష్ట్రాలలో సెలవులతో కలుపుకొని మొత్తం 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. నవంబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే.. నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం/కుట్/కర్వా చౌత్ (కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 5 - ఆదివారం నవంబర్ 10 - వంగల పండుగ (మేఘాలయ) నవంబర్ 11 - రెండవ శనివారం (వీక్లీ ఆఫ్) నవంబర్ 12 - ఆదివారం (వీక్లీ ఆఫ్) నవంబర్ 13 - గోవర్ధన్ పూజ/లక్ష్మీపూజ (త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర) నవంబర్ 14 - దీపావళి నవంబర్ 15 - భాయ్ దూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/నింగల్ చక్కుబా/భ్రాత్రి ద్వితీయ (సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 19, 2023 - ఆదివారం నవంబర్ 20 - ఛత్ (బిహార్, రాజస్థాన్) నవంబర్ 23 - సెంగ్ కుట్ స్నెమ్/ఇగాస్ బగ్వాల్ (ఉత్తరాఖండ్, సిక్కిం) నవంబర్ 25 - నాల్గవ శనివారం నవంబర్ 26 - ఆదివారం నవంబర్ 27 - గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ (త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్ - తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 30 - కనకదాస జయంతి (కర్ణాటక) -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! బ్యాంక్ అత్యవసర ప్రకటన!
SBI customers alert: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం అత్యవసర ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో ఎస్బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేసింది. కారణం ఇదే.. ఎస్బీఐ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ చేపట్టింది. దీని కారణంగా ఎస్బీఐ కస్టమర్లకు యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎస్బీఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్ ద్వారా తెలియజేసింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్న ఎస్బీఐ త్వరలోనే సమస్యను పరిష్కరిస్కామని వివరించింది. దేశంలో యూపీఐ చెల్లింపులు 2016లో ప్రారంభమయ్యాయి. డిజిటల్ పేమెంట్లు విస్తృతం కావడంతో నాటి నుంచి నేటి వరకూ యూపీఐ లావాదేవీలు అనేక రెట్లు పెరిగాయి. 2018 జనవరిలో 151 మిలియన్లు ఉన్న యూపీఐ లావాదేవీల సంఖ్య 2023 జూన్ నాటికి 9.3 బిలియన్లకు చేరింది. pic.twitter.com/yi5DVQjkYi — State Bank of India (@TheOfficialSBI) October 14, 2023 -
ఎస్బీఐ వినూత్న ఐడియా! ఈఎంఐలు కట్టనివారి కోసం..
బ్యాంకులో లోన్లు తీసుకుని ఈఎంఐలు సక్రమంగా కట్టనివారి నుంచి బకాయిలు రాబట్టేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినూత్న ఐడియా వేసింది. ఈఎంఐలు చెల్లించనివారికి ఇక నోటీసులు, ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా ఇంటికే వెళ్లి చేతిలో చాక్లెట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పి వాయిదా కట్టేలా చేస్తోంది. (ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు) ఈఎంఐ చెల్లించకుండా తప్పించుకోవాలనుకుంటున్న కస్టమర్లు.. సాధారణంగా బ్యాంక్ చేసే రిమైండర్ కాల్‌కు స్పందించరు. కాబట్టి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా కస్టమర్లకు ఇంటికే వెళ్లి గుర్తు చేయడం ఉత్తమ మార్గమని ఎస్బీఐ భావిస్తోంది. వడ్డీ రేట్లలో కదలికల నేపథ్యంలో ఈఎంఐలు చెల్లింపుల్లో జాప్యాలు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన వసూళ్లను సాధించడానికి ఎస్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ 2023 జూన్ త్రైమాసికంలో గతేడాది రూ.10,34,111 కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. ఇక మొత్తం రిటైల్ రుణాలు 13.9 శాతం వృద్ధి చెంది రూ. 33,03,731 కోట్లకు చేరుకున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే రెండు ఫిన్‌టెక్ కంపెనీలతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్బీఐలో రిస్క్ విభాగానికి ఇన్చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ఈ ఫిన్‌టెక్ ప్రతినిధులు ఈఎంఐ చెల్లించని కస్టమర్ల ఇళ్లకు వెళ్లి చాక్లెట్ల ప్యాక్ ఇచ్చి ఈఎంఐ బకాయిని గుర్తుచేస్తారని పేర్కన్నారు. అయితే ఆ ఫిన్‌టెక్‌ల పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ చర్య కేవలం పైలట్ దశలో ఉందని, కేవలం 15 రోజుల క్రితమే దీనిని అమలులోకి తెచ్చామని, విజయవంతమైతే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వివరించారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్ (Indian Bank) కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ‘ఐబీ సాథీ’ (IB SAATHI - సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్‌క్లూజన్)ను రూపొందించింది. ‘ఐబీ సాథీ’ కస్టమర్లకు అవసరమైన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలతో పాటు అదనపు సర్వీసులు అందించడాన్ని సులభతరం చేస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎల్ జైన్ చెన్నైలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ‘ఐబీ సాథీ’ కార్యక్రమం ద్వారా ఇండియన్ బ్యాంక్ తన అన్ని శాఖలలో రోజుకు కనీసం నాలుగు గంటల పాటు కస్టమర్లకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ కరస్పాండెంట్లు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) ఇందు కోసం 2024 మార్చి నాటికి సుమారు 5,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని ఇండియన్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల కస్టమర్లకు మరింత చేరువ కావచ్చని భావిస్తోంది. 36 రకాల సేవలు ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుతం 10,750 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, 10 మంది కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సంఖ్యను 15,000లకు, కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ల సంఖ్య 15కు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ తన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లకు 36 రకాల సేవలు అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా సేవలు పెరగనున్నాయి. -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: చిటికెలో రూ.50వేల లోన్! నమ్మారో..
బ్యాంకుల్లో లోన్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకునే రుణాలపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా బిజినెజ్ లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కానీ బ్యాంకుల్లో రుణం అంత సులువుగా లభించదు. క్రెడిట్ స్కోర్, ఆదాయ మార్గం.. ఇలా చాలా అంశాలను బ్యాంకులు పరగణనలోకి తీసుకుని లోన్ మంజూరు చేస్తాయి. టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ సర్వీసులు కూడా చాలా సులభతరం అయ్యాయి. బిల్లుల చెల్లింపు, పేమెంట్ చెల్లింపు, మనీ సెండ్, మనీ రిసీవ్ ఇలా చాలా పనులు ఇప్పుడు సెకన్లలోనే అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆన్లైన్ లోన్లు ఎక్కువయ్యాయి. కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమరపాటుగా ఉంటే అసలుకే ముప్పు రావొచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో చేరితే చాలంటూ.. ఇటీవల కాలంలో వాట్సాప్ స్కామ్‌ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే చాలు క్షణాల్లో లోన్ పొందొచ్చు అంటూ జరుగుతున్న మోసం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కస్టమర్లను హెచ్చరిస్తోంది. 'మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంటే.. వెంటనే రూ.50 వేలు ఉచితంగా పొందొచ్చు. వరల్డ్ డిజిటల్ లోన్ కింద బ్యాంక్ రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఇంట్లో నుంచే మీరు ఈ లోన్ పొందొచ్చు. నిమిషాల్లో రుణం వస్తుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి లోన్ పొందొచ్చు' అంటూ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోందని బ్యాంక్ తెలిపింది. ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాల బారిన పడవద్దని బ్యాంక్ కస్టమర్లను కోరుతోంది. ఇలాంటి మోసపూరిత వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావొద్దని సూచించింది. బ్యాంక్ ఎప్పుడూ కస్టమర్లను ఇలా వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వమని కోరదని, బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించింది. -
రూ. వేల కోట్ల చార్జీల ఎఫెక్ట్: బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 2018 నుంచి జరిమానా ఛార్జీల రూపంలో ఖాతాదారుల నుంచి రూ. 35,000 కోట్లకు పైగా వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. ఇందులో మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంపై రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల ద్వారా రూ.6,254.3 కోట్లు వసూలు చేశాయి. బ్యాంకులు చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి ఇన్ని వేల కోట్లు వసూలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సురక్షిత రుణ విధానాలపై తన ఆదేశాలలో భాగంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన రుణగ్రహీతలపై జరిమానా రూపంలో అదనపు వడ్డీని విధించవద్దని బ్యాంకులను కోరింది. బ్యాంకులు జరిమానా రూపంలో విధించే వడ్డీలు, ఛార్జీలను ఆదాయ మార్గంగా చూడకూడదని, ఒప్పందం ప్రకారం విధించే వడ్డీని మించి అదనపు వడ్డీని కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. రుణ ఖాతాలపై విధించే జరిమానా ఛార్జీలను నియంత్రించాలని ప్రతిపాదించిన ఏప్రిల్ 12 నాటి ముసాయిదా సర్క్యులర్‌కు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు ఇవే.. నిబంధనల ఉల్లంఘించినందుకు రుణ ఖాతాలపై ఎలాంటి వడ్డీ విధించకూడదు. ఒక సారి అపరాధ రుసుము విధించిట్లయితే, ఈ ఛార్జీలపై అదనపు వడ్డీ వేయకూడదు. వసూలు చేసే వడ్డీపై అదనంగా ఎటువంటి వడ్డీలు కానీ, చార్జీలు కానీ విధించకూడదు. జరిమానాలు సహేతుకంగా నిబంధనల ఉల్లంఘనల తీవ్రతకు అనుగుణంగా ఉండాలి. ఏదైనా నిర్దిష్ట రుణ ఉత్పత్తిపై ఇవి మరీ ఎక్కువగా ఉండకూడదు. వ్యక్తిగత రుణగ్రహీతలకు విధించే జరిమానా ఛార్జీలు.. ఇతర రుణగ్రహీతలకు విధించే దాని కంటే ఎక్కువగా ఉండకూడదు. జరిమానా మొత్తం, విధించడానికి గల కారణాలను ఆయా బ్యాంకులు, సంస్థలు స్పష్టంగా వెల్లడించాలి. సురక్షిత రుణ విధానాలకు సంబంధించిన కొత్త నిబంధనలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే, ఇవి క్రెడిట్ కార్డ్‌లు, బాహ్య వాణిజ్య రుణాలు, వాణిజ్య క్రెడిట్లు, స్ట్రక్చర్డ్ ఆబ్లిగేషన్లకు వర్తించవు. ఇదీ చదవండి: Search of Unclaimed deposits: బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు.. మీవీ ఉన్నాయా? ఆర్బీఐ పోర్టల్‌లో చెక్ చేయండి.. -
బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!
భారతదేశంలో దాదాపు చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అందులో ఉద్యోగాలు చేసేవారు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు ఇలా అందరూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే సంబంధిత బ్యాంక్ దానికి ఫెనాల్టీ చార్జీలను విధిస్తుంది. ఈ విధానం బ్యాంక్ ఖాతాదారులకు తలనొప్పిగా మారిపోయింది. అయితే ఈ విధానానికి చరమగీతం పాడటానికి ఆర్బిఐ సన్నద్ధమైంది. సేవింగ్ అకౌంట్లో బ్యాలన్స్ సున్నా ఉన్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు విధించే చార్జీలను నిలిపివేయాలని ఆర్బిఐ బ్యాంకులను కోరింది. గతంలోనే ఈ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ.. కొన్ని బ్యాంకులు మాత్రమే పాత పద్ధతినే పాటిస్తున్నాయి. ఆర్బిఐ అందించిన సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత, కస్టమర్ తన ఉద్యోగాన్ని మార్చుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. అప్పుడు మునుపటి అకౌంట్ లావాదేవీలు దాదాపు నిలిచిపోతాయి. లావాదేవీలు నిలిచిపోయిన తరువాత బ్యాంక్ దానికి ఫెనాల్టీ విధిస్తుంది. అప్పుడు బ్యాలన్స్ మైనస్‌లోకి వెళ్ళిపోతుంది. బ్యాంక్ ఆ మొత్తాన్ని రికవరీ చేయనప్పటికీ.. ఒకవేళా అకౌంట్లోకి డబ్బు జమ చేసినప్పుడు చెలించాల్సిన మొత్తం ఆటోమాటిక్‌గా కట్ అవుతుంది. దీని వల్ల వినియోగదారుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిమిషం.. ఇవి తెలుసుకోండి!) ఇదిలా ఉంటే 'హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్' మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయదని, అంతే కాకుండా మళ్ళీ ఆ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా డబ్బు వసూలు చేయదని చెబుతున్నారు. దీనితో పాటు యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోలో ఉన్నా.. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా కూడా ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విధానాన్ని ఏదైనా బ్యాంక్ అనుసరించకపోతే లేదా మీ అకౌంట్ నెగెటివ్ బ్యాలెన్స్‌లోకి వెళ్తే దీనిపైన మీరు ఆర్బిఐకి పిర్యాదు చేయవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీఅభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. Source: RBI -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! ఈ బ్యాంకులో కొత్త రూల్..
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కు చెల్లింపుల విషయంలో కొత్త రూల్ తీసుకొస్తోంది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రూల్ మోసపూరిత చెక్కుల చెల్లింపు నుంచి కస్టమర్లను కాపాడుతుంది. ఇంతకుముందు రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పీపీఎస్‌లో చెక్కు వివరాలను సమర్పించాల్సి ఉండేది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్, చెక్కు నంబర్, చెక్కు ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, చెక్కు మొత్తం, లబ్ధిదారు పేరుతో సహా అవసరమైన వివరాలను కస్టమర్లు పీపీఎస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మోసాలు జరిగే అవకాశం తగ్గుతుందని బ్యాంకు పేర్కొంటోంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి కస్టమర్లు ఈ పీపీఎస్ సౌకర్యాన్ని బ్యాంకు బ్రాంచ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. చెక్కు ప్రెజెంటేషన్ లేదా క్లియరింగ్ తేదీకి ఒక రోజు ముందుగా చెక్కు వివరాలను పీపీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ క్లియరింగ్‌లో సమర్పించే రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు పీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. రూ. 5 లక్షల లోపు చెక్కులకు ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారు ఇష్టం. అయితే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం మాత్రం దీన్ని తప్పనిసరి చేయవచ్చని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. -
కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును 35 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణ రేట్లు మరింత పెరగనున్నాయి. కొత్త రేటు జనవరి 12వ తేదీ నుంచి అమలవుతుంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది. నెల, మూడు, ఆరు, ఏడాది రేట్లు వరుసగా 8.15 శాతం, 8.25 శాతం, 8.35 శాతం, 8.50 శాతాలకు పెరిగాయి. పలు వాహన, వ్యక్తిగత, గృహ రుణాలకు ఏడాది రుణ రేటు అనుసంధానమై ఉండే సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు సోమవారం రుణ రేటను 25 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఐఓబీ డిపాజిట్ల రేట్లు అప్ కాగా, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)రిటైల్ డిపాజిట్ రేటును తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 45 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని ప్రకారం 444 రోజుల కాలానికి డిపాజిట్లపై 7.75 శాతం రేటు అమలవుతుంది. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ రేటును కూడా మంగళవారం నుంచి బ్యాంక్ 1% పెంచింది. దీనితో ఈ రేటు 5 శాతానికి చేరింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే!
అక్టోబరు నెల వస్తే బ్యాంక్ కస్టమర్లు వారి ఆర్థిక లావాదేవీలను ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల దాదాపు పండుగలతో మనముందుకు వస్తుంది. ఈ ఏడాది పండుగలను పరిశీలిస్తే.. దసరా, దుర్గాపూజ, దీపావళి, ఛత్ పూజ వంటి అనేక ఇతర ముఖ్యమైన పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. ఈ సెలవులు నెలలో వచ్చే పండుగలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు వంటి రెగ్యులర్ హాలిడేస్ కూడా కలిపి ఎక్కువ రోజులే ఉన్నాయి. ఈ సారి అక్టోబర్ 3 నుంచి 7 రోజులు ఈ నగరాల్లో బ్యాంకులు పని చేయవు. ఈ విషయాన్ని గమనించి కస్టమర్లు బ్యాంకుల్లో అత్యవసర పనులు ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అక్టోబర్ 3 నుంచి బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1 సందర్భంగా బ్యాంకులు హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ సందర్భంగా పని చేయలేదు. ఇక ఈరోజ అక్టోబర్ 2న కూడా గాంధీ జయంతి ఉంది. అలాగే ఆదివారం కూడా. అక్టోబర్ 3న దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులకు పని చేయవు. అగర్తలా, భువనేశ్వర్, గువాహటి, ఇంపాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీలో ఈ సెలవు వర్తిస్తుంది. ఇక మిగతా ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయని గుర్తించుకోవాలి. అక్టోబర్ 4: దుర్గాపూజ/దసరా (మహా నవమి)/ఆయుధ పూజ/ శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం సందర్భంగా.. అగర్తల, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 5: దుర్గాపూజ/దసరా (విజయదశమి) సందర్భంగా.. ఆ రోజు ఇంఫాల్ మినహా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 6: దుర్గా పూజ(దసైన్) సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పని చేయవు. అక్టోబర్ 7: గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్ హాలిడే ఉంది. అక్టోబర్ 8: రెండో శనివారం సందర్బంగా బ్యాంకులు పని చేయవు. అలాగే ఆ రోజు మహమ్మద్ ప్రవక్త జయంతి కూడా ఉంది. భోపాల్, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరుపనంతపురంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 9: ఆదివారం రెగ్యులర్ సెలవు. కాగా బ్యాంక్ సెలవులనేవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అయితే కస్టమర్లలు బ్యాంక్ హాలిడేస్‌లో కూడా ఆన్లైన్ సేవలు.. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్! -
బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. అక్టోబర్‌లో 21 రోజులు సెలవులు
-
ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు!
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పండుగ సీజన్ పురస్కరించుకుని తమ కస్టమర్ల కోసం ’ఫెస్టివ్ బొనాంజా’ పేరిట ప్రత్యేక ఆఫర్లనక్ప్రకటించింది. తమ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్జూమర్ ఫైనాన్స్, కార్డ్‌లెస్ ఈఎంఐ మొదలైన వాటి ద్వారా రూ. 25,000 వరకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు పొందవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, బిగ్‌బాస్కెట్, అజియో, రిలయన్స్ డిజిటల్, క్రోమా తదితర సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంకు ఈడీ రాకేష్ ఝా తెలిపారు. రుణాలపై కూడా (గృహ, వ్యక్తిగత, బంగారం రుణాలు మొదలైనవి) ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చని వివరించారు. వీటితో పాటు బ్యాంక్ పేర్కొన్న వస్తువులను కొనుగోళ్లు చేసే కస్టమర్లకు కార్డ్‌లెస్ ఈఎంఐ(EMI), 'నో-కాస్ట్ ఈఎంఐ(EMI) వంటి సౌకర్యాలను అందిస్తోంది. ప్రముఖ బ్రాండ్లు & ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంపై ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, టాటా క్లిక్ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలో ఆన్లైన్ షాపింగ్‌పై 10% తగ్గింపు. గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు: అర్మానీ ఎక్స్ఛేంజ్, కెనాలి, క్లార్క్స్, డీజిల్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్, పాల్ & షార్క్, సత్య పాల్, స్టీవ్ మాడెన్, బ్రూక్స్ & బ్రదర్స్ వంటి లగ్జరీ బ్రాండ్లపై అదనపు 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్ & గాడ్జెట్లపై ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లలో 10% వరకు క్యాష్‌బ్యాక్. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్‌లో కస్టమర్లు ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా పొందవచ్చు. దుస్తులు & ఆభరణాలు: షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, అజియో, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ దుస్తుల బ్రాండ్లపై అదనంగా 10% తగ్గింపు. అలాగే పీసీ జ్యువెలర్స్ (PCJ) నుంచి కనీసం ₹50,000 కొనుగోలుపై ₹2,500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్ -
బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ భారీ షాక్
-
16 కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లకు మంచిరోజులు!
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న 16 కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లు.. ఒక్కొక్కరికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద గరిష్టంగా రూ.5 లక్షల వరకు దక్కనుంది. డీఐసీజీసీ 21 బ్యాంకులతో ఒక జాబితాను రూపొందించగా.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సహా ఐదు బ్యాంకులను ఈ పథకం కింద మినహాయించింది. డీఐసీజీసీ కింద బ్యాంకులు సంక్షోభం పాలైతే.. డిపాజిట్ దారునకు గరిష్టంగా రూ.5లక్షలు పరిహారం చెల్లించే బిల్లుకు పార్లమెంటు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆమోదం తెలుపగా.. సెప్టెంబర్ 1న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
డిజిటల్ లావాదేవీలపట్ల జాగ్రత్త: ఎస్బీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలపట్ల బ్యాంక్ వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. తెలియని నంబర్లు, ఈ–మెయిల్ ద్వారా వచ్చే లింక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సూచించారు. ‘కస్టమర్లకు ఎస్బీఐ ఎటువంటి లింక్స్ పంపదు. ఓటీపీ చెప్పాలంటూ ఫోన్ ద్వారా మా బ్యాంక్ సిబ్బంది కోరరు. బ్యాంక్ శాఖ ద్వారానే లావాదేవీలు ఉంటాయి. ఓటీపీలు, సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదు’ అని వివరించారు. ఎస్బీఐ ‘మీటింగ్ కస్టమర్స్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాల యానికి గురువారం ఆయన విచ్చేశారు. చాలా ఏళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ తమ కస్టమర్‌గా ఉం దని గుర్తుచేశారు. అద్భుతమైన సంస్థకు రావ డం ఆనందంగా ఉందన్నారు. సీజీఎంతోపాటు బ్యాంక్ అధికారులు సురేంద్ర నాయక్, పి.ఎల్.శ్రీనివాస్ రావు, పల్లవి శర్మ, మారుతి, సంతోష్ ఉన్నారు. -
బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక
బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంకు వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్తగా దాడులు చేస్తున్న మాల్వేర్ గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తూ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్'ను డ్రినిక్ అనే పేరుతో పిలుస్తున్నారు. 5 సంవత్సరాల క్రితం దీనిని ఎస్ఎంఎస్ దొంగిలించడానికి ఉపయోగించేవారు. అయితే, ఇటీవల బ్యాంకు వినియోగదారుల సమాచారాన్ని దొంగలించేలా హ్యాకర్లు 'డ్రినిక్ మాల్వేర్'ను అభివృద్ధి చేశారు. సున్నితమైన బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి దీనిని తయారు చేశారు. ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో సహా 27కి పైగా భారతీయ బ్యాంకుల వినియోగదారులను ఇప్పటికే ఈ మాల్వేర్ ఉపయోగించి దాడి చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సీఈఆర్ టీ-ఇన్ తెలిపింది. ఒక్కసారి దాడి జరిగితే ఖాతాదారుల సున్నితమైన డేటా, గోప్యత, భద్రతను గట్టిగా దెబ్బతీస్తాయని, అలాగే పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు అవకాశం ఉన్నట్లు సీఈఆర్ టీ-ఇన్ పేర్కొంది.(చదవండి: నకిలీ ఎస్ఎంఎస్.. హానికరమైన యాప్!) ఈ కొత్త మాల్వేర్ ఎలా పనిచేస్తుంది? బాధితుడు ఫిషింగ్ వెబ్సైట్ లింక్ కలిగి ఉన్న ఎస్ఎమ్ఎస్(ఆదాయపు పన్ను శాఖ, భారత ప్రభుత్వ వెబ్సైట్ పేరుతో) అందుకుంటారు. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తి చేయడం కోసం వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి, హానికరమైన ఎపికె(APK) ఫైలును డౌన్లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయాలని కోరుతారు. ఈ హానికరమైన ఆండ్రాయిడ్ యాప్ ఆదాయపు పన్ను శాఖ/ ఇతర ప్రభుత్వ యాప్ పేరుతో ఉండవచ్చు. ఒకవేల ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ఎమ్ఎస్, కాల్ లాగ్, కాంటాక్ట్ మొదలైన అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని యాప్ యూజర్ ని కోరుతుంది.(చదవండి: చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా!) ఒకవేళ యూజర్ వెబ్సైట్లో ఎలాంటి సమాచారాన్ని నమోదు చేయకపోయిన, అనుమతులు ఇవ్వకపోయిన మీరు ముందుకు కొనసాగలేరు. ముందుకు సాగడం కోసం యూజర్ ని వివరాలు, అనుమతులు ఇవ్వాలని కోరుతుంది. ఆ తర్వాత డేటాలో పూర్తి పేరు, పాన్, ఆధార్ నెంబరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ చిరునామా, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్, సీఐఎఫ్ నెంబరు, డెబిట్ కార్డు నెంబరు, గడువు తేదీ, సీవీవీ, పిన్ వంటి ఆర్థిక వివరాలు ఉంటాయి. ఈ వివరాలను యూజర్ నమోదు చేసిన తర్వాత యూజర్ బ్యాంక్ ఖాతాకు రీఫండ్ చేసిన డబ్బు మొత్తం బ్యాంకు ఖాతాలో జమాచేయలా? అని అప్లికేషన్ పేర్కొంటుంది. వినియోగదారుడు గనుక అమౌంట్ లోనికి ప్రవేశించి "బదిలీ(Transfer)" క్లిక్ చేసినప్పుడు, అప్లికేషన్ ఒక నకిలీ అప్ డేట్ స్క్రీన్ ప్రదర్శిస్తుంది. కాబట్టి, బ్యాంక్ ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఫేక్ ఎస్ఎమ్ఎస్, కాల్స్, యాప్స్, వెబ్సైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిస్తుంది. ఏదైన అప్లికేషన్ ప్లే స్టోర్/ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఎవరైనా లేదా ఎక్కడైనా మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం కానీ, నమోదు చేయడం కానీ చేయవద్దు నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ఎప్పుడు మీ ఆర్ధిక వివరాలు ఆడగవని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. -
అందరూ బీమా చేయించుకోవాలి
అలంపూర్ రూరల్ : బ్యాంకు ఖాతాదారులు తప్పక బీమా చేయించుకోవాలని రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) శ్రీధర్ సూచించారు. బుధవారం అలంపూర్ మండలంలోని సింగవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి రాచబాట అవుతుందన్నారు. సాధ్యమైనంత వరకు తెలిసిన వారికే నగదు బదిలీలు చేయాలన్నారు. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితమని, ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మెన్ విభాగం పనిచేస్తోందన్నారు. రూరల్ ఎంప్లాయిమెంట్‌పై ప్రత్యేకంగా మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇందులో సర్టిఫికెట్ పొందిన వారికి రూ.లక్ష వరకు రుణాలు ఇస్తామన్నారు. అనంతరం డీడీఎం రవీంద్రనాయక్ మాట్లాడుతూ గ్రామాన్ని అలంపూర్ ఆంధ్రాబ్యాంకు దత్తత తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కాంతమ్మ, జోగుళాంబ ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ రాధాకృష్ణ, ఎంపీడీఓ మల్లికార్జున్, ఆంధ్రాబ్యాంకు మేనేజర్ రాఘవ విశ్వనాథ్, బ్యాంకు ఉద్యోగి గోపి, గ్రామస్తులు నాగేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బ్యాంకు ఖాతాదారులే టార్గెట్..!
హుజూర్నగర్ :బ్యాంకు ఖాతాదారుల అజాగ్రత్తను గుర్తుతెలియని వ్యక్తులు చాకచాక్యంగా సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్న నగదును తమ వాహనాల డిక్కీల భద్రపరుచుకుని పక్కకు వెళ్లి వచ్చేలోపే దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. హుజూర్‌నగర్‌లో ఇటీవల జరిగిన వరుస చో రీలను గమనిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతోంది. ప్రస్తుతం ఈ విషయం నియోజకవర్గ కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఖాతాదారులు బ్యాంకుల నుంచి నగదును డ్రా చేయాలంటేనే జంకుతున్నారు. అజాగ్రత్తే ప్రధాన కారణం హుజూర్‌నగర్‌లో వాహనాల డిక్కీల నుంచి మాయమవుతున్న నగదుకు అజాగ్రత్తే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్న నగదు ను సదరు వ్యక్తులు డిక్కీలో భద్రపరుచుకుని నేరుగా ఇంటికి వెళ్లకుండా ఇతరత్ర పనులు చూసుకుంటున్న క్రమంలోనే చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందిన కట్టా కృష్ణారావు బ్యాంకు నుంచి డ్రా చేసుకున్న రూ.5 లక్షల నుంచి రూ.4.50 లక్షలను అతని వా హనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది నిమిషాల్లోనే మాయం చేశారు. అయితే కృష్ణారావు తన వాహనాన్ని ఓ దుకాణం ముందు నిలిపి ఇతర పని చూసుకుంటున్న క్రమంలో ఈ చోరీ జరిగింది. అదే కృష్ణారావు నేరుగా ఇంటికి వెళ్లి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గతంలో మేళ్లచెరువు మండ లం మల్లారెడ్డిగూడేనికి చెంది న ఓ వ్యక్తి స్థానికంగా గల ఎస్బీహెచ్ నుంచి రూ. 47,000లను డ్రా చేసి తన మోటార్‌సైకిల్ డిక్కీలో పెట్టుకొని ఓ బట్టల దుకాణంలోకి వెళ్లినప్పుడు, పట్టణానికి చెందిన మరో ధా న్యం వ్యాపారి స్థాని కంగా గల పార్బాయిల్డ్ మిల్లు నుంచి రూ.85,000ల నగదును తీసుకొని తన హీరోహోండా మోటార్ సైకిల్ డిక్కీలో పెట్టుకొని ఇందిరాసెంటర్‌లోని టీ స్టాల్ వద్ద వాహనాన్ని పార్కింగ్ చే సి అజాగ్రత్తగా ఉన్నప్పుడే చోరీలు జరిగాయి. పోలీసులు ఏమంటున్నారంటే.. బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసుకునే వ్యక్తులు చాల జాగ్రత్తంగా ఉండాలని ఎస్ఐ వెంకటశివరావు అన్నారు. నగదును వెంట తీసుకువెళ్లే వారికి ఆయన కొన్ని సూచనలు చేశారు. పెద్ద మొత్తంలో నగదును డ్రా చేసినప్పుడు వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి. వీలైతే వెంట ఓ వ్యక్తిని తోడుగా తీసుకువెళ్లాలి.తమను సహాయం కోరినా వెంట ఓ కానిస్టేబుల్‌ను రక్షణగా పంపిస్తాం. తమను ఎవరైనా గమనిస్తున్నారనే విషయాన్ని పసిగట్టగలగాలి. అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణంలోని బ్యాంకుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కలెక్టరేట్లో ఏం జరుగుతోంది?
సాక్షి, నల్లగొండ: ఉన్నట్టుండి కలెక్టరేట్ సముదాయంలో కొన్నిరోజులుగా మార్పులు జరుగుతున్నాయి. సముదాయం వెనుకభాగంలో ఉన్న రెండు గేట్లను మూసివేయించారు. దీంతో ఆ పక్క రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన గేటు ద్వారానే రాకపోకలు సాగుతున్నాయి. గతంలో ఓసారి ఒక గేటుకు మాత్రమే తాళం వేశారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసేశారు. ఉన్నపళంగా పది రోజుల క్రితం రెండు గేట్లకు తాళం వేయడమేగాక, భవిష్యత్‌లో తెరవకుండా అడ్డంగా గోడలు నిర్మించారు. వాస్తవంగా సంక్షేమభవన్‌లో ఉన్న పలు కార్యాలయాతోపాటు ట్రెజరీ, భూ కొలతలు- రికార్డుల విభాగం, ఉద్యానవనశాఖ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, బ్యాంక్ ఖాతాదారులు ఆ గేట్ల ద్వారానే రాకపోకలు జరిపేవారు. ఆయా కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు సైతం ఇక్కడి నుంచే వచ్చిపోయేవారు. ఇవి ఉండడం వల్ల ప్రధాన గేటు వద్ద ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడి వంటి కార్యక్రమాలు జరిగినప్పుడు సిబ్బంది ఎటువంటి ఇబ్బందులకూ గురికాలేదు. పకడ్బందీ చర్యలు... రానున్న కాలంలో ప్రతి ఉద్యోగీ గుర్తింపు కార్డు కల్గి ఉంటేనే కలెక్టరేట్‌లోనికి అడుగు పెట్టాల్సి ఉంటుంది. వాహనాలకూ ఇదే వర్తిస్తుంది. పాస్‌లు తీసుకుంటేనే లోనికి అనుమతిస్తారు. వీటన్నింటినీ అమలు చేయడానికి జిల్లా యం త్రాంగం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. తమ పరిధిలో ఉన్న ఉద్యోగులకు, సిబ్బందికి గుర్తింపు కార్డులు అందజేయాలని ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. అంతేగాక అన్ని కార్యాలయాల్లో సీసీ కె మెరాలు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు. కలెక్టరేట్ చుట్టూ ఉన్న ప్రహరీ ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రహరీపై రక్షణ కంచెను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పైగా ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ గది నిర్మించనున్నట్టు సమాచారం. ఇక్కడ 24 గంటలపాటు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. లోనికి వెళ్లడానికి పాస్లూ ఇక్కడే అందజేస్తారు. కలెక్టరేట్ ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలు సముదాయం పరిధిలో జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఆందోళన కార్యక్రమాలకు ప్రత్యామ్నాయంగా మేకల అభినవ్ స్టేడియం వద్దకు పంపించే యోచనలో ఉన్నారు. ఈ మేరకు అన్ని రాజకీయపార్టీలు, సంఘాలు, నా యకులతోచర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, కల్టెరేట్ సముదాయంలో దాదాపు 33 శాఖల కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరి ధిలో సుమారు700మంది అధికారు లు, ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పనుల నిమిత్తం నిత్యం వందల మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. సోమవారం గ్రీవెన్స్ డేకు భారీగా బాధితులు వచ్చి పోతుంటారు. వీరందరికీ పాస్‌లు ఇచ్చి లోనికి పంపించడంలో ఏ మేరకు సఫలమవుతారో చూడాలి.