'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్‌ వచ్చేసింది | Sankranthiki Vasthunnam Godari Gattu Song Video Out Now | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి వస్తున్నాం మూవీ 'గోదారి గట్టు మీద' వీడియో సాంగ్‌

Published Sun, Feb 9 2025 11:32 AM | Last Updated on Sun, Feb 9 2025 11:59 AM

Sankranthiki Vasthunnam Godari Gattu Song Video Out Now

హీరో వెంకటేశ్  సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్‌ క్రియేట్‌ చేసిన ఒక సాంగ్‌ ఇప్పుడు వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రమోషనల్‌ విషయంలో చేసిన మ్యాజిక్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్‌ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది.  భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. 

ఆడియో లిరిక్స్‌ ఇప్పటి వరకు 170 మిలియన్ల మార్క్‌ను దాటింది. థియేటర్స్‌లో ఈ పాటకు  ప్రేక్షకులు లేచి మరీ చిందులు వేశారు. ఇప్పటికే యూట్యూబ్‌, ఇన్‌స్టా రీల్స్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాటను చాలా మంది రీక్రియేట్‌ కూడా చేశారు. ఇప్పుడు పూర్తి వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement