ST woman
-
ఎస్టీ మహిళపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఎస్టీ మహిళపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎల్బీ నగర్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటి స్టేషన్ సీసీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి అనే ఎస్టీ మహిళపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా తీవ్రంగా స్పందించి విచారణ కోసం సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఎస్టీ మహిళపై టీడీపీ నేత దాడి
సాక్షి, శ్రీకాకుళం : అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వంగర మండలం, మగ్గూరు గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై ఆ గ్రామ సర్పంచ్, టీడీపీ నేత ఖగేంద్రనాయుడు దాడికి పాల్పడ్డారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆమెకు అందలం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ...జిల్లా మహిళలకు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి, ఆ రంగంలో అడుగుపెట్టబోతున్నవారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటు మండల పరిషత్ ఎన్నికల్లో అధిక స్థానాలు రిజర్వుకాగా, మరో వైపు కేబినేట్ మంత్రి స్థాయి హోదా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. జెడ్పీ పీఠంపై ఎస్టీ మహిళ విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేపట్టాలనుకున్న నేతల అంచనాలు తలకిందులయ్యాయి. చైర్మన్ కుర్చీపై కూర్చోవాలనుకున్న వారి ఆశలకు రిజర్వేషన్లు గండికొట్టాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఎస్టీ మహిళకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రిజర్వు అయింది. ఈ పీఠాన్ని అధిష్టించే ఎస్టీ మహిళ ఎవరనే దానిపై జిల్లా వ్యాప్తంగా అప్పుడే చర్చ ప్రారంభమైంది. జిల్లా పరిషత్ చరిత్రలో ఠఇంతవరకు ఎస్సీకి గాని, ఎస్టీకి గాని చైర్మన్ పదవి దక్కలేదు. ఇన్నాళ్లకు ఎస్టీకి రిజర్వు అయింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాలు ఉన్న ఎస్టీ మహిళా నేతలను వెతుకులాడే పనిలో పడ్డారు. జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీ, ఓసీ వర్గాలకు చెందిన వారే ఇన్నాళ్లు వ్యవహారించారు. ఎక్కువగా వెలమ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారే ఈ పదవిని అధిష్టించారు. దశాబ్దాల తర్వాత ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. బొత్స కుటుంబీకులకు చెక్ బొత్స కుటుంబీకులు రాజకీయంగా ఎదిగేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టడమేనన్న విషయం జగమెరిగిన సత్యం. పదేళ్ల పాటు బొత్స కుటుంబీకులే జిల్లా పరిషత్ చైర్మన్లుగా కొనసాగారు. తొలుత బొత్స సతీమణి ప్రస్తుత ఎంపీ ఝాన్సీలక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత బొబ్బిలి ఎంపీగా ఉన్న కొండపల్లి పైడితల్లినాయుడు మృతి చెందడంతో ఆ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా ఝాన్సీలక్ష్మి గెలుపొందారు. దీంతో ఆమె ఖాళీ చేసిన కుర్చీని మంత్రి బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు అధిరోహించారు. 2009 ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు మధ్య బడ్డుకొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల ఎమ్మెల్యే టిక్కెట్టు రావడంతో ఆ పదవి మంత్రి బంధువు జిల్లా పరిషత్ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్‌ను వరించింది. 2011 ఆగస్టు వరకు ఈయనే జిల్లా పరిషత్ చైర్మన్‌గా వ్యవహరించారు. 10 ఏళ్లు పాటు మంత్రి బంధువులే చైర్మన్లుగా కొనసాగడంతో జిల్లాను తమ గుప్పెట్లో పెట్టుకుని శాసించే స్థాయికి చేరుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జిల్లా పరిషత్ వల్లే బొత్స కుటుంబీకులు, బంధువులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈసారికూడా మంత్రి బొత్స బంధువులు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కన్నేశారు. కేబినేట్ మంత్రి స్థాయి హోదా జిల్లా పరిషత్ చైర్మన్‌కు ఉండడంతో ఈ పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు ఈసారి ఆడియాశలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీకి రిజర్వు అవ్వడం, కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి చేరడంతో మంత్రి బొత్సకు, ఆయన కుటుంబీకులకు ఈసారి ఎదురుగాలి తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అధిరోహించే మహిళ ఎవరనేది త్వరలోనే తేలనుంది. -
ఎంపిపిల్లోను మహిళలే
మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లు శనివారం ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను అధికారులు జారీ చేశారు. కాగా.. ఇందులోనూ సగానికి పైగా మహిళలకే సీట్లు ఖరారు కావడం విశేషం. జిల్లాలోని 52 మండలాల్లో 28 స్థానాలను మహిళలకే కేటాయించారు. రిజర్వేషన్ల పరంగా ఎస్టీలకు 12, ఎస్సీలకు 7, బీసీలకు 15, అన్‌రిజర్వుడ్ (జనరల్)కు 18గా ప్రకటించారు. జెడ్పీటీసీల పరంగా 26 మహిళలకు కేటాయించగా, ఎంపీపీల్లోనూ ఆమెనే పైచేయి సాధించింది. రిజర్వేషన్ల వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఎస్టీ మహిళ : జైనూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, కడెం, కుభీర్, సారంగాపూర్, మామడ. ఎస్టీ జనరల్ : సిర్పూర్(యు), నార్నూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తలమడుగు. ఎస్సీ మహిళ : బెజ్జూర్, దండేపల్లి, లక్ష్మణచాంద, ముథోల్. ఎస్సీ జనరల్ : గుడిహత్నూర్, కాసిపేట, తానూర్. బీసీ జనరల్ : బజార్హత్నూర్, కాగజ్‌నగర్, కెరమెరి, కోటపల్లి, కౌటాల, లక్సెట్టిపేట, మంచిర్యాల. బీసీ మహిళ : భైంసా, ఇచ్చోడ, జైనథ్, జైపూర్, ఖానాపూర్, కుంటాల, నెన్నెల, తిర్యాణి. అన్రిజర్వ్డ్ (జనరల్) : బేల, బెల్లంపల్లి, భీమిని, బోథ్, చెన్నూర్, దహెగాం, దిలావర్పూర్, జన్నారం, మందమర్రి, రెబ్బెన, సిర్పూర్(టి), తాండూర్, వేమనపల్లి, వాంకిడి. అన్రిజర్వ్డ్ (మహిళ) : లోకేశ్వరం, నేరడిగొండ, నిర్మల్, తాంసి.