Pulkal Police Station
-
వివాదాలకు కేరాఫ్..!
- కెరీర్లో మూడుసార్లు సస్పెండ్ అయిన సీఐ నాగయ్య - అయినా తీరు మార్చుకోని వైనం! పుల్కల్ : పుల్కల్ పోలీసు స్టేషన్‌లోని మృతి చెందిన లక్ష్మయ్య మృతికి బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసిన జోగిపేట సీఐ నాగయ్య వివాదాలకు కేరాఫ్‌గా మారాడు. గతంలో సైతం నాగయ్య పలు సంఘటనల్లో బాధ్యుడయ్యాడు. దీంతో రెండుసార్లు సస్పెండ్ అయ్యాడు. తాజాగా లక్ష్మయ్య మృతిపై కూడా ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యాడు. నాగయ్య ఎక్కడ పనిచేసినా మచ్చ తెచ్చే సంచలనాలు చోటు చేసుకుంటూ సస్పెండ్ అవ్వడం పరిపాటిగా మారింది. పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బందిలో ఒక్కరిని ఎంచుకుని తన కార్యాలయంలో డిప్యూటేషన్ వేయించుకుని తనకు రావాల్సిన సెటిల్మెంట్లు, లావాదేవీలను వారితో చేయించుకుంటాడనే ఆరోపణలున్నాయి. పుల్కల్ పోలీసు స్టేషన్లో సైత ం తనకు సన్నిహితంగా ఉన్న ఓ కానిస్టేబుల్‌తో కేసులకు సంబంధించిన వ్యవహారాలకు ప్రతినిధిగా పెట్టుకుని కథను నడిపించేవాడని తెలుస్తోంది. అడిగినంత ఇస్తే చాలు కే సులు కొట్టేస్తాడని.. లేనిపక్షంలో చిత్ర హింసలకు గురి చేస్తారనే ఆరోపణలున్నాయి. డిసెంబర్ 27న మండల పరిధిలోని ఎస్ ఇటిక్యాల్‌లో వివాహిత హత్యకు గురైన సంఘటనలో సీఐ నాగ య్య నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఒకరిని మాత్రమే రిమాండ్ మిగిలిన ఇద్దరి నుంచి పెద్ద మొత్తంలో ము డుపులు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. లాకప్‌లో మృతి చెందిన లక్ష్మయ్య వ్యవహారంలో సైతం హత్యకు గురైన మంజులకు చెందిన బంగారం, అప్పుగా ఇచ్చిన రూ. 2 లక్షలను రికవరీ పేరుతో తాను తీసుకునేందుకే నాలుగు రోజులుగా లక్ష్మయ్యపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారణ జరిపినట్లుగా తెలిసింది. అయితే లక్ష్మయ్య పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందడంతో అందుకు బాధ్యుడిని చేస్తూ సీఐ నాగయ్యతో పాటు పుల్కల్ ఎస్ఐ లోకేష్, కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. -
చిత్రహింసలు పెట్టి చంపేశారు?
పుల్కల్ : పోలీసులు చిత్రహింసలు పెట్టి తన కుమారుడు చంపేశారని పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందిన లక్ష్మయ్య తల్లి ఎల్లమ్మ ఆరోపించింది. తన కుమారుడిని నా లుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దెబ్బలకు తాళలేకే లక్ష్మయ్య మాకు కాకుండా పోయాడని శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పోలీసులు రెండు లక్షలు చెల్లించమంటున్నారు..? ఎలా ఇవ్వాలని లక్ష్మయ్య చెప్పినట్లు ఎల్లమ్మ ఆరోపించింది. డబ్బులు చెల్లించనిదే తనను చంపేస్తారేమోనని తనతో కుమారుడు గోడును వెల్లబోసుకున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. పుల్కల్ పోలీసుస్టేషన్‌లోని లాక ప్ గదిలో గురువారం తెల్లవారు జా మున సదాశివపేట మండలం ఎల్లా రం గ్రామానికి చెందిన తలారి లక్ష్మ య్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు వ్యూహాత్మకంగానే ఎప్పుడే లేని విధంగా లాక ప్లో గొలుసుతో కూడిన సంకెళ్లు వేశారన్న ఆరోపణలున్నాయి.. నిజంగా పోలీసులు అదుపులోకి తీసుకుని మరుసటి రోజు రిమాండ్ చేసేందుకు పుల్కల్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఉంటే సంకెళ్లు ఎందుకు వేయాల్సి వచ్చింది? అరెస్టు చేయనప్పుడు సంకెళ్లు వేయడం చట్ట విరుద్ధం. కానీ.. నాలుగు రో జు లు పోలీసులు పెట్టిన తీవ్ర చిత్ర హింసలకు గురిచేయడం తట్టుకోలేకనే గురువారం తెల్లవారు జామున లాకప్‌లో లక్ష్మయ్య మృతి చెందిన ట్లు స్పష్టం అవుతోంది. అయితే.. స్టేషన్లో చనిపోయాకే లాకప్‌లో గొ లుసుతో కూడిన సంకెళ్లతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారన్నారు. అందులో భాగంగా లాకప్‌లో వాటిని వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. మృ తుడు దళితుడు కావడంతో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున ప్రతి పక్షాలు గొడవ చేసే అవకాశం ఉం టుందేమోనని భావించి లక్ష్మయ్య ను సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారనే విమర్శలున్నాయి. -
మద్యం మత్తులో ‘హెడ్’ వీరంగం!
పుల్కల్ : ఓ హెడ్ కానిస్టేబుల్ పూటుగా తాగి నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించాడు. దీంతో 45 నిమిషాల పాటు రాకపోకలను స్తంభింపజేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పుల్కల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లయ్య రాత్రి విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఫుల్‌గా మందుకొట్టాడు. పుల్కల్ బస్‌స్టాండ్ వద్ద మంతూర్ నైట్ హాల్ట్ బస్సు రాత్రి 10.15 నిమిషాలకు వచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ కిరాణం షాపులో పెరుగు తీసుకునేందుకు బస్సును ఆపాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మరో కారు పార్కు చేసి ఉంది. ఈ క్రమంలో కారులో వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ రోడ్డుపై వాహనాన్ని ఆపి ఎలా వెళ్లాలి అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై బూతు పురాణం మొదలు పెట్టాడు. ఇంతలోనే మరో వాహనం వచ్చింది. ఆ వాహనడ్రైవర్ పక్క నుంచి వెళ్లేందుకు యత్నించగా.. స్థలం లేకపోవడంతో అక్కడే నిలిచిపోయాడు. అంతే.. హెడ్‌కు కోపం వచ్చింది. అప్పటి వరకు బస్సు డ్రైవర్‌పై కస్సుమన్న అతను మరో వాహన డ్రైవర్‌నూ వదలలేదు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించాలని చెప్పడంతో.. అయితే తన వద్ద వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని, ఎందుకు స్టేషన్‌కు రావాలని వాదించడంతో.. అంత వరకు నోరును పారేసుకున్న హెడ్‌కానిస్టేబుల్.. చేతికి పని చెప్పేంత పని చేశాడు. ఇంతలో అక్కడున్న వారు ఎస్పీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆమె వెంటనే స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి పుల్కల్ బస్టాండ్‌లో ఏం జరుగుతుందో తనకు పది నిమిషాల్లో తెలపాలని ఆదేశించించారు. దీంతో స్టేషన్ నుంచి సిబ్బంది బస్టాండ్ వద్దకు చేరుకుని హెడ్‌కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లారు. ఈ తతంగం పూర్తి అయ్యేందుకు సుమారు రాత్రి 11 గంటలైంది. బాధ్యత గత పోలీసులే ఇలా తాగి రోడ్డుపై వాహనాన్ని నిలిపివేయడంతో మంతూర్, సింగూర్, పెద్దారెడ్డిపేట గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయణికులు రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ విషయమై ఎస్ఐ లోకేష్‌ను వివరణ కోరగా.. హెడ్ కానిస్టేబుల్ నుంచి వివరణ తీసుకుని నివేదిక పంపాలని ఎస్పీ సూచించినట్లు ఆయన వివరించారు. ఎస్పీ సూచన మేరకు తగిన చర్యలుంటాయన్నారు.