Third Degree
-
మహిళపై థర్డ్‌డిగ్రీ.! షాద్‌నగర్ పోలీసులపై కేసు
సాక్షి,షాద్‌నగర్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ పోలీసులపై కేసు నమోదైంది. ఇటీవల ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. షాద్‌నగర్ పీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) రామ్‌రెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై ఎఫ్ఐఆర్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల షాద్‌నగర్ పోలీసులు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. -
కొడుకు కోసం.. తల్లి నిర్బంధం
బషీరాబాద్: షాద్‌నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవకముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మరో దారుణం.. పదహారేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. రోజూ స్టేషన్‌కు పిలవడం.. కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం.. మధ్యలో లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం.. గడిచిన మే నుంచి ఆగస్టు 15 వరకూ ఇదే వరస.. కాలూచేయీ కూడ దీసుకోలేని స్థితిలో భర్త.. తను పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి.. పోలీసులు మాత్రం ఆమె పొట్టకొడుతూ మూడున్నర నెలలుగా ఠాణా చుట్టూనే తిప్పుతున్నారు.పంద్రాగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు దీనస్థితిలో స్టేషన్ ముందు కూర్చున్న ఆమె కంటపడింది. ఆరా తీస్తే ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుమారుడిపై కిడ్నాప్ కేసు.. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక (16) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మే 2న ఇంట్లోంచి పారిపోయారు. తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక కుటుంబసభ్యులు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మే 4న నరే‹Ùపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలుడి తల్లి కళావతి, తండ్రి నర్సప్ప కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పోలీసులు కళావతిని మే నెలలోనే ఠాణాకు పిలిపించారు. ఎస్ఐ రమేశ్‌కుమార్ ఆమెను విచారిస్తూ.. ‘నీ కొడుకు మైనర్ పిల్లను ఎత్తుకొనిపోయాడు.వాడు ఎక్కడున్నాడో రెండు రోజుల్లో వెతికి తీసుకురావాలి. లేదంటే వాణ్ణి నేనే పట్టుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేస్తా..’అంటూ బెదిరించాడు. దీనికి కళావతి స్పందిస్తూ.. ‘కూలి పనులు చేసుకునే మాకు ఏం తెలుసు సారూ.. వాడు పట్నంలో పనిచేసుకునేవాడు. కాశీంపూర్ పిల్లతో ప్రేమ కుదిరింట. అది పిల్ల తల్లికి కూడా తెలుసు. వారు ఎక్కడికి పోయారో నాకు తెలీదు’ అని చెప్పింది. దీంతో ఎస్ఐ ఒక్కసారిగా ఆవేశానికి లోనై లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని, నడవడానికి కూడా రాలేదని బాధితురాలు వాపోయింది. ‘ఆ రోజు నుంచి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్‌కి వస్తున్నా. రోజూ ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కూర్చోవాలి. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఆకలితో రాత్రి 9 గంటల వరకు ఉండి సారుకు చెప్పి ఇంటికెళ్తున్న. నిన్న ఒక్క రోజే (బుధవారం) స్టేషన్‌కు రాలేదు’అంటూ ఠాణాకు వెళ్లిన విలేకరులకు చెబుతూ కళావతి కన్నీటి పర్యంతమైంది. రోజు కూలి పనులు చేసుకునే తమకు మూడు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కళావతికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విచారణ జరుపుతాం: అశోక్, సీఐ తాండూరు రూరల్ కిడ్నాప్ కేసు విషయం మా దృష్టిలో ఉంది. కిడ్నాపర్ మైనర్ అయినా అరెస్టు చేయాల్సిందే. విచారణలో భాగంగా బాలుడి తల్లిని బషీరాబాద్ ఎస్ఐ స్టేషన్‌కు పిలిచి విచారించారు. ఎస్ఐ ఆమెను కొట్టాడనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరుపుతాం. -
దళిత మహిళపై పోలీస్ జులుం
-
దళిత మహిళపై పోలీసుల కర్కశత్వం
షాద్‌నగర్ రూరల్: దొంగతనం కేసులో విచారిస్తామంటూ తీసుకొచ్చిన ఓ దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్య హరించారు. అంతేకాకుండా ఆమె మైనర్ కుమారుడిపై సై తం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వె లుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పరిధిలోని రంగా రెడ్డి జిల్లా షాద్‌నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 24న చోరీ : షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్‌నగర్ ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగేందర్ ఇంట్లో గత నెల 24న దొంగతనం జరిగింది. తన ఇంట్లో 24 తులాల బంగారంతో పాటు, రూ.2 లక్షల నగదు చోరీ జరిగిందని, దీనికి కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులే కారణమంటూ ఆయన షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకొచ్చి.. చితకబాది : కేసు విచారణలో భాగంగా పోలీసులు భీమయ్య అతని భార్య సునీతతో పాటు 13 ఏళ్ల వారి కుమారుడిని గత నెల 30న షాద్‌నగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దొంగతనాన్ని ఒప్పుకోవాలని డీఐ రామిరెడ్డితోపాటు ఇతర పోలీసు సిబ్బంది తనను, భర్తను విచక్షణారహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. కాగా, తల్లి ముందే మైనర్ కొడుకును సైతం పోలీసులు దారుణంగా చితకబాది వారిని అర్ధరాత్రి ఇంటికి పంపించారు. కాగా, పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక సునీత నడవడానికి కూడా ఇబ్బందిపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను మరుసటిరోజు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో దళిత సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాయంతో ఆదివారం సునీతను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణకు ఆదేశం : దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పం కావడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ : దళిత మహిళపై పోలీసులు చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంలు షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి బాధితురాలు సునీతను పరామర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. మహిళ అని చూడకుండా పోలీసులు సునీతను కొట్టడం సరికాదని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం చేయాలన్నారు. సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ : దొంగతనం కేసులో దళిత మహిళ, మైనర్ బాలుడిని షాద్‌నగర్ పోలీసులు చితకబాదిన ఘటనపై ఆదివారం సాయంత్రం సైబరాబాద్ సీపీ మహంతి స్పందించారు. షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు. షాద్‌నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ సమగ్ర విచారణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు వారికి అండగా ఉంటామని హామీఇచ్చారు. దళిత మహిళపై దౌర్జన్యం హేయమైన చర్య: మాజీ మంత్రి హరీశ్‌రావు దళిత మహిళపట్ల పోలీసులు కర్కషంగా వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని దళిత దంపతులను చిత్రహింసలకు గురిచేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనమన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
దళితుడి లాకప్‌డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్‌డెత్‌కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్‌ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్‌కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్‌డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్‌ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్‌డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్‌డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్‌డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్‌ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్‌ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. -
ఎస్టీ మహిళపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఎస్టీ మహిళపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎల్బీ నగర్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటి స్టేషన్ సీసీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి అనే ఎస్టీ మహిళపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా తీవ్రంగా స్పందించి విచారణ కోసం సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
HYD: మహిళపై థర్డ్ డిగ్రీ..! సీపీ వివరణ
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై థర్డ్ డిగ్రీ కేసులో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాం. ఒక ఎస్ఐను బదిలీ చేశాం. హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పిస్తాం. బాధితురాలి దగ్గర డబ్బులు, గోల్డ్ తీసుకున్నారనడంలో వాస్తవం లేదు. హైకోర్టు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని సీపీ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. వరలక్ష్మీ అనే మహిళ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్డులో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ స్థానికంగా ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆగస్టు 15న దేవరకొండలోని బంధువుల ఇంటికి వెళ్లి ఆ మహిళ రాత్రి తిరిగి వస్తూ ఎల్బీ నగర్లో బస్సు దిగింది. ఆటోలు, బస్సులు లేకపోవడంతో రోడ్డు పక్కన నిలబడింది. పెట్రోలింగ్‌కు వచ్చిన ఎల్బీ నగర్ పోలీసులు ఆ మహిళను ప్రశ్నించారు. ఆమె వద్ద డబ్బులు కూడా ఉండటంతో అనుమానించి స్టేషన్ కు తీసుకెళ్లారు. తన కుమార్తె పెళ్లి కార్డును కూడా చూపినా వదల్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారని, ఉదయానే ఆటోలో ఇంటికి పంపినట్లు ఆమె తెలిపింది. చదవండి: మీర్పేట్లో అమానుషం.. గ్యాంగ్‌రేప్ నిందితుల అరెస్ట్ -
థర్డ్ డిగ్రీలకు కాలం చెల్లింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. బుధవారం ఢిల్లీలో పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా మాట్లాడారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించుకోవాలని, వీటి ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీనిపై సూచనలు, సలహాలు సేకరించి హోంశాఖకు పంపాలన్నారు. శిక్షా కాలం ఏడేళ్లు అంతకు మించిన క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఆధారాలను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శాస్త్రీయ విధానాలను అనుసరించాలి ‘ఫోరెన్సిక్ ఆధారాలను సైతం జత చేస్తూ పోలీసులు సమగ్రవంతమైన చార్జ్‌షీటును కోర్టుకు సమర్పిస్తే నిందితుల తరపు న్యాయవాదులకు వాదించడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. శిక్ష పడే అవకాశాలు సైతం బాగా పెరుగుతాయి. నేరగాళ్లు, నేర ప్రవృత్తి వ్యక్తుల కన్నా పోలీసులు నాలుగు అడుగులు ముందు ఉండటం అత్యవసరం. పోలీసులు వెనకపడకూడదు. బలగాల ఆధునికీకరణతోనే ఇది సాధ్యం. ఇది థర్డ్ డిగ్రీలు ప్రయోగించే కాలం కాదు. దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. ఫోన్ల ట్యాపింగ్ సత్ఫలితాలు ఇవ్వదు. పౌర పోలీసింగ్, ఇన్ఫార్మర్ల వ్యవస్థతో చాలా ప్రయోజనాలున్నాయి. బీట్ కానిస్టేబుళ్ల విధానాన్ని బలోపేతం చేయాలి’ అని అమిత్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ వర్సిటీ జాతీయ స్థాయిలో పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోందని అమిత్ షా వెల్లడించారు. వర్సిటీకి ప్రతి రాష్ట్రంలో అనుబంధ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 12వ తరగతి తరువాత పోలీస్ దళాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థుల కోసం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఈమేరకు బీపీఆర్డీ అందచేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గుజరాత్లో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఫోరెన్సిక్ వర్సిటీల నుంచి పట్టా పొందిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా నిరుద్యోగిలా మిగిలిపోలేదన్నారు. -
‘థర్డ్ డిగ్రీ’పై రాజీయత్నం!
- రంగంలోకి దిగిన అధికార పార్టీ నేతలు - జైలులో బాధితులతో చర్చలు - ఉద్యోగాలు.. పరిహారం.. కేసుల ఎత్తివేతకు సై సిరిసిల్ల: జిల్లాలోని తంగళ్లపల్లి మండలం నేరెళ్ల దళితులపై పోలీసుల ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగంపై ‘రాజీ’ యత్నాలు మొదలయ్యాయి. ముఖ్య నాయకుల ఆదేశాలతో అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగారు. ఆందోళనలకు ముగింపు పలికేలా తమతో సహ కరించాలంటూ బాధితు లతో చర్చలు జరిపారు. కేసులు ఎత్తి వేయిస్తామని, పరిహారం మంజూరయ్యేలా చూస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, అధికార పార్టీ నాయకులు ఆలస్యంగా స్పందించడంపై నిందితులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిరిసిల్లకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు శుక్రవారం కరీంనగర్ జైలుకు వెళ్లివచ్చారు. పోలీసుల తీరును తప్పు పడుతూనే.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ‘విపక్షాల ఆందోళనకు సహ కరించవద్దు.. వాళ్లు ఇవ్వాల వస్తారు.. పోతారు.. మనమే ఇక్కడ ఉండేది.’అంటూ రాజీ ప్రయ త్నాలు చేసినట్లు సమాచారం. ‘మా పానాలు పోతున్నయి. బొక్కబొక్కకూ పోలీసోళ్లు నీళ్లు పోసిండ్రు.. మాగతి మీకొస్తే తెలుస్తది..’ అంటూ నిందితుల్లో ఒకరు తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. ‘గిప్పుడా మీరు వచ్చేది’ అంటూ మరొకరు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులతోనూ చర్చలు.. నిందితుల కుటుంబ సభ్యులతో తంగళ్లపల్లి మండల ప్రజాప్రతినిధులు కొందరు చర్చలు జరిపి నట్లు తెలిసింది. నేరెళ్ల, రామచంద్రాపూర్, జిల్లెల్ల గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లా డగా కొందరు రాజీకి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విపక్షాలకు దూరంగా ఉంటే పరి హారం ఇస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామ నడంతో కొందరు అంగీకరించినట్లు సమాచారం. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది బాధితుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. పెంట బాణయ్య, చీకోటి శ్రీనివాస్, కోరుగంటి గణేశ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. పోరుబాటలో విపక్షాలు థర్డ్ డిగ్రీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కాంగ్రెస్ సహా బీజేపీ, దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. హైకోర్టులోనూ కేసు ఫైల్ చేశారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పోలీసులపై చర్యలు..! థర్డ్ డిగ్రీ ప్రయోగంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్నట్లు సమాచా రం. ప్రభుత్వపరంగా గ్రీన్‌సిగ్నల్ రాగానే బాధ్యు లపై చర్యలు చేపట్టనున్నారు. బాధ్యు లపై చర్యలు తీసుకుని, నిందితులను ఆదుకునే పక్రియను ఏకకాలంతో చేపట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. -
అమ్మో లాకప్
సాక్షి, విజయవాడ బ్యూరో: లాకప్‌కెళ్తే ప్రాణాలతో తిరిగిరావడం కష్టమేనా. అక్కడికెళ్తే యమపురిలో అడుగుపెట్టినట్టేనా? విజయవాడ పోలీస్ స్టేషన్లలో నిందితులపై హింస బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే దుర్గాప్రసాద్ పోలీసుల చేతిలో చనిపోయిన రెండో వ్యక్తి. గతంలో వ¯Œæటౌన్ పీఎస్‌లోని సీసీఎస్ భవనంలోని పై అంతస్తు నుంచి రాజమండ్రికి చెందిన ఓ వ్యాపారి పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విజయవాడ జక్కంపూడి కాలనీలో నివాసం ఉంటున్న మారిశెట్టి దుర్గాప్రసాద్ (23) పోలీసు చిత్రహింసల వల్లే చనిపోయాడని అతనికుటుంబ సభ్యులు, ఓపీడీఆర్ నిజనిర్ధరణ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. జూలై 20వ తేదీ రాత్రి ఇంటికి రాలేదు. ఆయన మిత్రులు నాగరాజు, హరిబాబు కూడా ఇంటికి చేరలేదు. తల్లి, భార్యలకు పోలీసులపైనే అనుమానం వచ్చింది. ఎందుకంటే గతంలోనూ ఇలాగే దుర్గాప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకెళ్ళి వారం రోజుల తరువాత పంపించేవారు. పోలీసుల దెబ్బల నుంచి తేరుకునేందుకు కనీసం నెలరోజులు పట్టేది. తల్లి, భార్య తమ పరిధిలోని స్టేషన్లకు వెళ్ళారు. నీ భర్తను తాము తీసుకు రాలేదంటూ పోలీసులు చెప్పారు. జూలై 30న పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. నీ భర్తకు బాగోలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పారు. అక్కడికి వెళ్ళగానే దుర్గాప్రసాద్ శవాన్ని భార్య, తల్లికి అప్పగించారు పోలీసులు. ఏం జరిగింది.... జూలై 20 సాయంత్రం దుర్గాప్రసాద్, అతని స్నేహితులు నాగరాజు, హరిబాబులు బుడమేరు కట్టపై నడుచుకుంటూ వస్తున్నారు. ఇరువురు కానిస్టేబుళ్ళు పని ఉంది అంటూ ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ కాంపౌండ్‌లోని సీసీఎస్ స్టేషన్లో వీరిని ఉంచారు. 20 నుంచి 28 వరకు సీసీఎస్ స్టేషన్లోనే ఉంచి దుర్గాప్రసాద్‌పై నిత్యం థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఆ తరువాత సీసీఎస్ పోలీసులు నాగరాజు, హరిబాబులను వేరే కేసుల్లో నిందితులుగా పేర్కొని రిమాండ్‌కు పంపించారు. తీవ్రమైన దెబ్బల వల్ల దుర్గాప్రసాద్ పేగులు, గుండె డ్యామేజీ కావడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో పోలీసులు వన్‌టౌన్‌లోని ఒక ప్రైవేట్ వైద్య శాలకు (నిత్యం పోలీసులు నిందితులకు వైద్యం చేయించే ప్రైవేట్ ఆస్పత్రి) జూలై 30 తరలించారు. అప్పటికే చావుకు దగ్గరైన దుర్గాప్రసాద్‌కు వైద్యం చేయడం సాధ్యం కాదంటూ వైద్యుడు తేల్చి చెప్పారు. æహడావుడిగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు. దుర్గాప్రసాద్ రాత్రి తొమ్మిది గంటలకు చనిపోగా 11 గంటలకు బంధువులు ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. కొందరు పోలీసు పెద్దలు వారిని నయానో భయానో నచ్చజెప్పి శవాన్ని ఇంటికి తీసుకుపోయేలా చేశారు. 31వ తేదీన శవాన్ని ఖననం చేసే సమయంలోనూ పోలీసులు మోహరించారు. బంధువులతో సెటిల్మెంట్... చనిపోయిన వ్యక్తి తిరిగి రాడని, అల్లరి చేస్తే పోలీసుల నుంచి మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని బందువులకు పోలీసులు సర్దిచెప్పారు. మృతుని భార్యకు రూ. 2.50 లక్షలు, తల్లికి రూ. లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం చేసి గుట్టుచప్పుడు కాకుండా కేసును మూసివేశారు ఖాకీలు. అనుమానాస్పద మరణంలో కచ్చితంగా నిర్వహించాల్సిన పోస్టుమార్టం కూడా జరపలేదు. పీఎం చేస్తే నిజాలు బయటపడతాయనే భయమే కారణం. గతంలో గన్నవరం యువకుడు కూడా ఏడాది కిందట పెనమలూరు పోలీసులు దొంగతనం కేసులో గన్నవరానికి చెందిన పుల్లా రమేష్ అనే యువకుణ్ని తీవ్రంగా హింసించడంతో అతడు చనిపోయాడు. తాము పట్టుకోబోతే కొంగల మందు మింగాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగానే మరణించాడని అప్పటి సీఐ సీహెచ్ జగన్మోçß毌æరావు చెప్పారు. దర్యాప్తు తీరుల్లో ఎన్నో ఆధునిక విధానాలు వస్తున్నా వాటిని పాటించకుండా, తమకు తెలిసిన చిత్రహింసలనే నిందితులపై ప్రయోగిస్తున్నారు సిటీ పోలీసులు. ఫలితంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మాకు సంబంధం లేదు సీసీఎస్ ఏడీసీపీ వెల్లడి దుర్గాప్రసాద్ మరణంతో పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని విజయవాడ క్రైమ్స్ (సీసీఎస్) అదనపు డిసిపి రామకోటేశ్వరరావు చెప్పారు. దుర్గాప్రసాద్ లాకప్‌డెత్ విషయమై సాక్షి డిసిపిని వివరణ కోరగా అతని మరణంతో పోలీసులకు ప్రమేయం లేదని చెప్పడం గమనార్హం. అతన్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్ళలేదని, అతను ఎలా మరణించిందీ తమకు తెలియదని ఆయన చెప్పారు. -
హీటర్‌పై మూత్రం పోయించాడు
లక్నో : వరుస చోరీ కేసుల్లో అరెస్ట్ చేసిన ఇద్దరి వ్యక్తులను విచారణలో భాగంగా వారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించి... తన ఉద్యోగానికి ఎసరు పెట్టుకున్నాడు ఓ ఎస్ఐ. వివరాలు ఇలా ఉన్నాయి... ఉత్తరప్రదేశ్ బరిచా జిల్లాలోని దర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సోను (23), కాలు (24) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. స్టేషన్‌కి తరలించారు. విచారణలో భాగంగా ఎస్ఐ అజిత్ వర్మ వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించాడు. ఆ క్రమంలో వారితో మూత్రం తాగించడమే కాకుండా... కరెంట్ హీటర్‌పై మూత్రం పోయించాడు. అలాగే ప్రైవేట్ పార్ట్స్‌పై పెట్రోల్ పోశాడు. దీంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అనంతరం వారిని బుధవారం సాయంత్రం ఇంటికి పంపించారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది... జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించారు. జిల్లా పోలీస్ అధికారి వెంటనే స్పందించి.... వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేయాలని బాధితుల కుటుంబసభ్యుల పోలీసు ఉన్నతాధికారులు డిమాండ్ చేసి ఆందోళనకు దిగారు. దీంతో ఎస్ ఐ అజిత్ వర్మపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ప్రాణాలు తీస్తున్న పోలీసుల థర్డ్ డిగ్రీ
-
చిత్రహింసలు పెట్టి చంపేశారు?
పుల్కల్ : పోలీసులు చిత్రహింసలు పెట్టి తన కుమారుడు చంపేశారని పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మయ్య తల్లి ఎల్లమ్మ ఆరోపించింది. తన కుమారుడిని నా లుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దెబ్బలకు తాళలేకే లక్ష్మయ్య మాకు కాకుండా పోయాడని శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పోలీసులు రెండు లక్షలు చెల్లించమంటున్నారు..? ఎలా ఇవ్వాలని లక్ష్మయ్య చెప్పినట్లు ఎల్లమ్మ ఆరోపించింది. డబ్బులు చెల్లించనిదే తనను చంపేస్తారేమోనని తనతో కుమారుడు గోడును వెల్లబోసుకున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. పుల్కల్ పోలీసుస్టేషన్‌లోని లాక ప్ గదిలో గురువారం తెల్లవారు జా మున సదాశివపేట మండలం ఎల్లా రం గ్రామానికి చెందిన తలారి లక్ష్మ య్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు వ్యూహాత్మకంగానే ఎప్పుడే లేని విధంగా లాక ప్లో గొలుసుతో కూడిన సంకెళ్లు వేశారన్న ఆరోపణలున్నాయి.. నిజంగా పోలీసులు అదుపులోకి తీసుకుని మరుసటి రోజు రిమాండ్ చేసేందుకు పుల్కల్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఉంటే సంకెళ్లు ఎందుకు వేయాల్సి వచ్చింది? అరెస్టు చేయనప్పుడు సంకెళ్లు వేయడం చట్ట విరుద్ధం. కానీ.. నాలుగు రో జు లు పోలీసులు పెట్టిన తీవ్ర చిత్ర హింసలకు గురిచేయడం తట్టుకోలేకనే గురువారం తెల్లవారు జామున లాకప్‌లో లక్ష్మయ్య మృతి చెందిన ట్లు స్పష్టం అవుతోంది. అయితే.. స్టేషన్లో చనిపోయాకే లాకప్‌లో గొ లుసుతో కూడిన సంకెళ్లతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారన్నారు. అందులో భాగంగా లాకప్‌లో వాటిని వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. మృ తుడు దళితుడు కావడంతో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున ప్రతి పక్షాలు గొడవ చేసే అవకాశం ఉం టుందేమోనని భావించి లక్ష్మయ్య ను సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారనే విమర్శలున్నాయి. -
50 ఏళ్ల మహిళపై థర్డ్ డిగ్రీ
ఒంగోలు క్రైం : ఒంగోలు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న పురుష పోలీసులు ఓ 50 ఏళ్ల మహిళ ను చితకబాదిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కొడుకు, కోడలు కేసు విషయమై ఆ మహిళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అత్యంత పాశవికంగా కొట్టారు. వివరాలు.. ఒంగోలులోని బలరాం కాలనీ మసీదు సమీపంలో నివాసం ఉంటున్న షేక్ ఖాదర్‌బీ(50) తన కుమారుడు ఎస్కే రహిమాన్‌కు గతేడాది ఆగస్టులో కర్నూలు రోడ్డులోని ఎస్డీ మహమ్మద్ కుమార్తెనిచ్చి వివాహం చేశారు. పెళ్లయిన నాలుగు నెలలకే కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు పొడచూపాయి. దీంతో కోడలు, కోడలు తండ్రి ఎస్డీ మహ్మద్ ఒంగోలులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పైనున్న మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మహిళా పోలీస్‌స్టేషన్ పురుష సిబ్బంది ఖాదర్బీతోపాటు ఆమె కుమారుడు రహిమాన్‌ను ఈ నెల 11వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. భార్యభర్తల గొడవ విషయం ఏమైందో ఏమో గానీ చివరకు రహిమాన్ తల్లి ఖాదర్బీపై మహిళ అని కూడా చూడకుండా పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఖాదర్‌బీని కొట్టారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత బయటకు పంపించివేశారు. రహిమాన్‌ను మాత్రం భార్యతో అత్తగారింటికి పంపించారు. తీవ్ర గాయాలపాలైన ఖాదర్‌బీ వారం రోజులుగా మంచం పట్టింది. ఈ సంగతి తెలిసిన సమీప బంధువులు సోమవారం ఇంటికెళ్లి ఖాదర్‌బీని పరామర్శించారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లోని పురుష పోలీసులు కొట్టిన విషయం అప్పుడు బయటపడింది. శరీరమంతా వాచి, కమిలిపోవడాన్ని గమనించిన బంధువులు ఆమెను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. ఖాదర్‌బీ అరికాళ్లపై కొట్టిన దెబ్బల వల్ల ఇప్పటికీ నడవలేకపోతోంది. నెల్లూరులో నివాసం ఉంటున్న ఖాదర్‌బీ కుటుంబం ఏడాది క్రితమే ఒంగోలులోని బలరాం కాలనీకి వచ్చింది. ప్రజలతో మమేకమై స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి చెబుతుంటే కొందరు మాత్రం జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 50 ఏళ్ల మహిళ అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా కొట్టడం ఎంత వరకు సబబని ఖాదర్‌బీ బంధువులు ప్రశ్నిస్తున్నారు. -
సెటిల్మెంట్ అడ్డాలు.. అర్బన్ ఠాణాలు..
వరంగల్‌క్రైం : జిల్లాలోని కొందరు పోలీసు అధికారులు బరితెగిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడుతూ పోలీసు శాఖ పరువు తీస్తున్నారు. సివిల్ తగాదాలను పోలీస్ స్టేషన్లలోనే పరిష్కరిస్తూ తామే న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సెటిల్మెంట్లలో తమ మాట పెడచెవిన పెట్టిన వారిపై థర్డ్ డి గ్రీ ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన పోలీసు బాస్‌లు కిందిస్థారుు అధికారుల అవినీతి వ్యవహారాలపై ఘాటుగా స్పందిస్తున్నా పోలీస్స్టేషన్లలో సిబ్బంది, సీఐ, ఎస్సైల ప్రవర్తన మాత్ర ం మారడం లేదు. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారుు. దారి రాకుంటే థర్డ డిగ్రీ.. నాలుగేళ్ల క్రితం పైడిపల్లికి చెందిన ఓ యువకుడు మధ్యవర్తిగా ఉండి ఇంటి స్థలం అమ్మి పెట్టాడు. అరుుతే ఆ భూమి కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిని అదనుగా తీసుకున్న హసన్‌పర్తి పోలీసులు సదరు యువకుడిపై తమ ప్రతాపం చూపుతున్నారు. రెండేళ్ల క్రితం అక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన సీఐ, ఎస్సై ఇదే కేసులో డబ్బులు వసూలు చేశారు. అయితే వారికి ముడుపులు ముట్టజెప్పాక కేసు అయిపోతుందిలే అనుకుంటే కొత్తగా వచ్చిన సీఐ, ఎస్సైలు ఆ కేసును తిరగదోడారు. సదరు మధ్యవర్తిని పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిచి బేరం కోసం పాకులాడారు. అయితే గతంలో పని చేసిన అధికారులకు డబ్బులు ఇచ్చానని, ఇక తాను డబ్బులు ఇచ్చుకోలేనని తెగేసి చెప్పాడు. ఇంకేముంది సదరు యువకుడిని ఒక రోజు మొత్తం మొద్దుకు వేశారు. అతడిపై అనాగరిక పద్ధతిలో థర్డ్ డి గ్రీ ఉపయోగించారు. రోజూ స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేశారు. భూమి కొనుగోలులో మధ్యవర్తిగా ఉన్నందున ‘నీ ఇల్లు అమ్మి డబ్బులు కట్టాలంటూ పోలీసులు తమదైన శైలిలో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో వారికి భయపడి సదరు యువకుడు తన భార్యాపిల్లలతో ప్రస్తుతం పరారీలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలకూ జరగని న్యాయం.. హసన్‌పర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని చిట్యాల మండలానికి చెందిన ఒక వ్యక్తికి ఇచ్చి 2009లో వివాహం చేశారు. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులతో పెళ్లరుున కొత్తలోనే భర్తతో విడిపోరుు భీమారంలో నివాసముంటోంది. మిషన్ కుట్టుకుంటూ జీవిస్తున్న ఆమెను ఇంటి పక్కనే ఉండే యువకుడు స్నానం చేస్తుండగా వీడియో తీశానంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మాయమాటలతో రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజులు ఇతర ప్రదేశాల్లో ఆమెతో కలిసి తిరిగొచ్చాడు. మోజు తీరాక పెళ్లి చేసుకోనంటూ కనిపించకుండా పోవడంతో బాధితురాలు అక్టోబర్ 31న ఎస్పీని ఆశ్రయించింది. విచారణ చేపట్టాల్సిందిగా ఆయన కేయూ పోలీసులను ఆదేశించారు. విచారణ బాధ్యతలు చేపట్టిన ఏఎస్సై స్థారుు అధికారి ఒకరు ఆ రోజు నుంచి సదరు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించకుండా బాధితురాలిని మాత్రం పలుమార్లు స్టేషన్‌కు పిలిపించారు. ఒకసారి రూ.30 వేలు తీసుకోవాలని, మరోమారు రూ.15 వేలు ఇస్తానంటున్నాడని బేరమాడుతున్నారు. తనకు డబ్బులు వద్దని, యువకుడితో పెళ్లి జరిపించాలని లేదంటే కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆమె డిమాండ్ చేస్తున్నా వారు అంగీకరించడం లేదు. దీంతో బాధితురాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అర్బన్ మహిళా స్టేషన్ ఎంట్రీ ఫీ రూ.5 వేలు రంగంపేటలోని అర్బన్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు బాధితుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దంపతు లు గొడవపడి స్టేషన్‌కు వస్తే అంతే సంగతులు. బయట ఉండే సిబ్బంది స్టేషనరీ లేదంటూ రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. స్టేషనరీ పేరుమీద ఆ డబ్బులు ఇస్తేనే కేసు ఎ స్సై, సీఐ వరకు వెళుతుందనే ఆరోపణలున్నారుు. అర్బన్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో మహిళలకు న్యాయం చేయాల్సిన పోలీసులే మహిళల వద్ద వేలాది రూపాయలు లాగుతున్నా రు.డబ్బులు ముట్టజెప్పిన వారికి ఒక న్యాయం చేస్తూ.. ఇ వ్వలేని వారికి అన్యాయం చేస్తున్నారనే విమర్శలున్నారు. -
బాలుడిపై థర్డ్‌డిగ్రీ!
యాకుత్‌పురా: దాడి కేసులో అరెస్టైన ఓ బాలుడిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రావడంతో పాతబస్తీలో కలకలం రేగింది. థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన భవానీనగర్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంబీటీ నాయకులతో పాటు బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అయితే అలాంటిదేమీ జరగలేదని పోలీసులు అంటున్నారు. భవానీనగర్ ఎస్సై నార్ల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా చాచా గ్యారేజీకి చెందిన మహ్మద్ చాంద్ (24), అబ్దుల్ బిన్ మెహఫేజ్ (15) అన్నదమ్ములు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు రెయిన్బజార్కి చెందిన మహ్మద్ ముజఫర్ (24)పై మహ్మద్ చాంద్, మెహఫేజ్ (15) కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ముజఫర్ వెంటనే భవానీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. అతనిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారిలో ఒకడైన మెహఫేజ్ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా బెయిల్‌పై విడుదలయ్యాడు. మహ్మద్ చాంద్ పరారీలో ఉన్నాడు. కాగా, తలాబ్కట్టాకి చెందిన బాలుడు అబ్దుల్ బిన్ మెహఫేజ్ (15)పై భవానీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదారని ఆజంపురా కార్పొరేటర్, ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్ ఆరోపించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారన్నారు. బాలల హక్కుల సంఘం ఖండన మెహఫేజ్పై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడాన్ని బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడి స్టేషన్ హౌజ్ఆఫీసర్ను వెంటనే తొలగించి విచారణ జరిపించాలని సంఘం అధ్యక్షురాలు అనురాధ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.