సెటిల్‌మెంట్ అడ్డాలు.. అర్బన్ ఠాణాలు..
వరంగల్‌క్రైం : జిల్లాలోని కొందరు పోలీసు అధికారులు బరితెగిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడుతూ పోలీసు శాఖ పరువు తీస్తున్నారు. సివిల్ తగాదాలను పోలీస్ స్టేషన్లలోనే పరిష్కరిస్తూ తామే న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సెటిల్‌మెంట్లలో తమ మాట పెడచెవిన పెట్టిన వారిపై థర్డ్ డి గ్రీ ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన పోలీసు బాస్‌లు కిందిస్థారుు అధికారుల అవినీతి వ్యవహారాలపై ఘాటుగా స్పందిస్తున్నా పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది, సీఐ, ఎస్సైల ప్రవర్తన మాత్ర ం మారడం లేదు. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారుు.
దారి రాకుంటే థర్‌డ డిగ్రీ..
నాలుగేళ్ల క్రితం పైడిపల్లికి చెందిన ఓ యువకుడు మధ్యవర్తిగా ఉండి ఇంటి స్థలం అమ్మి పెట్టాడు. అరుుతే ఆ భూమి కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిని అదనుగా తీసుకున్న హసన్‌పర్తి పోలీసులు సదరు యువకుడిపై తమ ప్రతాపం చూపుతున్నారు. రెండేళ్ల క్రితం అక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన సీఐ, ఎస్సై ఇదే కేసులో డబ్బులు వసూలు చేశారు. అయితే వారికి ముడుపులు ముట్టజెప్పాక కేసు అయిపోతుందిలే అనుకుంటే కొత్తగా వచ్చిన సీఐ, ఎస్సైలు ఆ కేసును తిరగదోడారు. సదరు మధ్యవర్తిని పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిచి బేరం కోసం పాకులాడారు.
అయితే గతంలో పని చేసిన అధికారులకు డబ్బులు ఇచ్చానని, ఇక తాను డబ్బులు ఇచ్చుకోలేనని తెగేసి చెప్పాడు. ఇంకేముంది సదరు యువకుడిని ఒక రోజు మొత్తం మొద్దుకు వేశారు. అతడిపై అనాగరిక పద్ధతిలో థర్డ్ డి గ్రీ ఉపయోగించారు. రోజూ స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేశారు. భూమి కొనుగోలులో మధ్యవర్తిగా ఉన్నందున ‘నీ ఇల్లు అమ్మి డబ్బులు కట్టాలంటూ పోలీసులు తమదైన శైలిలో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో వారికి భయపడి సదరు యువకుడు తన భార్యాపిల్లలతో ప్రస్తుతం పరారీలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
మహిళలకూ జరగని న్యాయం..
హసన్‌పర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని చిట్యాల మండలానికి చెందిన ఒక వ్యక్తికి ఇచ్చి 2009లో వివాహం చేశారు. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులతో పెళ్లరుున కొత్తలోనే భర్తతో విడిపోరుు భీమారంలో నివాసముంటోంది. మిషన్ కుట్టుకుంటూ జీవిస్తున్న ఆమెను ఇంటి పక్కనే ఉండే యువకుడు స్నానం చేస్తుండగా వీడియో తీశానంటూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మాయమాటలతో రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజులు ఇతర ప్రదేశాల్లో ఆమెతో కలిసి తిరిగొచ్చాడు. మోజు తీరాక పెళ్లి చేసుకోనంటూ కనిపించకుండా పోవడంతో బాధితురాలు అక్టోబర్ 31న ఎస్పీని ఆశ్రయించింది.
విచారణ చేపట్టాల్సిందిగా ఆయన కేయూ పోలీసులను ఆదేశించారు. విచారణ బాధ్యతలు చేపట్టిన ఏఎస్సై స్థారుు అధికారి ఒకరు ఆ రోజు నుంచి సదరు యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించకుండా బాధితురాలిని మాత్రం పలుమార్లు స్టేషన్‌కు పిలిపించారు. ఒకసారి రూ.30 వేలు తీసుకోవాలని, మరోమారు రూ.15 వేలు ఇస్తానంటున్నాడని బేరమాడుతున్నారు. తనకు డబ్బులు వద్దని, యువకుడితో పెళ్లి జరిపించాలని లేదంటే కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆమె డిమాండ్ చేస్తున్నా వారు అంగీకరించడం లేదు. దీంతో బాధితురాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
అర్బన్ మహిళా స్టేషన్ ఎంట్రీ ఫీ రూ.5 వేలు
రంగంపేటలోని అర్బన్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు బాధితుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దంపతు లు గొడవపడి స్టేషన్‌కు వస్తే అంతే సంగతులు. బయట ఉండే సిబ్బంది స్టేషనరీ లేదంటూ రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. స్టేషనరీ పేరుమీద ఆ డబ్బులు ఇస్తేనే కేసు ఎ స్సై, సీఐ వరకు వెళుతుందనే ఆరోపణలున్నారుు. అర్బన్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో మహిళలకు న్యాయం చేయాల్సిన పోలీసులే మహిళల వద్ద వేలాది రూపాయలు లాగుతున్నా రు.డబ్బులు ముట్టజెప్పిన వారికి ఒక న్యాయం చేస్తూ.. ఇ వ్వలేని వారికి అన్యాయం చేస్తున్నారనే విమర్శలున్నారు.