సాక్షి, హైదరాబాద్: ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఎస్టీ మహిళపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎల్‌బీ నగర్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది.
ఘటన జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటి స్టేషన్ సీసీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి అనే ఎస్టీ మహిళపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా తీవ్రంగా స్పందించి విచారణ కోసం సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment