నల్లగొండ, న్యూస్‌లైన్ : మండల ప్రజా పరిషత్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు శుక్రవార ం పంచాయితీ రాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల జాబితాను ప్రకటించిన మరుసటి రోజే ఎంపీపీ స్థానాల రిజ ర్వేషన్లు వెలువడడంతో అధికారులు ఆగమేఘాల మీద మండలాల వారీగా రిజర్వేషన్ల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఎంపీపీ స్థానాలు 59 ఉండగా వీటిల్లో జనరల్ 31, మహిళలకు 28 స్థానాలు రిజర్వు చేశారు. కాగా గత రిజర్వేషన్ల జాబితాను, 2011 జనాభా లెక్క లను ప్రాతిపదికగా తీసుకుని ఎంపీపీ స్థానాలను ఖరారు చేయనున్నారు. శనివారం ఆ జాబితాను అధికారికంగా ప్రకటిస్తామని జెడ్పీ సీఈఓ దామోదర్ రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
ఎస్టీలకు జెడ్పీ పీఠం.?
స్థానిక అభ్యర్థులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం గ తంలో రిజర్వేషన్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని 2011 లో జెడ్పీ పీఠం ఎస్టీ జనరల్‌కు కేటాయించా రు. అయి తే అప్పట్లో ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేశారు. తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం మళ్లీ రిజర్వేషన్ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల రిజర్వేషన్ మారుతుందా?.. లే దంటే ఎస్టీలకే ఉంటుందా అన్నది శనివారం అధికారి కంగా తేలనుంది. అధికారులు మాత్రం మార్పు ఉండకపోవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఉక్కిరి బిక్కిరి..
మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణతో అధికారులు ఇప్పటికే తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించాలని సుప్రీంకోర్డు ఆదేశించడంతో అధికారులు ఊపరి సలపకుండా ఉన్నారు. స్థానిక సమరానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఇంత తక్కువ వ్యవధిలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలంటే కష్టసాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, కేంద్రాల వద్ద ఏర్పాట్లను సమీక్షించడం, బందోబస్తు, సిబ్బంది నియామకం వంటి కార్యాచరణ తక్కువ వ్యవధిలో చేయడం తలకు మించిన భారం అవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు
Published Sat, Mar 8 2014 3:46 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement