సాక్షి, నల్లగొండ: ఉన్నట్టుండి కలెక్టరేట్ సముదాయంలో కొన్నిరోజులుగా మార్పులు జరుగుతున్నాయి. సముదాయం వెనుకభాగంలో ఉన్న రెండు గేట్లను మూసివేయించారు. దీంతో ఆ పక్క రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన గేటు ద్వారానే రాకపోకలు సాగుతున్నాయి. గతంలో ఓసారి ఒక గేటుకు మాత్రమే తాళం వేశారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసేశారు. ఉన్నపళంగా పది రోజుల క్రితం రెండు గేట్లకు తాళం వేయడమేగాక, భవిష్యత్‌లో తెరవకుండా అడ్డంగా గోడలు నిర్మించారు. వాస్తవంగా సంక్షేమభవన్‌లో ఉన్న పలు కార్యాలయాతోపాటు ట్రెజరీ, భూ కొలతలు- రికార్డుల విభాగం, ఉద్యానవనశాఖ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, బ్యాంక్ ఖాతాదారులు ఆ గేట్ల ద్వారానే రాకపోకలు జరిపేవారు. ఆయా కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు సైతం ఇక్కడి నుంచే వచ్చిపోయేవారు. ఇవి ఉండడం వల్ల ప్రధాన గేటు వద్ద ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడి వంటి కార్యక్రమాలు జరిగినప్పుడు సిబ్బంది ఎటువంటి ఇబ్బందులకూ గురికాలేదు.
పకడ్బందీ చర్యలు...
రానున్న కాలంలో ప్రతి ఉద్యోగీ గుర్తింపు కార్డు కల్గి ఉంటేనే కలెక్టరేట్‌లోనికి అడుగు పెట్టాల్సి ఉంటుంది. వాహనాలకూ ఇదే వర్తిస్తుంది. పాస్‌లు తీసుకుంటేనే లోనికి అనుమతిస్తారు. వీటన్నింటినీ అమలు చేయడానికి జిల్లా యం త్రాంగం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. తమ పరిధిలో ఉన్న ఉద్యోగులకు, సిబ్బందికి గుర్తింపు కార్డులు అందజేయాలని ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. అంతేగాక అన్ని కార్యాలయాల్లో సీసీ కె మెరాలు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు.
కలెక్టరేట్ చుట్టూ ఉన్న ప్రహరీ ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రహరీపై రక్షణ కంచెను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పైగా ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ గది నిర్మించనున్నట్టు సమాచారం. ఇక్కడ 24 గంటలపాటు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. లోనికి వెళ్లడానికి పాస్‌లూ ఇక్కడే అందజేస్తారు. కలెక్టరేట్ ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలు సముదాయం పరిధిలో జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఆందోళన కార్యక్రమాలకు ప్రత్యామ్నాయంగా మేకల అభినవ్ స్టేడియం వద్దకు పంపించే యోచనలో ఉన్నారు.
ఈ మేరకు అన్ని రాజకీయపార్టీలు, సంఘాలు, నా యకులతోచర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, కల్టెరేట్ సముదాయంలో దాదాపు 33 శాఖల కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరి ధిలో సుమారు700మంది అధికారు లు, ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పనుల నిమిత్తం నిత్యం వందల మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. సోమవారం గ్రీవెన్స్ డేకు భారీగా బాధితులు వచ్చి పోతుంటారు. వీరందరికీ పాస్‌లు ఇచ్చి లోనికి పంపించడంలో ఏ మేరకు సఫలమవుతారో చూడాలి.
కలెక్టరేట్‌లో ఏం జరుగుతోంది?
Published Sat, Dec 28 2013 3:51 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement