పుల్‌కల్ : పోలీసులు చిత్రహింసలు పెట్టి తన కుమారుడు చంపేశారని పుల్‌కల్ పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మయ్య తల్లి ఎల్లమ్మ ఆరోపించింది. తన కుమారుడిని నా లుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దెబ్బలకు తాళలేకే లక్ష్మయ్య మాకు కాకుండా పోయాడని శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పోలీసులు రెండు లక్షలు చెల్లించమంటున్నారు..? ఎలా ఇవ్వాలని లక్ష్మయ్య చెప్పినట్లు ఎల్లమ్మ ఆరోపించింది. డబ్బులు చెల్లించనిదే తనను చంపేస్తారేమోనని తనతో కుమారుడు గోడును వెల్లబోసుకున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. పుల్‌కల్ పోలీసుస్టేషన్‌లోని లాక ప్ గదిలో గురువారం తెల్లవారు జా మున సదాశివపేట మండలం ఎల్లా రం గ్రామానికి చెందిన తలారి లక్ష్మ య్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు వ్యూహాత్మకంగానే ఎప్పుడే లేని విధంగా లాక ప్‌లో గొలుసుతో కూడిన సంకెళ్లు వేశారన్న ఆరోపణలున్నాయి.. నిజంగా పోలీసులు అదుపులోకి తీసుకుని మరుసటి రోజు రిమాండ్ చేసేందుకు పుల్‌కల్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఉంటే సంకెళ్లు ఎందుకు వేయాల్సి వచ్చింది? అరెస్టు చేయనప్పుడు సంకెళ్లు వేయడం చట్ట విరుద్ధం.
కానీ.. నాలుగు రో జు లు పోలీసులు పెట్టిన తీవ్ర చిత్ర హింసలకు గురిచేయడం తట్టుకోలేకనే గురువారం తెల్లవారు జామున లాకప్‌లో లక్ష్మయ్య మృతి చెందిన ట్లు స్పష్టం అవుతోంది. అయితే.. స్టేషన్‌లో చనిపోయాకే లాకప్‌లో గొ లుసుతో కూడిన సంకెళ్లతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారన్నారు. అందులో భాగంగా లాకప్‌లో వాటిని వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. మృ తుడు దళితుడు కావడంతో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున ప్రతి పక్షాలు గొడవ చేసే అవకాశం ఉం టుందేమోనని భావించి లక్ష్మయ్య ను సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారనే విమర్శలున్నాయి.
చిత్రహింసలు పెట్టి చంపేశారు?
Published Sat, Mar 14 2015 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement