ఎంపిపిల్లోను మహిళలే | mptc for women | Sakshi
Sakshi News home page

ఎంపిపిల్లోను మహిళలే

Published Sun, Mar 9 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

mptc for women

మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను అధికారులు జారీ చేశారు. కాగా.. ఇందులోనూ సగానికి పైగా మహిళలకే సీట్లు ఖరారు కావడం విశేషం. జిల్లాలోని 52 మండలాల్లో 28 స్థానాలను మహిళలకే కేటాయించారు.

రిజర్వేషన్ల పరంగా ఎస్టీలకు 12, ఎస్సీలకు 7, బీసీలకు 15, అన్‌రిజర్వుడ్ (జనరల్)కు 18గా ప్రకటించారు. జెడ్పీటీసీల పరంగా 26 మహిళలకు కేటాయించగా, ఎంపీపీల్లోనూ ఆమెనే పైచేయి సాధించింది.
 రిజర్వేషన్ల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
 ఎస్టీ మహిళ : జైనూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, కడెం, కుభీర్, సారంగాపూర్, మామడ.
 ఎస్టీ జనరల్ : సిర్పూర్(యు), నార్నూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తలమడుగు.
 ఎస్సీ మహిళ : బెజ్జూర్, దండేపల్లి, లక్ష్మణచాంద, ముథోల్.
 ఎస్సీ జనరల్ : గుడిహత్నూర్, కాసిపేట, తానూర్.
 బీసీ జనరల్ : బజార్‌హత్నూర్, కాగజ్‌నగర్, కెరమెరి, కోటపల్లి, కౌటాల, లక్సెట్టిపేట, మంచిర్యాల.
 బీసీ మహిళ : భైంసా, ఇచ్చోడ, జైనథ్, జైపూర్, ఖానాపూర్, కుంటాల, నెన్నెల, తిర్యాణి.
 అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) : బేల, బెల్లంపల్లి, భీమిని, బోథ్, చెన్నూర్, దహెగాం, దిలావర్‌పూర్, జన్నారం, మందమర్రి, రెబ్బెన, సిర్పూర్(టి), తాండూర్, వేమనపల్లి, వాంకిడి.
 అన్‌రిజర్వ్‌డ్ (మహిళ) : లోకేశ్వరం, నేరడిగొండ, నిర్మల్, తాంసి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement