Reservations finalized
-
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు!
అచ్చంపేట: వరుస ఎన్నికలతో మరోసారి పల్లెలు సందడిగా మారనున్నాయి. లోక్‌సభతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ వరకు ఎన్నికల కోలాహలం ఉండడంతో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఇక అధికారులు ఓటర్లు, మున్సిపల్ వార్డులు, పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో తంతు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మమ్మురమైంది. ఇప్పటికే ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలోని 71మండల ప్రజాపరిషత్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఒక మండలం ఏజెన్సీ ఏరియాలో ఉంది. మిగిలిన 70మండలాల్లో 50శాతం అంటే 35మండలాల ఎంపీపీ స్థానాలను జనరల్‌కు కేటాయించారు. మిగిలిన వాటిలో ఏడు ఎస్టీలకు, 14 ఎస్సీలకు, 14 బీసీలకు రిజర్వ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన, బీసీ రిజర్వేషన్లు ఓటర్ల ప్రకారం నిర్ణయించారు. గతంలో ఇలా.. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు వేయగా, ఎంపీటీసీలు ఆయా మండలాల్లో సమర్పించేవారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సవరించి జెడ్పీటీసీలు మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మూడు ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించి నామినేషన్లు స్వీకరించే విధంగా నిర్ణయించారు. దీంతో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ అభ్యర్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో జిల్లాలో దూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికే వచ్చి నామినేషన్ల పత్రాలు సమర్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం వెసులుబాటు కలిగించడంతో ఊరట కలగనుంది. 600–700మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం 600 మంది నుంచి 700 మంది ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతు కావడంతో వాటిని తిరిగి చేర్పించేందుకు ఓటర్ల నమోదు ముసాయిదా నిర్వహించారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఓటర్లతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 2లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాను ఆధారంగా చేసుకునే ఈ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్లను విభజించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల నూతనంగా తయారు చేసిన ఓటర్ల జాబితాను కలెక్టర్ ద్వారా తీసుకున్నారు. దాని ఆధారంగానే గ్రామాల వారీగా ఆయా వార్డుల జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీటి ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. అనంతరం ఎంపీటీసీల నియోజకవర్గాల వారీగా తయారు చేసి ఈ నెల 27న తుది జాబితాను ప్రకటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్తగా పదర, చారకొండ, పెంటవెల్లి, ఊర్కొండ, వనపర్తి జిల్లాలో చిన్నంబావి, మదనాపురం, శ్రీరంగాపూర్, జోగుళాంబ జిల్లాలో కేటీ దొడ్డి, రాజోళి, ఉండవెల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మరికల్, మూసాపేట, రాజాపూర్, కృష్ణా మండలాలు ఏర్పడ్డాయి. పాత మండల పరిషత్‌లో ఉన్న ఈ మండలాల్లో కొత్త పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లా జెడ్పీటీసీలతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో కలిపి ప్రస్తుతం 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. -
ఎంపిపిల్లోను మహిళలే
మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను అధికారులు జారీ చేశారు. కాగా.. ఇందులోనూ సగానికి పైగా మహిళలకే సీట్లు ఖరారు కావడం విశేషం. జిల్లాలోని 52 మండలాల్లో 28 స్థానాలను మహిళలకే కేటాయించారు. రిజర్వేషన్ల పరంగా ఎస్టీలకు 12, ఎస్సీలకు 7, బీసీలకు 15, అన్‌రిజర్వుడ్ (జనరల్)కు 18గా ప్రకటించారు. జెడ్పీటీసీల పరంగా 26 మహిళలకు కేటాయించగా, ఎంపీపీల్లోనూ ఆమెనే పైచేయి సాధించింది. రిజర్వేషన్ల వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఎస్టీ మహిళ : జైనూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, కడెం, కుభీర్, సారంగాపూర్, మామడ. ఎస్టీ జనరల్ : సిర్పూర్(యు), నార్నూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తలమడుగు. ఎస్సీ మహిళ : బెజ్జూర్, దండేపల్లి, లక్ష్మణచాంద, ముథోల్. ఎస్సీ జనరల్ : గుడిహత్నూర్, కాసిపేట, తానూర్. బీసీ జనరల్ : బజార్హత్నూర్, కాగజ్‌నగర్, కెరమెరి, కోటపల్లి, కౌటాల, లక్సెట్టిపేట, మంచిర్యాల. బీసీ మహిళ : భైంసా, ఇచ్చోడ, జైనథ్, జైపూర్, ఖానాపూర్, కుంటాల, నెన్నెల, తిర్యాణి. అన్రిజర్వ్డ్ (జనరల్) : బేల, బెల్లంపల్లి, భీమిని, బోథ్, చెన్నూర్, దహెగాం, దిలావర్పూర్, జన్నారం, మందమర్రి, రెబ్బెన, సిర్పూర్(టి), తాండూర్, వేమనపల్లి, వాంకిడి. అన్రిజర్వ్డ్ (మహిళ) : లోకేశ్వరం, నేరడిగొండ, నిర్మల్, తాంసి. -
ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు
నల్లగొండ, న్యూస్‌లైన్ : మండల ప్రజా పరిషత్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు శుక్రవార ం పంచాయితీ రాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల జాబితాను ప్రకటించిన మరుసటి రోజే ఎంపీపీ స్థానాల రిజ ర్వేషన్లు వెలువడడంతో అధికారులు ఆగమేఘాల మీద మండలాల వారీగా రిజర్వేషన్ల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఎంపీపీ స్థానాలు 59 ఉండగా వీటిల్లో జనరల్ 31, మహిళలకు 28 స్థానాలు రిజర్వు చేశారు. కాగా గత రిజర్వేషన్ల జాబితాను, 2011 జనాభా లెక్క లను ప్రాతిపదికగా తీసుకుని ఎంపీపీ స్థానాలను ఖరారు చేయనున్నారు. శనివారం ఆ జాబితాను అధికారికంగా ప్రకటిస్తామని జెడ్పీ సీఈఓ దామోదర్ రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఎస్టీలకు జెడ్పీ పీఠం.? స్థానిక అభ్యర్థులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం గ తంలో రిజర్వేషన్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని 2011 లో జెడ్పీ పీఠం ఎస్టీ జనరల్‌కు కేటాయించా రు. అయి తే అప్పట్లో ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేశారు. తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం మళ్లీ రిజర్వేషన్ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల రిజర్వేషన్ మారుతుందా?.. లే దంటే ఎస్టీలకే ఉంటుందా అన్నది శనివారం అధికారి కంగా తేలనుంది. అధికారులు మాత్రం మార్పు ఉండకపోవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉక్కిరి బిక్కిరి.. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణతో అధికారులు ఇప్పటికే తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించాలని సుప్రీంకోర్డు ఆదేశించడంతో అధికారులు ఊపరి సలపకుండా ఉన్నారు. స్థానిక సమరానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఇంత తక్కువ వ్యవధిలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలంటే కష్టసాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, కేంద్రాల వద్ద ఏర్పాట్లను సమీక్షించడం, బందోబస్తు, సిబ్బంది నియామకం వంటి కార్యాచరణ తక్కువ వ్యవధిలో చేయడం తలకు మించిన భారం అవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రాదేశిక రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు ప్రాదేశిక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసిన యంత్రాంగం శుక్రవారం సాయంత్రం గెజిట్‌లో పొందుపరిచింది. జిల్లాలో 614 ఎంపీటీసీ స్థానాలు, 33 జెడ్పీటీసీ రిజర్వేషన్లు వెల్లడి కావడంతో రాజకీయవర్గాల్లో మరింత హడావుడి మొదలైంది. ఇప్పటికే మున్సిపల్, సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడగా.. తాజాగా ప్రాదేశిక పోరుకు సైతం ఏర్పాట్లు చకచకా సాగుతుండడం పార్టీలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. ఈ ఎన్నికలపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఒకట్రెండు రోజుల్లో ప్రాదేశిక ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఇలా.. 2011 జనాభా గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 1996, 2001, 2006 సంవత్సరాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లోని రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిని అనుసరించారు. బీసీ రిజర్వేషన్లు మాత్రం వారి జనాభా అంచనాను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో 614 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే ఇందులో ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన గ్రామాలతోపాటు.. జీహెచ్ఎంసీలో విలీనం చేయదలచిన పంచాయతీలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. గ్రేటర్లో విలీనం చేయాలనుకున్న 35 గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలు/మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి. ఈనేపథ్యంలో త్వరలో వెలువడే ప్రాదేశిక ఎన్నికల ప్రకటనలో ఈ 35 పంచాయతీల్లోని ఎంపీటీసీ స్థానాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాలోని 33 మండలాలకు జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే మండల పరిషత్ అధ్యక్ష పీఠానికి సంబంధించి రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు. -
రిజర్వేషన్లు ఖరారు
రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం వరంగల్ నగర మేయర్ స్థానం జనరల్ కేటగిరికి కోర్టు కేసుల కారణంగా వరంగల్‌కు ఎన్నికలు లేనట్లే.. సాక్షి ప్రతినిధి, వరంగల్ : మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మునిసిపాలిటీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలకు, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీల చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పురపాలక ఎన్నికలకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారం... వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపించిన తరుణంలోనే పురపాలక ఎన్నికలు వస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ద్వితీయశ్రేణి నాయకులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు... పురపాలక ఎన్నికలు వస్తుండడం పలు నియోజకవర్గాల్లోని నేతలకు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ఖర్చు విషయంలో ప్రణాళికలు వేసుకుంటున్న వీరికి ఇప్పుడు పురపాలక ఎన్నిలు రావడంతో రెట్టింపు నిధులు అవసరమయ్యే పరిస్థితి వస్తోంది. పురపాలక సంస్థలు ఉన్న జనగామ, మహబూబాబాద్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే నేతలకు ఇప్పడు ఖర్చు విషయంలో కొత్త దిగులు మొదలైంది. వరంగల్ జనరల్‌కు... వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ సీటు జనరల్(ఏ వర్గానికి రిజర్వు కాలేదు)గా ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రేటర్లో విలీన గ్రామాలపై నెలకొన్న న్యాయపరమైన వివాదంతో ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో వరంగల్‌ను గ్రేటర్‌గా పేర్కొనలేదు. వరంగల్ నగరపాలక సంస్థగానే పేర్కొన్నారు. రెండో దశలోనే వరంగల్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి.